Homeఅంతర్జాతీయంసౌరశక్తి వృద్ధాప్యాన్ని తగ్గిస్తుందా..!

సౌరశక్తి వృద్ధాప్యాన్ని తగ్గిస్తుందా..!

మానవులు వృద్ధాప్యాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల క్రీములు, లోషన్లు రాసుకుంటారు.. వయసు పై బడే కొద్దీ ఇంకా యవ్వనంగా కనిపించాలని తహతహలాడుతుంటారు.. అయితే.. ఎన్ని రకాల లోషన్స్ రాసినా పెద్ద ప్రయోజనం కనిపించడం లేదనేది నిజం.. అయితే.. ఇప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండానే వృద్ధాప్యాన్ని తగ్గిస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు.

వృద్ధాప్యాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల క్రీములు, లోషన్లు చేయలేని పని సౌరశక్తి చేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు.. ఎటువంటి క్రీములు, లోషన్లు రాయక్కర్లా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా యవ్వనంగా ఉండొచ్చంటోంది లేటెస్ట్ రీసెర్చ్..: ఇంతకూ అదెలా సాధ్యం అనుకుంటున్నారా..?

సూర్యరశ్మితో సకలకోటి జీవజాతులకు ఎంతో మేలు జరుగుతుంది.. సూర్యరశ్మి లేకపోతే జీవ ప్రక్రియలు జరగక జీవుల మనుగడ ఉండదు.. అన్ని రకాల జీవులకు సూర్యుని నుంచి వెలువడే కాంతి ఎంతో అవసరం.. అయితే.. సౌరశక్తి తాజాగా మరో మేలు చేస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.. సౌరశక్తి వృద్ధాప్యాన్ని తగ్గిస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఎటువంటి క్రీములు, లోషన్లు రాయక్కర్లా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా యవ్వనంగా ఉండొచ్చంటోంది లేటెస్ట్ రీసెర్చ్..: అందంగా ఉండాలని.. అందంగా కనిపించాలని అంతా కోరుకుంటారు. కానీ.. వయసు పెరిగేకొద్దీ శరీరంలో మార్పులు వస్తుంటాయి.

జుట్టు ఊడుతుంది. జుట్టు తెల్లబడుతుంది. చర్మం ముడుతలు పడుతుంది. ఈ మార్పులు మొదలవగానే.. ఓ ఆందోళన మొదలవుతుంది. అందంగా, వయస్సు చిన్నగా కనిపించటానికి ఏవేవో క్రీములు, ఆయిల్స్ రాస్తూ ఉంటారు. ఇక.. సెలబ్రిటీలైతే.. అందం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో.. అన్నీ తీసుకుంటారు. సెపరేట్.. డైట్ కూడా మెయింటైన్ చేస్తారు. అయినా సరే.. పెరుగుతున్న వయసుని.. దాంతో పాటు శరీరంలో వచ్చే మార్పులని ఎవరూ ఆపలేరు. ఎన్ని క్రీములు రుద్దినా.. ఎన్ని లోషన్స్ రాసినా.. ఎలాంటి డైట్ మెయింటైన్ చేసినా.. శరీరంలో జరిగే మార్పులు కనిపించకుండా పోవు.

కానీ ఇప్పుడా చింత అవసరం లేదంటున్నారు పరిశోధకులు.

  • ఉన్న చోటే ఉంటూ.. నిత్య యవ్వనంగా కనిపించొచ్చు..!

ఎలాంటి క్రీములు, లోషన్లు వాడాల్సిన పనిలేదు. రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఉన్న చోటే ఉంటూ.. నిత్య యవ్వనంగా కనిపించొచ్చు.. వృద్ధాప్యాన్ని తగ్గించేందుకు.. సౌరశక్తి ఉపయోగపడు తుందంటున్నారు శాస్త్రవేత్తలు.. మానవ శరీరంలో.. జన్యు మార్పులు చేసిన మైటోకాండ్రియా.. కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చగలదని పరిశోధకులు చూపించారు. ఇది.. కణాలు ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతుందని తేల్చారు.

