అమెరికా, కెనడా ఎయిర్ బేస్ లలో అనుమానాస్పద బెలూన్ లు చక్కర్లుకొడుతున్నాయి.. ఈ బెలూన్ లను వరుసగా పేల్చేస్తోంది అమెరికా.. అంతేకాదు.. ఇవి చైనా కు చెందిన నిఘా బెలూన్ లని.. తేల్చి చెబుతోంది.. తాజాగా అమెరికా ఆరోపణలపై డ్రాగన్ కంట్రీ కౌంటర్ ఇచ్చింది. అమెరికా మరో ఎగిరే వస్తువును కూల్చేసింది. యూఎస్ పరిధిలో గగనతల నిబంధనలను ఉల్లంఘించడంతో నాలుగో వస్తువును షూట్ చేసి పేల్చేసింది. ఈ నిఘా బెలూన్ లు చైనా వని చెబుతోంది అమెరికా.. అమెరికా ఆరోపణలను ఖండిస్తోంది డ్రాగన్ కంట్రీ.. చైనా, అమెరికాల మధ్య నిఘా బెలూన్లు మరోసారి చిచ్చురేపాయా..?
అమెరికా, కెనడా ఎయిర్ బేస్‌లో అనుమానాస్పద వస్తువులు చక్కర్లు కొడుతున్నాయి. వరుసగా వాటిని పేల్చేస్తోంది అగ్రరాజ్యం. ఇది కచ్చితంగా చైనా పనే అని తేల్చి చెబుతోంది. నిఘా పెట్టేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని మండి పడుతోంది. ఈ ఆరోపణలపై స్పందించిన డ్రాగన్.. కౌంటర్ ఇచ్చింది. అమెరికా తమ ఎయిర్‌బేస్‌లోకి స్పై బెలూన్‌లు పంపుతోందని ఆరోపించింది. జనవరి నుంచి ఇప్పటి వరకూ 10 బెలూన్స్‌ను గుర్తించామని వెల్లడించింది. అమెరికా అక్రమంగా తమ ఎయిర్‌బేస్‌లోకి బెలూన్‌లు పంపుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది నుంచే ఈ నిఘా మొదలైందని…ఇప్పటి వరకూ 10 కన్నా ఎక్కువగా స్బై బెలూన్‌లు పంపిందని చెప్పింది. చైనా అధికారుల అనుమతి లేకుండానే అక్రమంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది.
ఇప్పటికే అమెరికా – చైనా మధ్య సంబంధాలు తగ్గిపోయాయి. నిత్యం ఏదో విధంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి ఇరు దేశాలు. అగ్రరాజ్యం అనే బిరుదు కోసం చైనా తపిస్తోంది. అమెరికాను దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికా మరో ఎగిరే వస్తువును కూల్చేసింది. యూఎస్ పరిధిలో గగనతల నిబంధనలను ఉల్లంఘించడంతో నాలుగో వస్తువును షూట్ చేసి పేల్చేసింది.
8 కోణాలతో ఉన్న ఆ వస్తువు.. అమెరికా, కెనడా సరిహద్దుల్లో హ్యురోన్ సరస్సుపై ఎగురుతూ కనిపించింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశానుసారం యూఎస్ ఆర్మీకి చెందిన ఎఫ్ – 16 ఫైటర్ జెట్ దానిని కూల్చేసింది.
ఈ మధ్యకాలంలో ఇలాంటి వస్తువులు అమెరికా గగనతలంలో కనిపించడం, వాటిని పేల్చేయడం ఇది నాలుగోసారి. తాజాగా ఆకాశంలో కనిపించిన వస్తువును సైనిక ముప్పుగా పరిగణించలేదని, అయితే అది పౌర విమానయానానికి ముప్పును కలిగిస్తుందన్న ఉద్దేశంతోనే కూల్చేసినట్లు అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
గత వారం రోజుల్లో అమెరికా, కెనడా గగనతలంలో యూఎఫ్ఓలు కనిపించిన కేసులు నాలుగు నమోదు అయ్యాయి. ఈ నాలుగింటిలో 3 ఎగిరే వస్తువులు అమెరికా ఆకాశంలో కనిపించగా, ఒక యూఎఫ్ఓ కెనడియన్ గగనతలంలో కనిపించింది. ఈ నాలుగు ఎగిరే వస్తువులన్నింటిని అమెరికా సైనిక విభాగం యుద్ధ విమానాల ద్వారా కూల్చివేశారు. తాజాగా పేల్చేసిన వస్తువు కెనడా గగనతలం పరిధిలో కనిపించింది. యూఎస్ ఫైటర్ జెట్ ఈ ఎగిరే వస్తువును కూల్చేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఎగిరే వస్తువు కనిపించినట్లు నిర్ధారించారు. పీఎం ట్రూడో అనుమతి మేరకు కెనడియన్ గగనతలంలో గుర్తుతెలియని ఎగిరే వస్తువును కూల్చేసినట్లు తెలిపారు.
