డైరెక్టర్ శంకర్… ఎప్పుడు ఏం చేసిన కొత్తగానే ఉంటుంది. అపరిచితుడు అయినా..రోబో అయినా..ఐ సినిమా అయినా అన్ని కొత్త ప్రయోగాలే. మారుతున్న కాలానికి అనుగుణంగా సినిమాలను అప్డేట్స్ చేస్తుంటారు కెప్టెన్ శంకర్. అయితే ఇప్పుడు ఇండియాన్ 2 సినిమా కోసం కూడా మరో భారీ ప్రయోగం చేస్తున్నారు.

విశ్వనటుడు కమల్ హాసన్ కథానాయకుడి శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్-2’ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. సినిమాలో ఏకంగా ఏడుగురు విలన్లు కనిపించబోతున్నారని కోలీవుడ్ మాట. ఒక్కో విలన్ ది ఒక్కో రకమైన ప్రత్యేకత ఉంటుందని లీకులు అందుతున్నాయి. వాళ్ల ఆహార్యాలు కూడా భిన్నంగా ఉంటాయని..మునుపెన్నడు చూడని సరికొత్త విలన్లను శంకర్ తెరపై ఆవిష్కరించబోతున్నారని తెలుస్తోంది. ఏడుగులో కొందరు విదేశీ నటులు కూడా ఉన్నారని టాక్. డిఫరెంట్ లుక్ కోసం నైజీరియా..హాకాంగ్ నటుల్ని కూడా కొంత మందిని భాగం చేస్తున్నారు.
అయితే మెయిన్ విలన్ బాధ్యతలు ఓ తమిళ నటుడికే అప్పగించినట్లు తెలుస్తోంది.అయితే ఈ విలన్లు అంతా సిండికేట్ గా కనిపిస్తారా? ఎవరికి వార్ని కథలో హైలైట్ చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే శంకర్ ఇంతవరకూ ఏ సినిమా కోసం ఇంత మంది విలన్లని తీసుకోలేదు. 100 కోట్లు పెట్టి నిర్మించిన రోబో కథనే ఒకే విలన్ తో నడిపించారు. అయితే ఒక పాత్రనే రకరకాలుగా ఆవిష్కరించారు.
అంతకుముందు అపరిచితుడు సినిమా కోసం రకరకాల గా ఫైట్స్ డిజైన్ చేసినా? అంతిమంగా హీరోనే..విలన్ గా చూపించారు. ఒకే పాత్రతో ఇలాంటి మ్యాజిక్ లు చేయడం కేవలం శంకర మాత్రమే చెల్లింది. మరి ఇప్పుడు ఏడుగురు విలన్లు అంటున్నారు. మరి ఒకే పాత్రని అన్ని రకాల కోణాల్లో చూపిస్తా రా? ఒకరికొకరు సంబంధం లేకుండా కొత్త పాత్రల్ని తీసుకొస్తున్నారా? అన్నది చూడాలి.