మొన్నటికి మొన్న అమెరికాలోని మోంటానాపై గుర్తు తెలియని బెలూన్ కనిపించినప్పుడు అక్కడివారంతా యూఎఫ్ఓ వచ్చేసిందనే అనుకున్నారు. చాట్ జీపీటీ వచ్చాక ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ ఏలియన్స్ ని గుర్తించగలదా అన్నది కూడా ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారిపోయింది. ఎందుకంటే ఇన్నాళ్లూ మానవ మేధ చేయలేని ఎన్నో పనులను ఏఐ టెక్నాలజీ చాలా ఈజీగా చేసేస్తోంది. మొత్తానికి ఏలియన్స్ అనబడమే గ్రహాంతర వాసుల విషయంలో తన ద్రుక్పదాన్ని మార్చుకున్న నాసాను గమనించినా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలించినా గ్రహాంతరవాసుల గురించిన ఆలోచనలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
ప్రపంచవ్యాప్తంగా అందరికీ గ్రహాంతరవాసుల గురించి తెలుసు..అసలు సమస్యేంటంటే వాటిని చూసినవాళ్లు మాత్రం లేరు. ఏలియన్స్ ఉనికిపై ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవు. అయినప్పటికీ, వాటిని తాము చూశామని చెప్పే వారు కోకొల్లలుగా ఉన్నారు. యూఎఫ్ఓలు కానీ ఏలియన్స్ కు సంబంధించిన సంఘటనలు గానీ రోజుకు ప్రపంచవ్యాప్తంగా 510 వరకు దాకా నమోదవుతున్నాయని సమాచారం. కానీ ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్ సైట్లు మాత్రం అవన్నీ ఫేక్ అని కొట్టిపడేస్తుంటాయి. ఏలియన్స్‌ను, వాళ్లు ప్రయాణించే ఎగిరే పళ్లాలను చూసిన వారిలో అనేక ఆరోగ్య పరమైన సమస్యలు వస్తూండటం కూడా తెలిపింది. జట్టు రాలడం, తలనొప్పి, జ్వరం, పీడకలలు, ముక్కులో నుంచి రక్తం కారడం, చర్మంపై కాలిన గాయాలు, గుండెదడ వంటివి కనిపిస్తున్నట్టు ఇప్పటికే పలు మ్యాగజైన్లు వెల్లడించాయి..
అయితే, ఈ కథనాలు నిజాలపై స్పంధించాల్సిన అమెరికా మాత్రం అదేం లేదంటూ కమిటీలు వేసి పక్కకు తప్పుకుంది. దశాబ్దాలుగా ఏ సంఘటనను కూడా వాళ్లు ఖండించలేదు అలాగని నిజమా కాదా స్ఫష్టంగా చెప్పడం కూడా చేయలేదు. నిజానికి ఎప్పుడో గానీ మళ్లీ ఆ ప్రస్తావన బయటకు రాదు. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. అయితే ఏలియన్స్ గురించిన కథనాలు మాత్రం ఎప్పటిలాగే ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా ఎవర్ గ్రీన్ గానే ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆ థీమ్ తో తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నడుస్తుంటాయి.
అయితే గ్రహాంతరవాసులు మానవ స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నాయని, దాంతో ఒక మహిళ గర్భం దాల్చిందని పెంటగాన్ డాక్యుమెంట్ సంచలనం అప్పట్లో స్రుష్టించింది. గ్రహాంతరవాసులతో సంబంధంలోకి పోయిన మానవుల ఆరోగ్యంపై ప్రభావం గురించి శోధిస్తున్నట్లు అమెరికా మీడియా చెబుతోంది. గ్రహాంతర వాసులు మానవులను అపహరించడం, మానవ స్త్రీలతో సంపర్కం పెట్టుకోవడం, లైంగిక దాడులకు దిగడం, వారితో దూర సంభాషణ అనుభవం, భౌతిక స్పర్శ లేకుండానే ఒక శరీరం మరో శరీరంతో కలిసిపోవడం వంటి అనుభవాల గురించి కూడా పెంటగాన్ డాక్యుమెంట్లు వెల్లడించాయని అమెరికా మీడియా చెబుతోంది. గతంలో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త మేధావి స్టీఫెన్ హాకింగ్ ఏలియన్స్ ఉండి ఉంటారనీ, అయితే వారిని ఇన్వైట్ చేసే పిచ్చి పనులు చేయవద్దని హెచ్చరించారు.
