(త్రిపుల్ ఆర్ మూవీలో నాటు నాటు సాంగ్ కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించింది. అంతేకాకుండా ఈ పాట ఆస్కార్ కు కూడా నామినేట్ అయ్యింది. ఈ తరుణంలోనే అమెరికాకు చెందిన ఏబీసీ ఛానల్లోని గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షో లో పాల్గొనేందుకు రాంచరణ్ కు అవకాశం వచ్చింది. కానీ, హీరో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళికి మాత్రం ఆహ్వానం అందలేదనే ప్రచారం జరుగుతోంది. దీని వెనుక రహస్య ఎజెండా ఏమైనా ఉందా ? అనే కోణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. )
ఆర్ఆర్ఆర్ ఈ మూవీ గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలియని వారు లేరు. రాజమౌళి తెరకెక్కించిన తెలుగు సినీ కీర్తిని దేశంలో కాక ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరును తెచ్చిపెట్టింది. అంతేకాదు ఈ చిత్రం కోసం పని చేసిన సాంకేతిక నిపుణలకు, నటులకు కూడా ఎంతో పాపులారిటీని సంపాదించి పెట్టింది ఆర్ఆర్ఆర్. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలో యాక్ట్ చేసిన ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ కి పాన్ ఇండియా వైడ్ మాత్రమే కాదు వరల్డ్ వైడ్ అభిమానులను సంపాదించి పెట్టింది. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు కూడా వీరిద్దరి నటనకి ఫిదా అయిపోతున్నారు. ఎంతో మంది హాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు, నటీనటుల నుంచి అభినందనల వెల్లువ వస్తోంది. ఈ సినిమా గత ఏడాది మార్చి 25న విడుదలై కలెక్షన్స్ పరంగానే కాకుండా రివార్డులు, అవార్డుల పరంగా అదరహో అనిపిస్తోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న ఈ సినిమా ఆస్కార్ అవార్డ్‌కు నామినేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా అమెరికాలోని ఓ టెలివిజన్ టాక్ షోలో పాల్గొన్నారు.
అమెరికాలో రామ్ చరణ్ కు ఘన స్వాగతం
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ అమెరికాకు వెళ్లారు. త్వరలోనే ఆస్కార్ వేడుకలు ఘనంగా ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ సారి ఆస్కార్ అవార్డ్స్ లో తప్పకుండా తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ కు అవార్డు దక్కుతుంది అని అందరూ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు అవార్డ్ మనదేనని హింట్ కూడా ఇస్తున్నారు. ఆస్కార్ నామినేషన్లో నాటు నాటు సాంగ్ నిలిచిన విషయం తెలిసిందే. దీని కంటే ముందుగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చిత్ర యూనిట్ అందరికంటే ముందుగా అమెరికాకు వెళ్లి అక్కడ ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియాలో కనిపిస్తూ ఉండడం విశేషం. అమెరికాకు చెందిన ఓ ప్రముఖ టాక్ షో అయిన గుడ్ మార్నింగ్ అమెరికా అనే ఏబిసి ఛానల్ షో రామ్ లో చరణ్ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అమెరికా వాసులు రామ్ చరణ్ ను చుట్టుముట్టి అభిమాన వర్షం కురిపిస్తున్నారు. తెలుగు వారితో పాటు విదేశీయులు కూడా రామ్ చరణ్ తో సెల్పీలు దిగేందుకు పోటిపడుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఘన విజయంపై ఆయన షోలో మాట్లాడారు. దీంతో పాటు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ వేడుకలో ఆయన ప్రెజెంటర్ గా వ్యవహరించనున్నారు. ఇంతవరకు టాలీవుడ్ లో మరెవరికీ ఈ ఘనత దక్కలేదు.
చెర్రీకి అరుదైన గౌరవం..!
