Homeసినిమాప్రస్తుతం పాత సినిమాల ట్రెండ్ నడుస్తోంది..!

ప్రస్తుతం పాత సినిమాల ట్రెండ్ నడుస్తోంది..!

ప్రస్తుతం పాత సినిమాల ట్రెండ్ నడుస్తోంది. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి సినిమాను రీ రిలీజ్‌ చేసి కొత్త ట్రెండ్‌ క్రియేట్ చేశారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఆ తరువాత పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్‌గా తమ్ముడు, జల్సా సినిమాలు రిలీజ్ చేశారు.

జల్సా సినిమా రికార్డ్ కలెక్షన్లను కలెక్ట్ చేసింది. దీంతో మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ కంటే పవన్ కళ్యాణ్‌ అభిమానులది పై చేయి సాధించినట్టుగా మారింది. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరి అభిమానుల మధ్య మరోసారి రీ రిలీజ్ వార్ మొదలయ్యేలా ఉంది.

ప్రస్తుతం రీరిలీజ్‌ సినిమాల ట్రెండ్ నడుస్తోందనే చెప్పాలి. పాత సినిమాలను నేటి టెక్నాలజీకి మార్పులను జోడించి, మరలా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. అలాగే థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించాయి.

ఈ క్రమంలో టాలీవుడ్ మరో స్టార్ హీరో సినిమా ఈ లిస్టులో చేరింది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిన ఖుషీ సినిమా రీరిలిజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్‌‌లోనే బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచి, ఎన్నో రికార్డులను నెలకొల్పింది.

రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కాగా, ఈ సినిమాను డిసెంబర్‌ 31న రీ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీజ్‌ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. పవన్ తో పాటు… మహేష్ బాబు సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సంక్రాంతి బరిలో ఒక్కడు చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.

మహేష్ గతంలో నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఒక్కడు’ రిలీజ్ అయ్యి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా… ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. సంక్రాంతి బరిలో ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉండటంతో, పండగకు వారం ముందు.. అంటే జనవరి 7న ఒక్కడు సినిమాను రీరిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో మహేష్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇక ఈ సినిమాలో అందాల భామ భూమికా చావ్లా హీరోయిన్‌గా నటించగా, ప్రకాశ్ రాజ్ విలన్ పాత్రలో నటించాడు. మరి ఒక్కడు, ఖుషి రీ-రిలీజ్‌కు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

Must Read

spot_img