మరి కొన్ని దేశాలనూ చైనా టార్గెట్ చేసినట్టు ఓ రిపోర్ట్ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో భారత్‌తో పాటు జపాన్ కూడా ఉంది. ఇప్పటికే ఈ బెలూన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా భారత్‌కు తెలిపింది. వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా డిప్యుటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండీ శెర్మన్ ఈ విషయమై మాట్లాడారు.”చైనా స్పై బెలూన్ చాలా రోజులుగా యాక్టివ్‌గా ఉంటోంది. మిలిటరీ పరంగా బలంగా ఉన్న దేశాల సమాచారాన్ని సేకరిస్తోంది. జపాన్, భారత్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పైన్స్‌పై నిఘా పెట్టిందని వెల్లడించారు..
- అమెరికా, చైనా మధ్య నిఘా బెలూన్ల వివాదం నానాటికీ ముదురుతోంది.
ఈ నెల మొదట్లో తమ దేశ గగనతలంలో విహరిస్తున్న చైనాకు చెందిన ఓ బెలూన్‍ను యుద్ధ విమానంతో కూల్చివేసింది అమెరికా. దీనిపై డ్రాగన్ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా అగ్రరాజ్యంపై చైనా మరిన్ని ఆరోపణలు చేసింది. 2022 జనవరి నుంచి తమ దేశ గగనతలంలోకి అమెరికా 10సార్లకు పైగా బెలూన్లను పంపిందని చైనా ఆరోపించింది.
చైనాకు చెందిన ఓ బెలూన్‍ను కరోలినా ప్రాంతంలో అమెరికా కుప్పకూల్చింది. అమెరికా గగనతలంలోకి వచ్చిన దాన్ని యుద్ధ విమానంతో పేల్చేసింది. అయితే అది సివిలియన్ బెలూన్ అని, వాతావరణ అధ్యయనం కోసం పంపిందని చైనా చెప్పింది. అమెరికా, కెనడా గగనతలంలో మరిన్ని బెలూన్లను అగ్రరాజ్యం గుర్తించి, కుప్పకూల్చిందని తెలుస్తోంది. అయితే తొలి బెలూన్ మాత్రమే తమది అని ఇంత వరకు చైనా స్పందించింది.
తాజాగా ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖప్రతినిధి స్పందించారు.. ఇతర దేశాల గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించడం అమెరికాకు అలవాటే అనేలా చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెబిన్ పేర్కొన్నారు. “ఇతర దేశాల గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించడం అమెరికాకు అసాధారణం కాదు. గతేడాది నుంచి చైనాపై అమెరికా అక్రమ బెలూన్లు తిరిగాయి. చైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా 10సార్లకుపైగా ఇలా జరిగింది” అని ఆయన తెలిపారు. అమెరికా ఉల్లంఘనల పట్ల చైనా ఎంతో బాధ్యతాయుతంగా, హుందాగా ప్రతిస్పందించిందని ఆయన అన్నారు.
చైనాపై విహరించిన అక్రమ బెలూన్ల గురించి మరింత సమాచారం కావాలంటే అమెరికానే అడగాలని చెప్పారు. ఈ నెల 4వ తేదీన దక్షిణ కరోలినా సమీపంలో ఎఫ్-22 యుద్ధ విమానంతో చైనా నిఘా బెలూన్‍ను అమెరికా కుప్పకూల్చింది. సముద్ర జలాల్లో పడే విధంగా దీన్ని కూల్చివేసింది. ఆ తర్వాత బెలూన్ శిథిలాలను సేకరించింది. అనంతరం గగనతలంలో మరిన్నింటిని అమెరికా కూల్చినట్టు సమాచారం. అయితే మొదటి బెలూన్ తమదేనని మాత్రమే చైనా ఇప్పటి వరకు చెప్పింది. తమ సైనిక స్థావరాలపై నిఘా ఉంచేందుకే చైనా బెలూన్లను పంపుతోందని అమెరికా అనుమానిస్తోంది.
