Homeజాతీయంభారతీయుల డాలర్ డ్రీమ్స్ .. కలలుగా మారిపోతున్నాయి.

భారతీయుల డాలర్ డ్రీమ్స్ .. కలలుగా మారిపోతున్నాయి.

ఐటీ రంగంలో లేఆఫ్స్ .. భారతీయ ఉద్యోగుల్ని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ప్రస్తుత మాంద్యం వేళ రెండు నెలల్లో కొత్త ఉద్యోగాలు వెతుక్కోవాల్సి రావడం
.. కష్టసాధ్యంగా మారుతోంది.

భారతీయుల డాలర్ డ్రీమ్స్ .. కల్లలుగా మారిపోతున్నాయి. వరుస లేఆఫ్స్ తో .. 60 డేస్ డెడ్ లైన్ తో భారతీయ టెక్కీలు తీవ్ర ఆందోళనకు
గురవుతున్నారు. దీంతో అక్కడ ఉండే అవకాశాల్లేక .. సొంతూళ్లకు పయనమవుతున్నారు.

సాఫ్ట్ వేర్ రంగంలో వరుస లేఆఫ్‌ ల వల్ల లక్షలాది మంది నిరుద్యోగులవుతున్నారు. విదేశాల్లో అందులోనూ ముఖ్యంగా అమెరికాలో పనిచేస్తున్న
భారతీయుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గతేడాది నవంబరు నుంచి ఇప్పటి వరకు అగ్రరాజ్యంలో దాదాపు 2 లక్షల మంది భారతీయులు
ఉద్యోగాలు కోల్పోయారని ‘ది వాషింగ్టన్ పోస్ట్’ తెలిపింది. స్టార్టప్‌ ల నుంచి గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌ బుక్, అమెజాన్ సహా పెద్ద సంస్థల వరకు
ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. మొత్తం తొలగింపుల్లో 30 నుంచి 40 శాతం వరకు భారతీయ ఐటీ నిపుణులు ఉండగా.. వారిలో అధికంగా H1B,
L1 వీసాలపై ఉన్నారు. సాధారణంగా అమెరికా వలస వెళ్లిన నిపుణులు H1B, L1 వీసాల ద్వారా పనిచేస్తుంటారు. ఏదైనా కారణాల వల్ల
H1B వీసాదారులు ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లోపు కొత్తది సాధించాల్సి ఉంటుంది.

అప్పుడే అక్కడ ఉండటానికి అవకాశం ఉంది. లేని పక్షంలో ఇండియాకు తిరిగి రావాల్సిందే. ప్రస్తుతం భారతీయ ఐటీ నిపుణులు ఇక్కడే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిగ్గజ ఐటీ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుండగా.. రెండు నెలల్లో కొత్త కొలువు తెచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అగ్రరాజ్యంలో సాంకేతిక నైపుణ్య లేమిని భర్తీ చేసేందుకుగాను.. ఇండియా, చైనా నుంచి ఏటా పదివేల మందిని అక్కడి టెక్నాలజీ కంపెనీలు నియమించుకుంటుంటాయి. కంపెనీలన్నీ ఉద్యోగాల్లోతలు విధిస్తున్న ప్రస్తుత తరుణంలో.. ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయిన వారికి కొత్త కొలువు వెతుక్కోవడం సవాలుగా మారిందని సిలికాన్ వ్యాలీ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం జాబ్ మార్కెట్ లో నెలకొన్న ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకుని.. H1B కార్మికుల పట్ల ఆయా కంపెనీలు ఉదాసీనంగా వ్యవహరించాలని కోరారు.

తొలగింపు తేదీని కొంత కాలం పొడిగిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

గ్లోబల్ ఇండియన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్, ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ అనే సంస్థలు.. ఉద్యోగం కోల్పోయిన ఐటీ నిపుణులను రిక్రూటర్లతో కనెక్ట్చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని US పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అర్థం చేసుకుని.. బాధితులను ఆదుకునేందుకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి. తద్వారా ప్రతిభ కలిగిన నిపుణులను దేశంలో ఉంచుకోవడమూ లాభదాయకమేనని.. ఆ దిశగా ఆలోచించి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పునః పరిశీలించాలని ప్రభుత్వానికి విఙప్తి చేస్తున్నాయి.

