Homeఅంతర్జాతీయంబోర్డర్ లో చైనాకు ఊహించని షాకిచ్చిన భారత్...

బోర్డర్ లో చైనాకు ఊహించని షాకిచ్చిన భారత్…

అరుణాచల్ ప్రదేశ్ వద్ద భారత సరిహద్దు వెంబడి డ్రాగన్ తన యుధ్దవిమానాలను మొహరించింది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ఘర్షణల తర్వాత చైనా తన కుతంత్రాలకు మరింత పదను పెడుతోంది. శాటిలైట్ ద్వారా తీసిన హై-రిజల్యూషన్ చిత్రాలు చైనా మోహరింపును స్పష్టంగా చూపిస్తున్నాయి. భారత ఈశాన్య ప్రాంతానిక అతి దగ్గరలో వీటిని మోహరించింది. ఓ రిపోర్ట్..

సరిహద్దు వెంబడి యుద్ధవిమానాల మోహరింపజేయడం ద్వారా చైనా కుయుక్తులు పన్నుతోంది. జిత్తులమారి చైనా భారత సరిహద్దు వెంబడి యుద్ధ విమానాలు, డ్రోన్లను మోహరిస్తోంది. సరిహద్దు వెంబడి పలు ఎయిర్ బేస్ లను నిర్మించిన చైనా దాని వెంబడి సైనిక మోహరింపును సైతం పెంచుతోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు ఈశాన్యంగా 150 కిలోమీటర్ల దూరంలో చైనా బంగ్డా ఎయిర్ ఎయిర్‌బేస్ లో అత్యాధునిక WZ-7 ‘సోరింగ్ డ్రాగన్’ డ్రోన్ ను ఉంచింది. 2021లో తొలిసారిగా ఈ డ్రోన్ ను చైనా ఆవిష్కరించింది. ఏకంగా 10 గంటల వరకు నాన్ స్టాప్ గా ఎగరడం దీని ప్రత్యేకత. నిఘాతో పాటు క్రూయిజ్ క్షిపణులను ఇది భూమిపై లక్ష్యాలపై ప్రయోగించగలదు. అయితే ప్రస్తుతం భారత్ వద్ద ఇలాంటి డ్రోన్లు లేవు.

డిసెంబర్ 14 తీసిన చిత్రాల్లో చైనా బాంగ్డా ఎయిర్‌బేస్ లో రెండు ఫ్లాంకర్ తరగతికి చెందిన ఫైటర్ జెట్లను ఉంచింది. ఈ రకం ఫైటర్ జెట్లు రష్యా సుఖోయ్-30ఎంకేఐ తరహా విమానాలకు కాపీ అని చెప్పవచ్చు. అయితే వాటిపై మేడ్ ఇన్ చైనా అని రాసి ఉంటుంది. ముఖ్యంగా 2017 డోక్లాం ప్రతిష్టంభన తర్వాత చైనా ఈశాన్య సరిహద్దుల్లో సైనికీకరణను పెంచింది. లాసా గోంగ్‌గర్ విమానాశ్రయం రన్ వేను విస్తరించింది. టిబెట్ ప్రాంతంలోని అన్ని ఎయిర్ బెస్ లను అప్ గ్రేడ్ చేసింది. సైనికులను వేగంగా తరలించేందుకు రోడ్డు,రైలు మార్గాలను విస్తరించింది. ప్రస్తుతం భారత్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల ఘర్షణతో మరోసారి సరిహద్దుల్లో ఉద్రికత్త నెలకొంది.

ఇక్కడే చైనా మూడు కీలక ఎయిర్ బేసుల అభివృద్ధి చేస్తోంది. బంగ్డా..అంటే.. అరుణాచల్ సరిహద్దు నుంచి 150 కిలోమీటర్లు), లాసా..అంటే సరిహద్దు నుంచి 260 కిలోమీటర్లు., షిగట్సే…అంటే సిక్కిం సరిహద్దు నుంచి 150 కిలోమీటర్ల దూరంలో తనకు సంబంధించిన ఎయిర్ బేసులను డెవలప్ చేసింది. అయితే భారత్ తేజ్‌పూర్, మిస్సమారి, జోర్హాట్, హషిమారా మరియు బాగ్డోగ్రాలతో సహా అస్సాం, బెంగాల్ ప్రాంతాల్లో ఎయిర్ బేసులను నిర్వహిస్తోంది. చైనా ఎయిర్ బేసులతో పోలిస్తే భారత ఎయిర్ బేసులు వ్యూహాత్మకంగా మెరుగైన స్థితిలో ఉన్నాయి. చైనా ఎయిర్ బేసులు పూర్తిగా టిబెట్ ప్రాంతంలో ఎతైన ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో అంత ఎత్తైన కొండలను దాటేందుకు అతి తక్కువ బరువులను మోసుకెళ్లాల్సి ఉంటుంది.

తక్కువగా ఉండే ఆక్సిజన్ కారణంగా చైనా విమానాలకు ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అయితే భారత్ వైమానికి స్థావరాల నుంచి యుద్ధవిమానాలు సులువుగా ఇంధనం, క్షిపణులను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అరుణాచల్ పరిధిలో ఈ మధ్య చైనా కార్యకలాపాలు పెరిగినందున భారత వైమానిక దళం అక్కడి గగనతలంలో యుద్ధ విమాన గస్తీని నిర్వహిస్తోంది.

మాక్సర్ టెక్నాలజీతో ఉపగ్రహ ఫోటోలు తీస్తోంది. అరుణాచల్ మీదుగా భారత గగనతలంలోకి చైనా విమానాలు ప్రవేశించి అవకాశం ఉందని గుర్తించిన తర్వాత భారత వాయుసేన కనీసం రెండు సందర్భాల్లో యుద్ధ విమానాలను ఎగురవేసి అలర్ట్ ప్రకటించింది. దీంతో ఇక్కడి పరిస్థితి ప్రస్తుతం మాత్రం చాలా సున్నితంగా ఉందని అంటున్నారు.

2017 డోక్లాం ప్రతిష్టంభన తర్వాత ఈ ప్రాంతంలో చైనా వైమానిక సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం లాంటి పనులు సీక్రెట్ గా చేస్తూ వచ్చింది చైనా..దీన్ని బట్టి ఖచ్చితంగా భారత వైమానిక దళం, దాని స్థావరాలపై ఈ చర్యలు పెను ప్రభావాన్ని చూపించే అవకాశాలున్నాయి. ఇది మనకు భవిష్యత్తులో ముప్పుగా పరిణమించవచ్చని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. గత కొన్నేళ్లుగా భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరుదేశాల సైనికులు ఘర్షణలకు దిగడం, ప్రాణనష్టం జరగడం వంటివి కూడా చోటు చేసుకున్నాయి. భారత్ ఆత్మరక్షణకు ప్రాధాన్యత ఇస్తుండగా, చైనా మాత్రం సరిహద్దుల్లో మోహరింపులు పెంచుతూ యుద్ధ సన్నద్ధతను చాటుతోంది. ఇది ఎక్కడికైనా దారి తీసే అవకాశం ఉంది.

Must Read

spot_img