Homeఅంతర్జాతీయండ్రోన్లను ప్రయోగిస్తే.. సముద్రమట్టం అనూహ్యం..!!

డ్రోన్లను ప్రయోగిస్తే.. సముద్రమట్టం అనూహ్యం..!!

నియంతగా గుర్తింపు తెచ్చుకున్న నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. మరో సంచలనానికి తెరలేపారు.. ఇప్పటికే వరుసగా అణ్వాయుధాలనుపరీక్షిస్తూ.. ఆ దేశానికి పొరుగున ఉన్న దక్షిణకొరియా, జపాన్ లకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాడు కిమ్.. ఇప్పటికే మానవాళికి ప్రమాదకరంగా పరిణమించే అణ్వాస్త్రాలను సృష్టించారు. తాజాగా కృత్రిమ సునామీని సృష్టించే సామర్థ్యం గల డ్రోన్లు, అణ్వాయుధాలను తయారు చేయడం ప్రపంచదేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది..

ఆధునిక నియంతగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్‌.. మరో సరికొత్త ఉపద్రవానికి కారణం అయ్యారు. ఇప్పటికే వరుసగా అణ్వాయుధాలను పరీక్షిస్తూ పొరుగునే ఉన్న దక్షిణ కొరియా, జపాన్ లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న కిమ్… ఇక కొత్తగా మరో సంచలనానికి తెర తీశారు. ఎప్పటికైనా మానవాళికి ప్రమాదకరంగా పరిణమించే అణ్వస్త్రాలను సృష్టించారు. అణ్వాయుధ పరీక్షలపై అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలను విధించినప్పటికీ… ఉత్తర కొరియా ఏ మాత్రం వాటిని లెక్కచేయట్లేదు.

ఇప్పటి వరకు సముద్రాల్లో సంభవించే పెను భూకంపాల వల్ల ఏర్పడే సునామీని చూశాం. తాజాగా కృత్రిమ సునామీని సృష్టించే సామర్థ్యం గల డ్రోన్లు, అణ్వాయుధాలను తయారు చేసింది ఉత్తర కొరియా. అది కూడా రేడియో ధార్మిక శక్తి గల సునామీని సృష్టించే సామర్థ్యం గల డ్రోన్లు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీన్ని ఉత్తర కొరియా విజయవంతంగా పరీక్షించింది కూడా. కిమ్ జొంగ్ ఉన్ స్వయంగా రేడియో ధార్మిక శక్తి గల సునామీని సృష్టించే సామర్థ్యం గల డ్రోన్ పరీక్షలను పర్యవేక్షించారు.

పరీక్ష సమయంలో ఈ అండర్ వాటర్ న్యూక్లియర్ డ్రోన్ 80 నుంచి 150 మీటర్ల లోతులో సంచరించింది. 59 గంటలకు పైగా నీటి అడుగున ప్రయాణించింది. నిర్దేశిత గడువు ముగిసిన అనంతరం ఈ డ్రోన్- ఉత్తర కొరియా తూర్పు తీరంలో గల హంగ్యాంగ్ సమీపంలో సముద్ర జలాల్లో పేలిపోయింది. ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలన్నింటినీ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. శతృ దేశాలకు చెందిన యుద్ధనౌకలు, ఓడరేవులను రేడియో ధార్మిక సునామీలను సృష్టించడం ద్వారా నాశనం చేసే సామర్థ్యాలు గల న్యూక్లియర్ డ్రోన్లను ఉత్తర కొరియా విజయవంతంగా పరీక్షించినట్లు కేసీఎన్ఏ తెలిపింది. అండర్ వాటర్ న్యూక్లియర్ డ్రోన్‌ పరీక్షలను కిమ్ జొంగ్ స్వయంగా పర్యవేక్షించినట్లు స్పష్టం చేసింది. ఆ సమయంలో కిమ్ కుమార్తె కూడా అక్కడే ఉన్నట్లు పేర్కొంది.

సునామీని పుట్టించే అణు సామర్థ్యమున్న అండర్ వాటర్ డ్రోన్ ను విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తరకొరియా చేసిన ప్రకటన ప్రకంపనను రేపుతోంది.. దీని సాయంతో భారీ సునామీలు పుట్టించి తీరంలో నౌకాశ్రయాలనూ, సముద్ర మార్గంలో శత్రునౌకలను నాశనం చేయగల సామర్ధ్యం తమకు సమకూరిందని అది చెబుతోంది.. అదే నిజమైతే.. రష్యా తర్వాత ఈ సామర్ధ్యమున్న రెండో దేశమవుతోంది..ఇలాంటి డ్రోన్లను ప్రయోగిస్తే.. సముద్రమట్టం అనూహ్యంగా పెరిగి పరిసర ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తుతోంది.. దీనితో సముద్ర మధ్యలో అయితే.. శత్రు నౌకలను నీట ముంచవచ్చు.. అదే తీర ప్రాంతంలో ప్రయోగిస్తే.. సమీప నౌకాశ్రయాలతో పాటు నగరాలు, జనావాసాలు కూడా నామరూపాల్లేకుండా పోయే ప్రమాదముంది.

కాకపోతే.. హెయిల్ ను రష్యా అండర్ వాటర్ డ్రోన్ పొసెయ్ డాన్ తో ఏ మాత్రమూ పోల్చలేము.. ఎందకంటే.. అత్యాధునిక హంగులతో కూడిన పొసెయ్ డాన్ ను జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు.. స్వయంచాలిత న్యూక్లియర్ ప్రొపెల్షన్ వ్యవస్థ సాయంతో ఎంతకాలమైనా ప్రయాణం చేయగల సత్తా దాని సొంతం.. హెయిల్ కు అంత సీన్ లేదని నిపుణులు చెబుతున్నారు.. అమెరికాతో సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తున్న దక్షిణ కొరియాను బెదిరించేందుకు ఇలాంటి ప్రకటన చేసి ఉండవచ్చన్నది నిపుణుల విశ్లేషణ..

