Homeతెలంగాణబీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందా..?

బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందా..?

  • తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందా..?
  • లిక్కర్ స్కాం కేసులో .. సిసోడియా అరెస్ట్ తర్వాత తెలంగాణవైపే సీబీఐ చూపు ఉందని టాక్ వెల్లువెత్తుతోంది.
  • ఈ టైంలో పిలుపు..హాట్ టాపిక్ గా మారిందా..?

తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు… కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియాను అరెస్టు చేయడం… త్వరలో మరిన్ని అరెస్టులు జరుగుతాయన్న ప్రచారం .. నేపథ్యంలో.. అమిత్ షాతో టీ బీజేపీ నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం.. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. లిక్కర్ కేసుకి సంబంధించి చోటుచేసుకుంటున్న పరిణామాలు.. తెలంగాణ పాలిటిక్స్ లోనూ కలకలం రేపేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో.. బీజేపీ రాష్ట్ర నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర మంత్రి అమిత్ షా కార్యాలయం నుంచి తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకు ఫోన్ కాల్స్ వచ్చాయి.

ఫిబ్రవరి 28న ఢిల్లీకి రావాల్సిందిగా కీలక నేతలకు ఆర్డర్స్ జారీ అయ్యాయి. ఈ భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు లిక్కర్ స్కాం అంశంపైనా చర్చిస్తున్నారు. మరోవైపు.. తెలంగాణ బీజేపీలో నేతల మధ్య ఐక్యత లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కీలక నేతల మధ్య కమ్యూనికేషన్ అంతగా లేదనే ప్రచారం జరుగుతోంది. దీనివల్లే.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ అనుకున్న స్థాయిలో సాగడం లేదని, చేరికలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన నివేదికలు ఇప్పటికే అధిష్టానానికి చేరాయని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో.. ముఖ్య నేతల అభిప్రాయాలను తెలుసుకోనున్న అమిత్ షా… రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కసరత్తులు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతం కోసం జాతీయ స్థాయి నుంచి మండల స్థాయి వరకు నేతలు ప్రజల్లోనే ఉంటున్నారు. రాష్ట్ర నేతలతో జాతీయ స్థాయి నేతలు ఎప్పటికప్పుడు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు.

ఎన్నికలకు సంబంధించిన అంశాలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం సాధించేందుకు పక్కా ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయానికల్లా.. కేంద్రం నుంచి తెలంగాణలో వరుస పర్యటనలు ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రూపొందించిన త్రిముఖ వ్యూహం ఫలించడంతో తెలంగాణలోనూ అదే ప్లాన్ అమలు చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.

    కాగా, పాదయాత్రతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే గ్రామాల్లోకి వెళ్లగా.. తాజాగా, ప్రజా గోస-బీజేపీ భరోసా లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలకు మంచి గుర్తింపు వచ్చిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు, బీజేపీ కార్నర్ సమావేశాలు కూడా నిర్వహిస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీ రావాలని ఆ పార్టీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి పిలుపు రావడం ఇప్పుడు బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యనేతలంతా ఢిల్లీకి రావాలని ఆయన పిలవడం వెనుక కారణం ఏంటనే దానిపై ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

    నిజానికి నియోజకవర్గాల్లో పార్టీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లను నిర్వహించేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేశారు. కానీ ఉన్నట్టుండి అమిత్ షా నుంచి పిలుపు రావడంతో.. ఇఫ్పుడు అందరి దృష్టి ఆ సమావేశంపై పడింది. అమిత్ షా తెలంగాణ నేతలకు సలహాలు, సూచనలు చేస్తారా ? లేక క్లాస్ తీసుకుంటారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ పార్టీ శ్రేణులు నిత్యం జనంలో ఉండేలా ఆ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన సునీల్ బన్సల్ ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగానే స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లకు శ్రీకారం చుట్టారు. ఈ విషయంలో నేతలు ఏ మాత్రం అలసత్వం వహించకూడదని ఆయన ఇప్పటికే పలుసార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు.

    • బీజేపీ మరింత దూకుడు ప్రదర్శిస్తుందా లేదా..?

    ఇక తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు సొంతంగా నివేదికలు తెప్పించుకుంటోంది ఆ పార్టీ అధిష్టానం. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏంటి ? ఏ నాయకుడు ఏ విధంగా క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాడనే దానిపై ఆ పార్టీ నాయకత్వానికి ఎప్పటికప్పుడు సంపూర్ణ సమాచారం వెళుతోంది. ఈ నివేదికల ఆధారంగానే తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఆ పార్టీ ముఖ్యనేతలు ఎప్పటికప్పుడు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు.

    తాజాగా ఆ నివేదికల ఆధారంగానే అమిత్ షా పార్టీ నేతలను ఢిల్లీకి పిలిపించారేమో అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడం.. ఆ స్కాంతో తెలంగాణ నేతలకు కూడా లింకులు ఉండటంతో.. ఈ అంశంపై చర్చించేందుకు అమిత్ షా తెలంగాణ నేతలను ఢిల్లీ రమ్మన్నారా ? అని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఉన్నట్టుండి తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలంతా ఢిల్లీకి రావాలని అమిత్ షా నుంచి పిలుపు రావడంతో.. విషయం కాస్త సీరియస్‌గానే ఉంటుందనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం దృష్టిసారించింది.

    రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ మందుకు సాగుతోంది. ఇప్పటికే గడిచిన రెండు, మూడు నెలల వ్యవధిలో కేంద్ర మంత్రుల వరుస పర్యటనలతో పాటు పార్టీ బలోపేతానికి భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నికలతో పాటు బీజేపీ ఇప్పటివరకు గెలవని 19 ఎంపీ స్థానాల గురించి చర్చించనున్నారు. భువనగిరి, నల్గొండ, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ స్థానాలతో పాటు హైదరాబాద్ ఎంపీ స్థానంపై కూడా ప్రత్యేకంగా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో కేవలం 19 మంది ముఖ్య నేతలతోనే అమిత్ షా భేటీ అయ్యారు.

    తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా సమావేశం అజెండా సాగుతున్నట్లు సమాచారం. జాతీయ నాయకత్వం అంచనాలను అందుకోలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో ఐక్యత కొరవడినట్లు సమచారం ఉందని పేర్కొన్నారు. ప్రజల్లో బీజేపీపై ఆసక్తి ఉందన్నారు. నాయకులు ఇంకా కష్టపడితేనే ఫలితం ఉంటుందని చెప్పారు. బండి సంజయ్ పాదయాత్రకు స్పందన బాగుందని తెలిపారు. మిగతా నేతలు సైతం ప్రజల్లో ఉండాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై మరింత దూకుడుగా వెళ్లాలన్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, దిల్లీ లిక్కర్ స్కామ్ పై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

    దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో సౌత్ గ్రూప్ పాత్ర ఉందని భావిస్తున్న దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఈ విషయంపై బీజేపీ మినీ కోర్ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మార్చి 2,3 తేదీల్లో హైదరాబాద్ ​లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల నిర్వహణ, తాజా రాజకీయాలపై చర్చించేందుకు అందుబాటులో ఉండాలని బీజేపీ అధిష్ఠానం సూచించింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అమిత్ షా పర్యటన సాగనుంది. నియోజకవర్గాల్లోని పార్టీ నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో అమలుచేసే వ్యూహాల గురించి చర్చలు జరుగుతాయి. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో నేతల దగ్గర ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.

    మరి టీ బీజేపీ మరింత దూకుడు ప్రదర్శిస్తుందా లేదా అన్నదే హాట్ టాపిక్ గా మారింది..

    Must Read

    spot_img