ఆ దేశంలో వేల మంది మహిళలకు వారికి తెలియకుండానే గర్భనిరోధక పరికరాలు అమర్చారు.. అక్కడి మూలవాసుల జనాభాను కట్టడి చేసేందుకు కుటుంబ నియంత్రణ విధానాల్లో భాగంగా వీరికి అపరేషన్లు చేశారు.. ఆపరేషన్ బాధితుల్లో మైనర్ బాలికలు సైతం ఉండటం ఆశ్చర్యకరమైన విషయం..
గ్రీన్ లాండ్ మూలవాసుల జనాభాను కట్టడి చేసేందుకే… డెన్మార్క్ కుటుంబ నియంత్రణ విధానాల్లో భాగంగా ఆపరేషన్లు చేయించిందా..? వేల మంది మహిళలకు తెలియకుండా ఆపరేషన్లు ఎలా చేయగలిగారు..?
గ్రీన్‌లాండ్ లో వేల మంది మహిళలకు వారికి తెలియకుండానే గర్భనిరోధక పరికరాలను అమర్చారు. గ్రీన్‌లాండ్ మూలవాసుల జనాభాను కట్టడిచేసేందుకు 1960, 70లలో డెన్మార్క్తీ సుకొచ్చిన కుటుంబ నియంత్రణ విధానాల్లో భాగంగా వీరికి ఆపరేషన్లు చేశారు.
ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ బాధిత మహిళల్లో 12 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు.
‘‘కాయిల్ క్యాంపెయిన్’’గా పిలుస్తున్న ఈ ఆపరేషన్ విధానంపై స్వతంత్ర దర్యాప్తు చేపడుతున్నట్లు డెన్మార్క్ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల కూడా ఇలా తమకు తెలియకుండానే ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను చేశారనిచెబుతున్నారు బాధిత మహిళలు.
బేబియానేకు 21 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తన గర్భాశయంలో ‘‘గర్భనిరోధక కాయిల్’’ను ఏర్పాటు చేసుకోవాలని హాస్పిటల్‌కు వెళ్లారు. అయితే, తన గర్భాశయంలో ఇప్పటికే ఒక కాయిల్అ మర్చిన విషయాన్ని అప్పుడే ఆమె తెలుసుకున్నారు. ఆ రోజు నా కళ్ల నుంచి నీరు కారాయి. అసలు నా గర్భాశయంలోకి ఆ కాయిల్ ఎలా వచ్చిందో నాకు తెలియదు. అసలు ఇది ఎలా సాధ్యం’’అని ఆమె శోకసంధ్రంలో మునిగారు.. 2000 మొదట్లో తనకు 16 ఏళ్ల వయసున్నప్పుడు అబార్షన్ చేయించుకునేందుకు ఆమె ఆసుపత్రికి వెళ్లారు. బహుశా అప్పుడే తన కడుపులో ఆ కాయిల్ పెట్టి ఉండొచ్చని ఆమె
భావిస్తున్నారు.
ఆ తర్వాత నాలుగేళ్లలో తనకు విపరీతమైన కడపు నొప్పి వచ్చింది. ఒక్కోసారి ఈ కడుపు నొప్పి వల్ల ఆమె మెట్లు కూడా ఎక్కలేకపోయేవారు.
ఆమె చాలాసార్లు ఆసుపత్రికి వెళ్లినప్పటికీ… అసలు ఏం జరుగుతోందో అక్కడి వైద్యులు చెప్పేవారు కాదు. ఒక సమయంలో ఆమె గర్భం దాల్చేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ, ఏడాది గడిచినా ఆమెకు గర్భం రాలేదు. పిల్లలు పుట్టే అవకాశం పెరగాలంటే కొంత కాలంపాటు కడుపులో కాయిల్ అమర్చుకోవాలని ఆమెకు స్నేహితులు సూచించారు. దీంతో ఆమె పిల్లలు కోసం చేసే ప్రయత్నాలకు కాస్త విరామం ఇవ్వాలని భావించారు. అయితే, కాయిల్ అమర్చుకునేందుకు ఆసుపత్రికి వెళ్లినప్పుడే ఆమెకు అసలు విషయం తెలిసింది. వెంటనే కడుపులోని ఆ కాయిల్‌ను ఆపరేషన్‌తో ఆమె తీయించేశారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె గర్భం దాల్చింది..
