HomePoliticsతెలంగాణతో , బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు..

తెలంగాణతో , బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు..

  • తెలంగాణతో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందా..?
  • దీనివల్లే ఠాగూర్ రాజీనామా చేశారా..?
  • అసలు ఈ చర్చకు కారణమేంటి..? టీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ ఇక తన వల్ల కాదని చెప్పేశారు. సీనియర్ నేతల రాజకీయాలను తాను తట్టుకోలేనని హైకమాండ్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన పదవి నుంచి వైదొలిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చినప్పటి నుండి ఠాగూర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీనియర్లు ఆయనపై చాలా నిందలేశారు. డబ్బులు తీసుకుని పదవి వచ్చేలా చేశారన్నారు.

అయితే మాణిగం ఠాగూర్ మాత్రం పార్టీ అంతర్గత విషయాలపై ఎప్పుడూ బయట మాట్లాడలేదు. కానీ ఇటీవల కొంత మంది సీనియర్లు.. తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం కన్నా, భారత రాష్ట్ర సమితితో కలిసి ఎన్నికలకు వెళ్లడం మంచిదన్న అభిప్రాయాన్ని మాణిగం ఠాగూర్ వద్ద వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే బీఆర్ఎస్‌తో వెళ్లడం అంటే.. కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకున్నట్లేనని ,అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోవద్దని ఠాగూర్ తో పాటు రేవంత్ రెడ్డి కూడా సీనియర్లకు తెగేసి చెప్పినట్లుగా చెబుతున్నారు. సీనియర్లు ఇతర పార్టీలతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ హైకమాండ్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయి.

అయితే వారిపై ముందుగానే చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అందుకే దిగ్విజయ్ సింగ్ ను పంపి.. సీనియర్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే తాము టీ పీసీసీ నిర్వహించే కార్యక్రమాలను వెళ్లమని సీనియర్లు చెబుతున్నారు. పరిస్థితి ఏదైనా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలకు కొదవే ఉండదు.

ఒకరికి పదవి వచ్చినా గొడవే.. రాకపోయినా గొడవే. ఒకరితో పొత్తు పెట్టుకున్నా లొల్లే.. పొత్తు వద్దని చెప్పినా లొల్లే.

సీనియర్లకు కాస్త చోటు ఇచ్చినా తగాదా.. జూనియర్లను కాదన్నా తగాదే.. అలా ఉంటది కాంగ్రెస్ తోటి. చాలాకాలంగా తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుల లొల్లి ఒకటి నడుస్తున్న సంగతి తెలిసిందే. పార్టీలో సుదీర్ఘకాలంగా ఉంటూ వస్తోన్న పాతకాపులకు పార్టీ పగ్గాలను అప్పగించాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. కొద్దిరోజుల కిందటే దిగ్విజయ్ సింగ్ తెలంగాణ వచ్చి ఇది సరిచేయాలని చూశారు. సీనియర్లకు మద్దతుగా ఉండే ఆయన మాట ఇక్కడ చెల్లలేదు.

  • తెలంగాణ పరిస్థితి హైకమాండ్ దృష్టికీ..!

దీంతో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా తనవంతు ప్రయత్నం చేశారు. తెలంగాణ పరిస్థితిని హైకమాండ్ దృష్టికీ తీసుకెళ్లారు. కానీ, అది కూడా వర్క్ అవుట్ కాలేదు. ఇక్కడ గొడవ అంతా సీనియర్లు, రేవంత్ రెడ్డి వర్గీయుల మధ్యనే అనేది అందరికీ తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ కు నచ్చజెప్పాలని చూసిన మాణిక్యం ఠాకూర్ ఏకంగా తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్‌ తప్పుకున్నారు.

ఆ స్థానంలో మాణిక్‌ రావు ను అధిష్ఠానం నియమించింది. అయితే.. మాణిక్యం ఠాకూర్ ఇంచార్జ్ బాధ్యతల నుండి తప్పుకోవడం వెనక పెద్ద కారణమే ఉందని కూడా ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలలో చర్చ జరుగుతుంది. అసలే పాతాళానికి పడిపోతున్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఓ కొత్త లొల్లి మొదలైనట్లు రాజకీయ వర్గాలలో ఓ చర్చ నడుస్తుంది. సీనియర్ లీడర్లలో కొందరు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

పొత్తులో భాగంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు ఇచ్చేలా చర్చలు జరపాలని పీసీసీపై ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తున్నారట. అయితే.. ఈ ప్రతిపాదనను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌ తో పొత్తు ప్రసక్తే ఉండదని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వివాదం కారణంగానే మాణిక్యం ఠాకూర్ కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పొత్తులపై మళ్లీ చర్చ జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ తరుణంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు వ్యవహారంపై అద్దంకి కీలక విషయాలు బయటపెట్టారు. తెలంగాణ కాంగ్రెస్‌లోని కొంతమంది సీనియర్లు తొమ్మిది నెలల క్రితం బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ప్రతిపాదనను ఏఐసీసీ ముందు పెట్టారని తెలిపారు.

బీఆర్ఎస్‌తో పొత్తుపై ఏఐసీసీ తమ అభిప్రాయాలను అప్పట్లో కోరిందని, అప్పట్లో తాము వద్దని చెప్పినట్లు అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు గురించి పార్టీలో చర్చ జరిగిన మాట వాస్తవమేనని, తనకు పూర్తి సమాచారం ఉందని ఆయన అన్నారు. టీఆర్ఎస్‌తో కొట్లాడుతున్నప్పుడు పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి సరెండర్ అయినట్లు ఉంటుందని అద్దంకి దయాకర్ అభిప్రాయపడ్డారు. గతంలో కేసీఆర్ బీహార్ వెళ్లి నితీష్ కుమార్‌ని కలిశారని, ఆ తర్వాత రెండు రోజులకే నితీష్ కుమార్ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి కేసీఆర్‌ను కాంగ్రెస్‌లో కలుపుకోవాలని కోరినట్లు అద్దంకి దయాకర్ చెప్పారు.

కానీ రాహుల్ గాంధీ ఆ ప్రతిపాదనను పట్టించుకోలేదని, లైట్‌గా తీసుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఇప్పటికీ కాంగ్రెస్‌తో పొత్తుకు ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.

  • ఏఐసీసీ దగ్గర బీఆర్ఎస్ పొత్తు ఇది కోవర్జిజం కిందకు రాదా..?

కాంగ్రెస్‌లోని కొంతమంది సీనియర్లు ఏఐసీసీ దగ్గర బీఆర్ఎస్ పొత్తు గురించి ప్రపోజల్స్ ఇప్పటికీ పెడుతున్నారని, ఇది కోవర్జిజం కిందకు రాదా? అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారని, కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ పొత్తుకు రావాలని గతంలో కాంగ్రెస్ జాతీయ నేతలు కొంతమంది చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తుపై ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తుండగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వాటిని ఖండిస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ వరంగల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కూడా బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. ఎవరైనా నేతలు బీఆర్ఎస్‌తో పొత్తు గురించి మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కూడా రాహుల్ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత పొత్తు వార్తలకు చెక్ పడగా.. ఇటీవల మాణిక్యం ఠాగూర్ ఇచ్చిన రిపోర్టుతో మరోసారి చర్చ మొదలైంది.

బీఆర్ఎస్ నేతలు మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతుండగా.. బీఆర్ఎస్-కాంగ్రెస్ ఒక్కటేనని బీజేపీ ప్రచారం చేస్తోంది. రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదని చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంచార్జ్ మాణిక్‌రావు థాకరే రంగంలోకి దిగుతున్నారు. రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించి తెలంగాణ కాంగ్రెస్ నేతలందరితో పరిచయాలు పెంచుకోవాలనుకుంటున్నారు. మాణిక్‌రావు థాకరే మహారాష్ట్రకు చెందిన నేత.

గతంలో ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జ్‌గా ఏఐసీసీ అధిష్టానం మాణిక్‌రావు థాకరేను నియమించింది. ఇప్పుడు మహారాష్ట్ర నేత మాణిక్ రావు.. ఆయన ఇతర నేతల్లా సాఫ్ట్ కాదని.. చాలా హార్డ్ గా డీల్ చేస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

దీంతో సీనియర్ నేతలు ఆయనతో ఎలా ఉంటారన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇంచార్జ్ ను మార్పించడంలో సక్సెస్ అయ్యామనుకుంటున్న తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతలు.. ఎలాగైనా పీసీసీ చీఫ్ ను కూడా మార్పించాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని కోసం వారు హైకమాండ్ పై మరింత ఒత్తిడి వ్యూహం అమలు చేయనున్నట్లుగా చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే క్రమంలో గ్రూపులన్నింటినీ ఏకం చేసేందుకు మాణిక్ రావు ధాకరే ప్రయత్నించనున్నారు. సాఫ్ట్ గా డీల్ చేస్తే ఇప్పటి వరకూ అన్నీ ఎదురు దెబ్బలే తగిలాయి కాబట్టి ఈ సారి ధాకరే రూటు మారుస్తారని అంటున్నారు.

మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్ వ్యవహారశైలితోనే కాంగ్రెస్ లో గ్రూపులు పెరుగుతాయా.. తగ్గుతాయా అన్నది తేలే అవకాశం ఉందంటున్నారు. అయితే, బీజేపీ బద్ధవ్యతిరేకిగా పేరున్న మాణిక్‌ రావు థాకరే ఇప్పుడు తెలంగాణ ఇంచార్జిగా వచ్చారు.

మరి ఈయన ఎంతవరకు ఈ సమస్యకు చెక్ పెడతారో.. వేచి చూడాల్సిందే.

Must Read

spot_img