Homeఅంతర్జాతీయంవయసు పెరగకుండా చేసుకోవచ్చు.! అదెలాగో తెలుసా? 

వయసు పెరగకుండా చేసుకోవచ్చు.! అదెలాగో తెలుసా? 

మనం మరణాన్ని తప్పించుకోలేం. కానీ, వయసురీత్యా మనలో వచ్చే మార్పులను మాత్రం తప్పించుకోవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు. అంటే మన వయసు పెరుగుదలతో వచ్చే నష్టాలను తగ్గించుకోవడం తద్వారా ఎక్కువ కాలం వయసు పెరగకుండా చూసుకోవడం సాధ్యమేనని పరిశోధకులు చెబతున్నారు. గత 150 ఏళ్లలో మనుషుల జీవన కాలం రెండింతలు పెరిగి ఉండొచ్చు. కానీ, చాలా మంది మాత్రం వయసు పెరుగుతున్నా కొద్ది తమలో వచ్చే మార్పుల విషయంలో చాలా నిరాశగా ఉంటారు.

ఎందుకంటే వయసు మీదపడగానే తెల్ల వెంట్రుకలు రావడం, కీళ్ల నొప్పులు బీపీలు షుగర్‌లు దాడి చేయడం సర్వసాధరణంగా జరిగిపోతుంటుంది. అసలు ఆ వయసు గురించిన ఆలోచన వస్తే చాలు ఏదో తెలియని నిరుత్సాహం వచ్చి తీరుతుంది. అది చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి అలా జరుగుతుంటుంది. వృద్ధులు చురుకుగా ఉండకూడదు..వృద్దులు తమ వయసుకు తగ్గట్టుగా వ్యవహరించడం లాంటివి అటోమెటిక్‌గా శరీరంలోకి అన్వయించుకుంటారు. అయితే ఈ నిరుత్సాహాన్ని తగ్గించేందుకు సరికొత్త టెక్నాలజీ పుట్టుకొస్తోంది. దీని ద్వారా ఆరోగ్యకరంగా, ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అనేక ఆధునిక చికిత్సల ద్వారా శరీరంలో వచ్చే వ్యాధుల ప్రమాదాన్ని, బాధలను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

న్యూట్రిషినల్ పిల్స్‌ను ఇవ్వడం ద్వారా మన శరీరంలో కణాల క్షీణతను తగ్గించేందుకు చికిత్స ఇస్తున్నారు. ఈ చికిత్సల ద్వారా ఈ రంగంలో వ్యాపార అవకాశాలు కూడా ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. ఈ అధ్యయనాలు, చికిత్సలు కేవలం మనీ మేకింగ్ వెంచర్లా లేదా వైద్య రంగంలో పురోగతికి సహకరిస్తుందా అనేది తెలుసుకుంటున్నారు. 45 ఏళ్ల బ్రెయిన్ జాన్సన్ అనే వ్యాపారవేత్త జన్యుపరమైన చికిత్సతో తన వయసు తక్కువ కనిపించేలా వందల వేలకొద్ది డాలర్లను ఖర్చు చేస్తున్నారు.

వయసును తగ్గించుకునేందుకు ఈ బిజినెస్‌ మేన్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయనొక్కరే కాదు..ప్రపంచవ్యాప్తంగా అనేక మంది బిలియనియర్లు ఈ విషయంలో తమ సంపదను ఖర్చు చేస్తున్నారు. పరిశోధకులను పురమాయించి వయసు తగ్గించుకునే ప్రయత్నాలన్నింటినీ చేస్తున్నారు. అయితే ఒకటి మాత్రం నిజం.. వయసు పెరుగుతున్నకొద్ది, మన శరీరంలో ఎన్నో మార్పులు సహజంగా వస్తాయి.

