మెగాస్టార్ చిరంజీవి పోయిన ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ మూవీస్‌తో పలకరించారు. చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా జనవరి 13న సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా విజయం తర్వాత మంచి ఊపు మీదున్న చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాకుండా మరో సినిమాకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
యువ హీరో నాగచైతన్య హీరోగా “రారండోయ్ వేడుక చూద్దాం”, టాలీవుడ్ కింగ్ నాగార్జున తో “సోగ్గాడే చిన్నినాయన” వంటి సూపర్ హిట్ సినిమాలు తో ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల. ఈ మధ్యనే కళ్యాణ్ కృష్ణ నాగచైతన్య,నాగార్జునలతో కలిసి బంగార్రాజు అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా కలెక్షన్ల పరంగా కొంత నిరాశపరిచిందనే చెప్పుకోవాలి.
ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ తన తదుపరి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కళ్యాణ్ కృష్ణ ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక మంచి కథని రెడీ చేసుకున్నారట. ఈ నేపథ్యంలోని చిరంజీవికి కథ చెప్పటం కోసం అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారట.
నిజానికి కళ్యాణ్ కృష్ణ ,చిరంజీవి ల కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కళ్యాణ్ కృష్ణ అన్నయ్య కురసాల కన్నబాబు పార్టీలో చేరారు. ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక మరోవైపు చిరంజీవి “భోళా శంకర్” షూటింగ్ తో బిజీగా ఉన్నారు. వీలు దొరికినప్పుడు కళ్యాణ్ కృష్ణ చిరంజీవికి ఒక కథని నెరేట్ చేయబోతున్నారు. మరి చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో వేచి చూడాలి