Homeఅంతర్జాతీయంభారత్ పై డ్రాగన్ కంట్రీ నిఘా… ఈ నౌక ఎంట్రీనే ఉదాహరణ

భారత్ పై డ్రాగన్ కంట్రీ నిఘా… ఈ నౌక ఎంట్రీనే ఉదాహరణ

డ్రాగన్ కంట్రీ కుయుక్తులకు అంతే లేకుండా పోతోంది. హిందూ మహా సముద్రంలో పట్టు కోసం కుట్రలకు తెర తీస్తోంది. క్షిపణి ప్రయోగంపై నోటమ్ చైనా గూఢచారి నౌక ‘యువాన్ వాంగ్ ‘లో ట్రాకింగ్, నిఘా పరికరాలను కలిగి ఉన్నట్లు తెలిసింది.ఇచ్చిన తర్వాత.. నిఘా నౌక ఎంట్రీ ఇవ్వడం .. చైనా దుందుడుకుతనానికి నిదర్శనంగా నిలిచింది.

యువాన్ వాంగ్ .. మళ్లీ హిందూ మహా సముద్రంలో ఎంట్రీ ఇచ్చింది. అదీ కూడా భారత్ క్షిపణి పరీక్ష చేపట్టిన వేళలోనే ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే భారత్ పై డ్రాగన్ నిఘా పెట్టిందనడానికి ఈ నౌక ఎంట్రీనే ఉదాహరణగా అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు.

“చైనా గూఢచారి నౌక ‘యువాన్ వాంగ్ ‘లో ట్రాకింగ్, నిఘా పరికరాలను కలిగి ఉన్నట్లు తెలిసింది.”

బంగాళాఖాతంలో సుదూర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని భారత్ ప్రయోగించేందుకు సిద్ధమైన వేళ.. చైనా గూఢచారి నౌక హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి ప్రవేశం కలకలం రేపుతోంది. చైనా గూఢచారి నౌక ‘యువాన్ వాంగ్ ‘లో ట్రాకింగ్, నిఘా పరికరాలను కలిగి ఉన్నట్లు తెలిసింది. చైనా బాలిస్టిక్ క్షిపణి, శాటిలైట్ ట్రాకింగ్ గూఢచారి నౌక కదలికలను భారత నావికాదళం నిశితంగా పరిశీలిస్తోందని తెలిసింది. అయితే, ఓడ కార్యకలాపాలపై అధికారిక ధృవీకరణ లేదు.

ఈ నౌక ఆగస్టులో శ్రీలంకలోని హంబన్‌తోట నౌకాశ్రయంలోకి వచ్చి భారతదేశం, ద్వీప దేశం మధ్య దౌత్యపరమైన వివాదానికి దారితీసింది. చైనా పరిశోధనా నౌక ‘యువాన్ వాంగ్ 5’ భారత సైనిక స్థావరాలపై స్నూప్ చేయడానికి ఉపయోగించబడుతుందని భారతదేశం పదే పదే ఆందోళన వ్యక్తం చేసింది.

ఇప్పటికే ఉన్న ప్రోటోకాల్ ప్రకారం, బంగాళాఖాతంలో క్షిపణి పరీక్ష గురించి భారతదేశం ఇటీవల నోటమ్ జారీ చేసింది. అయితే, ఈ ప్రాంతంలో చైనా ఓడ ఉండటంతో, క్షిపణి పరీక్షకు భారత్ ముందుకు వెళ్తుందా లేదా అనేది అస్పష్టంగా ఉంది. భారత్ అంటే ఎప్పూడూ ఈర్ష్య చెందే చైనా.. మళ్లీ తన వక్రబుద్ధిని మరోసారి బయట పెట్టుకుంది. హిందూ మహాసముద్రంపై పట్టు సాధించేందుకు కుట్రలకు తెరలేపింది.

ఇండియన్‌ ఓషన్‌లో యువాన్‌ వాంగ్‌ నౌకను మోహరించి భారత్‌పై కన్నేసింది. మన దేశంలో జరుగుతున్న కార్యకలాపాలపై నిఘా పెట్టింది. చైనా యుద్ధ నౌక రాకతో భారత క్షిపణి పరీక్ష వాయిదా పడే పరిస్థితి నెలకొంది. భారత్‌ ఈనెల రెండో వారంలో క్షిపణిని ప్రయోగిస్తున్నట్లు ప్రకటించింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

2,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ క్షిపణి పయనం శ్రీలంక, ఇండోనేషియా మధ్య ఉన్న ప్రాంతంలో సాగనుంది. అయితే భారత్‌ నోటీసు జారీ చేసిన కొద్ది రోజులకే చైనాకు చెందిన యువాన్‌ వాంగ్‌-6 అనే నౌక హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించింది.

