Homeజాతీయంఒకప్పుడు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా టెక్ కంపెనీలు

ఒకప్పుడు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా టెక్ కంపెనీలు

ఒకప్పుడు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లే సమయంలో ప్రపంచంలోని పెద్ద పెద్ద టెక్ కంపెనీలు లేని టెక్కులు చూపించాయి. మంచి బూమ్ వచ్చిన సమయంలో అవి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. క్లౌడ్ సర్వీసులనీ, ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్సులనీ బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెట్టాయి. ఇంటర్నెట్ బ్రాడ్ కాస్టింగ్ బెలూన్లను కూడా ప్రపంచానికి పరిచయం చేసాయి. ఎంత సేపు వచ్చినవారిని వచ్చినట్టుగా కంపెనీల్లో చేర్చుకుంటూ నానా హడావిడీ చేసాయి. బిలియన్ల కొద్దీ డాలర్లను సంపాదించకున్నాయి.

వారి సంపాదన మామూలుగా లేదు.. అప్పట్లో ఆ కంపెనీల ఈ సర్వీసులను చూసిన వారంతా ఈ పెద్ద కంపెనీల ఐడియాలను చూసి ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టారు. ఎంతైనా పాశ్చాత్యదేశాల దైర్యమే వేరనుకున్నారు. వారి ఐడియాలజీలను అంతా మెచ్చుకున్నారు. ఇప్పుడా జిమ్మిక్కులన్నీ మూలన పడేసారు. సిలికాన్ వేలీకి గుండెకాయగా చెప్పుకునే సాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఉండే ఈ పెద్ద పెద్ద టెక్ కంపెనీలు గత సంవత్సరం చివరికల్లా తమను అందలం ఎక్కించిన 80వేల మంది ఉద్యోగులను రోడ్డున పడేశాయి.

ఈ కంపెనీలతో బాటే నడచుకునే యాపిల్, ఆమెజాన్ కంపెనీలు ఇంకా బాగానే నడుస్తున్నాయి. అయితే ఆ వేగం కాస్త మందగించి ఉంటే ఉండొచ్చు..కానీ పూర్తిగా నిలచిపోలేదు. తమ ఉన్నతికి కారణమైన ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనంత దరిద్రంగా మాత్రం లేదు. ఇప్పుడు ఇండియా గురించి చూస్తే..భారతదేశం సిలికాన్ వాలీకి తక్కువేం కాదు. మనకు బెంగళూరులో, హైదరాబాదులో సిలికాన్ వేలికన్నా ఎక్కువే పనులు జరుగుతున్నాయి. లెక్కకు మించిన కంపెనీలు వేగంగానే పనిచేస్తున్నాయి. ఆ రెండే కాదు..పునే, ముంబై, గురుగ్రాం, నేషనల్ క్యాపిటల్ రీజియన్ అయిన నొయిడాల్లోనూ సాఫ్ట్ వేర్ కంపెనీలు పనిచేస్తూనే ఉన్నాయి. గత మూడు నెలలుగా ఈ ప్రాంతాలలో ఎక్కడా అమెరికాలో చేసినంతగా జాబ్ కట్స్ చేయలేదు.

టాప్ సెవెన్ కంపెనీలుగా చెప్పుకునే కంపెనీల్లో కేవలం 5 వేల మందిని మాత్రమే తొలగించాయి.

