H3N2 ఇన్ ఫ్లూ యోంజా వైరస్ .. మామూలు ఫ్లూ వైరస్ .. అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లేనని వైద్య నిపుణులు అంటున్నారు. దీని ఎఫెక్ట్ తో సాధారణంగా వచ్చే జలుబు, దగ్గులు .. అసాధారణంగా మారుతున్నాయి. దీంతో ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు వెల్లువెత్తి, అతలాకుతలం అయిపోతున్నారు. కరోనా వైరస్ లానే .. ఆందోళన కలిగిస్తున్నా, ప్రాణాలకు నష్టం లేదన్నదే .. కాస్తంత ఊరట అని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి క్రమంగా కోలుకుంటున్న వేళ.. కొత్త వైరస్ హెచ్3ఎన్2 వైరస్ కల్లోలం రేపుతోంది. జ్వరం, ఫ్లూ లక్షణాలతో కూడిన ఈ వైరస్ బారిన జనం పడుతున్నారు. పైకి జ్వరం, జలుబుగా మాత్రమే కనిపిస్తున్న ఈ వైరస్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో పాటు కేంద్రం కూడా అడ్వైజరీలు విడుదల చేశాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో హెచ్3ఎన్2 వైరస్ కేసులు పెరుగుతున్నాయి.
జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి వైరస్ లక్షణాలతో వందల సంఖ్యలో జనం ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఫ్లూ కేసుల తీవ్రత పలు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండగా.. మరికొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్ని కేంద్రం అప్రమత్తం చేసింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో గత రెండు నెలల్లో దీర్ఘకాలిక అనారోగ్యం, దీర్ఘకాలిక దగ్గుతో ఎక్కువ ఫ్లూకేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా జ్వరం, ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు ఐసీఎంఆర్ కూడా ప్రకటించింది. ఇన్‌ఫ్లుయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2 వైరస్ కారణంగానే ఇలా జరుగుతుందని ఇండియన్ కౌన్సిల్
ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది.
H3N2 వైరస్ ఇతర ఉప రకాల కంటే ఎక్కువగా జనాన్ని ఆస్పత్రుల పాలు చేస్తున్నట్లు గుర్తించారు. గత రెండు మూడు నెలలుగా భారతదేశం అంతటా విస్తృతంగా వ్యాపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ లక్షణాలు సాధారణంగా జ్వరంతో పాటు నిరంతరాయంగా దగ్గును కలిగి ఉంటాయని
నిపుణలు చెప్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ తగ్గేందుకు చాలా సమయం తీసుకుంటున్నట్లు కూడా గుర్తించారు. రోగి కోలుకున్న తర్వాత కూడా లక్షణాలు చాలా కాలం పాటు కొనసాగుతాయని చెప్తున్నారు. ఢిల్లీలో దీర్ఘకాలిక అనారోగ్యం, దగ్గు వంటి లక్షణాలు ఎదుర్కొంటున్న చాలా మందిలో H3N2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్ ప్రబలినట్లు నిర్ధారణ అయింది.

ఇది సాధారణ ఫ్లూ గా భావిస్తున్న ప్రజలు సరైన రోగనిర్ధారణ చేసుకోకుండా, వైద్యులను సంప్రదించకుండానే ఫార్మసీ స్టోర్లకు పరుగులు పెడుతూ ఫ్లూ ఔషధాలు, యాంటీ బయోటిక్ ట్యాబ్లెట్‌లు, ఇంటి నివారణలు ప్రయత్నిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించకుండా స్వంత వైద్యం గానీ, ఔషధాలు తీసుకోవడం గానీ చేయవద్దని ప్రజలకు సిఫారసు చేసింది. గతంలో వైరల్ వ్యాధుల బారినపడినవారు, వాయు కాలుష్యం మొదలైన కారకాలు H3N2 ఇన్‌ఫ్లుఎంజా ప్రబలడానికి ప్రభావం చూపుతున్నాయి.
వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఎక్కువ సంక్రమణకు గురవుతున్నారు. జ్వరం, దగ్గు , ముక్కు కారటం వంటి శ్వాసకోశ సమస్యలతో పాటు, ఒళ్ళు నొప్పులు, వికారం, వాంతులు లేదా అతిసారం వంటివి H3N2 ఇన్‌ఫ్లుఎంజాకు ప్రధాన లక్షణాలుగా ఉన్నాయి. ఉబ్బసం ఉన్న రోగులు, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, వాతావరణ మార్పుల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి వారికి ఈ వైరస్
సోకితే లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయి. రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎక్కువగా తిరగరాదని,, ఆరుబయట పొల్యూషన్ మాస్క్ ధరించాలనిసూచిస్తున్నారు.
చేతులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ముఖ్యంగా రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించిన తర్వాత, ఆహారం తీసుకునే ముందు మీ ముఖం, ముక్కు లేదా నోటిని తాకడానికి ముందు మీ చేతులు పరిశుభ్రంగా ఉన్నట్లు నిర్ధారించుకోండి. వాయు మార్గాల పరిశుభ్రత పాటించాలి, వార్షిక ఫ్లూ షాట్‌లు తీసుకోవడం, ఇంటి లోపల గాలి నాణ్యత మెరుగుపరిచే పద్ధతులు అవలింబించడం వలన ఈ వైరస్ సోకకుండా నివారించవచ్చు.