శరీరం ముందున్న విధంగా కాకుండా వయసుతో పాటు చాలా వరకు పాడవుతుంది. క్యాన్సర్, డయబెటీస్, గుండె జబ్బులు వంటి వాటికి కారణం వయసు పెరగడం అన్నది కాదనలేని సత్యం. అయితే వయసు పెరగడాన్ని ఆపడం ద్వారా ఈ వ్యాధులు రావడాన్ని కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనం చెప్పుకున్న జాన్సన్ అనే సంపన్నుడు వెనీస్ బీచ్‌లోని తన ఇంటిని క్లినిక్‌గా మార్చేసుకున్నారు. ప్రతి రోజూ ఎన్నో గంటలను ఆ క్లినిక్‌లోనే వెచ్చించడం మొదలుపెట్టారు. ఉదయం 5 గంటలకు నిద్ర లేస్తారు. ఆరు లోపల బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. ఆ తర్వాత 11 గంటల కల్లా మధ్యాహ్న భోజనం చేస్తారు. దీంతో పాటు, 54 న్యూట్రిషినల్ పిల్స్‌ను తీసుకుంటారు.

రెగ్యులర్ చెకప్‌ల ద్వారా జాన్సన్ శరీరాన్ని పరీక్షించి ఈ మెడిసిన్ల డోస్‌ను, తీసుకునే సమయాన్ని డాక్టర్లు నిర్ణయిస్తారు. చాలా వరకు వ్యాయామాలు, చికిత్సలతోనే ఆయన రోజంతా గడిచిపోతుంది. దీంతో కొన్ని రోజుల అనంతరం మార్పులు కనిపించడం మొదలైంది. స్కిన్ లేజర్ ట్రీట్‌మెంట్‌తో చర్మం వయసు 22 ఏళ్లకి తగ్గిపోయింది. శరీరంలోని ఇతర బాడీ పార్ట్‌లతో పోలిస్తే తన స్కిన్ చాలా యంగ్‌గా ఉంటుందని జాన్సన్ చెబుతున్నారు. ఆరోగ్యానికి జాన్సన్ చాలా ప్రాధాన్యత ఇస్తారు. ప్రతిరోజూ 5 కి.మీలు నడుస్తారు. చక్కెరను శరీరంలోకి చేరకుండా వీలయినంతగా ప్రయత్నిస్తారు. దీంతో పాటు తన శరీర కార్యకలాపాలను మానిటర్ చేసుకునేందుకు ఇంటెన్సివ్ మానిటరింగ్ డివైజ్‌లను వాడుతున్నారు. జీవనకాలాన్ని పెంచుకోవడంలో 7 శాతం మాత్రమే జెనిటిక్స్ సాయపడతాయి. మిగతా 93 శాతం మనిషి జీవన విధానంపై ఆధారపడి ఉంటుంది.

ఎవరైతే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరిస్తారో వారు 95 ఏళ్ల పాటు నివసిస్తారని జాన్సన్ నమ్ముతున్నారు. అన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే మనిషి సగటు జీవన కాలం కంటే 15 నుంచి 17 ఏళ్లు ఎక్కువగా జీవన కాలం సాధ్యపడుతుంది. ఇది పరిశోధనల్లో తేలిన సత్యం. అయితే ఆరోగ్యకరమైన జీవన విధానాల్లో ఏమేమి ఉంటాయో తెలుసుకునేందుకూ నిరంతరం పరిశోధకులు రీసెర్చ్ చేస్తున్నారు. తాజా ఫలితాలను బట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, చక్కెరను అస్సలు ఏ రకంగా కూడా వాడకపోవడం, తగినంతగా నిద్రపోవడం వంటివి ఆరోగ్యకరమైన జీవన విధానాల్లో చాలా ముఖ్యమైనవి. ఎక్కువగా వ్యాయామాలు, కొన్ని గంటల పాటు ఉపవాసం, మంచి నిద్ర, సామాజిక సంబంధాలు, ఆల్కహాల్ తక్కువగా తీసుకోవడాన్ని అనుసరించడం అవసరం.