తాజా పరిణామంతో టెక్కీల యూఎస్ కలలు కుప్పకూలుతున్నాయి. కోటి ఆశలతో అమెరికా వెళ్లిన వారు ప్రస్తుతం లేఆఫ్‌ల కారణంగా గడ్డు కాలాన్ని
ఎదుర్కొంటున్నారు. టాప్ టెక్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను ఇళ్లకు పంపుతున్న తరుణంలో దిక్కుతోచని స్థితిలో స్వదేశాలకు తిరిగి
వచ్చేస్తున్నారు. ఇప్పటికే యూఎస్ టెక్ కంపెనీలు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, ఫేస్ బుక్ తో పాటు అనేక ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్
సంస్థలు సైతం నిర్థాక్ష్యణ్యంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ఇండియా నుంచి వలస వెళ్లిన అనేక మంది టెక్కీలు తీవ్ర ఇబ్బందులు
పడుతున్నారు. అక్కడే ఉండటానికి కుదరక తిరిగి ఇండియా రావటానికి మనసొప్పక సతమతమౌతున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ
తొలగింపుల జోరు ఇప్పుడప్పుడే తగ్గదని తెలుస్తోంది. మరింత కాలం కంపెనీలు కాస్ట్ కట్టింగ్ ప్రణాళికలను కొనసాగించవచ్చని నిపుణులు
హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం భారీ తొలగింపుల కారణంగా ప్రభావితమైన అనేక మంది ఎన్ఆర్ఐలు ఇండియాకు తిరిగి రావాల్సి వస్తోంది. దీంతో చాలా మంది మానసిక
ఒత్తిడికి లోనవుతున్నారు. యూఎస్ లో పరిస్థితులు దిగజారినప్పటికీ భారతదేశంలో ఐటీ రంగం మాత్రం పెద్దగా ప్రభావితం కాలేదు. దేశంలోని
స్టార్టప్ కంపెనీలు అనేక సవాళ్లకు పరిష్కారాలు అందించే పనిలో ఉండగా.. ఇది తిరిగి వచ్చే టెక్కీలకు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను
అందించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా తిరిగి వచ్చేందుకు ఇదే సరైన సమయమని చాలా మంది కూడా భావిస్తున్నట్లు
తెలుస్తోంది. అమెరికా విషయానికొస్తే చాలా మంది భారతీయ టెక్కీలు H1B, L1 వీసాలపై పని చేస్తున్నారు. అయితే వీరు పనిచేస్తున్న
కంపెనీలో తొలగించబడినట్లయితే 60 రోజుల్లో మరో కొత్త ఉద్యోగాన్ని పొందాల్సి ఉంటుంది.

అలా కుదరని పక్షంలో వారు ఇండియాకు తిరిగి రాకతప్పదు. ఇలా ఉద్యోగాల వేటలో విఫలమైన చాలా మంది చేసేది లేక తమ సొంత గ్రామాలకు, పట్టణాలకు తిరిగి వస్తున్నారు. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన కొంత మంది తమ అభిప్రాయాలను BLIND సైట్‌లో పోస్ట్ చేస్తున్నారు. మెటాలో ఉద్యోగం కోల్పోయిన ఒక వ్యక్తి ఇండియాకు తిరిగి వెళ్లి మనకు సరిపోయే ఛాలెంజింగ్ ఉద్యోగాన్ని ఎంచుకోవడం మంచిదంటూ పోస్ట్ చేశాడు. ఇక్కడ పోస్ట్ పెట్టే వారి వివరాలు బహిర్గతం కానప్పటికీ.. ఉద్యోగి తన అధికారిక ఈ-మెయిల్ ద్వారా మాత్రమే పోస్ట్ చేయగలరు. అంటే ఈ సైట్ లో నకిలీ వ్యక్తులు ఎలాంటి మెసేజ్ లు పోస్ట్ చేయలేరు. ఇది అచ్చం లింక్డ్‌ఇన్‌ని పోలి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక మాంద్యం ఐటీ ఉద్యోగులను కోలుకోలేని దెబ్బ తీస్తోంది. పేరు ఉన్న బడా
బడా కంపెనీలు అన్నీ లే ఆఫ్ లు చేస్తున్నాయి.

