Homeఅంతర్జాతీయంకోహినూర్ వజ్రం ధరిస్తే దరిద్రం పడుతుందా..?

కోహినూర్ వజ్రం ధరిస్తే దరిద్రం పడుతుందా..?

కోహినూర్ వజ్రం ధరించడానికి నూతన తరం బ్రిటన్ రాజరికం ఇష్టపడటం లేదు. ఎందుకో రాజకుటుంబంలో ఈ వజ్రం కారణంగానే గొడవలు వచ్చాయన్నవార్తల నేపథ్యంలో కింగ్ చార్లెస్ త్రీ పట్టాభిషేక సమయంలో రాణి కెమిల్లా కోహినూర్ ఉన్న కిరీటాన్ని ధరించబోవడం లేదు. అయితే అందుకు ప్రత్యమ్నాయంగా మరో కొత్త కిరీటం ఏర్పాటు చేసే పనిలో ఉంది బకింగ్ హం ప్యాలెస్.

కోహినూర్ వజ్రం ధరిస్తే దరిద్రం పడుతుందా..? అది ధరించడానికి కొత్త రాణి కెమిల్లా సాహసించలేక పోతున్నారా అన్నది మరోసారి వార్తల్లోకి వచ్చింది. నిజానికి భారతదేశానికి చెందిన కోహినూర్ వజ్రం ప్రపంచంలోనే విలువైనది. శతాబ్దాల కాలంలో అనేక చేతులు మారి చివరకు లండన్ చేరింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కోళ్లూరులో ఈ వజ్రం లభించిందని చారిత్రిక ఆధారాల ద్వారా తెలుస్తోంది. బ్రిటన్‌లో కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం దగ్గర పడుతుండగా కోహినూర్ వజ్రం గురించి చర్చ మొదలైంది. ఈ విలువైన వజ్రాన్ని మొఘల్ రాకుమారులు, పర్షియన్, ఆఫ్ఘన్ పాలకులు,పంజాబ్ మహారాజులు ధరించారు. వారి నుంచి చివరకు లండన్‌ చేరింది. అప్పటి నుంచి అక్కడే ఉంది. లండన్‌లో కోహినూర్ వజ్రం క్రౌన్ జ్యువెల్స్‌లో ఒక భాగం అయింది.

మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా తన తలపాగాలో కోహినూర్ వజ్రాన్ని ధరించాడని.. పర్షియన్ రాజు నాదర్ షా తెలుసుకున్నాడని ఒక కథనం.మొఘల్ పాలకుడిని విందుకు ఆహ్వానించడం ద్వారా స్నేహ హస్తం అందించాడు. ఆ కాలంలో స్నేహపూర్వక సంప్రదాయమైన తలపాగాలను మార్చుకోవడం ద్వారా వారి స్నేహాన్ని ధృవీకరించాలని అతను కోరాడు. మొఘల్ పాలకుడి తలపాగాను పొందిన తరువాత, నాదర్ షా కోహినూర్ వజ్రం అంటే కాంతి పర్వతం అని పేరు పెట్టాడు. అయితే కోహినూర్ రాజులకు కలసి రాలేదని చరిత్ర ద్వారా తెలుస్తోంది. రోయినా గ్రేవాల్ తన పుస్తకం ‘ఇన్ ది షాడో ఆఫ్ ది తాజ్, ఎ పోర్ట్రెయిట్ ఆఫ్ ఆగ్రా’లో కొన్ని విషయాలు చెప్పారు. కోహినూర్ దక్కించుకున్న తరవాత నాదర్ షా హత్యకు గురయ్యాడు. అతని కుమారులు ఆదిల్ షా, ఇబ్రహీం కూడా చనిపోయారు.

అతని మనవడు షారుఖ్, కోహినూర్‌ను ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన అహ్మద్ షాకు అప్పగించవలసి వచ్చింది.

