Homeజాతీయంచైనా క్వారంటైన్‌ను ముగించింది..

చైనా క్వారంటైన్‌ను ముగించింది..

  • ఎట్టకేలకు కోవిడ్ పట్ల చైనా తన తీరును మార్చుకుంది.
  • విదేశీ ప్రయాణీకులకు క్వారంటైన్ ఎత్తివేసింది.
  • దాదాపు మూడేళ్ల తరువాత క్వారంటైన్ విధానాన్ని పూర్తిగా తొలగించడం ఇదే తొలిసారి.
  • ఆదివారం నుంచి ఈ కొత్త నిబంధన అమలవుతోంది.
  • విదేశీ ప్రయాణీకులు , చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్లి వచ్చినవాళ్లు ఇకపై ఎవరూ క్వారంటైన్ అవాల్సిన అవసరం లేకుండా పోయింది.

ఆదివారం నుంచి చైనా క్వారంటైన్ నిబంధన ఎత్తివేసింది. మూడేళ్ల తర్వాత చైనా క్వారంటైన్ నిబంధన ఎత్తివేయడం విశేషం. విదేశీ ప్రయాణికులు, చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన వాళ్లు ఇకపై ఎవరూ క్వారంటైన్ పాటించాల్సిన అవసరం లేదు. టొరంటో, సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులు ఆదివారం క్వారంటైన్ లేకుండానే గమ్య స్థానాలకు చేరుకున్నారు.

చైనా సరిహద్దులో ఉన్న హాంకాంగ్, ఇతర దేశాల నుంచి కూడా సందర్శకుల్ని చైనా ఆహ్వానిస్తోంది. గతంలో విదేశీ ప్రయాణికుల విషయంలో చైనా తీవ్ర ఆంక్షలు విధించింది. విదేశాల నుంచి వచ్చే వాళ్లు కచ్చితంగా క్వారంటైన్ నిబంధన పాటించాల్సి ఉండేది. వ్యాక్సిన్లు తీసుకుని ఉండాలి. ఇప్పుడు మాత్ర ఇలాంటివేవీ చైనా పాటించడం లేదు.

ప్రస్తుతం చైనా వచ్చే ప్రయాణికులు 48 గంటల ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకుని ఉంటే సరిపోతుంది. అయితే, ఒకపక్క దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్న టైంలో చైనా క్వారంటైన్ నిబంధన ఎత్తివేయడం మరో విశేషం. చైనాలో పూర్తి స్థాయి కోవిడ్ రూల్స్‌ను ఆ దేశం ఎత్తివేసింది. దీంతో ప్రజలు కోవిడ్ రూల్స్ పాటించడం మానేశారు. ఫలితంగా దేశంలో కోవిడ్ కేసులు ఉన్నట్లుండి పెరిగిపోతున్నాయి.

లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంత్యక్రియలు నిర్వహించడం కూడా కష్టమవుతోంది. కోవిడ్ పేరుతో గతంలో చాలా మందిని ప్రభుత్వం నిర్బంధంలో ఉంచేది. ఇప్పుడు అలాంటి వాళ్లందరినీ స్వేచ్ఛగా వదిలేసింది. కోవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని చైనా ప్రభుత్వం వెల్లడించడం లేదు. ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇంతకాలం జీరో కొవిడ్ విధానంతో ప్రజలను ఆంక్షల చట్రంలో ఉంచిన చైనా ఇప్పుడు వాటిని సడలించింది. కరోనా కేసులు పెరుగుతోన్న తరుణంలో దానిని ఆకస్మికంగా ఎత్తివేయడంతో వైరస్ ఉద్ధృతి ఆకాశాన్నంటుతోంది. ఈ సమయంలోనే ఆ దేశం లూనార్‌ న్యూయర్ వేడుకలు జరుపుకోనుంది. ఇందుకోసం దేశ విదేశాలలోని చైనీయులు భారీగా ప్రయాణాలు చేయనున్నారు. సొంతూళ్లకు వెళ్లనున్నారు.

దీనినే గ్రేట్ మైగ్రేషన్ అంటారు. 2020 తర్వాత ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో శనివారం నుంచి రానున్న 40 రోజుల్లో కోట్లాది మంది రాకపోకలు సాగించనున్నారు. దాంతో ప్రయాణికుల సంఖ్య 200 కోట్లకు చేరుకుంటుందని చైనా రవాణా మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. అయితే ఈ అంచనాలపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.

  • మూడు సంవత్సరాల తర్వాత తొలిసారి ప్రయాణాలపై ఆంక్షలు..!

మూడు సంవత్సరాల తర్వాత తొలిసారి ప్రయాణాలపై ఆంక్షలు లేకపోవడంతో కొందరు ఊపిరిపీల్చుకుంటున్నారు. తమ వారితో కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోవచ్చని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి దృష్ట్యా తాము ఊరు వెళ్లమని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. నగరాల నుంచి తమ సొంతూళ్లకు ప్రజలు భారీగా వెళ్తారన్న అంచనాల మధ్య గ్రామాలకు కూడా వైరస్ సోకుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

వైద్య సదుపాయాల కొరత ఉన్న దగ్గర కరోనా విజృంభిస్తే.. పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇదిలా ఉండగా తాను అనుసరిస్తోన్న కొవిడ్ విధానాలపై విమర్శలు చేసే వారిని చైనా ఆంక్షలతో బంధిస్తోంది. ఇప్పటివరకు సుమారు వెయ్యిమంది విమర్శకుల సోషల్‌ మీడియా ఖాతాలను సస్పెండ్‌ చేసింది.

అక్కడి విబో సోషల్‌ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. 12వేల 854 ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. దాంతో 1 వేయి 120 ఖాతాలపై నిషేధం విధించినట్లు చెబుతున్నారు. చైనాలో ప్రభుత్వాన్ని విమర్షించడం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమేనని గతంలో ఎన్నోసార్లు రుజువైంది. ఇప్పుడు కూడా అంతే..చైనాలో ఏదైనా విషయం అధికారికంగా తెలియాలంటే ప్రభుత్వ మీడియాలో రావాలి..గ్లోబల్ టైమ్స్ లో వచ్చే విషయాలే ప్రపంచానికి తెలుస్తుంటాయి.

అయితే చైనా ఇప్పుడు ఒక్కసారిగా కరోనా ఆంక్షలు ఎత్తి వేయడం వెనుక కొత్త వేరియంట్లను ప్రపంచవ్యాప్తం చేయాలనే కుట్ర దాగి ఉందని వెస్టర్న్ కంట్రీస్ నమ్ముతున్నాయి. డబ్లూ హెచ్ ఓ ఎన్నిసార్లు విజ్నప్తి చేసినా చైనాలో విస్తరిస్తున్న కరోనా వివరాలను తెలియజేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

Must Read

spot_img