వచ్చే నెల 12న ఆస్కార్ అవార్డుల ఫలితాలు వెలువడనున్నాయి. నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ రావడం ఖాయమనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్ కు ఆయన ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నాడు. దీనికోసం హెచ్.సి.ఏ సంస్థ ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించింది. రేపు అమెరికాలో జరగబోయే 6వ హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో ఈయన ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నారు. ఈ అవార్డుల్లో ఒక విజేతకు రామ్ చరణ్ తన చేతుల మీదగా అవార్డును అందించనున్నాడు. ఆ స్టేజీ మీద ఒక తెలుగు వాడు అవార్డు ప్రదానం చేయడం మాములు విషయం కాదు. గతంలో మన ఇండియాకి స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు మ్యాజిక్ అందించినందుకు మ్యాజిక్ మెజీషియన్ ఏఆర్ రెహ్మాన్ కు ఆస్కార్ వచ్చింది. ఇప్పటి వరకు ఆస్కార్ నామినేషన్లు సాధించిన ఇతర భారతీయ చిత్రాలు మదర్ ఇండియా (1957), సలామ్ బొంబాయి (1988), లగాన్ (2001) చిత్రాలున్నాయి. ఆ తర్వాత మళ్లీ ఆ దిశగా ఇప్పడు బరీలో ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్ చేరింది. ఇప్పటీకే అవార్డు మనకే వస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఆ గుడ్ న్యూస్ కోసం మనం వచ్చే నెల 12 వరకు వేచిచూడాల్సిందే. ఇక హెచ్ సి ఏ అవార్డుల్లో భాగంగా ఆర్ఆర్ఆర్ సినిమా నాలుగు విభాగాల్లో నామినేట్ అయింది. ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకత్వం, అంతర్జాతీయ సినిమా, యాక్షన్ సినిమా విభాగాల్లో హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతోంది. మరి ఈ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ ఎన్ని అవార్డులను కైవసం చేసుకుంటుందో తెలియాలంటే ఈ నెల 24 వరకు వెయిట్ చేయాల్సిందే.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నిరాశ
ఆర్ఆర్ఆర్ ఇప్పుడు 95 వ అకాడమీ అవార్డులలో నామినేషన్ సాధించిన మొదటి దక్షిణ భారతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ అద్భుతమైన స్థానం సాధించినందుకు ఆర్‌ఆర్‌ఆర్ బృందాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇక ‘నాటు నాటు’ మిగితా నాలుగు పాటలతో పోటీ ఆస్కార్‌ను సాధిస్తుందా ? లేదా అనే విషయం పక్కనపెడితే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు కూడా నామినేటయ్యే అవకాశముందని అందరూ భావించారు. అయితే ఆయన పేరు లీడ్ యాక్టర్ కేటగిరిలో నామినేట్ కాలేదు. ఎన్టీఆర్‌కు బెస్ట్ యాక్టర్‌గా ఆస్కార్ పొందే ఆస్కారం ఉందని పలు నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రముఖ అమెరికన్ పబ్లికేషన్ ‘యుఎస్‌ఎ టుడే’. అమెరికాకు చెందిన ఈ పత్రిక తన కథనంలో రాస్తూ.. నటుడు జూనియర్ ఎన్టీఆర్ టాప్ ఆస్కార్ పోటీదారుగా ఉండబోతున్నాడని జోస్యం చెప్పింది అయితే అలాంటిదేమి జరుగలేదు. దీంతో అభిమానుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. తాజాగా మెగాపవర్ స్టార్ ఇంటర్నేషనల్ టాక్ షో లో కనడబడటం, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్ కు ఆయన ప్రజెంటర్‌గా వ్యవహరించడం పట్ల ఫ్యాన్స్ బాగా హర్టవుతున్నారు. కావాలనే ఎన్టీఆర్ కు ఆ అవకాశాలు రానియకుండా చేశారనే అనుమానాలను సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. నెట్టింట్లో ఎన్టీఆర్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తూ..ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ పాత్ర కంటే ఎన్టీఆర్ పాత్రనే ఎక్కువగా ఆదరణ పొందిదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నిజ జీవితంలో బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ జీవితంలో జరిగే ఎలాంటి విషయాలనైన మొదటగా ఎన్టీఆర్ తోనే షేర్ చేసుకుంటాడని చాలా సందర్బాలలో రామ్చరణ్ చెప్పాడు. తాను తండ్రి కాబోతున్న విషయాన్ని కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అయిన ఎన్టీఆర్ కి ముందు చెప్పినట్లు తెలిపారు. ఒక వేళా ఎన్టీఆర్ కు నిజంగానే ఆహ్వానం రాలేదా..? ఒక వేళా ఆహ్వానం వచ్చిన తన అన్న తారక్ రత్న మరణం కారణంగా వెళ్లలేక పోయాడా..? అనే దానిపై ఫ్యాన్స్ సందేహపడుతున్నారు. మల్టీ స్టార్ మూవీలో ఇద్దరి పాత్రలు సమానంగానే ఉన్న ఒక్కరికే పిలుపు రావడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తుంది.