Homeఅంతర్జాతీయంస్వలింగ వివాహాలకు అమోదముద్ర ఇవ్వాలన్న డిమాండ్..

స్వలింగ వివాహాలకు అమోదముద్ర ఇవ్వాలన్న డిమాండ్..

స్వలింగ వివాహాలు.. భారతీయ వివాహ వ్యవస్థకు ప్రమాదకరమని కేంద్రం .. సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఇవి భారత కుటుంబ వ్యవస్థను దెబ్బ తీస్తాయని, గే వివాహాల్ని అనుమతిస్తే, జాతి యావత్తూ కష్టాల పాలవుతుందని కేంద్రం .. పేర్కొంది. అయితే దీనికి చట్టబద్దత కల్పించాలన్న సూచన సహేతుకం కాదని .. కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో ఈ వివాహాలపై సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వనుందన్నదే ఆసక్తికరంగా మారింది.

పాశ్చాత్య సంసృతిని..ప్రతిబింబించే గే..వివాహం..భారత్ లో ఆమోదయోగ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇది..కుటుంబ సూత్రానికి గొడ్డలి పెట్టు వంటిదన్న కేంద్రం..దీనికోసం రాజ్యాంగ సవరణ సరికాదంటూ తేల్చి చెప్పింది. వీటివల్ల సమాజంలో కుటుంబాలు భిన్నాభిన్నం అవడమే కాక.. వరుస క్రమం సైతం దెబ్బతింటుందని స్పష్టం చేసింది.

దేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఇవ్వటం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇది చాలా సున్నితమైన అంశమని, భారతీయ కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకమని పేర్కొంది. దేశంలో అమల్లో ఉన్న ఏ పర్సనల్‌ న్యాయ చట్టాల్లోగానీ, అధికారిక న్యాయ చట్టాల్లోగానీ ఈ అంశంపై సానుకూల ప్రతిపాదనలు లేవని కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తెలిపింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) సెక్షన్‌ 377 ప్రకారం మనదేశంలో స్వలింగ సంపర్కాలు, స్వలింగ వివాహాలు నిషేధం. దీంతో ఈ సెక్షన్‌ను ఎత్తివేసి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరటంతో స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

స్వలింగ వివాహాలను చట్టబద్దం చేస్తే దేశంలోని పర్సనల్‌ లాకు, సామాజిక విలువలకు మధ్య సమతూకం దెబ్బతింటుందని కేంద్రం తన అఫిడవిట్‌లో తెలిపింది. పిటిషనర్లు స్వలింగ వివాహాలను ప్రాథమిక హక్కుగా భావించటానికి వీలు లేదని స్పష్టంచేసింది. అదే సమయంలో సమాజంలో భిన్న లైంగిక సంబంధాలకు గుర్తింపునిచ్చే విషయంలో ప్రభుత్వానికి పరిధులు ఉన్నాయని పేర్కొంది.

పశ్చిమదేశాల్లోని న్యాయశాస్ర్తాలను భారత్‌లోకి యథావిధిగా దిగుమతి చేసుకోలేమని తెలిపింది. మానవ సంబంధాలకు గుర్తింపునిచ్చే బాధ్యత చట్టసభలదేగాని, న్యాయవ్యవస్థది కాదని వాదించింది. ఈ అంశంపై పిటిషనర్లు కోర్టును ఆశ్రయించటం పూర్తిగా అసంబద్ధమని తెలిపింది. దేశంలో స్వలింగ సంపర్కుల వివాహ ప్రక్రియపై కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయి. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధతను కల్పించాలని, దీనికి అధికారిక గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది.

ఈ విషయంపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పలు పిటీషన్లు దాఖలయ్యాయి. స్వలింగ వివాహాలపై సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలకు కేంద్రం కీలక సమాధానాలు చెప్పింది. ఇది భారతీయ కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. స్వలింగ వివాహం నేరం కాకపోయినప్పటికీ, ఇది భార్యాభర్తల సంబంధానికి, భారతీయ సంస్కృతికి విరుద్ధమని అభిప్రాయపడింది. ఇలాంటి వాటి వల్ల సమాజంలో పెడ పోకడలు పెరుగుతాయని వివరించింది.

స్త్రీ, పురుషుల కలయిక ద్వారా పిల్లలు పుడతారని, వారు భవిష్యత్‌లో తల్లిదండ్రులుగా మారి పిల్లలకు జన్మనిస్తారని, స్వలింగ వివాహంలో ఇది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. ఇటీవల నాలుగు స్వలింగ సంపర్క జంటలు తమ వివాహాన్ని గుర్తించాలంటూ సుప్రీం కోర్టు తలుపు తట్టిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కేంద్రం వివరణ కోరింది. ఈనేపథ్యంలో తన వివరణ వినిపించిన కేంద్రం..స్వలింగ సంపర్క జంటలు వేసిన ఫిటిషన్‌ను కొట్టేయాలని కోర్టును కోరింది. భారతదేశం అంటేనే ఎన్నో మతాలకు నిలయమని, ఆ మతాల సంస్కృతికి భిన్నంగా స్వలింగ సంపర్క జంటల వివాహాలను చట్టబద్ధం చేస్తే భవిష్యత్‌లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.

