ఇళయదళపతి విజయ్, తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో మరో మూవీ తెరకెక్కబోతుంది. 2021లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మాస్టర్’ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో…ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది.
దళపతి విజయ్ కు తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను దేవుడుగా కొలిచే కొందరు అభిమానులు కూడా ఉన్నారంటే.. ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇటీవల తన 66వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు అనే సినిమా తెరకెక్కింది.
విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ కిక్ శ్యామ్ జయసుధ శరత్ కుమార్ ప్రకాష్ రాజ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా జనవరి 11వ తేదీన తమిళంలో… జనవరి 14వ తేదీన తెలుగులో విడుదలైంది.
ఈ సినిమా ఆశించిన మేర ఫలితాన్ని అందుకోలేకపోయినా… ఫ్యామిలీ డ్రామాగా ఫ్యామిలీస్ ని ఆకట్టుకుంటుంది. ఆ సంగతి పక్కన పెడితే విజయ్ 67వ సినిమా ఎవరితో ఉండబోతుందనే విషయం మీద క్లారిటీ లేదు. అయితే దాదాపుగా అది లోకేష్ కనకరాజుతోనే ఉండబోతుందనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే ఈ మధ్య గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో కూడా విజయ్ ఒక సినిమా చేయబోతున్నాడు అనే ప్రచారం తెర మీదకు వచ్చింది.
కానీ అది కేవలం ప్రచారం అని అంటున్నారు. విజయ్ తర్వాతి సినిమా లోకేష్ కనకరాజుతోనే ఉంటుందని… లోకేష్ కనకరాజు చేస్తూ వస్తున్న వరుస సినిమాల లింకుతోనే ఈ సినిమా కూడా ఉంటుందని అంటున్నారు.
లోకేష్ కనకరాజు ముందుగా ఖైదీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు. దానికి కొనసాగింపుగా విక్రమ్ అనే సినిమా కూడా చేశారు. ఈ విక్రమ్ అనే సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ఒక కీలక పాత్రలో నటించాడు. ఇప్పుడు అదే పాత్ర లోకేష్ కనకరాజు… విజయ్ కాంబినేషన్ల వరకు తెరకెక్కుతున్న సినిమాలో కూడా కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన లేకపోయినా తమిళ మీడియా వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది.