Homeఅంతర్జాతీయంచైనాలో కరోనా కల్లోలం.. కొత్త కేసులు, వేలాదిగా మరణాలు..!

చైనాలో కరోనా కల్లోలం.. కొత్త కేసులు, వేలాదిగా మరణాలు..!

కరోనా గురించే కాదు..చైనాలో ఏది జరిగినా అసలు విషయం ఎన్నడూ బయటకు రాదు. ఏవో నాలుగు ముక్కలు ఆ దేశ అధికార మీడియా చెబితే చెబుతుంది లేకపోతే అదీ ఉండదు. సోషల్ మీడియాపై కూడా అక్కడి ప్రభుత్వం అబ్జర్వేషన్ అంతగా ఉంటుంది.

ప్రాణాలు తెగించి అక్కడి వార్తలు బయటకు వస్తుంటాయి. అలా వచ్చినా చేసేదేం లేదు. డ్రాగన్ కంట్రీ ఎవరి ఆరోపణలకు ఉలకదు పలకదు. ఎటువంటి వార్తలైనా నాచురల్ డెత్ అయిపోవాల్సిందే.. ఇప్పుడు కరోనా మరణాలు కూడా అంతే అవుతోంది..

చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజుకు లక్షలాదిగా కొత్త కేసులు, వేలాదిగా మరణాలు నమోదవుతున్నాయి. ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. అనేక నగరాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. అయినా అక్కడి నుంచి ఏ వార్తా బయటకు రావడం లేదు. అసలు విషయాలను చైనా బయటకు పొక్కనీయడం లేదు. ఎంతకు తెగించిందంటే కోట్లాది మంది ఒక్కరోజే కరోనా పాజిటివ్ అయితే ఆ విషయాన్ని కూడా దాచిపెట్టింది.

మీకు తెలుసా..‘రేడియో ఫ్రీ ఆసియా’ లీక్ చేసిన ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రకారం చైనాలో గత 20 రోజుల వ్యవధిలో 25 కోట్ల మంది వైరస్ బారినపడినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య చైనా జనాభాలో 17.65 శాతంగా ఉంటుంది. అంతేకాదు రానున్న మూడు నెలల్లో చైనాలో కరోనా కారణంగా 20 లక్షల మంది చనిపోతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ విషయం సదరు రేడియో బయటపెట్టేదాకా బయటి ప్రపంచానికి తెలియదు. నిన్న మొన్నటి స్టేట్మెంట్ మేరకు కేవలం పది లక్షల కేసులు 5 వేల మరణాలు అని చెప్పిన చైనా ఇప్పుడు విషయం బయటకు పొక్కడంతో దొంగ దొరికినట్టైంది. అందుకే చైనాలోని ప్రతీచోటా పడకలు ఖాళీలేక బేంచీలు, బల్లల మీదే, ఆఖరుకు రోడ్లమీదే చికిత్స అందిస్తున్నారు. శవాలను పూడ్చేందుకు శ్మశాన వాటికల్లో స్థలం లేక వేరే ప్రదేశాలకు తరలిస్తున్నారు.

పరిస్థితి ఇలా ఉంటే చైనా ఆరోగ్య శాఖ ఆదివారం అనూహ్య ప్రకటన చేసింది. ఇకపై కరోనా కేసుల వివరాలు తాము వెల్లడించమని తెలిపింది. అంటువ్యాధుల నియంత్రణ, పరిశోధన కేంద్రమే కరోనా వివరాలను చూసుకుంటుందని చెప్పింది. అయితే కేసుల లెక్కలు ఎప్పుడు వెల్లడిస్తారు అనే విషయాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.

చైనాలో ఏది జరిగినా అసలు విషయం ఎన్నడూ బయటకు రాదు..

దీంతో కరోనా లెక్కలు దాచేందుకు చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. అసలు ఇంత గందరగోళం జరుగుతుంటే అధ్యక్షుడు జిన్ పింగ్ ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు. మొన్న జిన్ పింగ్ తల్లి కూడా కరోనా కారణంగా మరణించారని వార్తలు వస్తున్నాయి. తల్లిని జాయిన్ చేసిన ఆసుపత్రి నుంచి ఆమె మ్రుతదేహాన్ని అంత్యక్రియలకు తరలించే ముందు నాలుగు రహదారులను మూసివేయడంతో చాంతాడంత ట్రాఫిక్కు గంటల పాటు జామ్ అయింది.

అప్పుడే అందరికీ తెలిసింది. చివరకు జిన్ పింగ్ తల్లి కూడా కరోనా కారణంగా మరణించారని. జిన్ పింగ్ ప్రస్తుతం ఎక్కడో బంకరులో ఉన్నాడని సమాచారం. బయటకు వచ్చి దేశ ప్రజలకు దైర్యం చెప్పే విషయం అటుంచితే..కనీసం తల్లి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేది.

ఇదంతా విధి వైపరీత్యం అంటున్నారు విశ్లేషకులు. చేసిన పాపం ఊరికే పోదన్నట్టు కరోనాను ప్రపంచం మీదకు తోలి వ్యాక్సిన్లను కనిపెట్టి డబ్బులు సంపాదించాలనుకున్న చైనా ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. చైనా నుంచి కనిపెట్టబడిన వ్యాక్సిన్ నిజానికి అస్సలు పనిచేయడం లేదు. ఇప్పుడు రెచ్చిపోతున్న ఒమిక్రాన్ బీఎఫ్7 మీద ఆవగింజంత ప్రభావం చూపించడం లేదంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు.

చైనా ఆరోగ్య సంస్థ ‘ఎన్‌హెచ్‌సి’ సమావేశం నుండి లీక్ అయిన పత్రాలను చూసినట్లు అమెరికన్ న్యూస్ ఛానెల్ సిఎన్‌ఎన్ కూడా తెలిపింది. జిన్‌పింగ్ ప్రభుత్వ రహస్య డేటా లీక్ కావడంతో చైనాలో కలకలం రేగింది. చైనాలో కరోనా ఎంత విధ్వంసం సృష్టించిందో లీక్ అయిన నివేదికను బట్టి అంచనా వేయవచ్చు.

చైనా ఆరోగ్య శాఖ డిసెంబర్ మొదటి 20 రోజుల్లో 250 మిలియన్లకు బదులుగా 62,592 కొత్త కోవిడ్ కేసులను మాత్రమే నివేదించిందని సీఎన్‌ఎన్‌ తెలిపింది. అటు బ్లూమ్‌బెర్గ్, ఫైనాన్షియల్ టైమ్స్ నివేదికల ప్రకారం, డిసెంబర్ మొదటి 20 రోజుల్లోనే చైనాలో దాదాపు 250 మిలియన్లు మంది ప్రజలు కోవిడ్ బారిన పడవచ్చని చెబుతున్నారు.

చైనా ఉన్నత ఆరోగ్య అధికారులు అంతర్గతంగా వేసిన అంచనాలను బుధవారం చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ సమావేశంలో సమర్పించబడ్డాయి. ఈ గణాంకాలు సరైనవే అయితే, 140 కోట్ల జనాభా ఉన్న చైనాలో 18 శాతానికి పైగా ప్రజలు కోవిడ్ బారిన పడ్డారని అర్థం. ప్రపంచంలోని ఏ దేశం నుండి కోవిడ్ సోకిన వారి సంఖ్య కంటే ఇది ఎక్కువ.

Must Read

spot_img