ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన హీరోయిన్లలో దీపికా పదుకొణె ఒకరు. అలాగే బాలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లలో టాప్ లిస్టులో ఉంది. ఈ ముద్దుగుమ్మ అందరి కలల రాణిగా ఉంటూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది. బాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు తాజాగా తెలుగులో నటించనున్నట్లు సినీ వర్గాల టాక్. బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాల ఎంపిక విషయంలో కూడా చాలా విభిన్నంగా అడుగులు వేస్తున్నారు. ఒక విధంగా పెళ్లి తర్వాత కూడా స్పీడ్ పెంచింది అని చెప్పవచ్చు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తో కలిసి ఓం శాంతి ఓం సినిమాలో నటించిన దీపికా పదుకొణె ఆ మూవీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో ‘పఠాన్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పఠాన్ మూవీలో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించగా, సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌లో కనిపించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అంచనాలు మించి పోయింది. సినిమా విడుదలకు ముందు కాస్తా కాంట్రవర్శీ వచ్చిన రీలీజ్ అయిన మొదటి వారంలోనే కోట్ల రూపాయలు వసూలు చేసింది.

పఠాన్` మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా వైడ్‌గా పాపులర్ అయిన దీపికా పదుకొనె రాజమౌళి మూవీలో ఫైనల్ అయ్యిందని సమాచారం. దీంతో ఈ దెబ్బతో మరో జాక్ పాట్ కొట్టింది. ఇప్పటికే దీపికా తెలుగులో ప్రభాస్‌తో కలిసి నటిస్తుంది. తెలుగు సినిమా ఖ్యాతీని ప్రపంచానికి పరిచయం చేసిన అపజయమెరుగని దర్శకుడు రాజమౌళి. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో ఆయన ఫేమ్ గ్లోబల్ రేంజ్ కి వెళ్ళింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతుంది.

ప్రస్తుతం జక్కన్న ఫ్రిన్స్ మహేష్ బాబుతో పాన్ ఇండియా మూవీ చేపట్టారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలైయ్యాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ యాక్షన్ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో మహేష్‌తో కలిసి దీపికా పదుకొణె నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది అనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో దేశ వ్యాప్తంగా మోస్ట్ ట్రెండింగ్ న్యూస్ గా తెగ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్..అటు దీపికా పదుకొణె ఫ్యాన్స్ పోటా పోటీగా వీరద్దరి ఫోటోలతో రీల్స్ పెడుతూ… తెగ హాడాహుడి చేస్తున్నారు.