అలాగే వైద్యులను సంప్రదించకుండా ఫార్మసీ మందులు వాడటం, ఇంటి నివారణలకు దూరంగా ఉండాలని వైద్యులు అంటున్నారు. వార్షిక ఫ్లూ టీకాలు వేయించుకోవాలి. ఈ అక్టోబరు చివరి నాటికే అందరూ టీకాలు వేయించుకొని ఉండాలని సూచించారు. ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభం కావడంతో ఈ వైరస్ ఇన్ ఫెక్షన్ల సంఖ్య మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారం నుంచి తగ్గే అవకాశం ఉందని ఐసీఎమ్ఆర్ అంటోంది. హెచ్3ఎన్2తో ఆస్పత్రుల్లో చేరిన రోగుల్లో 92 శాతం మంది రోగులకు జ్వరం, 86 శాతం మంది రోగులకు దగ్గు, 27 శాతం మందికి శ్వాస ఆడకపోవడం, 16 శాతం మందికి శ్వాస లోపం ఉన్నట్లు గుర్తించారు. దీనికి అదనంగా 16 శాతం మంది రోగులకు నిమోనియా, 6 శాతం మందికి మూర్చ సమస్యలు ఉన్నాయని ఐసీఎమ్ఆర్ పరిశీలనలో వెల్లడైంది.

హెచ్3ఎన్2తో బాధపడుతున్న వారిలో 10 శాతం మంది రోగులకు ఆక్సిజన్, 7 శాతం మందికి ఐసీయూ సంరక్షణ అవసరమనిఐసీఎమ్ఆర్అభిప్రాయపడింది. ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో ముఖ్యంగా పెద్దవారిలో, చిన్నపిల్లల్లో జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ఇది రెగ్యులర్ గా ఉంటే నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్లు చెబుతున్నారు. దీనికి ఇన్ ఫ్లూయెంజా వైరస్ కారణమని గుర్తించారు. దీన్ని హెచ్3ఎన్2 అనే వేరియంట్ గా ఐసీఎమ్ఆర్ గుర్తించింది. దీని ప్రభావంతో ఎక్కువ శాతం మంది తీవ్రమైన దగ్గు, ఊపరితిత్తుల సమస్యల బారిన పడుతున్నారు. కరోనా లక్షణాలతో ఇన్ ఫ్లూయెంజా కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో గత రెండు నెలలుగా దీర్ఘకాలిక అనారోగ్యం, దీర్ఘకాలిక దగ్గుతో అధిక సంఖ్యలో ఇన్ ఫ్లూయెంజా కేసులు నమోదవుతున్నాయి.
రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారితో పోరాడిన తర్వాత ఇప్పుడు ఫ్లూ కేసులు పెరుగుతుండటం సాధారణ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో దీర్ఘకాలిక దగ్గు, కొన్నిసార్లు జ్వరంతో కూడిన ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అధికంగా వ్యాపిస్తున్న ఫ్లూ కారణంగా ఇతర వేరియంట్ల కంటే ఎక్కువగా ఆసుపత్రిలో చేరడానికి కారణమవుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది. హెచ్ 3 ఎన్ 2 వైరస్ ఇతర వేరియంట్ల కంటే ఎక్కువ ప్రభావితం చేస్తుందనీ, దీని కారణంగా ఆసుపత్రిలో చేరే రేటును పెంచుతుందనీ, గత రెండు మూడు నెలలుగా ఇది భారతదేశం అంతటా విస్తృతంగా వ్యాప్తిలో ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే, కొత్త రకం ఇన్ ఫ్లూయెంజా ప్రాణాంతకం కాదని నిపుణులు చెబుతున్నట్లు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. వైరల్ కేసులు ఎక్కువగా 15 ఏళ్లలోపు, 50 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో సంభవిస్తాయనీ, జ్వరంతో పాటు ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయని ఐఎంఏ తెలిపింది. దేశంలోని అనేక ప్రాంతాలలో గత రెండు నెలల్లో దీర్ఘకాలిక అనారోగ్యం, దీర్ఘకాలిక దగ్గుతో అధిక సంఖ్యలో ఇన్‌ఫ్లూయెంజా కేసులు నమోదవుతున్నాయి. రెండు సంవత్సరాల కొవిడ్ మహమ్మారి అనంతరం ఇప్పుడు ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇక వైరస్ బారిన పడకుండా తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు అనుసరించాల్సిన విధులను కూడా ICMR ఇప్పటికే సూచించింది. మరోవైపు దేశవ్యాప్తంగా దగ్గు, జలుబు, వికారం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యాంటీబయాటిక్స్‌ను విచక్షణారహితంగా వాడకూడదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచించింది. కరోనాతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ కొత్త వైరస్ .. ఠారెత్తిస్తోంది. దీంతో మళ్లీ మాస్కులు, సామాజిక దూరం సూచనలు వినిపిస్తుండడంతో, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..