అమెరికాలో పెద్ద కంపెనీలన్నీ ఇక్కడిలాగే ఉద్యోగాలను తీసేస్తున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలా అన్ని కంపెనీలు స్టాఫ్ ను
తగ్గించేసుకుంటున్నాయి.

అయితే సొంత దేశమైతే పర్వాలేదు కానీ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి మాత్రం దారుణంగా తయారైందని
అంచనాలు వినిపిస్తున్నాయి. నవంబర్ నుంచి ఇప్పటివరకు 2లక్షల మందికి ఉద్యోగాలు పోయాయిట. అందులో 30 నుంచి 40 శాతం మంది
ఇండియన్సే ఉన్నారు. వాళ్ళల్లో ఎక్కువగా హెచ్ 1, ఎల్ 1 వీసాల మీద వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. ఉద్యోగాలు పోగొట్టుకున్నవాళ్ళు వర్క్ వీసాల
కింద డెడ్ లైన్ లు ముందు ఉండడంతో కొత్త జాబ్ ను వెతుక్కోవడానికి కష్టపడుతున్నారు. పరిస్థితి దారుణంగా ఉందని, రోజులు చాలా కష్టంగా
గడుస్తున్నాయని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. అమెరికాలో ఐటీ ఉద్యోగాల్లో స్థిర‌ప‌డిన భార‌తీయుల‌ బతుకు అగమ్య‌గోచ‌రంగా మారింది.

త‌మ ఉద్యోగాలు కోల్పోయిన ఐటీ ప్రొఫెష‌న‌ల్స్ తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. హెచ్ 1 బీ వీసాను కాపాడుకునేందుకు ఆ ఐటీ ఉద్యోగులు కొత్త
ఉద్యోగాల వైపు చూస్తున్నారు. ఆర్థిక మాంద్యం కార‌ణంగా కొత్త ఉద్యోగాలు దొరక్క తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. గూగుల్, అమెజాన్,
మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గ‌జ సంస్థ‌ల‌తో పాటు అనేక ఐటీ సంస్థ‌లు లే ఆఫ్‌లు ప్ర‌క‌టించ‌డంతో ఇండియాకు చెందిన వేలాది మంది ఐటీ ఉద్యోగులు త‌మ
ఉద్యోగాల‌ను కోల్పోయారు. ఆ ఉద్యోగులంతా దిక్కు తోచ‌ని స్థితిలో ఉన్నారు. త‌మ‌కున్న వ‌ర్క్ వీసా నిబంధ‌న‌ల ప్ర‌కారం అమెరికాలో ఉండాలంటే
నిర్దిష్ట కాలంలో కొత్త ఉద్యోగాల్లో చేరాలి. ఆర్థిక మాంద్యం కార‌ణంగా కొత్త ఉద్యోగాలు ల‌భించ‌డం క‌ష్టంగా మారింది. ఈ ప‌రిస్థితి త‌మ కుటుంబాల‌పై తీవ్ర
ప్ర‌భావం చూపుతుంద‌ని ఐటీ ఉద్యోగులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

వరుస లేఆఫ్స్ .. 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోలేకపోతే, తిరుగు ప్రయాణం అవ్వాల్సిన పరిస్థితులు .. టెక్కీల దుస్థితికి అర్థం పడుతున్నాయి.
ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..

Must Read

spot_img