Homeఅంతర్జాతీయంకరోనా వైరస్ ను చైనానే పుట్టించిందా?

కరోనా వైరస్ ను చైనానే పుట్టించిందా?

ఇంతకూ ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది..? ఎక్కడ పుట్టింది..? అనే చర్చ కొంతకాలంగా సాగుతోంది.. అమెరికాకు చెందిన శాస్త్రవేత్త, పరిశోధకుడు ఆండ్రూ హాఫ్ తన పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడించారు..

కోవిడ్ -19 మానవ నిర్మితమా..? కరోనా వైరస్ వూహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి లీకైందా..? కరోనా వైరస్ జన్యుపరంగా ఇంజనీరింగ్ చేయబడిన వైరసేనా..? ఆండ్రూ హాఫ్ వెల్లడించిన విషయాలు ఇప్పుడు ప్రపంచదేశాలలో కొత్త చర్చకు దారితీశాయా..?

కోవిడ్ -19 ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది.. ఇప్పటికీ.. కొన్ని దేశాలలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.. చైనాలో అయితే.. ఏకంగా లాక్ డౌన్ లు విధిస్తున్నారు.. దీని కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. అయితే.. ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ ఎలా పుట్టుకొచ్చింది, అది మానవ సృష్టినా లేక అదే ఉద్భవించిందా…? అనుమానాలు ఇంకా తొలగిపోలేదు. గత మూడేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కోవిడ్ -19. చైనా వూహాన్ నగరంలో ప్రారంభం అయిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించింది.. కరోనా వైరస్ వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థలతో పాటు ఆరోగ్య వ్యవస్థలను సర్వనాశనం చేసింది. లక్షల సంఖ్యలో ప్రజల్ని బలి తీసుకుంది.

ఇప్పటీకీ కరోనా వైరస్ ప్రభావం తగ్గలేదు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా.. వ్యాధి తన రూపాన్ని మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ఇకపై కోవిడ్-19తో సహజీవనం చేయాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. కరోనా కరోనా వైరస్ ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్, మళ్లీ ఓమిక్రాన్ లో సబ్ వేరియంట్లుగా రూపాంతరం చెందుతూనే ప్రజలపై దాడి చేస్తోంది.

ఇదిలా ఉంటే యూఎస్ఏకు చెందిన సైంటిస్టు ఆండ్రూ హఫ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. తాను రాసిన తాజా పుస్తకం ”ది ట్రూత్ అబౌట్ వుహాన్” అనే పుస్తకంలో ఈ విషయాలను తెలియజేశారు. కోవిడ్-19 ” మానన నిర్మిత వైరస్” అని అన్నారు. రెండేళ్ల క్రితం ప్రభుత్వ నిర్వహణలో, ప్రభుత్వ నిధులతో పనిచేస్తున్న పరిశోధనా కేంద్రం వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ లీక్ అయిందని.. ఆండ్రూ హఫ్ పుస్తకంలో వెల్లడించారు..

గతంలో ఆండ్రూ హఫ్ వ్యూహాన్ ల్యాబులో పనిచేశారు. అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు ఆండ్రూ హాఫ్ తన తాజా పుస్తకం, “ది ట్రూత్ అబౌట్ వూహాన్”లో పలు సంచలన విషయాలు రాశారు. ఈ బుక్‌లో పేర్కొన్న అంశాలలలో కరోనా వైరస్ వూహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి లీకైంది అనేది చాలా ముఖ్యమైనది అని బ్రిటన్ కు ది సన్ న్యూస్ పేపర్ ప్రచురించింది. చైనా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలలో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో వూహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయిందని సైంటిస్ట్ ఆండ్రూ హాఫ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. ప్రపంచాన్ని కొవిడ్ మానవ నిర్మిత వైరస్ అని, అది చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే లీకైందని బయటకు రావడంతో పలు దేశాలు తమ అంచనా నిజమైందని చెబుతున్నాయి.

న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఆండ్రూ హాఫ్ ఎకోహెల్త్ అలయన్స్ మాజీ వైస్ ప్రెసిడెంట్ గా చేశారు. ఎకో హెల్త్ అనేది ఎన్జీవో సంస్థ. ఇది అంటువ్యాధుల గురించి అధ్యయనం చేస్తుంది.. అమెరికాకు చెందిన ఈ సంస్థ గబ్బిలాల్లో కరోనా వైరస్ లపై 10 ఏళ్ల కిందటి నుంచి అధ్యయనం చేస్తోంది. ఈ ఎక్ హెల్త్ సంస్థనే చైనాలోని వూహాన్ ల్యాబ్ కు నిధులు సమకూర్చుతోంది. కానీ ఇదే ల్యాబ్ నుంచి కరోనా వైరస్ ను చైనా లీక్ చేసిందని ప్రపంచ వ్యాప్తంగా ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో చైనా ల్యాబ్ కు నిధులను అప్పటి ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది.

