Homeఅంతర్జాతీయంహిందూ జలాల్లో చైనా గూఢచారి నౌకకు ఎదురుదెబ్బ....

హిందూ జలాల్లో చైనా గూఢచారి నౌకకు ఎదురుదెబ్బ….

హిందూ జలాల్లో చైనా గూఢచారి నౌకకు ఎదురుదెబ్బ తగిలిందన్న వార్తలు .. ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎప్పుడైతే, నిఘా నౌక ఎంట్రీ
ఇచ్చిందో .. అప్పుడే భారత్ తనదైన శైలిలో వ్యూహాత్మకంగా పావులు కదిపిందన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.

భారత్ పై నిఘా పెట్టేందుకు వచ్చిన యువాన్ వాంగ్ నౌక .. సమాచార సేకరణ కన్నా.. స్వరక్షణకే ప్రయత్నించిందన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి భారత్ అనుసరించిన వ్యూహమే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి భారత్‌ సరిహద్దుల్లో చొరబడింది. ఇదివరకు లఢక్ తూర్పు ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద ఘర్షణకు పాల్పడిన చైనాకు
చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు ఇప్పుడు కూడా అలాంటి దుందుడుకు చర్యలకు తెగబడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టర్‌
సరిహద్దుల్లో భారత జవాన్లపై దాడికి తీవ్ర ప్రయత్నం చేసింది. అయితే దీనికి భారత్ ఇచ్చిన ఝలక్ తోనే ఈ కుట్రకు తెర తీసిందన్న వాదనలు
వెల్లువెత్తుతున్నాయి. కొద్దిరోజుల క్రితం హిందూ మహాసముద్రంలో భారత జలాల్లోకి ప్రవేశించింది చైనాకు చెందిన పరిశోధక నౌక యాంగ్ వాంగ్-5.

ఇప్పుడా షిప్- భారత జలాల్లో లేదని, వెనక్కి వెళ్లిపోయిందని నౌకాదళ వర్గాలు తెలిపాయి. ఈ నౌక కార్యకలాపాలను లాంగ్ రేంజ్ విజిలెన్స్ డ్రోన్లు,సముద్ర గస్తీ విమానాలు, భారత నౌకా దళ విభాగాలన్నీ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నాయి. కొద్ది రోజుల క్రితం హిందూ మహాసముద్ర రీజియన్‌లోకి చైనా గూఢచర్య నౌక యాంగ్ వాంగ్-5 ప్రవేశించిందని నావికాదళం పేర్కొంది. ఇందులో బాలిస్టిక్ క్షిపణులు, ఉపగ్రహ ట్రాకింగ్ప రికరాలు ఉన్నాయని తాము భావిస్తున్నట్లు చెప్పాయి. యువాన్ వాంగ్ 5 ఆగస్టు 16న హబన్‌తోట పోర్ట్ చేరనుంది. చైనా నౌక ఆగస్టు 16 నుంచి వారం రోజుల పాటు హంబన్‌తోట ఓడరేవులో లంగరు వేశారు. అయితే యువాన్ వాంగ్ 5 నౌక అంతర్జాతీయ షిప్పింగ్, పరిశోధన-సర్వే నౌక
అని చైనా చెబుతోంది.

అయితే, ద్వంద్వ ప్రయోజనాలను నెరవేర్చే ఈ నౌకను గూఢచారి నౌక అని కూడా పిలుస్తున్నారు.

హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా కార్యకలాపాలపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీలంకలోని ఈ ప్రాంతం తమిళనాడుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున, జాఫ్నాలో చైనా ఉనికి భారతదేశానికి ముప్పుగా పరిణమించవచ్చని అంచనా వేశారు.

యువాన్ వాంగ్ 5 నౌకను చైనా పరిశోధన, సర్వే నౌక అని పేర్కొంది. ఉపగ్రహాలు, రాకెట్లు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలను ట్రాక్
చేయడానికి చైనా ఈ తరహా నౌకలను ఉపయోగిస్తుంది. చైనా వద్ద ఇలాంటివి ఏడు నౌకలు ఉన్నాయి.