ఈ నౌక ఇండోనేషియా బాలీ తీరం నుంచి బయల్దేరింది. భారత క్షిపణి పరీక్షలకు ముందే చైనా నిఘా నౌక హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామంతో బాలిస్టిక్‌ పరీక్షను వాయిదా వేయాలని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే చైనా స్పై షిప్‌ కదలికల్ని నిశితంగా
పరిశీలిస్తున్నామని ఇండియన్‌ నేవీ చీఫ్‌ ప్రకటించారు. యువాన్ వాంగ్-6 నౌకలో భారీ యాంటెన్నాతో పాటు అత్యాధునిక నిఘా పరికరాలు అమర్చి ఉన్నట్లు నేవీ అధికారులు గుర్తించారు. వీటితో ఉపగ్రహ ప్రయోగాలు, క్షిపణి ప్రయోగాలు, అవి ప్రయాణించే మార్గాల్ని ట్రాక్ చేసే వీలుందంటున్నారు.

 అయితే యువాన్‌ వాంగ్‌-6 పరిశోధనా నౌక అని డ్రాగన్‌ చెప్పుకుంటోంది. కానీ.. దానికి క్షిపణి పరీక్షలు, ఉపగ్రహాల కదలికల్ని పరిశీలించే సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోంది. భారత క్షిపణి ప్రయోగానికి కొద్ది రోజుల ముందే ఈ నౌకను హిందూ మహా సముద్రంలోకి పంపించడంతో.. మన ఆయుధ పాటవంపై కన్నేసి ఉంచడానికే డ్రాగన్‌ ఇలా చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలోనే క్షిపణి పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేయాలని స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. చైనా కుట్రలతో మన క్షిపణి పరీక్షలు నిలిచిపోవడం ఇది రెండోసారి అవుతుంది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే జలమార్గాల్లో హిందూ మహాసముద్రం ఒకటి. దీనిపై పట్టు
సాధించిన వారు ప్రపంచంపై ఆధిపత్యం సాధిస్తారు. అత్యంత కీలకమైన హిందూ మహా సముద్రంలో భారత్‌ అతిపెద్ద దేశం.

“భారత్ పై నిఘా పెట్టటమే డ్రాగన్ ఉద్ధేశ్యమని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.”

ఈ సముద్రంపై రవాణా భారత్‌ కనుసన్నల్లోనే జరగాలి. భారత్‌కు ప్రధాన ప్రత్యర్థి చైనా ఈ సముద్రంలోకి నేరుగా ప్రవేశించే అవకాశం లేకపోవడంతో భారత్‌కు సమీపంలో ఉన్న శ్రీలంక, పాక్ లాంటి దేశాలకు రుణాలను ఇచ్చి మచ్చిక చేసుకుంటోంది. ఈ ఏడాది ఆగస్టులో కూడా యువాన్‌ వాంగ్‌-5 శ్రీలంకలోని హంబన్‌టోట రేవులో లంగరేయడం తీవ్ర వివాదాస్పదమైంది.

నౌకపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ.. లంక ప్రభుత్వం దాన్ని అనుమతించింది. శ్రీలంక .. చైనాకు రుణాల్ని తిగిరి చెల్లించలేకపోవడంతో హంబన్ టోట రేవును శ్రీలంక.. చైనాకు 99ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. దీంతో దాన్ని డ్రాగన్ సైనికావసరాలకు ఉపయోగించే ప్రమాదం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. చైనా గూఢచర్య నౌక హంబన్‌టోట్ పోర్టులోకి ప్రవేశించడంపై అమెరికా సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. 2020లో లద్ధాఖ్‌లోని గల్వాన్‌ లోయలో ఘర్షణలతో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రాజుకుంటూనే ఉన్నాయి.

