Homeసినిమామరోసారి చిరు-బాలయ్య మధ్య ఫైట్ !!!

మరోసారి చిరు-బాలయ్య మధ్య ఫైట్ !!!

మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్ లో ఈ ఇద్దరు హీరోల క్రేజ్ గురించిప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ హీరోల ఫ్యాన్స్ మధ్య జరిగే వార్.. వీరి మధ్య ఉండే పోటీ మరే హీరోల మధ్య ఉండదనే చెప్పాలి. ముఖ్యంగా ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయంటే.. ఇక ఫ్యాన్స్ కు పండగే. ఇటివల సంక్రాంతికి అలాంటి పండగనే చూశాం. సీన్ కట్ చేస్తే… మరోసారి బాలయ్య చిరంజీవి సినిమాలు పోటీ పడనున్నట్లు తెలుస్తోంది.

2023 సంక్రాంతి సమరం రసవత్తరంగా సాగింది. ఇందుకు ప్రధాన కారణం బరిలో టాలీవుడ్ అగ్ర హీరోలైన..మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ పోటీ పోటీగా సై అంటే సై అంటూ పోటీపడటమే. దాదాపు ఎనిమిదేళ్ల విరామం అనంతరం నందమూరి బాలకృష్ణ,మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి సమరానికి కాలుదువ్వారు. నందమూరి బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ మూవీతో జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ తరువాత జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మూవీతో బరిలోకి దిగారు. ఈ రెండు సినిమాలు మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లే. అయితే అందులో కాస్త చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో వినోదాన్ని జోడించడమే కాకుండా వింటేజ్ చిరుని పరిచయం చేసిన తీరు ప్రేక్షకుల్ని మరింతగా ఆకట్టుకుంది. దీంతో బాలయ్య ‘వీర సింహారెడ్డి’ని మించి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’కు ప్రేక్షకుల బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పట్టారు. కాసుల వర్షం కురిపించారు.

చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ వరల్డ్ వైడ్ గా 200 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి చిరు నటించిన సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఇదిలా వుంటే ఈ ఇద్దరు హీరోలు మళ్లీ సమరానికి సై అంటున్నట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి సీజన్ లో హోరా హోరీగా పోటీపడిన ఈ ఇద్దరు అగ్కర కథానాయకులు మరోసారి పోటా పోటీగా పోటీపడేందుకు రంగం సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సారి సమ్మర్ ని ఈ ఇద్దరు టార్గెట్ చేసినట్టుగా చెబుతున్నారు. ‘వీర సింహారెడ్డి’ అందించిన సక్సెస్ జోష్ లో వున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

108వ ప్రాజెక్ట్ గావస్తున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా నటిస్తుండగా కాజల్ అగర్వాల్… శ్రీలీల కూతురు పాత్రలో కనిపించబోతోంది. వయసు మళ్లిన పాత్రలో బాలయ్య నటిస్తున్న ఈ మూవీని మే 12న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. సరిగ్గా ఇదే రోజున మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ ని విడుదల చేయబోతున్నారట. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని తమిళ హిట్ ఫిల్మ్ ‘వేదాలం’ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా చిరుకు సోదరిగా కీర్తి సురేష్ కనిపించబోతోంది. సిస్టర్ సెంటిమెంట్ నేపత్యంలో సాగే ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ కి పెద్దగా హోప్స్ లేకపోవడంతో ఈ సమ్మర్ సమరంలో బాలయ్య విజేతగా నిలిచే అవకాశం వుందని తెలుస్తోంది.

Must Read

spot_img