Homeసినిమాగాసిప్స్పుష్ప 2 నుంచి భారీ డైలాగ్ లీక్

పుష్ప 2 నుంచి భారీ డైలాగ్ లీక్

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరపైకి రాబోతున్న పుష్ప సెకండ్ పార్ట్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వాళ్లు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా డైరెక్ట్ గా గీత ఆర్ట్స్ ఆఫీస్ ముందు కూడా నిరసనలకు దిగారు. పుష్ప మొదటి భాగం భారీ స్థాయిలో సక్సెస్ కావడంతో ఆ సినిమాకు కొనసాగింపుగా సెకండ్ పార్ట్ ను దర్శకుడు అంతకుమించి అనేలా తెరపైకి తీసుకు వస్తున్నాడు.

ఇటీవల అవతార్ 2 సినిమాతో పాటు పుష్ప ఫ్యాన్స్ ఒక సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నారు. అవతార్ 2 సినిమా షోలకు అటాచ్ చేస్తూ స్పెషల్ ప్రోమో కూడా విడుదల చేయాలని భావించారు. సీన్ కట్ చేస్తే.. బన్నీకి ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్ వచ్చింది.

తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచిందని బాధ పడుతున్నారు బన్నీ ఫ్యాన్స్. పుష్ప 2 అప్డేట్ కోసం మైత్రీ మూవీ మేకర్స్‌ను చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. కొంత మంది బన్నీ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో మైత్రీ సంస్థను బూతులు తిడుతున్నారు. అయితే, దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఇటివల నుంచి పుష్ప 2 షూటింగ్ షురూ అయిందని తెలుస్తోంది.

ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, పుష్ప 2 నుంచి ఒక భారీ డైలాగ్ సోషల్ మీడియాలో లీకైంది. ఈ డైలాగ్‌ను బన్నీ అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ట్విట్టర్‌లో వైరల్ చేస్తున్నారు.

ఈ డైలాగ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులను విపరీతంగా ఆకర్షిస్తోంది. అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప రాజ్ వచ్చాడని అర్థం అనే డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ డైలాగ్‌ను బట్టి ‘పుష్ప: ది రూల్’లో పుష్పరాజ్ క్యారెక్టర్ ఇంకెంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. అయితే, నిజంగా ఈ డైలాగ్ సినిమాలో ఉందా అనే విషయంలో స్పష్టత లేదు. దీనిపై ఇప్పటి వరకు చిత్ర యూనిట్ అయితే స్పందించలేదు. నిజానికి ఈ డైలాగ్ ఎలా లీకైందనే విషయం కూడా ఎవరికీ తెలీదు.

ఇంకా పూర్తిస్థాయిలో షూటింగ్ ప్రారంభం కాని పుష్ప 2 నుంచి డైలాగ్ లీకవడం ఆశ్చర్యకరంగా ఉంది. అంటే, స్క్రిప్ట్ వర్క్ సుకుమార్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అంటే, ఆయన టీమ్‌లో నుంచే ఎవరైనా ఈ డైలాగ్‌ను లీక్ చేశారా అనే అనుమానం కలుగుతోంది. ఏదేమైనా, ఈ డైలాగ్ లీకవడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

మరోవైపు, బన్నీ ఫ్యాన్స్‌ను కూల్ చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పుష్ప 2 వీడియో గ్లింప్స్‌ను తీసుకొస్తుందని ప్రచారం జరిగింది. పుష్ప విడుదలై ఏడాది పూర్తికాబోతున్న సందర్భంగా డిసెంబర్ 16 నుంచి అవతార్ 2 స్క్రీన్స్‌లో పుష్ప 2 గ్లింప్స్ ప్రదర్శిస్తారని అన్నారు. కానీ, దీనిలో నిజం లేదని తెలిసింది. అవతార్ 2 స్క్రీన్స్‌లో ఇంటర్వెల్‌కి గీతా ఆర్ట్స్ లేటెస్ట్ మూవీ 18 పేజెస్ ట్రైలర్ వేస్తారని క్లారిటీ వచ్చింది.

Must Read

spot_img