Homeఅంతర్జాతీయంపాకిస్థాన్‌ కుటిలత్వం..

పాకిస్థాన్‌ కుటిలత్వం..

  • పాకిస్తాన్.. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశం.. అయినప్పటికీ.. ఈ పరిస్థితుల్లో కూడా తన కుటిలబుద్దిని వీడటం లేదు..
  • సంక్షోభంలో కూరుకుపోయినప్పటికీ.. పాక్ కు ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పు పుట్టడం లేదు.. అలాంటి పరిస్థితుల్లో కూడా పాక్ వక్రబుద్ది ప్రదర్శిస్తోందా..?

ప్రపంచంలో ఉన్న దేశాలలో ఇచ్చిన మాట మీద నిలబడని దేశం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా పాకిస్తానే.. పాక్ వక్రబుద్దిని భారత్ సహా అనేక దేశాలు ఇప్పటికే పలుమార్లు బహిరంగం చేశాయి.. మరోసారి రష్యా విషయంలో పాక్ కుటిలబుద్ది ప్రదర్శిస్తుండటంపై ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతోంది.ప్రపంచంలో ఇచ్చిన మాట మీద నిలబడని దేశం ఏదైనా ఉందంటే… అది పాకిస్థాన్ అని చెప్పుకోక తప్పదు. అక్కడి నాయకుడు చాలా కాలంగా అంతర్జాతీయ సంస్థలు, దేశాలకు అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు.. అందుకే ఆ దేశాన్ని అంతర్జాతీయ సమాజం సైతం దాదాపు వెలివేసింది.

ప్రస్తుతం పాక్ అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.. ఈ క్రమంలో కనీసం ఇంధన అవసరాలను తీర్చేందుకు డబ్బులు కూడా లేవు. ఒక విధంగా చెప్పాలంటే.. శ్రీలంక పతనం జరగటానికి ముందు ఏం జరిగిందో ప్రస్తుతం పాకిస్థాన్ లో అదే జరుగుతోంది. అయితే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు రష్యా నుంచి చౌక ధరకు పెట్రోల్, డీజిల్ పొందాలని భావిస్తోంది పాక్… అందుకోసం ఆ దేశంతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పాకిస్థాన్ లో కిలో చికెన్ ధర రూ.600కు పైగానే ఉండగా.. మిగిలిన నిత్యావసరాల ధరలు సైతం ఆకాశాన్ని అంటాయి. మరోవైపు… దేశం చీకట్లలో మగ్గుతోంది. ఒకవైపు.. రష్యా సాయం కోసం కాళ్ల భేరానికి చర్చలు చేస్తున్న పాకిస్థాన్.. మరోవైపు.. ఉక్రెయిన్ కు సాయం చేస్తోంది. ఈ క్రమంలో పాక్ తాజాగా పది వేలకు పైగా రాకెట్ లాంఛర్లను సరఫరా చేసింది. వీటిని జర్మనీ పోర్టు మీదుగా పోలాండా నుంచి తరలించినట్లు సమాచారం. కరాచీకి చెందిన ప్రాజెక్ట్ షిప్పింగ్ గత నెలలో 146 కంటైనర్ల ఆయుధాలను సరఫరా చేసినట్లు వెల్లడైంది. దీనికి బదులుగా MI-17 హెలికాప్టర్లను అప్‌గ్రేడ్ చేయడంలో సహకరిస్తామని దాయాదికి ఉక్రెయిన్ హామీ ఇచ్చింది.

గత ఏడాదిలోనూ ఉక్రెయిన్ కు ఆయుధాలను సరఫరా చేసింది పాకిస్తాన్.. గ్లోబ్‌మాస్టర్ విమానం ద్వారా పాక్ నుంచి ఉక్రెయిన్‌ కు ఆయుధాలను తరలించింది. గడచిన రెండు దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య 1.6 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ ఒప్పందాలు జరిగాయి. అలా దాయాది యుద్ధంలో ఉన్న రెండు దేశాలనూ తన స్వార్థం కోసం వినియోగించుకుంటోంది. ఒక పక్క తక్కువ ధరకు ఇంధనాన్ని సరఫరా చేయాలంటూ రష్యాను కోరుతూనే.. మరోవైపు… దానితో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు ఆయుధాల సాయం అందిస్తోంది. యుద్ధంలో నిజంగా గెలిచేది పోరాటంలో ఉన్న రెండు దేశాలు కాదు.