ఇదిలా ఉంటే చైనా ఈ బెలూన్ల సహాయంతో 5 ఖండాల్లో 40 దేశాలపై నిగా పెట్టినట్లు అమెరికన్ అధికారి వెల్లడించారు. బెలూన్ తయారీదారులు చైనా సైన్యంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నారని యూఎస్ఏ భావిస్తోంది. అయితే చైనా మాత్రం వాతావరణ పరిశోధన కోసం వీటిని ఉపయోగిస్తున్నట్లు ఒప్పుకుంది. అమెరికా ఆరోపణలను చైనా తోసిపుచ్చుతోంది. చైనా స్పై బెలూన్లు కమ్యూనికేషన్ సిగ్నల్స్ ని సేకరించగలిగేదిగా ఉందని..కూల్చేసిన బెలూన్ ఏకంగా 60 మీటర్ల పొడవుతో ఓ విమానం కలిగి ఉండే పేలోడ్ కలిగి ఉందని, సమాచారం బదిలీకి యాంటెన్నాలు, పవర్ ఉత్పత్తికి సోలార్ ప్లేట్స్ కలిగి ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. భారత్, జపాన్ తో పాటు యూఎస్ఏపై చైనా నిఘా పెట్టిందని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో వెల్లడించింది.
ప్రతీ ఒక్కరితోనూ గొడవ పడే దేశంగా చైనా తయారైందని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఆరోపించాడు. ఇది ఆ దేశ ప్రజలకు మంచిది కాదని హితవు పలికారు. చైనా స్పై బెలూన్ల అంశంపై ఇప్పుడు అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా చైనాతో శత్రుత్వం కలిగిన ఇండియా, జపాన్, వియత్నాం వంటివి ఆందోళన చెందుతున్నాయి. దీనిపై అమెరికా అధికారులు ఒక నివేదిక రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం.. ఇండియా, జపాన్‌తోపాటు 40 దేశాలు చైనా స్పై బెలూన్ నిఘాలో ఉన్నాయి.
ముఖ్యంగా చైనాతో శత్రుత్వం కలిగిన ఇండియా, జపాన్, వియత్నాం వంటివి ఆందోళన చెందుతున్నాయి. దీనిపై అమెరికా అధికారులు ఒక నివేదిక రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం.. ఇండియా, జపాన్‌తోపాటు 40 దేశాలు చైనా స్పై బెలూన్ నిఘాలో ఉన్నాయి. చైనా భారీ ఎత్తున నిఘా బెలూన్లను పంపించిందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయా దేశాలకు తెలియజేసినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. చైనా, దక్షిణ తీరంలోని హైనానా ప్రావిన్స్ నుంచి ఈ బెలూన్లను ఆపరేట్ చేస్తున్నారు. చాలా ఏళ్లుగా ఈ బెలూన్లు పని చేస్తున్నాయి.
ఈ బెలూన్లు ఇండియా, జపాన్, వియత్నం, తైవాన్, ఫిలిప్పీన్స్ దేశాలపై నిఘా కొనసాగిస్తున్నాయి. ఆయా దేశాలకు చెందిన సైనిక సమాచారాన్ని తెలుసుకునేందుకు చైనా ఈ బెలూన్లు ఉపయోగిస్తోంది.. గుర్తు తెలియని రక్షణ శాఖ, ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఈ నివేదిక వెల్లడించినట్లు అమెరికా తెలిపింది. చైనా సైన్యమైన పీఎల్ఏ ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాల్లో భాగంగా, ఐదు ఖండాల్లో చైనా వీటిని ప్రయోగించింది.
అనేక దేశాల గగనతలాల్లో ఈ బెలూన్లు ఎగరడం, ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడమేనని అమెరికా అభిప్రాయపడింది. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో చైనాతో శత్రుత్వం కలిగి ఉన్న దేశాలు అప్రమత్తం అయ్యాయి.. మరోవైపు.. అమెరికా, చైనాలు స్పై బెలూన్ల విషయంలో పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండటంతో.. ఈ విషయం చివరకు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోననే భయాందోళనలు కలిగిస్తున్నాయి..
అమెరికా, కెనడా గగనతలంలో స్పై బెలూన్ లతో నిఘా పెట్టిన చైనా.. అమెరికా పేల్చిన బెలూన్ లు తమవేనని ఒప్పుకుంది.. అంతేకాదు.. తిరిగి అమెరికా గత ఏడాదిగా 10 బెలూన్ లను తమదేశ గగనతలంలో ఉంచి నిఘా పెట్టినట్లు ఆరోపించడం ఇప్పుడు సరికొత్త వివాదానికి దారితీసింది..