Homeఅంతర్జాతీయంచైనాలో మళ్లీ కోవిడ్ పడగ..వేగంగా నమోదవుతున్న కేసులు

చైనాలో మళ్లీ కోవిడ్ పడగ..వేగంగా నమోదవుతున్న కేసులు

చైనాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది.. ఆ దేశంలోని అత్యధిక కుటుంబాలు కరోనా బారినపడ్డాయి.. ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీని ఎత్తివేసినప్పటికీ రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కోవిడ్ ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వం విధుల్లోకి రమ్మని ఉద్యోగులను ఆహ్వానిస్తోంది.

చైనాలో కొవిడ్‌-19 భయానక స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. అక్కడ ఓ నగరంలో రోజుకు 10 లక్షల కొత్త కేసులు వస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చైనా కొత్త కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ పేర్కొన్నారు.

చైనా.. అదొక ఉక్కు పిడికిలి లాంటి దేశం.. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ ఓ పట్టాన అంతు పట్టదు. అక్కడ ఏం జరిగినా విషయం బయటపడదు. ఆసక్తి కొద్దీ తెలుసుకుందామన్నా ఓ పట్టానా సమాచారం దొరకదు. వాస్తవాల కంటే వదంతులే ఎక్కువగా వినిపిస్తాయి. కోవిడ్ పుట్టినిల్లు చైనాలో ఇప్పుడు ఆ వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం ఓమిక్రాన్ కొత్త వేరియంట్ బీ ఎఫ్. 7 కల్లోలం సృష్టిస్తున్నది. జీరో కోవిడ్ పాలసీ కి ముగింపు పలికిన చైనాలో గత పది రోజులుగా కేసులు దారుణంగా నమోదవుతున్నాయి.. వైద్య సేవలకు సిబ్బంది కూడా కరువయ్యారంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందా అర్థం చేసుకోవచ్చు. కేసుల తీవ్రత కనివినీ ఎరుగని స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కోవిడ్ నిర్ధారణ పరీక్షలను నిలిపివేసింది.. రోజువారీ కేసుల వెల్లడించడం లేదు.

అంతేకాదు చైనాలోని మెజారిటీ కుటుంబాల్లో అందరూ కోవిడ్ బారిన పడ్డారు.. ముఖ్యంగా మహిళలు గొంతు ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారు. వృద్ధులు మరణ శయ్యపై ఉన్నారు.. వీరిలో 25 శాతం మందికి ప్రాణాపాయం ఉంది. కోవిడ్ పాజిటివ్ గా తేలినవారు ఆసుపత్రిలో చేరేందుకు మూడు గంటల దాకా నిరీక్షించాల్సి వస్తోంది.. ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీని ఎత్తివేసినప్పటికీ రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కోవిడ్ ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వం విధుల్లోకి రమ్మని ఉద్యోగులను ఆహ్వానిస్తున్నది.

చైనా రాజధాని బీజింగ్ లో 80 శాతం పైగా ప్రజలు కోవిడ్ కు గురయ్యారు. బీజింగ్ సహా ప్రధాన నగరంలోని ఆసుపత్రులు కోవిడ్ రోగుల తాకిడిని తట్టుకోలేకపోతున్నాయి.. బీజింగ్ లోని ఒక ఆసుపత్రికి రోజుకు 500 పైగా సీరియస్ కేసులు వస్తున్నాయి. దీంతో తాత్కాలిక ఇన్సెంటివ్ కేర్ యూనిట్లు,
పడకల పెంపును ప్రభుత్వం చేపడుతోంది.