వారికి ఆయుధాలు సరఫరా చేసి సొమ్ము చేసుకునే దేశాలేనని గతంలోనూ చాలా సార్లు స్పష్టమైంది. రెండు దేశాల చిచ్చును చల్లారకుండాచలికాసుకుంటున్న అగ్రదేశాలు తమ ఆయుధాలను అమ్ముకుని పబ్బం గడుపుకుంటున్నాయి. అలా ఉక్రెయిన్ కు బిలియన్ డాలర్ల ఆయుధ సామాగ్రిని అందిస్తున్నాయి. యుద్ధ సాయం మాటున తమ దేశాల పవర్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్… రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు మాస్కోతో సంప్రదింపులు జరుపుతోంది. అదే సమయంలో రష్యాతో యుద్ధం చేస్తోన్న ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేస్తోంది. జర్మనీ, పోలాండ్ మీదుగా పది వేల రాకెట్ లాంచర్లను పాకిస్థాన్ ఉక్రెయిన్‌కు తరలిస్తోంది. ఇంతకు ముందు కూడా పాకిస్థాన్ ఉక్రెయిన్‌కు ఆయుధాలను ఎగుమతి చేసింది.

యూకే తరఫున కీవ్‌కు పాకిస్థాన్ ఆయుధాలను సరఫరా చేస్తోంది.. దాదాపు ఏడాది కాలంగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది.. ఉక్రెయిన్‌ ను తేలిగ్గా స్వాధీనం చేసుకోవచ్చని తొలుత రష్యా భావించింది. కానీ మాస్కో అంచనాలకు భిన్నంగా.. కీవ్ సేనల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ఉక్రెయిన్‌ కు ప్రపంచ దేశాల నుంచి ముఖ్యంగా.. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల నుంచి సాయం అందుతోంది. అందుకే రష్యా దళాలను ఉక్రెయిన్ సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ తాజాగా కీవ్‌కు 10 వేలకుపైగా రాకెట్ లాంఛర్లను సరఫరా చేసింది.. జర్మనీ పోర్టు మీదుగా.. పోలాండ్ నుంచి ఈ రాకెట్ లాంఛర్లను ఉక్రెయిన్‌ను పంపినట్లు తెలుస్తోంది.

  • పాక్ కుటిలత్వం.. ఒకపక్క కాళ్ల భేరం.. మరోపక్క శత్రువుకు సాయం..!!

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన పాకిస్థాన్ తమకు చౌక ధరకే ఇంధనం విక్రయించాలని ఓవైపు రష్యాను కోరుతూనే.. మరోవైపు ఆ దేశంతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు నిరంతరం ఆయుధాలను సరఫరా చేస్తుండటం తన కుటిలబుద్దికి నిదర్శనం..కరాచీలోని షిప్పింగ్ కంపెనీ ‘ప్రాజెక్ట్ షిప్పింగ్’ గత నెలలో పాకిస్థాన్ ఆర్డనెన్స్ ఫ్యాక్టరీల నుంచి 146 కంటైనర్లను ఉక్రెయిన్‌కు తరలించింది. గత నెలలో పాకిస్థాన్ ఆర్డనెన్స్ ఫ్యాక్టరీలు 50 వేల డిఫెన్స్ స్టోర్లను కరాచీ మీదుగా పంపించాయి.