విదేశాలతో పోల్చుకుంటే అక్కడ లక్షల సంఖ్యలో తొలగింపులు నిర్దాక్షిణ్యంగా జరిగిపోయాయి. రాబోతోందన్న ఆర్థిక మాంద్యం ఇంకా రానే లేదు..అప్పుడే తమ కంపెనీలలో పారిశుధ్యపు పనివారిని కూడా తొలగించడం చూస్తే పిచ్చి పీక్స్ కు చేరిందని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్లూ ఇదే ఉద్యోగులతో పనులు చేయించుకుని సంపాదించుకున్న డబ్బంతా ఉంది కదా..రేపు రాబోయే ఆర్థిక మాంద్యం వల్ల ఇమీడియట్ నష్టాలేం లేవు. కేవలం పొదుపు చర్యల పేరిట ఇలా తొలగింపులు చేస్తున్నారు. గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు గడచిన కొన్ని నెలల్లో ఒక్కొక్కటీ పదివేల కన్నా ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. ప్రపంచం మొత్తం మీద ఈ లేఆఫ్ లు పెద్ద ప్రకంపనలే స్రుష్టించాయి. ఇదే భారతదేశంతో పోల్చకుంటే ఇక్కడి ఐటీ దిగ్గజ కంపెనీలు మాత్రం కొత్త ఉద్యోగులను తీసుకునే వేగాన్ని తగ్గించడం ద్వారా పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేసాయి. ఈ కంపెనీలన్నీ కరోనా పండెమిక్ సమయంలో వర్క్ ఫ్రం హోం పేరిట ఉద్యోగుల నుంచి లెక్కకు మించిన పనులు చేయించుకున్నాయి. విపరీతమైన లాభాలు అర్జించాయి.

ఇప్పుడు వారి అవసరం తీరాక లేని ఆర్థిక మాంద్యం సాకుగా చూపించి కాస్ట్ కటింగ్ అనీ, జాబ్ కటింగ్స్, పొదుపు పేరుతో ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి. అయితే ఈ దోరణి మనదేశంలో అంతగా కనిపించకపోవడం శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం సుస్పష్టం..అమెరికా కంపెనీల మాదిరిగా సోషల్ మీడియా స్రుష్టించిన కొత్త ప్రపంచాన్ని అందుకునే ప్రయత్నాల్లో పడకుండా తమను తాము కాపాడుకున్నాయి.భారతీయ కంపెనీలు తాము చేస్తున్న పనుల్లోనే కొత్త మార్గాలను ఎంచుకున్నాయి. ఒకరు స్రుజనాత్మక స్రుష్టి చేసేవారైతే, ఇంకొకరు వాటిని అమలు చేయడం చేసారు. వ్యాపార పరిస్థితుల్లో వేగంగా వచ్చిన మార్పుల ప్రభావం అమలు చేసేవారిపై పెద్దగా పడలేదు.

టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో టెక్ మహీంద్రా వంటి భారీ భారతీయ కంపెనీలు ఐటీ సర్వీసుల రంగంలోనే ఎక్కువగా ఉన్నాయి.

ఉత్పత్తుల ఆధారిత కంపెనీలు కొన్ని ఉన్నా వీటిలో అత్యధికంగా ఈ మధ్య కాలంలోనే మొదలైనవిగా చెప్పకోవాలి. అంటే ఒకరకంగా స్టార్టప్ కంపెనీల్లాంటివి అన్నమాట. కరోనా ఉద్రుతి దిగివస్తున్న క్రమంలో అటు స్టార్టప్ లు, ఇటు పెద్ద టెక్ కంపెనీలు తీవ్ర సమస్యలు ఎదుర్కున్నాయి. ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందన్న వార్తలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచడం ఈ రెండు వర్గాల వారికి గోరుచుట్టుపై రోకటి పోటు చందంగా మారింది. దీంతో ఖర్ులు తగ్గించకునేందుకు ఉద్యోగులకు లే ఆఫ్ లు ఇవ్వడం మొదలైంది. వ్యాపారం తగ్గిపోవడం, పెట్టుబడులు వచ్చే అవకాశాలు సన్నగిల్లడంతో లాభాలను కాపాడుకునేందుకు ఈ చర్యలు అనివార్యంగా మారాయి. అంచనాలు మారిపోవడంతో తొలగింపులను ముమ్మరం చేసాయి.