చైనా కేసులు విపరీతంగా పెరుగుతుండటం, ఆస్పత్రుల్లో సైతం ఖాళీ బెడ్లు లేకపోవడంతో.. ప్రజలు సంప్రదాయ వైద్యాన్ని నమ్ముతున్నారు. ఫ్యాక్టరీలు, కంపెనీలు నడుస్తున్నప్పటికీ వాటిల్లో కార్మికుల హాజరు 10 శాతానికి మించడం లేదు. ఇక గత వారం వరకు 99 శాతం మంది ఇళ్ళకే పరిమితమయ్యారు. ఇక మొన్నటి వరకు జీరో కోవిడ్ పాలసీ అమలు చేసిన చైనా ఇప్పుడు దానిని ఎత్తేసింది.

గతంలో పాజిటివ్ కేసులు వస్తే ఐసోలేషన్లో ఉంచిన ప్రభుత్వం… ఇప్పుడు పాజిటివ్ ఉన్నప్పటికీ విధులకు రమ్మని ఆహ్వానిస్తున్నది. అంతేకాదు వివిధ రాష్ట్రాల మధ్య ఆంక్షలను కూడా పూర్తిగా సడలించింది. అన్నింటికంటే ముఖ్యంగా విదేశాల నుంచి వస్తే పది రోజుల క్వారంటైన్ ను పూర్తిగా ఎత్తేసింది.. ప్రజలే స్వచ్ఛందంగా క్వారంటైన్ అవుతున్నారు.

ఇక కరోనా రోగుల తాకిడి పెరగడంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేందుకు గంటలపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.ఆస్పత్రుల్లో కూడా కండిషన్ సీరియస్ గా ఉన్న వారినే అడ్మిట్చే సుకుంటున్నారు. ఇక చైనాలో మందులు కావాలంటే ఎక్కడపడితే అక్కడా బయటకు వెళ్లి తెచ్చుకోవడం ఉండదు. అంతా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంటాయి.. కొన్ని మందులు మాత్రమే దుకాణాల్లో విక్రయిస్తారు.. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పారాసిటమల్ వంటి మాత్రలను ప్రజలు పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఇంట్లో నిల్వ చేసుకున్నారు.. దీంతో ఆ మాత్రలకు కొరత ఏర్పడింది.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా
వచ్చేందుకు చాలా సమయం పడుతున్నది. ఇలా చెప్పుకుంటూ పోతే చైనాలో కోవిడ్ కు అంతూ పొంతూ లేదు.

చైనాలో కొవిడ్‌-19 భయానక స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. అక్కడ ఓ నగరంలో రోజుకు 10 లక్షల కొత్త కేసులు వస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.. షాంఘై సమీపంలోని పెద్ద పారిశ్రామిక నగరమైన జెజియాంగ్‌లో రోజువారీ కేసుల సంఖ్య 10 లక్షలుగా నమోదవుతున్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఇక్కడ కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని స్థానిక ప్రభుత్వం అంచనా వేస్తోంది. ”ఇన్పెక్షన్‌ కేసులు మరికొన్ని రోజుల్లో తీవ్రస్థాయికి చేరుకుంటాయని అంచనా వేస్తున్నాం. కొత్త సంవత్సరం సమీపానికి రోజువారీ కేసుల సంఖ్య దాదాపు రోజుకు 20 లక్షలకు చేరుకోవచ్చు” అని జెజియాంగ్‌
ప్రభుత్వం పేర్కొన్నట్లు రాయిటర్స్‌ తెలిపింది.

నూతన కోవిడ్‌ పరిస్థితిని చైనా ఎదుర్కొంటోందని దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆకస్మిక పరిణామాన్ని ఎదుర్కొనేందుకు ఆరోగ్య పరిరక్షణ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్‌ నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చైనా అధ్యక్షుడు సి జిన్‌పింగ్‌ అధికారులను ఆదేశించారు. జీరో కోవిడ్‌ విధానాన్ని సడలించిన తర్వాత ఈ నెల్లో ఒక్కసారిగా కేసులు పెరుగుతున్నాయి. రాబోయే కొద్ది మాసాల్లో దాదాపు 10లక్షల మంది కోవిడ్‌ కారణంగా మరణించవచ్చని అధ్యయనాలు అంచనాలు వేస్తున్నాయి.

