HomeUncategorizedచైనాలో కరోనా పాజిటివ్..రోజురోజుకు భారీగా కేసులు..!

చైనాలో కరోనా పాజిటివ్..రోజురోజుకు భారీగా కేసులు..!

చైనాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి.. కరోనా మరణాలు సైతం వేలల్లో ఉంటున్నాయి.. కానీ.. చైనా మాత్రం కరోనా కేసులు, మరణాల సంఖ్యను వెల్లడించడం లేదు.. ఇప్పుడు ఇదే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనకు కారణమవుతోంది..

చైనాలో కోవిడ్ వ్యాప్తితీవ్ర స్థాయిలో ఉంది.. అయినా చైనా ప్రభుత్వం మాత్రం కోవిడ్ కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యను వెల్లడించకపోవడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.. కరోనా కేసుల సంఖ్యను చైనా ఎందుకు వెల్లడించడం లేదు..?

చైనాలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా బారినపడి ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు బాధితులు.. వైరస్ బాధితులతో ఆస్పత్రులలో బెడ్లు సరిపోకపోవడం, ట్రీట్ మెంట్ అందించడం సాధ్యం కాకపోవడం వల్ల చైనాలోని ఆస్పత్రులపై తీవ్ర ఒత్తిడిపెరుగుతోంది.. ఇంత జరుగుతున్నా చైనా మాత్రం కొవిడ్ బాధితుల సంఖ్యను చాలా తక్కువగా చూపిస్తోంది.

మొదటి నుంచి కరోనా లెక్కలను సరిగా వెల్లడించకుండా దాస్తోంది చైనా. ఇప్పుడు కూడా మళ్లీ అదే విధంగా వ్యవహరిస్తోంది. ఈ వైఖరిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 కారణంగా చైనాలో భారీ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. కానీ.. .చైనా మాత్రం అదేం లేదంటూ తప్పుడు లెక్కలు బయట పెడుతోంది. చైనాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో దాదాపు 97% మేర ఈ కొత్త వేరియంట్‌ కారణంగా వచ్చినవే. అయితే.. చైనా కొవిడ్ కేసుల విషయంలో ఇస్తున్న సమాచారం సరిగా ఉండడం లేదని WHO తేల్చి చెప్పింది.

జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్ట్‌లను మాత్రమే ఇస్తోందని, మ్యుటేషన్‌ లు, వేరియంట్‌లు, కొవిడ్ కేసుల సంఖ్య లాంటి వివరాలను అందించడం లేదని చెబుతోంది. ఇప్పటికే WHO ప్రతినిధులు చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఇంతకూ ఏ వేరియంట్‌ ఎక్కువగా సోకుతోంది..? ఆసుపత్రుల్లో సరిగా చికిత్స అందుతోందా లేదా..? జీనోమ్ సీక్వెన్సింగ్ ఎలా కొనసాగుతోంది..? ఇలా అన్ని విషయాలనూ ఆరా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు చైనా అధికారులు.. “ఈ వివరాలు కచ్చితంగా ఉంటేనే కరోనాపై పోరాడం సులువవుతుంది” అని WHO స్పష్టం చేసింది. పలు దేశాల్లో ఈ డేటా సరిగ్గా ఉండటం వల్ల కొంత వరకూ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలైందని గుర్తు చేసింది. దాదాపు మూడేళ్లుగా చైనాలో కరోనా ఆంక్షలు విధిస్తున్నప్పటికీ…పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదని వెల్లడించింది.

ఇదంతా ఆరంభం మాత్రమేనని…అసలు కథ ముందుందని అంటున్నారు నిపుణులు. మరి కొద్ది రోజుల్లో ఇంత కన్నా దారుణమైనపరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరో 13 రోజుల పాటు కరోనా కేసులు ఉన్నట్టుండి పెరిగిపోతాయని చెబుతున్నారు. అంతే కాదు. గత రికార్డులను బద్దలు కొట్టే స్థాయిలో కేసులు నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు..

యూకేలోని ఆరోగ్య రంగ నిపుణులు చైనాలో ఏ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతాయో అంచనా వేస్తున్నారు. జనవరి 13వ తేదీన కరోనా అనూహ్య స్థాయిలో వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. అప్పటికి కరోనా బాధితుల సంఖ్య 37 లక్షలకు పెరుగుతుందని, అక్కడి నుంచి మరింత వ్యాప్తి చెందుతుందని స్పష్టం చేస్తున్నారు. జనవరి 23వ తేదీ నాటికి రోజుకు 25 వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతారని సంచలన అంచనాలు వెలువరించారు ఎక్స్‌పర్ట్‌లు.

ఇదే నిజమైతే…చైనా వణికిపోవడం ఖాయం. ఇప్పటికే అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కరోనా బాధితులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. నిపుణులు చెప్పినట్టుగా కేసులు ఆ స్థాయిలో పెరిగితే అక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడతారో ఊహించు కోడానికి కూడా భయంగానే ఉంది. సరైన వైద్యం దొరక్క ఇప్పటికే అల్లాడిపోతున్నారు.

చైనా రాజధాని హాస్పిటళ్లు అన్నీ ఫుల్..

చైనా రాజధాని బీజింగ్‌ లో దాదాపు హాస్పిటళ్లు అన్నీ ఫుల్ అయ్యాయి. కోవిడ్ లక్షణాలతో హాస్పిటళ్లలో చేరుతున్న వారి సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. అయితే పాపులర్ వ్యక్తుల మరణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం ఇప్పుడు అక్కడ కొంత ఆందోళనకర పరిస్థితిని క్రియేట్ చేస్తోంది. 40 ఏళ్ల మేటి ఒపెరా సింగర్ చూ లాన్‌లన్ మరణించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో చాలా మంది భయాందోళనలకు గురవుతున్నారు.