ఈ నిఘా నౌకతో మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. పరిశోధన నౌక అని చైనా చెప్పుకుంటున్నా దీని మాటున భారత్ పై నిఘా పెట్టటమే డ్రాగన్ ఉద్ధేశ్యమని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. భారత మిలటరీ ప్రాంతాలన్నింటిపైనే నిఘా ఉంచే సామర్థ్యం ఈ నౌకకి ఉంది. యువాన్‌ వాంగ్‌ సిరీస్‌లో మూడో జనరేషన్‌కు చెందిన ట్రాకింగ్‌ నౌక ఇది.

ఖండాంతర క్షిపణులు, ఉపగ్రహాలు, రాకెట్లను ట్రాక్‌ చేసే ఎలక్ట్రానిక్‌ వ్యవస్థ ఈ నౌకలో ఉంది. 750 కిలోమీటర్ల దూరంలో ఉన్నవన్నీ ఈ నౌక రాడార్‌ పరిధిలోకి వస్తాయి. ఏడున్నర వేల కిలోమీటర్లకు పైబడిన సముద్రతీరం ఆర్థికంగా ఇండియాకు కల్పవృక్షమే. కానీ.. దాన్ని లైట్‌ తీసుకుంటే దేశ భద్రతకు అది అత్యంత ప్రమాదకరంగా మారే ఛాన్సుంది.

1993లో ముంబైని వణికించిన వరస పేలుళ్ల కోసం ఉగ్రమూకలకు పేలుడు పదార్థాలు సముద్ర మార్గంలోనే సరఫరా అయ్యాయి. ఇండియన్‌ ఓషన్‌ మీదుగా 2008లో పాక్‌ ముష్కరులు భారత్‌లోకి ప్రవేశించి ముంబైలో మారణహోమం సృష్టించారు. సముద్రం ద్వారా ఇండియాలోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారని మూడేళ్ల క్రితం అప్పటి నేవీ అధికారులు హెచ్చరించారు.

ఉగ్రముప్పుతో పాటుహిందూ మహాసముద్రంలో ఊపందుకున్న చైనా కార్యకలాపాలతో తీర ప్రాంతాల్ని శత్రుదుర్భేద్యంగా మార్చుకోవాల్సిన అవసరముంది. ఈ క్రమంలో సముద్రంలో కదలికలపై అనుక్షణం నిఘా వేస్తూ, ప్రమాదాల్ని పసిగట్టి నివారించగలిగే నేషనల్‌ మారిటైమ్‌ డొమైన్‌ అవేర్‌నెస్‌ ప్రాజెక్టును ప్రధాని
నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ ఇటీవల ఆమోదించింది. 2008 ముంబై దాడులు నేర్పిన గుణపాఠాల నుంచి పురుడుపోసుకున్న ఐఎంఏసీ కూడా ఎన్‌ఎండీఏలో అంతర్భాగం కానుంది.

ఇది జరగాలంటే మౌలిక సదుపాయాల, సరిపడా స్టాఫ్‌ నియామకంతో నిఘా వ్యవస్థల్ని బలోపేతం చేయాల్సిఉంటుంది. ప్రపంచ చమురు రవాణాలో ప్రధానపాత్ర పోషిస్తున్న హిందూ మహాసముద్రంలో నిత్యం 13వేల నౌకలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇప్పుడా మహాసాగరంలో చైనాకు చెందిన నాలుగు నుంచి ఆరు యుద్ధనౌకలతో పాటు మరికొన్ని పరిశోధక నౌకలు తిరుగుతున్నాయి. చేపల వేట పేరిట డ్రాగన్‌ కంట్రీ నుంచి భారీగా పడవలు కూడా అక్కడికి తరలివస్తున్నాయి.

మన దేశ రక్షణ కోసం వాటిన్నింటిపై నిఘా పెట్టడం అంత ఈజీ కాదు. అందుకే సుదూర తీరాల్లోనూ సైనిక పరాక్రమాన్ని ప్రదర్శించగలిగే శక్తిసామర్థ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది. అందుకు తగినట్లుగా నౌకాదళాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హిందూ మహా సముద్రంలోనూ, సరిహద్దుల్లోనూ ఉద్రికత్తల దిశగా చైనా అడుగులు వేస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

తాజాగా నిఘా నౌక రాక .. ఇరు దేశాల మద్య విబేధాలకు ఆజ్యం పోసినట్లేనని వీరంతా అంటున్నారు

Must Read

spot_img