- ప్రపంచంలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆ వైరస్ బారినపడి తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు..
- ఈ వైరస్ సోకిన వ్యక్తులు కొన్ని రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉండటంతో డబ్ల్యూహెచ్ వో ఆందోళన వ్యక్తం చేసింది..
- ప్రపంచాన్ని కలవరపెడుతోన్న ఆ వైరస్ తో ప్రమాదం పొంచి ఉందా…?
- ఈక్వటోరియల్ గినియాలో మార్‌బర్గ్ వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది.
- అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఈ వైరస్ కు ఉండటం ఆందోళనను రెట్టింపు చేస్తోంది..
- ఇంతకూ ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడం సాధ్యం కాదా..? డబ్ల్యూహెచ్ వో ఆందోళనకు కారణం ఏంటి..?
సుమారు రెండున్నర సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్నీ వణికించిన ప్రాణాంతక కరోనా వైరస్ కు పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది చైనా. హ్యూబే ప్రావిన్స్‌లోని వుహాన్ సిటీలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి బారిన పడని దేశమంటూ లేదు. అన్ని దేశాల్లోనూ అడుగు పెట్టింది. లక్షలాది మంది ప్రజల ప్రాణాలను తీసింది. కోవిడ్ బారిన తీవ్రంగా పడిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంటోంది. 10 కోట్ల వరకు పాజిటివ్ కేసులు ఇక్కడ నమోదయ్యాయి. 11 లక్షల మందికి పైగా దీని బారిన పడి మరణించారు.
కోవిడ్ మరణాల్లో రెండో స్థానంలో భారత్ నిలిచింది. నాలుగున్నర కోట్లకు పైగా పాజిటివ్ కేసులు భారత్ లో నమోదయ్యాయి. 5లక్షల 30 వేల మంది మృతిచెందారు. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి భారత్ సహా కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన తరువాత దీని తీవ్రత తగ్గింది.
పూర్తిగా నిర్మూలించకపోయినప్పటికీ- అన్ని దేశాల్లోనూ ఈ మహమ్మారి విస్తరించే వేగం అదుపులోకి వచ్చింది. మాస్కులను ధరించాల్సిన అవసరం లేనంతగా దీని తీవ్రత తగ్గిపోయింది.
తాజాగా మరో వైరస్ వ్యాప్తి చెందడం మొదలు పెట్టింది. ఇప్పటికే తొమ్మిది మంది దీని బారిన పడి మరణించారు కూడా. దీన్ని మార్‌బర్గ్ వైరస్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఆఫ్రికన్ దేశం ఈక్వెటోరియల్ గినియాలో దీన్ని గుర్తించింది డబ్ల్యూహెచ్ఓ. దీని బారిన పడి ఇప్పటికే తొమ్మిది మందిమరణించారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఈ వైరస్ కు ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఈక్వెటోరియల్ గినియా సరిహద్దు దేశాలను డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తం చేసింది.
కామెరూన్- గబన్ సరిహద్దులో ఉన్న కీ-ఎన్‌టెమ్ ప్రావిన్స్‌లో అంత్యక్రియలకు వెళ్లిన వ్యక్తుల్లో తొలిసారిగా మార్బర్గ్ వైరస్ లక్షణాలు కనిపించాయి. వైరస్ లక్షణాలు కనిపించిన అతి కొద్దిరోజుల్లోనే తొమ్మిది మందిని పొట్టనబెట్టుకుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే తీవ్రమైన జ్వరం సోకుతుంది. దీని తీవ్రతకు రక్తనాళాలు చిట్లిపోతాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వైరస్ లక్షణాలు ఇదివరకు ఆఫ్రికన్ దేశాలను వణికించిన ఎబోలాను పోలి ఉంటాయని పేర్కొంది.
జర్మనీలోని మార్ బర్గ్, ఫ్రాంక్ ఫర్ట్, సెర్బియా రాజధాని బెల్ గ్రేడ్ లో 1967లో మొదటిసారిగా ఈ వైరస్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. అందుకే దీనికి మార్ బర్గ్ అనే పేరు పెట్టారు. మార్ బర్గ్- ఎబోలా వైరస్ రెండూ కూడా ఫిలోవైరస్ జాతికి చెందినవి. 88 శాతం ఇది ప్రాణాంతకంగా నిర్ధారించింది డబ్ల్యూహెచ్ఓ. సకాలంలో వైరస్ ను గుర్తించిన వెంటనే చికిత్స అందించడం వల్ల మరణాల రేటును తగ్గించవచ్చని తెలిపింది.
- కరోనా వైరస్ తరహాలోనే ఇది కూడా గబ్బిలాల నుంచే ఆవిర్భవిస్తుంది..
వేగంగా విస్తరించే లక్షణాలు దీనికి ఉన్నాయి. రక్తస్రావం, హైఫీవర్, అతిసారం, వాంతులు, విరేచనాలు, తీవ్రమైన తలనొప్పిని కలిగించడం ఈ వైరస్ లక్షణం. ఆఫ్రికాలోని అంగోలా, డెమొక్రటిక్ రిపబ్లిక్ కాంగో, గినియా, కెన్యా, దక్షిణాఫ్రికా, ఉగాండాలో గతంలో ఈ వ్యాప్తి చెందింది. అప్పట్లోనూ మరణాలు
నమోదయ్యాయి. ఘనాలో గత ఏడాది మార్ బర్గ్ వైరస్ మరణాలు వెలుగులోకి వచ్చాయి.