మన భూమి గురించిన వివరాలు వాటికి లీక్ చేయవద్దని వారి సంకేతాలకు సమాధానాలు ఇవ్వవద్దని సూచించారు. ఆయన ఇప్పుడు లేకపోయినా ఆ హెచ్చరికలలో ఓ అర్థం ఉంది. అయితే ఆయన సూచనలు హెచ్చరికలు సైంటిస్టులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ నిత్యం మనం నివసించే భూమి లొకేషన్, ఇక్కడ నివసించే జీవజాలం, వాతావరణం గురించిన వివరాలను ఎంక్రిప్ట్ చేసి శబ్దతరంగాలు, ఎలక్ట్రో మాగ్నెటివ్ వేవ్ ల రూపంలో, కాంతి రూపంలో దిగాంతాలకు పంపిస్తూనే ఉన్నారు. అలా చేయడం వలన ఏం జరుగుతుందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏలియన్స్ ఉనికి గురించి రకరకాల వాదనలు చక్కర్లు కొడుతుంటాయి. విశ్వాంతరాలలో జీవం ఉండే నక్షత్రాలు కోట్లలో ఉన్నాయనీ, అందులో భూమిలా ఇతర గ్రహాలు కూడా ఉన్నాయని, భూమిపైన ఉన్నట్లే ఏదో ఒక గ్రహంలో ఇతరుల ఉనికి ఉండే ఉంటుందన్నది నిజమే అంటున్నారు పరిశోధకులు. వారిలో మనలా బుద్ది జీవులు కూడా ఉండొచ్చనీ, వారు మనకన్నా అడ్వాన్స్ టెక్నాలజీలను అభివ్రుద్ది చేసి ఉండొచ్చని ఊహాగానాలు చేస్తున్నారు. వారిని ఆకర్షించి మచ్చిక చేసుకుని టెక్నాలజీలను సొంతం చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
అయితే, అలాంటి వారు ఎక్కడ ఉన్నారో ఇంత వరకూ మనుషులకు తెలియదు. తెలిస్తే తప్పనిసరిగా వారితో సంప్రదింపులు జరుపుతారు. అంతటితో ఆగకుండా వారితో వ్యాపారాలు, అధికారకాంక్షలకు దారితీయవచ్చు. అది భూమిపై నివసించే మనకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే గ్రహాంతరవాసుల్ని సంప్రదించడం గురించి స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. అయినా, ఆ మాటలను పెడచెవిన పెట్టిన శాస్త్రవేత్తలు విశ్వంలో భూమి ఉన్న స్థానాన్ని తెలుపుతూ అంతరిక్షంలోకి సమాచారం పంపుతున్నారు. అంటే, మనుషులు ఎక్కడ ఉన్నారో తెలుపుతూ ఏలియన్స్‌కు సంకేతాలు పంపుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ‘బీకాన్ ఇన్ ది గెలాక్సీ’ అని పిలుస్తున్నారు.
ఈ ప్రయత్నం 1974లో జరిగింది. ఏలియన్ల కోసం పంపిన అరెసిబో మెసేజ్ లో భూగ్రహం గురించిన వివరాలు ఉన్నాయి. అంటే మన పాలపుంతలో భూమి స్థానం ఎక్కడుందో, ఈ భూగ్రహంపై ఎలాంటి జీవులున్నాయో తెలియజేస్తూ మనుషుల ఆకారాలను కూడా పంపుతున్నారు.భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణానికి ముందు మాట్లాడుతూ.. ‘మీరు చరిత్రను పరిశీలిస్తే.. మానవులకి, తక్కువ మేధో జీవులకు మధ్య సంబంధాలు వారి దృక్కోణం నుంచి చూస్తే వినాశకరమైనవిగా ఉంటాయన్నారు. అలాగే, ఆధునిక, ఆదిమ టెక్నాలజీలతో నాగరికతల మధ్య సంప్రదింపులు అంత సులభం కాకపోవచ్చు. దీంతో పెద్దగా లాభం ఉండకపోవచ్చని అన్నారు. అప్పట్లో 100 మిలియన్ డాలర్ట బ్రేక్‌త్రూ అయిన లిసన్ ప్రాజెక్ట్‌కు ప్రతిస్పందనగా 2015లో హాకింగ్ ఈ హెచ్చరికలు చేసారు. ఈ ప్రాజెక్ట్‌లో అంతరిక్షంలో గ్రహాంతర జీవుల కోసం వెతకడం అన్నది ప్రధానంగా ఉంది. ఈ ప్రయత్నాలే చాలాసార్లు హాలివుడ్ సినిమాలుగా వచ్చాయి. నిజానికి, మనల్ని సందర్శించాలనుకునే గ్రహాంతరవాసుల కోసం గెలాక్సీలోకి మనం పంపించే మెసేజ్‌లో సౌరకుటుంబంలో భూమి ఉన్న ప్రదేశం మాత్రమే కాకుండా ఇందులో గ్రహం మ్యాప్, మానవుల రసాయన రూపం గురించి సమాచారం ఉంటుంది. ఓ నగ్న పురుషుడు, ఓ నగ్న స్త్రీల రూపాలు కూడా ఉన్నాయి.