అసలు అధికారికంగా కోవిడ్ మృతుల లెక్క ఎంత ఉంటుందో అని భయపడుతున్నారు. గత డిసెంబర్‌లో కోవిడ్ జీరో పాలసీని చైనా ఎత్తివేసింది. దాంతో అక్కడ ఒక్కసారిగా మళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగాయి. హాస్పిటళ్లు, శ్మశానవాటికలు మళ్లీ కిక్కిరిసిపోతున్నాయి. రోజువారీ కేసుల వివరాలను వెల్లడించేందుకు చైనా నిరాకరిస్తోంది.

గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కేవలం 22 మంది మాత్రమే చనిపోయినట్లు ఆ దేశం పేర్కొన్నది. కేవలం శ్వాసకోస ఇబ్బందులు, న్యుమోనియా లాంటి కేసుల్ని మాత్రం లెక్కిస్తున్నారు. చూ లాన్‌లన్ లాంటి పబ్లిక్ ఫిగర్లు మృతి కలవరం రేపింది. ఇక మృతుల లెక్కలపై ప్రభుత్వం ఇస్తున్న అధికారిక లెక్కలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

న్యూ ఇయర్ రోజున నటుడు గాంగ్ జిన్‌టాంగ్ మరణం కూడా చైనా ఇంటర్నెట్ యూజర్లను తెగ ఆందోళనకు గురి చేసింది. ఫాదర్ కాంగ్ పాత్రతో గాంగ్ టీవీ ప్రేక్షకుల్ని ఆకర్షించారు. మాజీ జర్నలిస్టు, నాన్‌జింగ్ వర్సిటీ ప్రొఫెసర్ హూ ఫూమింగ్ జనవరి రెండో తేదీన మరణించారు.

డిసెంబర్ 21 నుంచి 26వ తేదీ వరకు దేశంలోని టాప్ సైన్స్, ఇంజనీరింగ్ సైంటిస్టులు 16మంది చనిపోయినట్లు చైనా మీడియా తెలిపింది. నిజానికి వీళ్ల మరణాలకు కోవిడ్ కారణమని ఎక్కడా చెప్పకపోయినా.. ఇంటర్నెట్ యూజర్లు మాత్రం ఆ డౌట్స్‌ను వ్యక్తం చేస్తున్నారు.

చైనాలో కొవిడ్ కేసులు వేగంగా పెరుగడమే కాదు.. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దేశ జనాభాలో 60 శాతం మంది.. అంటే సుమారు 84 కోట్ల మంది వైరస్‌ బారిన పడతారని అమెరికాకు చెందిన ప్రజారోగ్య శాస్త్రవేత్త ఎరిక్‌ ఫీగ్ల్‌-డింగ్‌ అంచనా వేశారు. ఆయన చెప్పిన విధంగానే చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. జీరో కొవిడ్ పాలసి ఎత్తివేశాక కేసులు వేగంగా పెరుగుతన్నాయి.

కేసులతో పాటు మరణాలు సంభవిస్తున్నా చైనా ప్రభుత్వం మాత్రం అధికారికంగా వివరాలు వెల్లడించడం లేదు. కొవిడ్ రోగులతో ఇప్పటికే ఆస్పత్రులు నిండిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. బెడ్స్ ఖాళీలేక డాక్టర్లు ఎమర్జెన్సీ వార్డుల్లో ఒక్కో బెడ్​పై ఇద్దరిని, బెడ్స్ మధ్య నేలపైన కూడా రోగులను పడుకోబెట్టి చికిత్స చేస్తున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి..

ఒక్కో రోజుకు 200 మృతదేహాలు చైనాలో రోగులతో నిండిపోయిన ఓ ఆసుపత్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు అంత్యక్రియల కోసం బీజింగ్​లో ఒక్క క్రిమటోరియానికే రోజుకు 200 మృతదేహాలను తీసుకొస్తున్నారని తెలిసింది. అయితే, ఈ మరణాల లెక్క అధికారికంగా ప్రకటించిన దాని కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాలు చెబుతున్నాయి.

ఇటీవల కాలంలో ఒక్క బీజింగ్‌లోనే రోజుల వ్యవధిలో 2700 మంది చనిపోయినట్లు హాంకాంగ్‌ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. బీజింగ్‌లోని కొన్ని శ్మశానవాటికలు కొవిడ్‌ మృతులతో నిండిపోయాయ వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం వివరించింది. జీరో కొవిడ్​ ఆంక్షలు ఎత్తేశాక దేశంలో వైరస్ కేసులు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్నా జిన్ పింగ్​సర్కారు పట్టించుకోవట్లేదని ఎపిడమాలజిస్ట్ ఎరిక్​ఫెయిగిల్​డింగ్​ విమర్శించారు.

చైనాలో ఇప్పటి వరకు 5,327 మంది కొవిడ్‌తో మరణించారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆ దేశంలో ఎవరైనా కేవలం కరోనా వల్ల చనిపోయినప్పుడే కొవిడ్‌ మరణంగా గుర్తిస్తారు. చాలామేర ఇతర దేశాల్లో మాత్రం కరోనా వైరస్‌ సోకి ఆ ప్రభావంతో ఇతర ఏ కారణాలతో మృతిచెందినా కొవిడ్‌ మరణాలుగానే లెక్కిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 కారణంగా చైనాలో భారీ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. కానీ.. .చైనా మాత్రం అదేం లేదంటూ తప్పుడు లెక్కలు బయట పెడుతోంది. చైనాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో దాదాపు 97% మేర ఈ కొత్త వేరియంట్‌ కారణంగా వచ్చినవే.

Must Read

spot_img