Homeఅంతర్జాతీయంపదవీ విరమణ వయస్సును పెంచడానికి చైనా కొత్త వ్యూహం..?

పదవీ విరమణ వయస్సును పెంచడానికి చైనా కొత్త వ్యూహం..?

ప్రపంచంలో అన్ని రంగాల్లో దూసుకెళుతున్న దేశాల్లో చైనా ఒకటి.. అయితే.. ఒక విషయంలో మాత్రం చైనాకు సమస్యలు తప్పడం లేదు. చైనాలో యువత జనాభా తగ్గుతుండటం.. వృద్ధాప్య జనాభా పెరుగుతుండటం ఆ దేశ ఆందోళనకు కారణమవుతోంది. ఇందుకోసం చైనా ఓ కొత్త వ్యూహం రచిస్తోంది..

  • చైనాలో ఉద్యోగుల పదవి విరమణను పెంచే యోచనలో జిన్ పింగ్ ప్రభుత్వం ఉందా..?
  • యువత సంఖ్య తగ్గుతుండటంతో గత్యంతరం లేక ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంచేందుకు సిద్దమైందా..?
  • ఇంతకూ చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి…?

ప్రపంచంలోని అత్యధిక జనాభా గల దేశాల్లో చైనా ఒకటి.. ఆ దేశంలో వేగంగా పెరుగుతున్న వృద్ధాప్య జనాభాకు అనుగుణంగా చైనా పదవీ విరమణ వయస్సును పెంచాలని యోచిస్తోంది. పదవీ విరమణ వయస్సును పెంచడానికి చైనా అనువైన మార్గాన్ని చూస్తోందని చైనీస్ అకాడమీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ సెక్యూరిటీ సైన్సెస్ ప్రెసిడెంట్ జిన్ వీగాంగ్ పేర్కొన్నారు. చైనాలో పదవీ విరమణ వయస్సు ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. పురుషులకు 60 సంవత్సరాలు, వైట్ కాలర్ మహిళలకు 55 ఏళ్లు.. ఫ్యాక్టరీలలో పనిచేసే మహిళలకు 50 సంవత్సరాలుగా కొనసాగుతోంది. అయితే దేశ జనాభా తగ్గుతుండటం
వల్ల ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి..

చైనాలో వయసు మీద పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో జిన్‌పింగ్‌ సర్కార్‌ రిటైర్మెంట్‌ వయసు పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. అయితే రిటైర్మెంట్‌కు దగ్గర పడుతున్న ఉద్యోగుల విషయానికి వస్తే.. ఉద్యోగులు ఎన్ని సంవత్సరాల పాటు కొనసాగాలో నిర్ణయించుకునే వెసలుబాటును ప్రభుత్వం ఉద్యోగికే కల్పిస్తోంది. ఎందుకంటే వారి ఆరోగ్య సమస్యలతో పాటు వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం మాత్రం ఉద్యోగికే వదిలిపెట్టారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే.. యువకులు కొన్ని సంవత్సరాలు ఎక్కువ పని చేయాల్సి రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

1980 నుండి 2015 వరకు జంటలను ఒక బిడ్డకు పరిమితం చేసిన కఠినమైన ఒక బిడ్డ విధానం ఫలితంగా చైనా జనాభా 1.4 బిలియన్లు క్షీణించింది. చైనా నేషనల్ హెల్త్ కమీషన్ అంచనా ప్రకారం.. 60ఏళ్ల వయసు దాటిన వారి సంఖ్య ప్రస్తుతం 280 మిలియన్ల నుంచి 2035 నాటికి వారి సంఖ్య 400 మిలియన్లకు చేరుతుంది.. ఈ నేపథ్యంలో పని చేసేవారి సంఖ్య తగ్గుతుండటం.. వృద్ధులు పెరగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు అధికారిక ప్రకటనలు మాత్రం వెలువడలేదు.

చైనాలో జనాభా సంఖ్య తగ్గుతూ వస్తోంది.. జనాభా తగ్గుదలకు కారణాలు అనేకం ఉన్నాయి. ఈ జనాభా పెంచేందుకు చైనా ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలను రూపొందిస్తోంది.. ఇప్పటికే ఒకే బిడ్డ విధానాన్ని సడలించింది. అలాగే పలు పన్ను రాయితీలు ప్రకటించింది. అయినా.. జనాభా పెరుగకపోవడంతో తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ‘బ్రైడ్‌ ప్రైస్‌’ను రద్దు చేసింది. త్వరగా వివాహాలు చేసుకోవడంతో పాటు ఎక్కువ మంది పిల్లలను కనే అవకాశం ఉందని భావిస్తోంది. అయితే, పెళ్లి సమయంలో అబ్బాయిలు అమ్మాయిలకు కట్నం ఇవ్వడం అక్కడి సంప్రదాయం.

