మెగాస్టార్ చిరంజీవి హీరోగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాధ్ కాంబినేషన్ లో ఇప్పటికే ఓసినిమా పడాలి. కానీ ఎందుకనో ఆ కలయిక కుదర్లేదు.
కుదిరింది అనుకునే సరికి ‘ఆటోజానీ’ చివరి నిమిషంలో ఆగిపోయింది. అయినా పూరి మాత్రం విడిచిపెట్టలేదు. 150 కాకపోతే 160 ఏదో ఒకరోజు అన్నయ్య తో సినిమా చేసి తీరుతానని శపదం చేశారు. ఆ దిశగా కథలు రాయడం మొదలు పెట్టారు.
గాడ్ పాధర్ నుంచి పూరీ సినిమాపై అశలు చిగురించాయి. మరి తాజాగా ఆ కాంబో సెట్ అవుతుందా? అంటే అవుననే తెలుస్తోంది. ఇటీవలే పూరి -చిరంజీవికి అదిరిపోయే లైన్ వినిపించారట. చిరు ఆ లైన్ విని చాలా ఇంప్రెస్ అయ్యారట. ఇంకెందుకు ఆలస్యం బౌండెడ్ స్ర్కిప్ట్ రెడీ చేయండని చెప్పేసారుట.
ఇది ఔటెండ్ ఔట్ ఎంటర్ టైనింగ్ అని కథని తెలుస్తోంది. పూరి మార్క్ హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుందట. చిరు అక్కడే లాక్ అయినట్లు వినిపిస్తుంది. అయితే పూర్తి కథతోనూ చిరంజీవిని మెప్పించాల్సి ఉంది.
లైన్ వినిపించి లాక్ చేసేద్దాం? అంటే కుదరదు అదే జరిగితే 150వ సినిమా దర్శకుడు పూరి నే అయ్యేవారు. ఆ కథ లైన్ నచ్చినా? అటుపై డెవలప్ మెంట్ లో చిరును 100 శాతం తృప్తి పరచలేకపోయారు.
‘ఆటోజానీ’ మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడా ఛాన్స్ ఇవ్వకూడదు. పక్కాగా చిరు ని 200 శాతం మెప్పించి..వెంటనే సినిమా మొదలు పెట్టాలి. పూరి ముందున్న అతి పెద్ద టాస్క్ ఇది. ఈసారి రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఇప్పటికే లైగర్ ప్లాప్ తో నష్టాల ఊబిలో కూరుకుపోయాడు.
హిట్ అందుకుని గెలుపు గుర్రమెక్కి తే తప్ప. దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో చిరు తో అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు. మరి అంతిమంగా ఏం జరుగుతుందో చూడాలి.
సాధారణంగా పూరి బౌండెడ్ స్ర్కీఫ్ట్ రెడీ చేయరు. కథ ఐడియా ఉంటుంది. స్ర్కీన్ ప్లే రాసుకుంటారు. అవసరమైన డైలాగులు కొన్నింటిని రాసుకుని షూట్ కి వెళ్లిపోతుంటారు. అవసరం మేర ఆన్ సెట్స్ లోనే అక్కడికక్కడ కావాల్సిన విధంగ మార్పులు.. చేర్పులు చేసి షూట్ చేసేస్తుంటారు.
కానీ ఇక్కడ మెగాస్టార్ విషయంలో అలా చేయడానికి ఛాన్స్ లేదు. అన్నింటిని పర్పెక్ట్ గా సిద్దం చేసుకుని వెళ్తే తప్ప…తొందర పడటానికి అవకాశం లేదు. పూరి కూడా తన పద్దతి మార్చుకున్నాని అన్నాడు కాబట్టి అలా పనిచేస్తాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.