పాశ్చాత్య సంస్కృతి భారత్‌లో ఇమడదని వివరించింది. స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేస్తే, ప్రస్తుత వివాహ చట్టంలోని కొన్ని వారు ఉల్లంఘించే ప్రమాదం ఉందని కేంద్రం వాదించింది. స్త్రీ, పురుషులను మానసికంగా, శారీరకంగా ఒక్కటి చేయడమే వివాహం ముఖ్య ఉద్దేశ్యమని చెప్పిన కేంద్రం, సామాజికంగా, సాంస్కృతికంగా, చట్టబద్ధంగా వివాహం ముఖ్య లక్ష్యం ఇదేనని వ్యాఖ్యానించింది.

వివాహం చేసుకున్న స్త్రీ, పురుషులు తమ శారీరక కలయిక ద్వారా పిల్లల్ని కంటారు. వారి ద్వారా కుటుంబాన్ని ఏర్పరుచుకుంటారు. వివాహం ద్వారా ఒక సామాజిక హోదాను అనుభవిస్తారు. సంప్రదాయ వివాహం చేసుకున్న వారికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వాటికి లోబడి వారు నడుచుకుంటారు. ఇలాంటి విధానమే భారత్‌ వసుధైక కుటుంబం అనే నానుడికి కారణమైంది. పైగా సంప్రదాయ వివాహం చేసుకున్న వారికి ఓ నియంత్రణ ఉంటుంది. కానీ స్వలింగ వివాహం చేసుకున్న వారికి ఇది ఉండదు. ఫలితంగా సమాజంలో అంతరాలు ఏర్పడతాయని సుప్రీంకు తెలిపింది. చరిత్రలో ఎక్కడా ఇలాంటి వాటికి గుర్తింపు లేదన్న కేంద్రం ఇది కుటుంబ వ్యవస్థకు విఘాతం అని తెలిపింది.

స్వలింగ సంపర్కులు కలిసి జీవించడం నేరం కాదన్న కేంద్రం..కానీ వారిని భార్యభర్తల్లా చూడాలనడం…భారతీయ కుటుంబ వ్యవస్థకు విరుద్ధమని కేంద్రం చెప్పింది. భారత్‌లో పురుషుడు భర్త అవుతాడనీ, స్త్రీ… భార్య అవుతుందనీ… వారికి పిల్లలు పుట్టాక.. తల్లిదండ్రులు అవుతారని తెలిపిన కేంద్రం… ఈ వివావ వ్యవస్థలో ఎన్నో బాధ్యతాయుత అంశాలు ముడిపడివున్నాయని తెలిపింది. భిన్న లింగ స్వభావానికి పరిమితమైన వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు అనేది చరిత్రలో ఆనవాయితీగా ఉందని, దేశ అస్థిత్వానికి దాని కొనసాగింపుకు ఇది పునాదని కేంద్రం తెలిపింది.

భర్త, భార్య, పిల్లలుగా ఉండే భారతీయ కుటుంబం అనే భావనకు స్వలింగ వివాహం అనుకూలంగా లేదని కేంద్రం తెలిపింది. స్వలింగ వివాహం భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి విరుద్ధమని కేంద్రం కోర్టుకు తెలిపింది. స్వలింగ సంపర్కుల వివాహానికి సంబంధించి చట్టాలు చేయడానికి సిద్ధంగా లేమని కేంద్రం కోర్టులో తన వైఖరిని వెల్లడించింది. 1954 నాటి ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం స్వలింగ వివాహాలను నమోదు చేయరాదు. వివిధ కులాలు, మతాల వివాహాలకు సాధారణంగా కల్పించే రాజ్యాంగ రక్షణ పరిధిలోకి కూడా స్వలింగ వివాహం రాదు.

స్వలింగ సంపర్కుల వివాహానికి కావాల్సిన వారిని పెళ్లి చేసుకునే రాజ్యాంగ హక్కు లేదని, స్వలింగ వివాహాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించలేమని కేంద్రం జారీ చేసిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లపై విచారణ చేపట్టనుంది.

ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టుతో సహా వివిధ రాష్ట్రాల్లోని ఉన్నత న్యాయస్థానాల ముందు పెండింగ్‌లో ఉన్న పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు క్రోడీకరించింది. వాటన్నింటినీ విచారణకు స్వీకరించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ అరుంధతీ కట్జూ తన వాదనలను వినిపించనున్నారు. హైకోర్టుల్లో పెండింగ్‌ లో ఉన్న స్వలింగ వివాహాల గుర్తింపు కోసం దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇదివరకే విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. జనవరి 6వ తేదీన వాటన్నింటినీ తమకు బదిలీ చేయాలని ఆదేశించింది.

స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించకుండా గత ఏడాది నవంబరులో సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులను జారీ చేసింది. స్వలింగ సంపర్కులు లేదా భిన్న లింగ సంపర్కులు పరస్పర అంగీకారంతో సెక్స్ చేయడం నేరం కాదని పేర్కొంది. తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కును ఎల్‌జిబిటిక్యూ సామాజిక వర్గానికి ఉందని అప్పట్లో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవడం అనేది చాలా దేశాల్లో అమలవుతోంది. అందువల్ల ఇండియాలో కూడా అమలవ్వాలనే డిమాండ్లు చాలా ఏళ్లుగా వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇలాంటి వాటిని ఆమోదించే ప్రసక్తే లేదని క్లియర్‌గా చెప్పేసింది.

స్వలింగ వివాహాలకు అమోదముద్ర ఇవ్వాలన్న డిమాండ్ పై కేంద్రం స్పందించింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ వేళ..కేంద్ర అఫిడవిట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. భారతీయ వివాహ వ్యవస్థకు..ప్రమాదమని తేల్చి చెప్పింది. మరి దీనిపై సుప్రీం ఏం చేయనుందన్నదే కీలకంగా మారింది.

Must Read

spot_img