గ్లోబులార్ క్లస్టర్‌లకు సంబంధించి పాలపుంతలో సౌర వ్యవస్థ టైమ్ స్టాంప్డ్ స్థానం వంటి డిజిటైజ్ సమాచారం ఉంది. నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్త జోనాథన్ జియాంగ్ ఈ ఆలోచనను వివరించారు.ఆయన తన సహచరులతో కలిసి చేసిన అధ్యయనాన్ని ప్రీప్రింట్ సైట్ లో ప్రచురించారు. ఈ సందేశం చైనా, కాలిఫోర్నియాలోని రేడియో టెలిస్కోప్‌ల రేడియో తరంగాల నుండి పంపబడింది. పాలపుంతలోని గెలాక్సీ కేంద్రం నుండి 13,000 కాంతి సంవత్సరాల బిందువుకు ఈ సందేశాన్ని పంపింది.
కానీ ఎంత కాంతి వేగంతో ఈ మెసెస్ ను పంపించినా అది దిగాంతాలకు అవతలకు చేరాలంటే సుదీర్థకాలం పడుతుంది. మీకు తెలుసా మార్స్ నుంచి మనకు ఓ రేడియో సందేశం రావాలంటే 22 నిముషాలు పడుతుంది. ఇప్పటికే గ్రహాంతర వాసులు మన భూమికి చేరి ఉండొచ్చన్న వాదన కూడా ఉంది. వారు మనతో పాటే మనకు తెలియని రూపంలో జీవిస్తున్నారనే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే గ్రహాంతరవాసులను భూమిపైనన్న మనం సంప్రదించాలా వద్దా అనే విషయంలో శాస్త్రవేత్తల వద్ద విభిన్న వాదనలున్నాయి. పరిణామంలో తగినంత దూరం చేరుకున్నతర్వాత ఏ గ్రహాంతరవాసులకైనా శాంతి ప్రాముఖ్యత తెలుస్తుందని శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు.
అలాగే, ఎక్స్‌ట్రా-టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ శాంతియుతంగా ఉంటుందా లేక విద్వంసపూరితమా అనే సందేహానికి కూడా వారే సమాధానం వెతుకున్నారు. అదేమిటంటే.. ‘ఏలియన్లు గనుక ఉండి, మానవ స్వభావం రిత్యా మనం గానీ వారితో యుద్ధం అనివార్యంగా చేస్తే బహుశా మరొక తెలివిగల జాతి అంతరించిపోవడానికి కారణం కూడా కావచ్చు అంటున్నారు. అయితే, కాస్మోస్ ద్వారా కమ్యూనికేషన్ సాధించగలిగిన స్థాయికి చేరుకున్న ఏ జాతి అయినా తమలో తాము ఒక ఉన్నత స్థాయి సహకారాన్ని కలిగే ఉంటారని చెబుతున్నారు. వారికి శాంతి, సహకారం వాటి ప్రాముఖ్యతలు తెలిసే ఉంటుందనే తర్కాన్ని చెబుతున్నారు. ఏదైమైనప్పటికీ, దీనిపై బహిరంగ చర్చ అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు.