Homeఅంతర్జాతీయందేశంలో కరోనా కొత్త వేరియంట్ .. శరవేగంగా వ్యాపిస్తోందా..?

దేశంలో కరోనా కొత్త వేరియంట్ .. శరవేగంగా వ్యాపిస్తోందా..?

దీని వ్యాప్తి .. సర్వత్రా భయాందోళనల్ని పెంచుతోందా..? దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

కరోనా XXB వేరియంట్ .. ప్రకంపనలు పుట్టిస్తోంది.. గుజరాత్ లో మొదలై .. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మళ్లీ ఆంక్షలు పాటించాల్సిందేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌ళ్లీ క‌రోనా విజృంభిస్తోంది. చైనాలో క‌రోనా మ‌ర‌ణ‌మృదంగాన్ని సృష్టిస్తుండ‌గా, అమెరికా, ఇంగ్లాండ్‌, ద‌క్షిణ కొరియాతో పాటు అనేక
ఆసియా, అమెరికా, యూర‌ప్ దేశాల్లోనూ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌త్ అప్ర‌మ‌త్త‌మైంది. క‌రోనా కేసుల పెరుగుద‌ల‌పై ఇప్ప‌టికే కేంద్రం అల‌ర్ట్ చేసింది. క‌రోనా కేసులు పెర‌గ‌డానికి కార‌ణమైన స‌బ్ వేరియంట్ ఎక్స్ఎక్స్‌బి వేరియంట్ కేసులు ఇప్ప‌టికే కొన్ని బ‌య‌ట‌ప‌డ్డాయి.

దీనితో పాటు మ‌రో స‌బ్ వేరియంట్‌ ఎక్స్ఎక్స్‌బి 1.5 కేసులను కూడా భార‌త్‌లో గుర్తించారు. గుజ‌రాత్‌లో 3, క‌ర్ణాట‌క‌, రాజ‌స్థాన్‌లో ఒక్కో కేసు చొప్పున న‌మోదైన‌ట్లు ఇన్ఫాకాగ్ తెలియ‌జేసింది. అమెరికాలో 40.5 శాతం కేసులు ఈ స‌బ్ వేరియంట్ కార‌ణంగానే న‌మోద‌య్యాయి. ఇంగ్లాండ్‌లోనూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతున్న‌ది. ఒమిక్రాన్ స‌బ్ వేరియింట్ బిఏ 2 నుండి ఈ ఎక్స్ ఎక్స‌బి, ఎక్స్ఎక్స్‌బి 1.5 స‌బ్ వేరియంట్లు పుట్టుకొచ్చిన‌ట్లు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

అయితే, ఈ స‌బ్‌వేరియంట్ల ప్ర‌భావం భార‌త్‌పై ఉండ‌క‌పోవ‌చ్చ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దేశంలో ఇప్ప‌టికే 80 శాతానికి పైగా డ‌బుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న‌వారు ఉన్నార‌ని, అదేవిధంగా బూస్ట‌ర్ డోసు కూడా తీసుకున్నార‌ని, దీంతో వ్యాధినిరోధ‌క శ‌క్తి పెరిగింద‌ని, స‌బ్ వేరియంట్ల ప్ర‌భావం ఉండే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ కేంద్రం త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ఆక్సీజ‌న్‌, క‌రోనా బెడ్ల‌ను సిద్ధం చేసుకోవాల‌ని అల‌ర్ట్ చేసింది.

గత మూడు సంవత్సరాలుగా కరోనా వైరస్ మానవ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూనే ఉంది. దాని కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చనిపోగా, మరికొంత మంది కరోనా సంబంధిత వ్యాధులతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఈ మధ్యే దాని ప్రభావం కొంచం తగ్గిందని ఊపిరి పీల్చుకునే లోపే మళ్ళీ దాని ప్రతాపం చూపించడం ప్రారంభించింది. ప్రస్తుతం చైనాలో ఈ వైరస్
విపరీతంగా వ్యాపిస్తుంది. రోజుకి లక్షల్లో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. హాస్పిటల్స్ లో సరైన చికిత్స అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ప్రజల నుంచి వచ్చిన తీవ్ర నిరసనల కారణంగా చైనా ప్రభుత్వం కోవిడ్ జీరో పాలసీని ఎత్తివేసింది.

