Homeఆంధ్ర ప్రదేశ్తారాస్థాయికి చేరిన నెల్లూరు జనసేనలో విభేదాలు..

తారాస్థాయికి చేరిన నెల్లూరు జనసేనలో విభేదాలు..

నెల్లూరు జనసేనలో విబేధాలు తారా స్థాయికి చేరాయట..జనసేనలో ఒకరి పై ఒకరు స్టేషన్లలో కంప్లైంట్లు, ఎఫ్ఐఆర్ వరకు వెళ్లడం చర్చనీయాంశంగా మారాయి. ఓ నేతను డ్డిని కావాలనే పొగపెట్టి బయటకు తోసేస్తున్నారంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం సస్పెన్షన్ .. సాయంత్రానికి తప్పైపోయిందని నాలుక కరుచుకోవడం వెనుక .. ఏం జరుగుతోంది..? అసలు నెల్లూరు జనసేనలో అంతర్గతంగా సాగుతోన్న అంతర్యుద్ధం.

రాష్ట్రం మెత్తం మీద జిల్లాకో అసెంబ్లి స్థానంలో జనసేన కాస్తోకూస్తో బలంగా ఉందంటే .. అదీ నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటీలోనే. ఇదే ఇప్పుడు జనసేనలో అంతర్గత కుమ్ములాటలకు కారణంగా మారిందంటున్నారు జన సైనికులు. అసలెందుకు నెల్లూరు నగరంలోని జనసేనలో నాయకుల మధ్య ఇంత గ్యాపొచ్చిందన్నది హాట్ టాపిక్ గా మారింది. 2019లొ నెల్లూరు నగరం నుండి కేతంరెడ్డి వినోద్ రెడ్డి జనసేన అభ్యర్దిగా బరిలో నిలిచాడు. అయితే హోరాహోరిగా జరిగిన త్రికోణ పోరులొ వినోద్ రెడ్డి ఓటమి పాలయ్యాడు.

ఎన్నికల్లో ఓటమి చెందినా.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిత్యం ప్రజల్లో ఎండగడుతూ .. ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉంటూ వస్తున్నాడు. గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని వైసీపీ ప్రవేశ పెట్టక మునుపే.. గత 275 రోజులుగా పవనన్న ప్రజాబాట పేరుతో నెల్లూరు నగరంలోని 28 వార్డుల్లో ప్రతి ఇంటి గడపను తొక్కుతున్నాడట వినోద్ రెడ్డి. దీంతో నెల్లూరు నగరంలో జనసేనకు మంచి మలేజ్ రావడంతో పాటు.. ప్రజల్లో జనసేనకు మంచి గుర్తింపు లభించిందట. ప్రచారంలో ఉన్నట్టు.. ప్రభుత్వం పై అలుపెరగని పోరాటం చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో జత కడితే నెల్లూరు నగరం నుండి బరిలోకి దిగాలన్నది కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆలోచనగా టాక్ వినిపిస్తోంది. అయితే ఇక్కడే నెల్లూరు జనసేనలో వర్గ విబేదాలకు తెరలేచాయట.

నెల్లూరు జనసేన అధ్యక్షుడుగా ఉన్న మనుక్రాంత్ రెడ్డి గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుండి పోటీ చేసి ఓటమి చెందాడు. దీంతొ ఈసారి తన అదృష్టాన్ని నెల్లూరు నగరం నుండి పరీక్షించుకోవాలని తహతహలాడుతున్నాడట. గత కొంత కాలంగా నెల్లూరు నగర మీద దృష్టి సారించి వినోద్ రెడ్డికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం, సభలు, సమావేశాలు నిర్వహించడం షురూ చేశారట. అక్కడితో ఆగకుండా .. నెల్లూరు నగరానికి అద్యక్షుడుగా సుజయ్ అనే యువకుడిని నియమించడం కూడా జరిగింది. ఇదంతా అధిష్టానం ఆదేశాలతోనే జరిగిందంటూ మనుక్రాంత్ రెడ్డి వివరణ ఇస్తున్నారు. అంతేగాక ఏ భాద్యత, పదవి లేని వినోద్ రెడ్డి అసలు నెల్లూరు నగర అభ్యర్ది ఎలా అవుతాడన్న ప్రశ్న లేవనెత్తుతున్నారు మనుక్రాంత్ రెడ్డి వర్గం.

2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందినా పార్టీని అంటి పెట్టుకుని పార్టీ కార్యక్రమాలు చేపడుతున్న తానెందుకు జనసైనికుడిని కాకపోతానంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు వినోద్ రెడ్డి. ఇలా ఎవరికి వారు నెల్లూరు నగరంలో ప్రచారం చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దం నడుస్తోందని జనసైనికులు చెబుతున్నారు. రాజకియ ప్రత్యేర్దులను తలపిస్తూ జనసేనలోని మనుక్రాంత్, కేతంరెడ్డిల మధ్య కోల్డ్ వార్ నడుస్తో్ంది. వెంకటేశ్వరపురం ప్రాంతంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో వినోద్ రెడ్డి ఇంటింటికి అంటించిన పవన్ కళ్యాణ్ బొమ్మ పై మనుక్రాంత్ రెడ్డి బొమ్మలను ఆయన వర్గం అంటించడంతొ మాటల యుద్దం చెలరేగి పోలీస్ స్టేషన్ వరకు చేరిందట పంచాయితి.