28 ఏళ్ల సారా అనే మహిళకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆపరేషన్ తర్వాత కళ్లు తెరచి చూసినప్పుడు షాక్‌కు గురయ్యే విషయం ఆమెకు తెలిసింది.
2014లో గర్భస్రావం తర్వాత ఆమెకు మత్తుమందు ఇచ్చారు. అప్పుడే ఆమెకు గర్భ నిరోధక సాధనాల్లో ఒకటైన డెపో ప్రొవెరాను ఒక డెన్మార్క్ నర్సు ఆమెకు సూదిమందు రూపంలో ఇచ్చారు ‘అదేమిటో అసలు నాకు తెలియలేదు. నీకు దాన్ని ఎక్కస్తున్నామని నర్సు కనీసం నన్ను అడగలేదు’’అని బాధితురాలు వాపోయింది.. ఆ తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి దీన్ని ఎక్కించుకోవడానికి ఆసుపత్రికి రావాలని నర్సు ఆమెకు సూచించారు.
కనీసం ఆ ఔషధం పేరేమిటో కూడా తనకు వెల్లడించలేదు.. ఒకసారి రసీదులో ఆ ఔషధం పేరును చూసి ఆమె ఆన్‌లైన్‌లో వెతికారు. అప్పుడే దాని గురించి ఆమెకు తెలిసింది.. అయితే, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలపాటు ఆ ఔషధాన్ని ఆమె తీసుకున్నారు. ఆ తర్వాత పిల్లలను కనాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. కానీ, గర్భం రావడానికి ఆమె ఏళ్ల సమయం పట్టింది.
‘‘డెపో ప్రొవేరాతో దాదాపు 12 నెలల వరకు రుతుచక్రం ప్రభావితం అవుతుందని నర్సు లేదా వైద్యులు ఆ మహిళకు చెప్పలేదు..
సెప్టెంబరులో ఇలాంటి కేసులపై విచారణ చేపట్టాలని డెన్మార్క్, గ్రీన్‌లాండ్అం గీకరించాయి..!
991 వరకు గ్రీన్‌లాండ్ ఆరోగ్య విభాగం డెన్మార్క్ నియంత్రణలో ఉండేది. ఆ సమయంలో ఏం జరిగింది అనే అంశంపై ఆ దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు. ఈ అంశంపై గ్రీన్‌లాండ్ ఆరోగ్య మంత్రి మీమీ కార్ల్‌సెన్‌తో స్పందించారు.. ఇలా గర్భ నిరోధక సాధనాలు అమర్చిన తాజా కేసుల గురించి
తనకు తెలియదని వెల్లడించారు..
ఎవరైనా వైద్యులు వ్యక్తిగతంగా ఇలాంటి ఆపరేషన్లు చేస్తున్నారేమో.. అవి అనైతికం. వీటిని కట్టడి చేసేందుకు మేం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.. ఇటీవల వెలుగుచూసిన అంశాలను జాతీయ ఆరోగ్య బోర్డు, చీఫ్ మెడికల్ ఆఫీసర్‌లకు పంపిస్తానని తెలిపారు. ఇలాంటి కేసులు మొత్తం ఎన్ని ఉన్నాయో దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు ఇస్తామన్నారు.
‘‘లిప్పీస్ లూప్’’గా పిలిచే ఐయూడీని అప్పట్లో ఎక్కువగా మహిళలకు అమర్చేవారు. సాధారణంగా అప్పటికే పిల్లలు పుట్టిన మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో భాగంగా ఆ సాధనాన్ని అమర్చేవారు. కానీ, గ్రీన్‌లాండ్‌లో 12 ఏళ్ల బాలికలకు కూడా దాన్ని అమర్చారు.