అప్పటి నుంచి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే కరోనా కేసులు విపరీతంగా పెరగడానికి కొత్త కోవిడ్ వేరియంట్ అయిన XBB.1.5 ప్రధాన కారణం అని నిపుణులు భావిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్యను గణనీయంగా పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వేరియంట్ ఇప్పటికే మన దేశంలోకి ప్రవేశించింది.

XBB.1.5 అని పిలువబడే ఒక కొత్త రీకాంబినెంట్ స్ట్రెయిన్ BQ, XBB వేరియంట్ల కంటే ఎక్కువ రోగనిరోధక శక్తిని కలిగి ఉండడంతో పాటు మరింత వేగంగా వ్యాప్తి చెందే గుణాన్ని కలిగి ఉంటుంది. BQ1 వేరియంట్ ను XBB 1.5 వేరియంట్ 108 శాతం అధిగమించింది. ప్రస్తుతం మరింత డేటా అందుబాటులోకి రావడంతో XBB 1.5 సబ్ వేరియంట్ 120 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుంది, ఇది ఒమిక్రోన్ బీఎఫ్ కంటే వేగంగా వ్యాపిస్తుంది.

కరోనా వైరస్ కి సంబంధించిన కొత్త BQ.1, BQ.1.1 సబ్ వేరియంట్లు ఇకపై ఎక్కువగా కనిపించకపోవచ్చు, దీని స్థానంలో XBB 1.5 ఓమిక్రాన్ సబ్ వేరియంట్లు ఉన్నాయి. BA.2 ఓమిక్రాన్ సబ్ వేరియంట్ నుంచి ఉద్భవించిన రెండు సబ్ వేరియంట్లు కలిసి XBB సబ్ వేరియంట్ ని ఉత్పత్తి చేశాయి. ఇది BA.2 సబ్ వేరియంట్ నుంచి వచ్చిన రెండు కరోనా వైరస్ వేరియంట్ల నుంచి జన్యు పదార్థాన్ని కలిగి ఉంటుంది.

ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు అయిన XBB, XBB.1 లను మొదటగా మన దేశంలోనే కనుగొనడం జరిగింది.

అయితే, XBB.1.5 సబ్ వేరియంట్ న్యూయార్క్ లో పరివర్తన చెంది ఉండవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో 40 శాతం కంటే ఎక్కువ కోవిడ్ -19 కేసులకు అత్యంత వేగంగా వ్యాపించే ఓమిక్రాన్ XBB 1.5 సబ్ వేరియంట్ కారణమని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్
డేటా సూచించింది. ఈ సబ్ వేరియంట్ మునుపటి వారంతో పోలిస్తే రెట్టింపు అవుతుందని డేటా తెలిపింది.

కరోనా వైరస్ కి సంబంధించిన అసలు వేరియంట్ తో పాటు BA .4, BA .5 సబ్ వేరియంట్లను లక్ష్యంగా చేసుకునే కొత్త కోవిడ్ బూస్టర్ షాట్లు XBB సబ్ వేరియంట్ నుంచి కూడా కొంత మేర రక్షణను అందించవచ్చునని అంటు వ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీ నవంబర్ లో తెలిపారు. తాజాగా భారతదేశంలో కరోనావైరస్ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ తొలి కేసు నమోదైంది. ఒమిక్రాన్ వేరియంట్ ‘XXB.1.5’ కేసు గుజరాత్ రాష్ట్రంలో వెలుగుచూసింది.