ఈక్వటోరియల్ గినియాలో మార్‌బర్గ్ వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. ఈ వైరస్ వ్యాప్తితో కనీసం తొమ్మిది మంది మరణిచారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వైరస్ హెమరేజిక్ జ్వరాన్ని కలిగిస్తుందని.. ‘‘ఎబోలా’’ వ్యాధిని పోలి ఉంటుందని పేర్కొంది. తొమ్మిది మంది వ్యక్తుల నమూనాలు మార్‌బర్గ్ వైరస్‌కు పాజిటివ్‌గా నిర్దారణ అయిన తర్వాత ఈక్వటోరియల్ గినియా తన మొట్టమొదటి వ్యాప్తిని ధృవీకరించిందని డబ్ల్యూహెచ్‌వో ఒక ప్రకటనలో తెలిపింది.
వైరస్ లక్షణాలను చూపించే వ్యక్తులను కాంటాక్ట్‌లను గుర్తించడానికి.. ఐసోలేట్ చేయడానికి, వైద్య సంరక్షణ అందించడానికి ముందస్తు బృందాలను ప్రభావిత జిల్లాల్లో మోహరించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి ఎపిడెమియాలజీ, కేస్ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫెక్షన్ నివారణ, ల్యాబ్, రిస్క్ కమ్యూనికేషన్‌లో ఆరోగ్య అత్యవసర నిపుణులను అక్కడికి పంపేందుకు డబ్ల్యూహెచ్‌వో ప్రయత్నాలు చేస్తోంది. నమూనాల పరీక్ష కోసం ల్యాబొరేటరీ గ్లోవ్ టెంట్‌లను రవాణా చేయడంతోపాటు 500 మంది ఆరోగ్య కార్యకర్తలు ఉపయోగించగల వ్యక్తిగత రక్షణ పరికరాలను కలిగి ఉన్న ఒక వైరల్ హెమరేజిక్ ఫీవర్ కిట్‌ను కూడా పంపేందుకు సిద్దమైంది.
మార్‌బర్గ్ తీవ్రమైన అంటువ్యాధి. ఈ వ్యాధిని నిర్ధారించడంలో ఈక్వటోరియల్ గినియా అధికారుల వేగవంతమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారని తెలిపారు డబ్ల్యూహెచ్‌వో ఆఫ్రికా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ మట్షిడిసో. అత్యవసర ప్రతిస్పందన త్వరగా చేపట్టడం ద్వారా మేము ప్రాణాలను కాపాడుతామని వెల్లడించారు. ఇక, డబ్ల్యూహెచ్‌వో ప్రకారం.. మార్‌బర్గ్ వైరస్ వ్యాధి 88 శాతం వరకు మరణాల నిష్పత్తితో అత్యంత తీవ్రమైన వ్యాధి. ఇది ఎబోలా వైరస్ వ్యాధికి కారణమయ్యే వైరస్ ఉన్న కుటుంబంలోనే ఉంది. మార్‌బర్గ్ వైరస్ వల్ల ఆకస్మాత్తుగా అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, తీవ్రమైన అనారోగ్యం
ప్రారంభమవుతుంది. చాలా మంది రోగులలో ఏడు రోజులలో తీవ్రమైన రక్తస్రావ లక్షణాలు కనిపించేందుకు అవకాశం ఉంటుంది.
- వైరస్ ఫ్రూట్ గబ్బిలాల నుంచి ప్రజలకు వ్యాపిస్తుంది..
ఈ వైరస్ సోకిన వ్యక్తుల శరీర ద్రవాలు, ఉపరితలాలు, పదార్థాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా మానవుల మధ్య వ్యాపిస్తుంది. ఇప్పటి వరకు ఈ వైరస్ చికిత్సకు టీకాలు లేదా చికిత్సలు కనుగొనబడలేదు. అయితే ఈ వైరస్‌ను ఎదుర్కొనేలా సహాయక సంరక్షణ ఉంది. కొత్త వైరస్ ఉనికిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.. “మార్‌బర్గ్” పేరుతో ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ఘనాలో వేగంగా ఈ వైరస్ వ్యాప్తిస్తుంది.
వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో లాక్డౌన్‌ను అమలు చేస్తుంది. పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనాలో ఈ కొత్త వైరస్‌ను గుర్తించారు. దీనికి మార్‌బర్గ్‌గా పేరు పెట్టారు. అయితే, ఘనాలో ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి, ముప్పును అంచనా వేసేందుకు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. పైగా, ఈ వైరస్ ఎంతో ప్రాణాంతకమని తెలిపింది.
ఈ వైరస్ సోకిన వారిని తాకడం వల్ల, వారి రక్తంతో పాటు ఇతర శరీర ద్రవాల ద్వారా, రోగులు నిద్రించిన ప్రదేశంలో నిద్రించడం వల్ల, వారి దుస్తులను వేసుకోవడం వల్ల ఇతరులకు వ్యాపిస్తుందని హెచ్చరించింది. వైరస్ సోకిన జంతువులు, గబ్బిలాల వల్ల కూడా ఈ వైరస్ అంటుంకుంటుందని వెల్లడించింది.
గాలి ద్వారా ఈ వైరస్ వ్యాపించిందని తేల్చి చెప్పింది. వైరస్ బాధితులు తీవ్రమైన జ్వరం, తలనొప్పితో బాధపడుతుంటారని వైద్య నిపుణులు పేర్కొన్నారు. శరీరంలో అంతర్గతంగాను, బహిర్గతంగానూ రక్తస్రావం జరుగుతుందని.. వైరస్ లక్షణాలు ఒక్కసారిగా బయటపడతాని, చికిత్సలో జాప్యం జరిగితే మనిషి ప్రాణానికే ముప్పు అని హెచ్చరించారు..
ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచదేశాలు అతలాకుతలం అయ్యాయి.. తాజాగా “మార్‌బర్గ్” అనే కొత్త వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ వైరస్ ప్రభావ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో తెలియనుంది..