‘‘ఒక చిన్న గర్భద్వారంలో ఆ సాధనాన్ని అమర్చినప్పుడు వచ్చే నొప్పి ఎంత ఉంటుందో అసలు చెప్పలేమన్నది గైనకాలజిస్టుల మాట… లిప్పీస్ లూప్’’ను బాలికలకు అమర్చేటప్పుడు చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. విపరీతమైన బ్లీడింగ్, ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన నొప్పి, పిల్లలు పుట్టకపోవడం లాంటి సమస్యలు
ఎదురవుతాయి.
1990 మధ్యలో పిల్లలు పుట్టడంలేదని తమ దగ్గరకు వచ్చిన మహిళల్లో తాము లిప్పీస్ లూప్ అమర్చినట్లు పలువురు గైనకాలజిస్టులు గుర్తించారు. ‘‘అలాంటివి గర్భాశయంలో ఉన్నట్లు వారికి తెలియదు. పది నుంచి 15 ఏళ్లపాటు పిల్లల కోసం ప్రయత్నించిన తర్వాత ఆస్పత్రికి వెళ్లేవారు..
ఈ ఏడాది మొదట్లో ఈ గర్భనిరోధక సాధనాల కేసులపై ఒక డెన్మార్క్ వార్తా సంస్థ పాడ్‌కాస్ట్‌ను విడుదల చేసింది. అప్పుడే 1991 ముందునాటి పరిణామాలపై దర్యాప్తు చేపట్టాలని డెన్మార్క్ని ర్ణయించింది. కాయిల్ క్యాంపెయిన్ పేరుతో ఆ పాడ్‌కాస్ట్‌ను ప్రచురించారు. 1966 నుంచి 1970ల మధ్య దాదాపు 4,500 మంది గ్రీన్‌లాండ్ మహిళలకు లిప్పీస్ లూప్ సాధనాలన అమర్చినట్లు దానిలో చెప్పారు. ఆ సమయంలో గ్రీన్‌లాండ్‌లో గర్భం దాల్చే వయసులో ఉన్న మొత్తం మహిళల సంఖ్య 9,000 మాత్రమే.
గ్రీన్‌లాండ్‌లో జనాభా నియంత్రణకు కళ్లెం వేయాలని, ఆరోగ్య సేవలను ఆధునికీకరించాలని 1950ల నుంచి డెన్మార్క్ ప్రణాళికలు రచించేది. టీనేజీలోని అమ్మాయిలు ఎక్కువగా గర్భం దాల్చడంపై డెన్మార్క్ అధికారులు అప్రమత్తంగా ఉండేవారు.
1970ల్లో జనాభా నియంత్రణకు తాము అనుసరిస్తున్న వ్యూహాలు ఫలించాయని డెన్మార్క్ అధికారులు చెప్పేవారు. మరోవైపు సంతానోత్పత్తి రేటు కూడా ఒక్కసారిగా పడిపోయింది. ఆ క్యాంపెయిన్ మొదలయిన ఎనిమిదేళ్ల తర్వాత అంటే 1974లో సంతానోత్పత్తి రేటు 7 నుంచి 2.3 కి పడిపోయింది. అసలు ఆ ప్రచారాన్ని ఎప్పుడు నిలిపివేశారో తన దగ్గర రికార్డులేమీ తమ దగ్గర లేవని డెన్మార్క్ తాత్కాలిక ఆరోగ్య మంత్రి మాగ్నస్హ్యూ నిక్ ఇటీవల వెల్లడించారు..
గ్రీన్‌లాండ్ లో వేల మంది మహిళలకు వారికి తెలియకుండానే గర్భనిరోధక పరికరాలను అమర్చారు. గ్రీన్‌లాండ్ మూలవాసుల జనాభాను కట్టడిచేసేందుకు 1960, 70లలో డెన్మార్క్ తీసుకొచ్చిన కుటుంబ నియంత్రణ విధానాల్లో భాగంగా వీరికి ఆపరేషన్లు చేశారు. మరి.. బాధిత మహిళలకు ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుందో చూడాలి..