దీని వల్ల జాన్సన్ చక్కటి ఫలితాలు సాధించారు. అయితే తాను నేర్చుకున్నది ప్రపంచంతో పంచుకున్నారు. ఆయన ఏమంటున్నారంటే..24 గంటల సమయంలో కనీసం 14 గంటలు తినకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే అది మనుషుల మెటాబోలిజంపై ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. మనం వయసు పెరుగుతున్న కొద్ది శరీరంపై తగిన శ్రద్ధ తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్యలు బయటపడితే, వెంటనే దానికి అవసరమైన వైద్యాన్ని సరైన సమయంలో తీసుకోవాలి. ఈ విధానాన్ని జీవితంలో భాగంగా చేసుకోవాలనీ, ఇది జీవితాల్లో పెను మార్పును తీసుకురాగలదనీ అంటారు ఎరిక్. రీసెర్చ్‌లో పాల్గొన్న చాలామంది తమ ఆయుర్ధాయాన్ని పెంచుకోవడానికి ఒకటి కంటే ఎక్కువ స్మార్ట్ ట్రాకర్లను వాడుతున్నారు. బాడీలో జరిగే ప్రక్రియలను గుర్తించేందుకు స్మార్ట్ వాచ్‌ను, నిద్ర సమయాలను మానిటర్ చేసేందుకు స్మార్ట్ రింగ్‌ను ఉపయోగిస్తున్నారు. నిద్రపోయేటప్పుడు వాచ్ కంటే మరింత సౌకర్యవంతంగా రింగ్ ఉంటుందని చాలా మంది రీసెర్చర్లు చెబుతున్నారు.

ఆరోగ్యం విషయంలో నేటితరం టెక్నాలజీలు అద్భుతంగా అందుబాటులోకి వచ్చాయి. వాటితో ప్రజల ఆయుర్ధాయం క్రమంగా పెరుగుతోంది. వైద్య రంగంలో ఎన్నో ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయుష్షు పెరిగింది. అయితే, ప్రజల జీవన కాలం పెరుగుతున్న సమయంలో, వృద్ధాప్యాన్ని మనం ఒక నిర్దిష్ట వయసు తర్వాత వ్యాధిగా పరిగణించవచ్చా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వృద్ధాప్యాన్ని చెప్పేందుకు ఒక వయసును నిర్ణయిస్తే, వారికి చేసే చికిత్సా ఖర్చులు కూడా పదింతలు పెరగనున్నాయి. ఒక వయసు వచ్చిన తర్వాత వారిని ‘సిక్’ పర్సన్లుగా ముద్ర వేసే ప్రమాదం ఉంది. ఆరోగ్యకరమైన జీవితమంటే మరింత కాలం పాటు పని చేయగలగడమని అర్థం. అంటే ఆరోగ్యం ద్వారా పని గంటలు కూడా పెరుగుతాయన్నమాట. అందుకే ఆరోగ్యమే మహా భాగ్యం అని పెద్దలు చెబుతుంటారు. ఎంత సంపాదించినా ఆరోగ్యం సరిగా లేనట్టైతే ఏమీ లాభం ఉండదు. అందుకే వయసు పెరిగే సమయానికి మరింత జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని జాన్సన్ చెబుతున్నారు.


వయసు పెరిగే కొద్దీ బరువు తగ్గడం చాలా కష్టం, వృద్ధుల కోసం ఈ బరువు తగ్గించే చిట్కాలను అనుసరించాలి. రెగ్యులర్‌గా నడక సాగించడం, అనారోగ్యం సమయంలో వైద్యుడిని సంప్రదించడం, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను ఎంచుకోవడం, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం, హైడ్రేటెడ్‌గా ఉండటం, వ్యాయామం చేయడం మొదలైనవి మీ బరువు తగ్గిస్తాయి. 50 ఏళ్లు దాటగానే శరీరపు జీవక్రియ మందగిస్తుంది. వయసు పెరిగే కొద్దీ శరీరానికి కావాల్సిన క్యాలరీలు తగ్గుతాయి. అందువల్ల, సరైన స్థాయిలో క్యాలరీలను సర్దుబాటు చేయాలి.

కేలరీల లోటును సృష్టించడానికి మనం బర్న్ చేసే దానికంటే తక్కువ కేలరీలను తీసుకోవడం చాలా అవసరం, ఇది బరువు తగ్గడానికి అవసరమైన చిట్కా అంటున్నారు నిపుణులు.

Must Read

spot_img