వీటికి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల నుంచి పనిచేయగల సామర్థ్యం ఉంది. ఉపగ్రహాలు, రాకెట్లు మొదలైనవాటిని ట్రాక్ చేయడానికి భూమిపై స్టేషన్లు ఉన్నట్లే, ఈ నౌకలు సముద్రంలో స్టేషన్లు అన్నమాట. యువాన్ వాంగ్ 5 నౌకపై అమెరికా కూడా సందేహాలు వ్యక్తం చేసింది. పీఎల్ఏ వ్యూహాత్మక మద్దతు దళం వీటిని నిర్వహిస్తోందని అమెరికా రక్షణ శాఖ ఒక నివేదికలో తెలిపింది.

పీఎల్ఏ వ్యూహాలు, సైబర్-ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్,సైకలాజికల్ వార్‌ఫేర్ మిషన్లను ఎస్ఎస్ఎఫ్ పర్యవేక్షిస్తుంది.

ఈ నౌకలో అత్యాధునిక ట్రాకింగ్ టెక్నాలజీని అమర్చారని, ఇది గత నెలలో చైనాకు చెందిన లాంగ్ మార్చ్ 5B రాకెట్ నిఘా మిషన్‌లో పాల్గొందని సమాచారం. అత్యాధునిక స్పైషిప్‌ను శ్రీలంక ఓడరేవులో లంగరు వేసి.. భారత మిలిటరీకి చెందిన అత్యంత రహస్యమైన కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్‌ను పసిగట్టాలని చైనా అధ్యక్షుడు షి జింగ్-పింగ్ వేసిన ఎత్తును దీటుగా చిత్తు చేసి అంతర్జాతీయంగా షి జింగ్-పింగ్‌ను మరోసారి పరాభవానికి గురిచేసి భారత్ చావుదెబ్బ తీసింది. శ్రీలంక ఓడరేవు హంబాన్ టోటలో లంగరు వేసిన చైనా గూఢచారి నౌకపై నిరంతరం నిఘా వేసి నౌకపై జరుగుతున్న ప్రతి కదలికను, చర్యను నిశితంగా గమనించడమే గాకుండా.. ఆ నౌకపై అమర్చిన కమ్యూనికేషన్ వ్యవస్థను ఆమూలాగ్రం స్టడీ చేసేలా.. భారతీయ సైనిక ఉపగ్రహాలు రుక్మిణి, యాంగ్రీ బర్డ్ లను భారత్ వినియోగించింది.

చైనా యుద్ద నౌక శ్రీలంక జలాల్లోకి ప్రవేశించిన దగ్గర్నుండీ.. భారత మిలిటరీ శాటిలైట్లు.. చైనా స్పైషిప్‌ పైనే నిరంతరం నిఘా వేశాయి. అంతరిక్షం నుండి.. ఓడ మీద జరుగుతున్న ప్రతి కదలికను డేగ కళ్ళతో నిశితంగా గమనించాయి. అక్కడితో ఆగకుండా షిప్ మీద చైనా మిలిటరీ గూఢచార విభాగం నెలకొల్పిన రిసీవర్ యాంటెన్నాలను అధికమొత్తం జంక్ డేటాతో ముంచెత్తడం ప్రారంభించాయి. దాంతో షిప్‌ పైనున్న హార్డ్‌డిస్క్‌లన్నీ క్షణాల్లో నిండిపోగా, పనికిమాలిన సమాచారాన్ని తొలగించి.. డేటా నిల్వకు డిస్క్‌లను సిద్ధం చేయడానికి మళ్ళీమళ్ళీ ఫార్మాట్ చేయాల్సి వచ్చింది.

దీంతో షిప్‌ పైనున్న చైనా మిలిటరీ ఎక్స్‌పర్ట్‌లే గాకుండా.. ఈ షిప్ నుండి ప్రసారమౌతున్న చెత్తను బ్యాకప్ చేసే మెయిన్ ల్యాండ్ చైనాలోని మిలిటరీ ప్రధాన స్థావరంలోని సర్వర్లు కూడా నిండిపోతుండడంతో.. అక్కడి సాంకేతిక నిపుణులకు కూడా దిక్కుతోచక దిగాలు పడ్డారు. ఈ విషయం షి జింగ్-పింగ్ వరకు చేరడంతో కోపోద్రిక్తుడై.. ఈ స్పై షిప్‌ను శ్రీలంకకు పంపించి.. దేశానికి దక్షిణ భాగాన.. భారత మిలిటరీ అత్యంత రహస్యంగా మొహరించిన మిలిటరీ వ్యూహాత్మక మిస్సైల్ కమ్యూనికేషన్ అండ్ కమాండ్ సెంటర్ల రహస్య సంకేతాలను సేకరిద్దామన్న ఆలోచన ఇచ్చిన పీఎల్ఏకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ టాప్ ఎక్స్‌పర్ట్‌ను ఉద్యోగంలోంచి తొలగించి ఇంటికి పంపించారు.