ఇప్పటి వరకు ఉత్తర కొరియా అత్యంత శక్తిమంతమైన క్షిపణి హ్వాసాంగ్- 17 పరీక్షలను విజయవంతంగా ప్రయోగించింది. ఇది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. ఇప్పుడు తాజాగా అండర్ వాటర్ న్యూక్లియర్ డ్రోన్లను ప్రయోగించడం ప్రపంచదేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. దీనిపై అమెరికా ఇంకా స్పందించాల్సి ఉంది. అటు దక్షిణ కొరియా, జపాన్ ఈ ప్రయోగాన్ని తప్పుపట్టాయి. ఉద్దేశపూరకంగానే ఉత్తర కొరియా రెచ్చగొట్టే ధోరణిలో ఉందని ఆరోపించాయి. ఐసీబీఎం వంటి న్యూక్లియర్ మిస్సైల్ పరీక్షలపై తాము పలుమార్లు అభ్యంతరాన్ని వ్యక్తం చేశామని, అయినప్పటికీ వినిపించుకోట్లేదని పేర్కొన్నాయి.

ఇక ఉత్తరకొరియా ఇప్పటికే.. అమెరికా, దక్షిణ కొరియాల ఉమ్మడి సైనిక విన్యాసాలను నిరసిస్తూ.. డమ్మీ అణ్వాయుధంతో కూడిన క్షిపణిని ప్రయోగించింది. శత్రువుల దూకుడు నేపథ్యంలో యుద్ధ సన్నద్ధతను మెరుగుపరచుకోవాలని ఉత్తర కొరియా అణ్వస్త్ర బలగాలను ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆదేశించారు. విన్యాసాల్లో భాగంగా అమెరికాకు చెందిన బీ-1బీ బాంబర్‌ విమానాలు ఎగరడానికి సుమారు గంట ముందు ఉత్తర కొరియా తూర్పు తీరం నుంచి స్వల్పశ్రేణి క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా, జపాన్‌ సైనిక దళాలు గుర్తించాయి.

డమ్మీ అణ్వాయుధం కలిగిన ఈ క్షిపణి సుమారు 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. సముద్రంలో లక్ష్యంగా నిర్దేశించిన ప్రాంతానికి 800 మీటర్ల ఎగువన విస్ఫోటం చెందిందని ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్‌ఏ తెలిపింది. దీని ద్వారా అణ్వాయుధ విస్ఫోట నియంత్రణ సాధనాలు, వార్‌హెడ్‌ డిటోనేటర్ల సమర్థతను పరీక్షించినట్లు పేర్కొంది. అమెరికా, దక్షిణ కొరియాలకు ఇది తీవ్ర హెచ్చరిక అని స్పష్టం చేసింది.

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన కుమార్తె, సీనియర్‌ సైనిక అధికారులతో కలిసి ఈ క్షిపణి ప్రయోగానికి హాజరయ్యారు. అమెరికా, దక్షిణ కొరియాలు మార్చి 13న ఉమ్మడి సైనిక విన్యాసాలు చేపట్టాయి.. వీటిని వ్యతిరేకిస్తున్న ఉత్తర కొరియా.. క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేసింది. మొత్తంగా ఈ నెలలో చేపట్టిన ఐదో అస్త్రపరీక్ష ఇది. ఈ దేశం 2022లో రికార్డుస్థాయిలో 70 క్షిపణులను పరీక్షించగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 20 ప్రయోగించింది.

తాజాగా భారీ రేడియో ధార్మిక సునామీని పుట్టించగల అణుసామర్థ్యంతో కూడిన అండర్ వాటర్ డ్రోన్ హెయిల్ ను విజయవంతంగా పరీక్షించినట్లుఉత్తరకొరియా ప్రకటించగానే.. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను మరింతగా పెంచింది.. ఈ డ్రోన్ ను తీరం వద్ద మోహరించవచ్చు.. నౌకలపై సముద్రం లోపలికి తీసుకెళ్లి.. ప్రయోగించవచ్చు.. నీటి లోపల ఇది స్రుష్టించే పేలుడు దెబ్బకు పుట్టుకొచ్చే రేడియో ధార్మిక సునామీ నౌకాశ్రయాలతో పాటు నడి సముద్రంలో శత్రు యుద్ద నౌకలను కూడా తునాతునకలు చేయగలదు.. 2012 నుంచి అభివ్రుద్ది చేస్తున్న ఈ డ్రోన్ ను గత రెండేళ్లలో 50 సార్లకు పైగా పరీక్షించి చూసినట్లు ప్రకటించింది నార్త్ కొరియా.. అయితే.. ఉత్తరకొరియా ప్రకటనలో విశ్వసనీయపై నిపుణులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రేడియో ధార్మిక సునామీలను సృష్టించడం ద్వారా శతృ దేశాలకు చెందిన యుద్ధనౌకలు, ఓడరేవులను నాశనం చేసే సామర్థ్యాలు గల న్యూక్లియర్ డ్రోన్లను ఉత్తర కొరియా విజయవంతంగా పరీక్షించడంపై ప్రపంచదేశాలలో సరికొత్త ఆందోళన మొదలైంది..

Must Read

spot_img