వీటిని కరాచీ నుంచి పోలాండ్లోని గాన్స్‌ పోర్ట్‌కు తరలించి.. అక్కడి నుంచి ఉక్రెయిన్‌కు చేరవేసినట్లు తెలుస్తోంది..ఉక్రెయిన్‌తో సరిహద్దును పంచుకుంటున్న తూర్పు యూరోప్ దేశాల గుండా.. పాకిస్థాన్ తయారు చేసిన సైనిక పరికరాలను ఉక్రెయిన్‌ కు చేరవేస్తున్నారు. ఉక్రెయిన్ సైన్యం ఆర్డర్ చేసిన ఆయుధాలను తూర్పు యూరప్‌లోని ఆయుధ సంస్థలకు పంపడానికి ఇస్లామాబాద్‌కు చెందిన ఆయుధ సరఫరాదారు డీఎంఐ అసోసియేట్స్.. ఆయా సంస్థలతో కలిసి పని చేస్తోంది. ఈ సాయానికి బదులుగా ఎంఐ-17 హెలికాప్టర్లను అప్‌గ్రేడ్ చేయడంలో సహకరిస్తామని పాకిస్థాన్‌కు ఉక్రెయిన్ హామీ ఇచ్చింది.

పాకిస్థాన్ హెలికాప్టర్లను అప్‌‌గ్రేడ్ చేయడంలో ఉక్రెయిన్‌ కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్లు, ఇండస్ట్రియల్ మెరైన్ గ్యాస్ టర్బైన్ల తయారీ సంస్థ ఒకటి నిమగ్నమైందని తెలుస్తోంది. గత ఏడాది యూకే తరఫున ఉక్రెయిన్‌‌ కు ఆయుధాలు చేరవేయడంలో పాకిస్థాన్ ముఖ్య పాత్ర పోషించింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ నుంచి మధ్యధరా ప్రాంతంలోని బ్రిటిష్ ఎయిర్‌బేస్ మీదుగా.. రొమేనియాలోని అవ్రమ్ ఇయాన్‌కూ క్లజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు మిలటరీ హెలికాప్టర్ల ద్వారా ఆయుధాలను తరలించారు.

ఇరాన్, అప్ఘానిస్థాన్‌ గగనతలం మీదుగా వెళ్తే త్వరగా ఉక్రెయిన్ చేరే అవకాశం ఉన్నప్పటికీ..రష్యా దాడి చేస్తుందనే భయంతో ఆ దేశాల మీదుగా ఆయుధాలను తరలించే సాహసం చేయలేదు. గ్లోబ్‌మాస్టర్ విమానం ద్వారా పాక్ నుంచి ఉక్రెయిన్‌ను ఆయుధాలను తరలించారని తెలుస్తోంది. ఉక్రెయిన్, పాక్ ల మధ్య చాలాకాలంగా మిలటరీ, వాణిజ్య అంశాల్లో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. 1991 నుంచి 2020 వరకు సుమారు 1.6 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన మిలటరీ ఉత్పత్తులను ఉక్రెయిన్ నుంచి పాక్ కొనుగోలు చేసింది.

ఉక్రెయిన్ నుంచి పాకిస్థాన్ 320కిపైగా టీ-80యూడీ ట్యాంక్‌లను కొనుగోలు చేసింది. 1991-2020 మధ్య ఇరు దేశాలు 1.6 బిలియన డాలర్ల విలువైన ఆయుధ ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. టీ-80యూడీ ఫ్లీట్ మరమ్మతులకు ఉక్రెయిన్‌తో పాక్ 85.6 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం చేసుకుంది. వీటి నిర్వహణ బాధ్యతలు మొత్తం ఉక్రెయిన్ చూసుకునేలా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

ఓ వైపు.. రష్యా నుంచి తక్కువ ధరకే చమురు కొనుగోలుకు ప్రయత్నిస్తోంది పాక్.. అదే సమయంలో ఉక్రెయిన్ కు ఆయుధాలు విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటోంది.. ఒకే సమయంలో రెండు శత్రుదేశాలతో స్వలాభం పొందేందుకు ప్రయత్నిస్తోంది కుటిలబుద్ది గల పాకిస్తాన్..

Must Read

spot_img