మైటోకాండ్రియాలనేవి.. మానవ శరీరంలోని జీవకణాలు. మన అందాన్ని, వయసుని, వృద్ధాప్యాన్ని డిసైడ్ చేసేవి ఇవే. జీవక్రియలు చురుగ్గా సాగే విషయంలో.. వీటి పాత్రే చాలా ఉంటుంది. కణాల్లో జరిగే అనేక జీవక్రియ చర్యలకు అవసరమైన శక్తిని మైటోకాండ్రియాలే అందిస్తాయి. అందువల్ల వీటిని.. కణానికి సంబంధించిన పవర్‌హౌజ్‌గా చెబుతారు వైద్య నిపుణులు. అయితే.. ఇవి యాక్టివ్‌గా,ఉంటేనే.. మన శరీరం కూడా చాలా అందంగా కనిపిస్తుంది.

వృద్ధాప్యం అంత త్వరగా రాదని చెబుతున్నారు. అలా.. సైలెంట్ అయిపోయిన మైటోకాండ్రియాలలోకి.. కాంతిని ప్రసరింపజేస్తే.. అది రసాయనశక్తిగా మారి.. కణాలను ఉత్తేజపరుస్తుందని పరిశోధకులు తేల్చారు. ఈ రీసెర్చే ఇప్పుడు.. చాలా మందిలో ఆశలు రేకెత్తిస్తోంది.

యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం.. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మనుషుల అందం తగ్గకుండా.. వృద్ధాప్యం త్వరగా దరి చేరకుండా చేసే సాధనాన్ని వాళ్లు దాదాపు కనుగొన్నారు. మైటోకాండ్రియా కణాలు పనిచేయకపోవడం వల్లే.. వృద్ధాప్యం త్వరగా వస్తుందని పరిశోధకులు తేల్చారు. అయితే.. ఇందుకు గల కచ్చితమైన జీవసంబంధమైన కారణాలు ఏమిటనే దానిపై ఇంకా రీసెర్చ్ జరుగుతోంది. కానీ.. జన్యుమార్పులు చేసిన మైటోకాండ్రియా.. కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చగలదని తేల్చారు పరిశోధకులు.

ఈ శక్తిని.. కణాలు తమను తాము నిలబెట్టుకునేందుకు వాడుకుంటాయని చెబుతున్నారు. రౌండ్ వార్మ్ సి.ఎలిగాన్స్‌లో ఈ ప్రక్రియ జరుగుతున్నట్లు కనుగొన్నారు. ఈ రీసెర్చ్.. రాబోయే రోజుల్లో వయసు సంబంధిత వ్యాధులతో పాటు వయసును తగ్గించి చూపే చికిత్సలకు కొత్త మార్గం కానుందని సూచిస్తోంది. ఈ రీసెర్చ్‌కు సంబంధించిన కీలక సమాచారమంతా.. నేచర్ జర్నల్‌ లోప్రచురించారు.

మైటోకాండ్రియా అనేది మానవ శరీరంలోని చాలా అవయవాల్లో కనిపించే కణాలని చెప్పొచ్చు. వీటిని.. సెల్యులార్ పవర్ ప్లాంట్లుగా సూచిస్తారు. లైట్-యాక్టివేటెడ్ ప్రోటాన్ పంప్‌ని ఉపయోగించి.. ఆప్టోజెనెటిక్‌గా.. మైటోకాండ్రియల్ పొటెన్షియల్ పెంచడం ద్వారా.. వయసు సంబంధింత లక్షణాలు మెరుగుపడతాయి. అదే విధంగా.. కెనోరాబిడిటిస్ ఎలిగాన్స్‌ జీవితకాలం కూడా పెరుగుతుందని.. పరిశోధకులు చెబుతున్నారు.