వివాహ వేడుకలు ఏడాది పొడవునా జరుగుతాయి. అంతే కాకుండా పెళ్లి విషయంలో చాలా ఖర్చు అవుతుంది. దాంతో చాలా మందికి పెళ్లిళ్లు జరుగడం లేదు. ఈ క్రమంలో ఈ సంప్రదాయానికి స్వస్తి పలుకుతున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. పెళ్లి చేసుకోకపోయిన పిల్లలను కోనే అవకాశం కల్పిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  • చైనాలో వయసు మీద పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది..

చైనా ఉద్యోగుల కొరత ఏర్పడటానికి ప్రధానం కారణం జనాభా తగ్గుతుండటం.. దీంతో జనాభా సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు.. చైనా ప్రభుత్వం సరికొత్త పథకాలు, ప్రోత్సాహకాలు, రాయితీలు, బహుమతులు ప్రకటిస్తోంది. పెళ్లి చేసుకోండి.. ఎంతమంది అంటే అంతమంది పిల్లల్ని కనండి అంటూ ఎంకరేజ్ చేస్తోంది చైనా సర్కార్. ఈ ప్రోత్సాహకం వెనుక అసలు కారణం.. దేశంలో వేగంగా పెరుగుతున్న వృద్ధుల జనాభే. చైనా బేబీ బోనస్‌లు, ఎక్కువ వేతనంతో కూడిన సెలవులు, పన్ను తగ్గింపులు, పిల్లల పెంపకం రాయితీలను ప్రోత్సాహకాలుగా అందిస్తోంది.

చైనా అధికారులు వివిధ సంస్థల ద్వారా ముగ్గురు పిల్లలను కలిగి ఉండేలా ప్రోత్సహిస్తున్నారు. బీజింగ్ డబినాంగ్ టెక్నాలజీ గ్రూప్ తన ఉద్యోగులకు 90,000 యువాన్ల వరకు నగదు ప్రోత్సాహకం, 12 నెలల ప్రసూతి సెలవులు, 9 రోజుల ప్రత్యేక సెలవులను అందిస్తోంది. ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీలు కూడా అనేక ఆఫర్లను ప్రకటించాయి.’’గర్భిణీ స్త్రీలు, పిండంలోని బిడ్డలు సురక్షితంగా ఉండేందుకు ప్రత్యేక సబ్సిడీలు..గర్భిణీ స్త్రీలు,పిండంలోని బిడ్డలు సురక్షితంగా ఉండేందుకు కంపెనీ నిర్వాహకులకు సబ్సిడీ ఇస్తోంది..

చైనాలో వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతోంది. ఓ వైపు యువత సంఖ్య తగ్గిపోతుండటం.. వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమే.. వృద్ధ జనాభా పెరగడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపడమే అవుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.. ఇది దేశం యొక్క ఆర్థిక పురోగతిని కూడా నిరోధిస్తుంది. ఒక దేశం వృద్ధి చెందాలంటే.. పనిచేసే మానవ వనరులు చాలా కీలకం. ఇలాంటి సమయంలో యువత కంటే, వృద్ధుల సంఖ్య పెరగడం అంటే ఆ దేశం ఆర్థికంగా నష్టపోవడం ఖాయం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ప్రభుత్వం నుంచి పింఛన్లు, ఆరోగ్య సదుపాయాలు వంటి అన్ని అలవెన్సులు తీసుకుంటున్న వృద్ధుల జనాభా పెరుగడం వల్ల ప్రభుత్వంపై భారమే పడుతుంది తప్ప.. ప్రయోజనం శూన్యం అవుతుంది. సరళంగా చెప్పాలంటే, చైనా జనాభా వృద్ధాప్యం అవుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థ లేదా దేశ అభివృద్ధికి పని చేయదు. అందుకే యువత పెళ్లి చేసుకోవాలని, ఎక్కువ పిల్లలను కనాలని చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. జనాభా తగ్గుదల దేశంపై తీవ్ర ప్రభావంచూపిస్తోంది.. దీంతో. వేగంగా పెరుగుతున్న వృద్ధాప్య జనాభాకు అనుగుణంగా చైనా పదవీ విరమణ వయస్సును పెంచాలని యోచిస్తోంది.

చైనాలో వయసు మీద పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో జిన్‌పింగ్‌ సర్కార్‌ రిటైర్మెంట్‌ వయసు పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. రిటైర్మెంట్ విషయంలో ఉద్యోగులకే స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. పదవీ విరమణ వయస్సును పెంచడానికి చైనా అనువైన మార్గాన్ని చూస్తోంది.

Must Read

spot_img