Homeఅంతర్జాతీయంగత వారం రోజులుగా చైనాలో కరోనా గురించిన ప్రచారంపై చైనా స్పంధించింది.

గత వారం రోజులుగా చైనాలో కరోనా గురించిన ప్రచారంపై చైనా స్పంధించింది.

ఇదంతా తప్పుడు ప్రచారమేనని కొట్టి పడేసింది. కరోనా ఉద్ధృతిపై అవన్నీ తప్పుడు నివేదికలేనంటోంది డ్రాగన్ కంట్రీ. పాశ్చాత్య దేశాలు వక్రీకరించిన ప్రాపగండా కథనాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా ప్రారంభమైన నాటి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకే తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిందని వెల్లడించింది.

కరోనా వైరస్ కొత్త వేరియంట్లతో చైనా విలవిల్లాడుతోంది. కొవిడ్ బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడిందని, శ్మశాన వాటికలు రగులుతూనే ఉన్నాయంటూ నిత్యం వందలాదిగా కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ వార్తలను చైనా ఏకపక్షంగా తోసిపుచ్చింది. ఇవన్నీ వక్రీకరించిన కథనాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా ప్రారంభమైన నాటి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకే తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిందని వెల్లడించింది. ‘ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచాం. దశలవారీగా వైరస్ విజృంభిస్తోంది. దానిని ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సమయానుకూలంగా శాస్త్రీయ పద్ధతులను చైనా అనుసరిస్తోందంటూ విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు.

కరోనా కేసుల సునామీతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ జీరో కొవిడ్ విధానం నుంచి చైనా క్రమంగా దూరంగా జరుగుతోంది.

విదేశాల నుంచి చైనాకు వచ్చే ప్రయాణికులకు వచ్చే నెల 8వ తేదీ నుంచి క్వారంటైన్ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. కొవిడ్ స్థాయిని క్లాస్ ‘ఎ’ ఇన్‌ఫెక్షన్ల నుంచి క్లాస్ ‘బి’ కి తగ్గిస్తున్నట్లు చైనా జాతీయ హెల్త్ కమిషన్ ప్రకటించింది. తద్వారా కొవిడ్ రోగులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి తప్పనిసరి క్వారంటైన్ సహా కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో లాక్ డౌన్ అవసరం లేకుండా పోయింది. చైనాలో 40 రకాల ఇన్ఫెక్షన్లను ఎ,బి,సి కేటగిరిల్లో వర్గీకరించారు. ‘ఎ’ కేటగిరిలో కలరా, ప్లేగు వంటివి ఉన్నాయి. మరోపక్క అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు సడలించడంతో చైనీయులు విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.

అయితే వారం రోజులుగా జరుగుతున్న ప్రచారంతో చైనా కరోనా ఉద్ధృతిని చూసి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనా నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి వైరస్ వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నాయి. ఈ జాబితాలో ఇప్పటికే భారత్‌, ఇటలీ, జపాన్‌, తైవాన్‌ వంటి దేశాలుండగా.. తాజాగా అమెరికా కూడా చేరింది. తమ దేశానికి వచ్చే చైనీయులకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరి చేసింది. దీని ప్రకారం విమానం ఎక్కడానికి 48 గంటల ముందు వచ్చిన నెగెటివ్ ధ్రువపత్రాన్ని చూపించాల్సి ఉంది. జనవరి 5 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. చైనాతో పాటు హాంకాంగ్‌, మకావు నుంచి వచ్చే వారికి కూడా ఇది వర్తిస్తుంది. అయితే వీటన్నింటిని గమనించిన చైనా ఇక లాభం లేదనుకుని వార్తలను ఖండించే పని మొదలుపెట్టింది.

స్వదేశీ, విదేశీయుల పై చైనా ప్రయాణ ఆంక్షలను సడలించగా.. అక్కడి నుంచి వచ్చేవారిపై రేస్ట్రిక్షన్స్‌ విధిస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ప్రయాణానికి రెండు రోజుల ముందు పీసీఆర్‌ టెస్ట్‌ చేసుకోవాలని, నెగెటివ్‌ రిపోర్ట్‌ ఉండాలని అధికారులు స్పష్టంచేశారు. అదేవిధంగా చైనా నుంచి నేరుగా కాకుండా సియోల్‌, టొరంటో, వాంకోవర్‌ మీదుగా వచ్చే ప్రయాణికులకు కూడా ఇదే షరతు వర్తిస్తుందని వెల్లడించారు. అయితే చైనాలో కోవిడ్‌ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతూ లక్షల మందికి సోకుతోంది. కొద్ది రోజుల్లోనే దేశంలోనే 60 శాతం జనాభాకు ఈ వైరస్‌ సోకే ప్రమాదం ఉందనే నివేదికలు కలవర పెడుతున్నాయి. అందుకు ప్రధానంగా ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బీఎఫ్‌.7తో పాటు మరో మూడు వేరియంట్లు కారణమని గుర్తించారు.

ఈ క్రమంలోనే ఓ షాకింగ్‌ న్యూస్‌ యావత్‌ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

ప్రజాగ్రహంతో జీరో కోవిడ్‌ పాలసీకి మంగళం పాడిన చైనా ప్రభుత్వం, జనవరి 8 నుంచి విదేశీ ప్రయాణికుల క్వారంటైన్‌ నిబంధనలనూ ఎత్తివేసింది. మరోవైపు.. రోజువారీ కోవిడ్‌ నివేదికలను వెల్లడించటాన్ని ఆపివేసింది చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌. కొద్ది రోజులుగా వేలాది మంది వైరస్‌ బారినపడినట్లు తెలుస్తోంది. వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. వ్యాక్సినేషన్‌ సరిగా లేకపోవటం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల చైనాలో.. ప్రపంచ జనాభాలోని ఐదోవంతు మందిలో ఈ వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీంతో కొత్త వేరియంట్లు అభివృద్ధి చెందేందుకు చైనా కేంద్ర బిందువుగా మారబోతోందని ఇతర దేశాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Must Read

spot_img