Homeఅంతర్జాతీయంవిమాన వేగంతో దూసుకుపోయే వాహనాలను తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్న చైనా..

విమాన వేగంతో దూసుకుపోయే వాహనాలను తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్న చైనా..

విమానవేగంతో దూసుకుపోయే వాహనాలను కలలో కూడా ఊహించని కాలం నుంచి ప్రపంచం 21వ శతాబ్దంలో ప్రయాణిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ వేగాన్ని అందుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ వాహనాలు నడవడానికి అయస్కాంతశక్తి అవసరమవుతుంది. ఏ కాలుశ్యం లేని శబ్దకాలుష్యా రాని ఈ మ్యాగ్నెటిక్ వాహనాలనే మాగ్లెవ్ లని అంటున్నారు. చైనా ఈ దిశగా మరింత దూసుకుపోతోంది.

అయస్కాంత శక్తితో నడిచే మాగ్లెవ్ రైళ్లు విమాన వేగాన్ని అందుకున్నాయి. ఆ దిశగా పలు దేశాలు ఇప్పటికే రైళ్లను నడపించి విజయవంతం అయ్యాయి. ఇప్పుడు అదే కోవలో గంటకు 230కి.మీ వేగంతో దూసుకుపోయే కార్లను కూడా చైనా పరీక్షించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ ప్రయోగాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి.

ఎలక్ట్రిక్ కార్లను అధిగమించి ఇప్పుడు మ్యాగ్నెటిక్ వాహనాలు రంగప్రవేశం చేసాయి. అయితే ఇతర దేశాలతో పోల్చుకుంటే చైనా టెక్నాలజీతో అటు ప్రపంచాన్ని అలాగే ప్రజలను పరుగులు పెట్టిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలను చేస్తూ వాటిలో సక్సెస్ సాధిస్తూ టెక్నాలజీ విషయంలో దూసుకుపోతోంది చైనా.కృత్రిమ సూర్యూడిని తయారు చేసుకుని చైనా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.

ఇది మరువక ముందే డ్రాగన్‌ దేశం ఆధునాతన సాంకేతికతను ఉపయోగించి గాల్లో తేలే రైలును ఆవిష్కరించింది.

అంటే ఈ రైలు.. పట్టాలపై తేలుతూ గంటకు 620 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సౌత్‌వెస్ట్ జియటాంగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ రైలుకు చక్రాలు ఉండవు. మాగ్నెటిక్‌ లెవిటేషన్, హై టెంపరేచర్ సూపర్ కండక్టర్ టెక్నాలజీలో పురోగతి సాధించడం ద్వారా దీనికి రూపకల్పన చేసినట్లు చైనా శాస్త్రవేత్తలు వివరించారు. ప్రస్తుతం భూమిపైని రైళ్లన్నింటికంటే వేగంగా ఈ రైలు దూసుకుపోతుందని వారు తెలిపారు. ఈ టెక్నాలజీని లెవిటేషన్ మాగ్లెవ్‌ అని పిలుస్తారు.మాగ్లెవ్ ట్రెయిన్ కోసం ప్రత్యేకంగా ట్రాక్ నిర్మించి రైళ్లను నడిపించి చూపించింది డ్రాగన్ కంట్రీ..

ఈ నేపథ్యంలోనే తాజాగా చైనా నుంచి మరొక వండర్ ప్రపంచం ముందుకు వచ్చింది.

ఈసారి ఏకంగా మ్యాగ్నెటిక్ కారునే రూపొందించింది. ఈ మ్యాగ్నెటిక్ కారు టెస్ట్‌ డ్రైవ్‌ ను కూడా ఇప్పటికే పూర్తి చేసింది. దానికి అధునాతన టెక్నాలజీ జోడించి ఆ కారుని మార్కెట్లోకి విడుదల చేయనుంది. ప్రస్తుతం చైనా అదే టెక్నాలజీతో మ్యాగ్లెవ్ కారును సిద్ధం చేసింది. 2.8 టన్నుల బరువున్న ఈ కారు టెస్ట్‌ డ్రైవ్‌లో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. జియాంగ్‌ ప్రావిన్స్‌ హైవే పై ఈ డ్రైవ్‌ టెస్ట్ ను నిర్వహించారు. దాదాపు 8 కిలోమీటర్ల మేర ఈ కారును టెస్ట్‌ చేశారు. అయితే ఈ కారు గ్రౌండ్‌ను టచ్‌ చేయకుండా ప్రయాణిస్తాయి.

ఎందుకంటే ఇవి విద్యుత్‌ అయస్కాంత శక్తి ఆధారంగా నడుస్తాయి. ఇటీవల పరీక్షించిన మాగ్లెవ్ కారు కూడా గ్రౌండ్‌కు 35 మిల్లిమీటర్ల గ్యాప్‌తో ప్రయాణిస్తుంది. అయితే ఈ టెక్నాలజీతో తయారు చేసిన వాహనాలకు సాధారణ రోడ్లపై ప్రయాణించలేవు. ప్రత్యేకంగా నిర్మించిన విద్యుత్‌ అయస్కాంత ట్రాక్లపై మాత్రమే నడుస్తాయి. ఇప్పుడు మాగ్లెవ్‌ కారుకి కూడా ఈ ఫార్ములానే అనుసరించాలి. లేదంటే ఈ కార్ల నిర్వహణ అంత తేలికైన పని కాదు. భారీ మొత్తంలో నిధులు అవసరమవుతుంటాయి. రోడ్లను పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. అయితే ట్రాఫిక్‌ ఎక్కువ ఉన్న ప్రాంతాలలో వీటిని తీసుకురావడానికి చైనా ఆలోచన చేస్తోంది. ఈ మధ్య కాలంలో మ్యాగ్లెవ్ ట్రాన్స్ పోర్టేషన్ విషయంలో వరల్డ్ లీడర్ గా మారుతోంది చైనా.

వాణిజ్యపరంగా షాంఘై ట్రాన్స్ రాపిడ్ గత 18 సంవత్సరాలుగా మాగ్లెవ్ ట్రెయిన్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అంతే కాదు గంటకు 431 కి.మీల వేగంతో దూసుకుపోయే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ ట్రెయిన్ కూడా చైనాలో నడుస్తోంది. బీజింగ్ నుంచి షాంఘై మధ్య సుమారు వేయి కి.మీల దూరాన్ని కేవలం రెండున్నర గంటలలో చేరుకునేలా ప్లాన్ చేస్తోంది.

ఈ రైలు ద్వారా విమాన ప్రయాణం రైలు ప్రయాణం మధ్య ఉన్న దూరాన్ని సమం చేయనుంది. ప్లేన్ తో పోటీ పడేలా ఈ ప్రయాణం కొనసాగనుంది. ఇప్పుడు మ్యాగ్లెవ్ కార్ రోడ్ టెస్ట్ గంటకు 230 కి.మీ వేగం పుంజుకోవడం జరిగింది. ఇది చైనా నేషనల్ హైవే రోడ్లపై ఉండే స్పీడ్ లిమిట్ ను దాటినట్టుగా భావిస్తున్నారు.

Must Read

spot_img