కోహినూర్‌ను దక్కించుకున్న తర్వాత, అహ్మద్ షా మరణించాడు. షా కుమారుల మధ్య అంతర్యుద్ధం ప్రారంభమైంది. అతని ఇద్దరు కుమారులు వజ్రంతో పంజాబ్‌కు పారిపోయారు. ఆ తర్వాత మహారాజా రంజిత్ సింగ్ కోహినూర్‌ను దక్కించుకున్నాడు. రంజిత్ సింగ్ మరణానంతరం సింహాసనం కోసం పోటీ ఏర్పడింది. చివరకు 1849లో పంజాబ్‌ను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ రాష్ట్ర ఆస్తిని ఈస్ట్ ఇండియా కంపెనీ జప్తు చేసింది. కోహినూర్‌ను ఇంగ్లండ్ రాణికి బహుమతిగా అందించారు. లార్డ్ డల్హౌసీ దీనిని 1850లో ఇంగ్లండ్‌కు పంపించారు. క్వీన్ విక్టోరియా మొదట తన కిరీటంలో రత్నాన్ని ధరించింది.

అయితే ఈ వజ్రానికి సంబంధించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

ఒక స్త్రీ మాత్రమే కోహినూర్‌ను ధరించి ఎలాంటి ఆపదలు రాకుండా ఉందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. రాణి విక్టోరియా పెద్ద కుమారుడైన కింగ్ ఎడ్వర్డ్ VII భార్య అలెగ్జాండ్రా 1902లో ఆమె పట్టాభిషేకం సందర్భంగా క్వీన్ కాన్సార్ట్ కిరీటంలో కోహినూర్ వజ్రాన్ని ఉంచారు. 1911లో విక్టోరియా మనవడు కింగ్ జార్జ్-Vని వివాహం చేసుకున్న యువరాణి మేరీ కిరీటంలో కోహినూర్ వజ్రాన్ని పొదిగారు. కింగ్ జార్జ్ VI క్వీన్ కన్సార్ట్ 1937లో కిరీటంలో కోహినూర్ పొదిగారు. ఆమె 2002లో ప్రిన్సెస్ ఎలిజబెత్ II ఇంగ్లాండ్ చక్రవర్తిగా ఉన్న సమయంలో కోహినూర్ వజ్రాన్ని ప్లాటినం కిరీటాన్ని ధరించింది. చరిత్రను పరిశీలిస్తే కోహినూర్ మగవారికి కలసి రాలేదు. కేవలం రాణులకు మాత్రమే కోహినూర్ కలిసి వచ్చింది.

ఈ వజ్రం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని మార్లు ప్రయత్నించినా మన దేశానికి తిరిగి రాలేదు. ప్రపంచంలో ఎన్ని వజ్రాలు ఉన్నా కోహినూర్ కు ఉన్న విశిష్టత వేరు. నిజానికి ఈ వజ్రం తొలి రోజుల్లో 793 క్యారెట్లు ఉండేది. ప్రస్తుతం 105.6 క్యారట్లకు తగ్గిపోయింది. వాస్తవానికి ఈ వజ్రం ఒకరికి ఒకరు కానుకగా ఇవ్వడం తప్ప.. అమ్మడమో, బలవంతంగా లాక్కోవడమో జరగలేదు. అంతే కాదు.. ఎవరు కొనుగోలు చేయడం కూడా జరగలేదు.. దీని ప్రకారం కోహినూరు వజ్రానికి ఎవరూ శాశ్వత యజమానులు లేరు.
ఎందుకంటే ఇది ఉన్న చోటల్లా అల్లకల్లోలం స్రుష్టించడం జరిగింది. అలా ఒక్కో రాజకుటుంబం పూర్తిగా కుప్పకూలపోయాక మరో రాజకుటుంబానికి వచ్చి చేరింది. ఇప్పుడు బ్రిటన్ లోని బకింగ్ హమ్ ప్యాలెస్ లోనూ కుటుంబంలో చిచ్చు రగిలింది. కోడలును మెచ్చని కారణంగా రాజకుటుంబం నుంచి చిన్న కొడుకు హ్యారీ తన భార్యతో సహా అమెరికాకు వెళ్లిపోయారు.

Must Read

spot_img