చైనా దుస్సాహసాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేవలం చమురు నింపుకునేందుకు శ్రీలంక ఓడరేవు హంబాన్ టోటకు యుద్ద నౌక వచ్చిందని సిలోన్ పాలకులు చెప్పారు.

చైనా గూడాచార నౌక రెండు రోజుల క్రితమే శ్రీలంక నుంచి సింగపూర్ వెళ్ళింది. ఇప్పుడు చైనీస్ స్పై షిప్‌ల కమ్యూనికేషన్ ప్రోటోకాల్‌లు, వాటి
ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీ, అనేక ఇతర ప్రామాణిక చైనా మిలిటరీ సాంకేతిక సమాచారాన్ని భారత్ మిలిటరీ శాటిలైట్ల ద్వారా భారత్ ఇప్పటికే పసిగట్టేసింది.

ఈ సమాచారంతో ముందు ముందు చైనా మిలిటరీ.. భూతలం, సముద్రజలాల్లో వినియోగించే రాడార్‌ల విద్యుదయస్కాంత వర్ణపటాన్ని కొలవడానికి,
తరంగాల ఉనికిని గుర్తించి తద్వారా అవి ఉన్న ప్రదేశాన్ని తెలుసుకోవడానికి భారత మిలిటరీ నిపుణులకు తేలికవుతుంది. చైనాకు ఇదొక అతి పెద్ద
తలనొప్పిగా పరిణమించనుంది. మరోవైపు చైనీస్ స్పై షిప్ శ్రీలంక జలాల్లోకి ప్రవేశించే ముందే.. భారతదేశం తన మిలిటరీ కమ్యూనికేషన్ వ్యవస్థ
నుండి.. హ్యాండ్ షేకింగ్ ప్రోటోకాల్స్‌తో సహా.. ఒక్క బైట్ సమాచారం కూడా ప్రసారం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

అత్యంత వ్యూహాత్మకంగా భారత్ అమలు చేసిన పద్మవ్యూహంలో చిక్కుకుని చైనా చిత్తైంది. భారత DRDO,ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన అత్యుత్తమ
సాంకేతికత కలిగిన భారత నౌకాదళానికి చెందిన రెండు ప్రపంచ స్థాయి నావికా గూఢచారి నౌకలు.. ఏదైనా అనుకోని సమస్య తలెత్తితే రంగంలోకి
దిగడానికి సిద్ధంగా ఉన్నాయి. యువాన్ వాంగ్-5 IORలోకి ప్రవేశించిందని డిసెంబర్ 6న PTI నివేదించింది. చైనా బాలిస్టిక్ క్షిపణులు, శాటిలైట్ ట్రాకింగ్ షిప్‌ల కదలికలను భారత నావికాదళం పర్యవేక్షిస్తోందని నివేదికలో పేర్కొంది. భారత్‌కు పెనుముప్పుగా పరిణమించాలని చైనా వేసిన ఎత్తుగడను చాకచక్యంగా భారత్ ఎదుర్కోవడమే గాక.. చైనానే ముప్పుతిప్పలు పెట్టిన తీరు పట్ల అంతర్జాతీయ నిఘా నిపుణులు విస్మయం వ్యక్తం చేశారు.

ఈ అనుభవంతో ఏ ఇతర దేశమైనా.. స్పై షిప్‌తో భారతదేశ మిలిటరీపై గూఢచర్యం చేయాలని తలపోసే ముందు.. భారతదేశ స్పేస్బోర్న్ ELINT సిస్టం “కౌటిల్య” గుర్తుకొస్తుంది. ఈ దెబ్బకు .. చైనా తవాంగ్ దగ్గర అలజడి సృష్టించాలని ప్రయత్నించిందన్న వాదనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

భారత శాటిలైట్ల దెబ్బకు యువాన్ వాంగ్ పలాయనం చిత్తగిస్తే, ఆ ఆక్రోశంతోనే తవాంగ్ వద్ద చొరబాట్లకు, ఉద్రిక్తతలకు చైనా దిగిందన్న వాదన
ఇప్పుడు వినిపిస్తోంది.

Must Read

spot_img