ప్రస్తుతం కేసులు పెరిగిన వేళ ఔషధాలకు తీవ్రంగా కొరత ఏర్పడుతోంది. వృద్ధులైన రోగులు, పైగా వ్యాక్సినేషన్‌ పూర్తిగా జరగనివారు ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో అత్యవసర వైద్య సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం చైనాలో కోవిడ్‌ నివారణ, నియంత్రణలు కొత్త పరిస్థితులను, కర్తవ్యాలను ఎదుర్కొంటున్నాయని జిన్‌పింగ్‌ పేర్కొన్నట్లు ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్‌ సిసిటివి తెలిపింది. దేశభక్తియుతమైన ఆరోగ్య ప్రచారాన్ని మరింతగా చేయాలని జిన్‌పింగ్‌ సూచించారు.

చైనాలో కోవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో, ఫీవర్‌ క్లినిక్‌లను చాలా చోట్ల కొత్తగా తెరుస్తున్నారు. ముఖ్యంగా చిన్న పట్టణాలు, నగరాల్లో స్థానిక వైద్య వ్యవస్థ సామర్ధ్యాన్ని పెంచేందుకుగానూ వీటిని ప్రారంభిస్తున్నారు. వాణిజ్య ప్రాంతాల్లో ఇతర బహిరంగ స్థలాల్లో కన్సల్టేషన్‌ రూమ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. జ్వరంతో బాధపడే రోగులకు మౌలిక మందులు ఇక్కడ ఇస్తారు. వాస్తవానికి, ఈ క్లినిక్‌లో చాలావాటిని న్యూక్లిక్‌ ఆసిడ్‌ టెస్టింగ్‌ బూత్‌లుగా మార్చారు పెరుగుతున్న కోవిడ్‌ రోగులకు సహాయకరంగా వుండేలా చైనా ప్రభుత్వం తీసుకుంటును చర్యల్లో ఇవి కొన్ని.

కోవిడ్‌కు తప్పనిసరి పరీక్షలను పెంచిన తర్వాత న్యూక్లిక్‌ ఆసిడ్‌ టెస్టింగ్‌ బూత్‌లను బాగా పెంచారు. దక్షిణ చైనాలోని గుయాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో రాపింగ్‌ కౌంటీలో మొత్తంగా 520 ఫీవర్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశారు. తమకు లక్షణాలు కనిపించగానే స్థానికులు ఇక్కడకు వెళ్లి చికిత్స తీసుకోవచ్చు. గ్రామీణుల భద్రత కోసం మొట్టమొదటి చర్యగా కిందిస్థాయిల్లో వైద్య సేవలను అందిస్తున్నామని షేయాంగ్‌ కౌంటీ అధికార వెబ్‌సైట్‌ పేర్కొంది.

మొదటి వేవ్‌లో ఇన్ఫెక్షన్‌ బాగా ఎక్కువగా వున్నప్పుడు ఇటువంటి చర్యల ద్వారా జ్వర బాధితులకు పటిష్టంగా వైద్య రక్షణ కల్పించడం వల్ల ప్రయోజనం కనిపించిందని పేర్కొంది. ఇటీవల కాలంలో జ్వర బాధితులు ఎక్కువ కావడంతో అనేక నగరాలు ఈ క్లినిక్‌ల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి.జీరో కోవిడ్‌ విధానాన్ని సడలించిన తర్వాత ఈ నెల్లో ఒక్కసారిగా కేసులు పెరుగుతున్నాయి.

రాబోయే కొద్ది మాసాల్లో దాదాపు 10లక్షల మంది కోవిడ్‌ కారణంగా మరణించవచ్చని అధ్యయనాలు అంచనాలు వేస్తున్నాయి. ప్రస్తుతం కేసులు పెరిగిన వేళ ఔషధాలకు తీవ్రంగా కొరత ఏర్పడుతోంది..

Must Read

spot_img