ఈ వేరియంట్ న్యూయార్క్‌లో కరోనావైరస్ కేసుల పెరుగుదలకు కారణమైంది.ఒమిక్రాన్ XXB.1.5 మొదటి కేసు గుజరాత్‌లో నిర్ధారించినట్లు వైద్యులు వెల్లడించారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రచురించిన డేటా ప్రకారం.. XBB.1.5 ఇప్పుడు యూఎస్‌లో దేశవ్యాప్తంగా 41% కొత్త కేసులన్నాయి. గత వారంలో దీని ప్రాబల్యం దాదాపు రెట్టింపు అయింది. కొత్త వేరియంట్ బీక్యూ, XBB కంటే ఎక్కువ రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది.

సోకడంలో మెరుగ్గా ఉంటుంది. ట్రాన్స్‌మిషన్ ఆర్ విలువ, ఇన్‌ఫెక్షన్ రేటులో మునుపటి వేరియంట్‌ల కంటే XXB15 వేరియంట్ చాలా అధ్వాన్నంగా ఉందని బహుళ మోడల్‌లు చూపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సబ్ వేరియంట్ BB7 కేసులు గణనీయంగా పెరుగుతుండగానే మరో సబ్ వేరియంట్ పుట్టుకొచ్చింది..!

ఇప్పుడు కొత్తగా ఉద్భవించిన సబ్ వేరియంట్ XBB1.5 విదేశాలలో ఆందోళనలను కలిగిస్తోంది. కరోనా లెక్కల ప్రకారం ప్రస్తుతం కరోనా XBB1.5 కేసులు సింగపూర్‌లో ఎక్కువగా నమోదవుతున్నాయి. సింగపూర్‌తో పాటు దానికి చుట్టుపక్కల ఉన్న ఆసియా దేశాలలో కూడా ఈ సబ్ వేరియంట్ కేసులు నమోదయినట్లు ఆయా దేశాల వైద్యులు గుర్తించారు. దీనిని ‘సూపర్ వేరియంట్’ అని కూడా వారు పిలుస్తున్నారు.

ఈ వేరియంట్ మరింతగా వ్యాప్తి చెందుతుందని కొంతమంది ఆరోగ్య నిపుణులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలలో కేసుల పెరుగుదలకు కారణమవుతున్న ఇతర ఉప వేరియంట్లు భారతదేశంలో కూడా ఉండడానికి అవకాశాలున్నాయని భావిస్తున్నారు. భారత్‌లోనూ అనేక నమూనాలలో కొత్త వేరియంట్ల జాడలు కనిపించాయని చెబుతున్నారు. ఈ వేరియెంట్‌ మన దేశంలో విజృంభిస్తే.. మూడు నుంచి నాలుగు వారాల్లో కేసులు మళ్లీ గణనీయంగా పుంజుకునే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇతర ఉప-వేరియంట్‌లపై ఆధిపత్యం అంటే వాటి కంటే వేగంగా వ్యాపించి మానవాళిని ప్రభావితం చేయగల లక్షణాలను XBB 1.5 ప్రదర్శిస్తోందని పలువురు గుర్తించారు. ఇది వ్యాధి నిరోధక వ్యవస్థను ఏమార్చే లక్షణాలను కలిగిన సబ్ వేరియంట్ అని చెబుతున్నారు. అయితే ఈ వేరియంట్ తీవ్రమైన అనారోగ్యానికి కారణమైనట్టు ఎలాంటి ఆధారాలు లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది.

ఈ వేరియంట్ సోకిన వారు వ్యాక్సిన్లు తీసుకోకపోతే ప్రమాదంలో పడతారని, వ్యాక్సిన్లు తీసుకున్న వారికి ఎటువంటి ప్రమాదం ఉండదని అభిప్రాయపడుతున్నారు.

కరోనా కొత్త వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తున్నా, ప్రమాద తీవ్రత పెద్దగా లేదని వైద్య నిపుణులు చెబుతుండడంతో ప్రజలు కాస్తంత ఊరట చెందుతున్నారు.

Must Read

spot_img