  • మనుషుల్లో వచ్చే వ్యాధులను నయం చేసే విధానాలను కనిపెట్టడానికి.. సి.ఎలిగాన్స్ అనే రౌండ్‌ వార్మ్స్‌పై ఎప్పటి నుంచో పరిశోధనలు జరుగుతున్నాయి..!

వీటిలో ఉండే జీనోమ్స్‌.. మనుషుల తరహాలోనే ఉంటాయి. నాడీ సంబంధమైన వ్యాధులకు, గుండె, మూత్రపిండాల సమస్యలకు సంబంధించిన ప్రయోగాలు ఎక్కువగా వీటిపైనే పరిశోధకులు చేస్తుంటారు. మైటోకాండ్రియాలు కూడా మనలో ఉన్నట్లే… సి.ఎలిగాన్స్‌లో ఉండండతో శాస్త్రవేత్తల దృష్టి వాటిపై,పడింది. వీటికి జన్యుపరమైన మార్పులు చేసినప్పుడు.. రౌండ్ వార్మ్‌ల జీవితకాలం.. 30 నుంచి 40 శాతం పెరిగినట్లు గుర్తించారు. అందుకే.. మనుషుల జీవిత కాలాన్ని పెంచవచ్చని బలంగా నమ్ముతున్నారు.

మైటోకాండ్రియల్ సరిగా పనిచేయకపోవడం వల్లే.. మానవజాతి త్వరగా వృద్ధాప్యం బారిన పడుతోంది. అయితే.. కాంతి శక్తితో పనిచేసే మైటోకాండ్రియాను ఉపయోగించి.. జీవక్రియను పెంచడం వల్ల.. ఆరోగ్యకరమైన జీవితాలు లభిస్తాయని తాజా రీసెర్చ్‌లో తేలింది.

ఈ పరిశోధనలు.. కొత్త పరిశోధనా సాధనాలు, మైటోకాండ్రియాను మరింత అధ్యయనం చేయడానికి, వయసు సంబంధిత వ్యాధుల చికిత్సకు, వయసు తగ్గినట్లుగా చూపించేందుకు.. సహాయపడతాయని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనం.. మానవ శరీరంలో.. మైటోకాండ్రియా పోషించే సంక్లిష్ట జీవసంబంధమైన పాత్రలపై.. పరిశోధకులకు మరింత సమాచారాన్ని అందించనుంది.

ఇది సజీవ కణంలోని మైటోకాండ్రియాను మార్చడానికి.. కొత్త మార్గాన్ని చూపించే అవకాశం ఉంది. నిజానికి.. మైటోకాండ్రియా జంతువుల్లో ఎలా ప్రవర్తిస్తుందనే దానిని అర్థం చేసుకోవడంపై పరిశోధకులు దృష్టి పెట్టారు. మొదట పురుగులో, తర్వాత ఎలుకలలో, ఆ తర్వాత మానవ కణాల్లో.. ప్రయోగం జరపనున్నారు. ఆ తర్వాతే.. మానవుల్లో ఎక్కువగా ఉన్న వ్యాధులపై, వృద్ధాప్యాన్ని కలిగిస్తున్న కణాలను లక్ష్యంగా చేసుకొని పరిశోధనలు చేసే అవకాశం ఉంది. అయితే.. వృద్ధాప్యాన్ని జయించవచ్చనే ఆశకు ఈ పరిశోధన ఊపిరిపోస్తోంది..

జన్యు మార్పులు చేసిన మైటోకాండ్రియా.. మానవ శరీరంలో కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చగలదని పరిశోధనలో తేల్చారు శాస్త్రవేత్తలు..ఇది.. కణాలు ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతుంది. జీవకణాలను ఎక్కువ కాలం సజీవంగా ఉంచడం వల్ల వృద్ధాప్యాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Must Read

spot_img