వినోద్ రెడ్డి వర్గంపై కేసులు నమోదు చేయించడం, అది ఎఫ్ఐఆర్ కావడంతొ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడంటూ వినోద్ రెడ్డి పై అభియోగం మోపి వినోద్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మనుక్రాంత్ రెడ్డి ప్రకటన విడుదల చేశాడు. దీంతొ ఒక్కసారిగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న జనసైనికులు సోషల్ మీడియా వేదికగా మనుక్రాంత్ రెడ్డి పై విమర్శలకు దిగారట. జనసేన అఫిషియల్ సైట్లలో సైతం మనుక్రాంత్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించడం, మీడియాలొ కథనాలు రావడంతొ ఒక్కసారిగా అధిష్టానం స్పందించినట్టు సమాచారం.

దీంతొ సాయంత్రానికి కేతంరెడ్డి వినోద్ రెడ్డి సస్పెన్షన్ను రద్దు చేస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడిగా మరో ప్రకటన విడుదల చేశాడు. అయితె ఇప్పుడు వినోద్ రెడ్డి పై తీసుకున్న సస్సెండ్ నిర్ణయం అధిష్టానంకు తెలిసి తీసుకున్నాడా.. లేక మనుక్రాంత్ రెడ్డి సొంత నిర్ణయమా అన్నది తేలాల్సి ఉంది. నెల్లూరు నగర బరిలో నిలవాలన్న ఆలోచనతోనే మనుక్రాంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జరిగిన సంఘటన విషయం తెలుసుకోన్న జనసేన అధిష్టానం వినోద్ రెడ్డి సస్పెన్షన్ రద్దు చేయించిందని జిల్లాలో జనసైనికులు చర్చించుకుంటున్నారు.

ఇంత జరుగుతున్న ఇంత కాలం పట్టించుకోని జనసేన అధిష్టానం ఇప్పుడు నష్టనివారణ చర్యలకు సమాయిత్తం అయినట్టు సమాచారం. మనుక్రాంత్ రెడ్డిని, వినోద్ రెడ్డిలకు పిలుపొచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఇద్దరు నేతలు అధిష్టానం ముందు హాజరుకానున్నారని సమాచారం. ఇప్పటికే ఈ ఘటనకు సంబందించిన వివరాలను స్వయంగా తెప్పించుకుందట జనసేన అధిష్టానం. ఇరువురిని కూర్చోబెట్టి ఏం జరిగింది.. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందన్న విషయం పై చర్చించే కసరత్తు ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది.

  • ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందో జనసేన అధిష్టానం..

నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ప్రభావం కొంత కనిపించే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక సిటీ నియోజకవర్గం అని చెప్పాలి. మొదటి నుంచి కూడా ఇక్కడ కేతంరెడ్డి వినోద్ రెడ్డి జనసేనకు ముఖ్య నాయకుడిగా ఉన్నాడు. జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో ఉందంటే కేతంరెడ్డి వల్లే అని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతారు. ముందు నుంచి కూడా కేతంరెడ్డి జనసేన పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లాడు. నెల్లూరులో జనసేన పార్టీ ఉనికిని చాటాడు. అయితే సిటీ నియోజకవర్గంలో ఈ మధ్య జనసేనలో ముగ్గురు నాయకులు తయారయ్యారు. కేతంరెడ్డితో పాటు మనుక్రాంత్ రెడ్డి, కిషోర్ మూడు గ్రూపులుగా విడిపోయారు. పోటాపోటీగా ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అయితే, కేతంరెడ్డి గత 275 రోజులుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుందో అదే విధంగా పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు కేతంరెడ్డి. ఇదే క్రమంలో మూడు రోజుల క్రితం మనుక్రాంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. జనం కోసం జనసేన పేరుతో కార్యక్రమాలు చేపట్టారు.

తాము జనంలోకి వెళ్లి ఇంటింటికి తిరుగుతూ పవన్ స్టిక్కర్లు అతికించామని, అయితే మనుక్రాంత్ రెడ్డి వర్గీయులు కూడా అదే స్టిక్కర్ల పై మళ్లీ స్టిక్కర్లు అంటించడం కరెక్ట్ కాదంటున్నారు కేతంరెడ్డి. దీంతో నెల్లూరు జిల్లా జనసేనలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. నెల్లూరు సిటీ ఇంచార్జ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటన చేశారు జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ చర్యలు తీసుకున్నారు.

అయితే, తనను సస్పెండ్ చేసే అధికారం జిల్లా అధ్యక్షుడికి లేదన్నారు వినోద్ రెడ్డి. ఈ నేపథ్యంలో అధిష్టానం ఏ చర్యలు తీసుకుంటుందోనన్న ఆసక్తి జిల్లా జన సైనికుల్లో వెల్లువెత్తుతోంది. ఏదేమైనా.. ఇలాంటి చర్యలు పున:రావ్రుతం కాకుండా అధిష్టానం ఎవరి భాద్యతలు వారికి అప్పగిస్తే మరోసారి ఇలాంటి వివాదాలకు కారణం కాకుండా ఉంటుందంటున్నారట నెల్లూరు జనసైనికులు. ఎన్నికల వేళ నేతల మధ్య తలెత్తిన రచ్చకు హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి జిల్లావ్యాప్తంగా వెల్లువెత్తుతోంది.

Must Read

spot_img