అయితే ఒకటి..మాత్రం నిజం కరోనా వచ్చిన తొలినాళ్లలో పోలిస్తే ఈ వైఖరి పూర్తి భిన్నం అని చెప్పవచ్చు. ఆట్రిషన్ నియంత్రణకు, వ్యాపారాన్ని కాపాడుకునేందుకు అప్పట్లో కొత్త ఉద్యోగుల నియామకాలు ఎడాపెడా జరిగాయి. పోటీ కంపెనీలు ఉద్యోగులను ఎగరేసుకుపోతే కొండంత ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయలేమన్న ఆలోచనతో అప్పట్లో అలా జరిగింది. నైపుణ్యమున్న ఉద్యోగులకు, ఇండస్ట్రీ అవసరాలకు మధ్య అంతరం భవిశ్యత్తులో కూడా కొనసాగుతుంది. ఈ తేడా 2023లో పది శాతం వరకు ఉంటుందని అంచనా. ఈ ఏడాది రెండో సగంలో ఉద్యోగుల నియామకాలు పూర్వ స్తితికి చేరుకుంటాయని కంపెనీలు ఆశాభావంతో ఉన్నాయి. ఇక్కడే అమెరికా భారతీయ కంపెనీల మధ్య కనిపిస్తున్న స్పష్టమైన తేడాలేంటో చూద్దాం.. కరోనా ప్రపంచాన్ని చుట్టేసిన సందర్భంగా కంపెనీలన్నీ డిజిటల్ మార్గం పట్టే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

క్లౌడ్ సర్వీసులకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. అంది వచ్చిన కొత్త అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని ప్రతీ కంపెనీ ఆశించింది.

కోవిడ్ కారణంగా ఇంటికే పరిమితమై అట్టడుగు వర్గాల నుంచి కూడా టెక్నాలజీ కోసం డిమాండ్ ఏర్పడటంతో కంపెనీలు కూడా తమ ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చింది. టెక్నాలజీ సర్వీసులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో నియామకాలు జోరందుకున్నాయి. దీని ఫలితంగా అట్రిషన్ సమస్య పుట్టుకురావడం, ఆ క్రమంలోనే ఉద్యోగుల వేతన ఖర్చులు పెరిగిపోవడం జరిగిపోయింది. రెండేళ్ల తరువాత కోవిడ్ తగ్గుముఖం పట్టడం మొదలైంది. అభివ్రుద్ది చెందిన దేశాల్లో ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచేసాయి. దీంతో మాంద్యం తప్పదన్న ఆందోళన మొదలైంది. చేతిలో ఉన్న నగదును కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కంపెనీలు టెక్నాలజీ రంగానికి కేటాయించిన నిధులకు కోత పెట్టాయి. ఇదే సమయంలో డిజిటల్ టెక్నాలజీలకు డిమాండ్ తగ్గిపోవడంతో వీటిని అభివ్రుద్ది చేసే కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలకాల్సి వచ్చింది. ఈ మొత్త పరిస్థితుల్లో ఒక్క విషయమైతే స్పష్టం అంటున్నారు నిపుణులు.

భారతీయ సాఫ్ట్ వేర్ దిగ్గజాలు పాశ్చాత్య దేశాల కంపెనీల మాదిరగా పూర్తిగా స్రుజనాత్మక ఆలోచనలకు బదులు ముందుగానే నిర్ణయించిన పనులు చేయడంలోనే నిమగ్నమయ్యాయి. అమెరికా కంపెనీల మాదిరిగా సోషల్ మీడియా స్రుష్టించిందనుకున్న కొత్త ప్రపంచాన్ని అందుకునే ప్రయత్నాలలో పడలేదు. భారతీయ కంపెనీలు తాము చేసే పనుల్లోనే కొత్త కొత్త మార్గాలను అన్వేషించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకరు క్రియేటివిటీ స్రుష్టించేవారైతే ఇంకొకరు వాటిని అమలు చేసేవారన్నమాట. వ్యాపార పరిస్థితుల్లో వేగంగా వచ్చిన మార్పుల ప్రభావం అమలు చేసేవారిపై పెద్దగా పడలేదు. ఈ తేడా కారణంగానే భారతీయ కంపెనీల్లో పెద్ద స్థాయిలో లేఆఫ్ లు లేకుండా పోయాయి. మంచి హోదా, వేతనం కోసం యువత ఇప్పుడు పెద్ద టెక్ కంపెనీ స్టార్టప్ ల వైపు చూడాలి. ఓ మోస్తరు వేతనంతో స్థిరంగా ఉండాలని అనుకుంటే మాత్రం అమలు చేసేవారి వద్ద పనిచేయడం మేలని అంటున్నారు విశ్లేషకులు.

Must Read

spot_img