మొదటి నుంచి కరోనా వైరస్ మూలాలకు వూహాన్ ల్యాబ్ కేంద్రంగా ఉంది. ప్రపంచదేశాలు కూడా వూహాన్ ల్యాబుపై అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే ప్రపంచదేశాలు చేసిన విమర్శలను చైనా అధికారులు ఖండించారు. సరైన బయో సెక్యురిటీ, రిస్క్ మేనేజ్మెంట్ నియంత్రణ చర్యలు వూహాన్ ప్రయోగశాలలలో తగినంత లేవు… అందుకనే ల్యాబ్ నుంచి వైరస్ లీక్ కు దారి తీసిందని ఆండ్రూ హఫ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. మానవ నిర్మిత వైరస్ అని చైనాకు మొదట్నుంచీ కొవిడ్ గురించి తెలుసునని, కానీ అందుకు అమెరికా ప్రభుత్వమే కారణమని ప్రచారం జరగడంతో తాను ఆందోళనకు గురైనట్లు రాసుకొచ్చారు.

కరోనా వైరస్ జన్యుపరంగా ఇంజనీరింగ్ చేయబడిన వైరస్ అని తనకు మొదటి నుంచి తెలుసు అని హఫ్ తన పుస్తకంలో రాశారు. 2014 నుంచి 2016 వరకు అమెరికాకు చెందిన ఎకో హెల్త్ అలయెన్స్లో పనిచేశారు హఫ్. అయితే ఈ సమయంలో కరోనా వైరస్ సృష్టించడంలో అనేక పద్దతులను అభివృద్ధి చేయడానికి ఈ సంస్థ వూహాన్ ల్యాబుకు సహకరించిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదకరమైన టెక్నాలజీని చైనీయులకు బదిలీ చేయడానికి యూఎస్ ప్రభుత్వమే కారణం అని చెప్పవచ్చని వెల్లడించారు.. చైనాకు అమెరికా బయో వెపన్స్ అందజేస్తుందని పలు దేశాలు ఆరోపించాయి. చైనా నుంచి లీకైన కరోనా వైరస్ ఆపై ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి మిలియన్ల మంది మరణానికి కారణమైంది. పలు దేశాలు ప్రయాణ ఆంక్షలతో పాటు భౌతిక దూరం, మాస్కులు ధరించడం లాంటి ఎన్నో కోవిడ్ ఆంక్షలు అమలు చేసినా ప్రాణ నష్టం ఏడాది వరకు ఆగలేదు. వ్యాక్సిన్లు రావడంతో కరోనా ప్రభావం తగ్గిపోయింది.

కోవిడ్ -19 ఒక అంటువ్యాధి. ఇది సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోం కరోనా వైరస్ 2 అనే వైరస్ వల్ల కలుగుతుంది. దీన్ని మొట్టమొదటగా మధ్య చైనాలోని హూబే ప్రావిన్సు రాజధానియైన వుహాన్లో 2019 లో గుర్తించారు. అక్కడి నుంచి ఇది ప్రపంచమంతటా వ్యాపించి 2019-20 కరోనా వైరస్ విశ్వమారి అయ్యింది. జ్వరం, దగ్గు, శ్వాస సరిగా ఆడకపోవడం దీని ప్రధాన లక్షణాలు. కండరాల నొప్పి, కఫం ఉత్పత్తి కావడం, విరేచనాలు, గొంతు బొంగురుపోవడం కొంచెం తక్కువగా కనిపించే లక్షణాలు.. అంతేకాక చలిగా అనిపించడం, ఒంట్లో వణుకు, కండరాల నొప్పి, తలనొప్పి, వాసన గ్రహించలేకపోవడం, గొంతు నొప్పి, మంట వంటి లక్షణాలు కరోనా వైరస్ సోకిన రెండు రోజుల నుండి 14 రోజుల మధ్యలో ఈ లక్షణాలు కన్పించే అవకాశం ఉందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ గుర్తించింది. కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. అసలే ఆర్థిక మందగమనంతో ఉన్న దేశాలు.. ఆర్థికంగా మరింత దిగజారాయి.

కోవిడ్ వైరస్ వ్యాప్తి చెంది ప్రపంచలోని అనేక దేశాల ప్రజలను పట్టి పీడించింది.. లక్షలాది మంది ప్రజలను బలితీసుకుంది.. ఇప్పుడు ఈ వైరస్ ను వ్యాక్సిన్ లతో కొంత వరకు అడ్డుకోగలుగుతున్నారు.. ఇంతటి ప్రమాదకరమైన వైరస్ చైనా ల్యాబ్ నుంచే లీక్ అయిందని.. ఇది మానన నిర్మిత వైరస్” అని తెలియపరచడంతో మరో కొత్త చర్చకు తెరతీసినట్లయింది..
………………………………………

Must Read

spot_img