Homeఅంతర్జాతీయంఎయిమ్స్ సర్వర్ల హ్యాకింగ్ వెనుక చైనా హస్తముందా..?

ఎయిమ్స్ సర్వర్ల హ్యాకింగ్ వెనుక చైనా హస్తముందా..?

ఎయిమ్స్ టార్గెట్ వెనుక పెద్ద కథే ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మరి .. సర్వర్ల హ్యాకింగ్ కు చైనా ప్రయత్నించిందన్న ఆరోపణలకు కారణమేంటి..? భారత్ ను దొంగదారిలో దెబ్బకొట్టాలన్నదే చైనా వ్యూహమా..?

ఢిల్లీలోని AIIMS హాస్పిటల్ సర్వర్ సిస్టం హ్యాక్‌కు గురైంది. ఎయిమ్స్ స‌ర్వ‌ర్ల‌ను హ్యాక‌ర్లు టార్గెట్ చేశార‌నే స‌మాచారంతో ల‌క్ష‌లాది రోగుల వ్య‌క్తిగ‌త వివ‌రాలు ప్ర‌మాదంలో ప‌డ‌తాయ‌నే ఆందోళ‌న నెల‌కొంది. మొత్తం అయిదు ఎయిమ్స్ మెయిన్ స‌ర్వ‌ర్లు టార్గెట్‌గా సైబ‌ర్ దాడి జ‌రిగింద‌ని ఇందులో చైనా హ్యాక‌ర్ల ప్ర‌మేయం ఉంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. చోరీ చేసిన డేటాను డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్ట‌నున్న‌ట్టుచెబుతున్నారు. అయితే ఇప్పటివరకు డార్క్ వెబ్ లో డేటాను పెట్టలేదని దర్యాప్తు బృందాలు తెలిపాయి. చోరీకి గురైన‌ ఎయిమ్స్ డేటా కోసం డార్క్వెబ్‌లో 1600కుపైగా సెర్చ్‌లు సాగిన‌ట్టు వెల్ల‌డైంది. రాజ‌కీయ నేత‌లు, సెల‌బ్రిటీల‌తో కూడిన వీవీఐపీల స‌మాచారం కూడా చోరీకి గురైన డేటాలో ఉంద‌ని స‌మాచారం.

ఎయిమ్స్‌కు చెందిన ఐదు స‌ర్వ‌ర్లు హ్యాక్ అయ్యాయ‌ని ఐఎఫ్ఎస్ఓ వ‌ర్గాలు తెలిపాయి. డేటా లీక్‌పై ఎఫ్ఎస్ఎల్ బృందం ప్ర‌స్తుతం త‌నిఖీలు నిర్వ‌హిస్తోంది. అయితే ఎలాంటి డేటా న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని ఐఎఫ్ఎస్ఓ అధికారులు పేర్కొన్నారు. హ్యాక‌ర్లు భారీ ఎత్తున డ‌బ్బును డిమాండ్చే సేందుకే ఈ ప‌నికి పాల్ప‌డి ఉంటార‌ని ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేసిన ఐఎఫ్ఎస్ఓ వ‌ర్గాలు తెలిపాయి. ఐఎఫ్ఎస్ఓ చేప‌ట్టిన తొలి హ్యాకింగ్ కేసు ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఎయిమ్స్ స‌ర్వ‌ర్ల‌ను టార్గెట్ చేసిన హ్యాక‌ర్లు రూ . 200 కోట్ల‌ను క్రిప్టోక‌రెన్సీలో ఇవ్వాల‌ని ప్ర‌తిష్టాత్మ‌క వైద్య సంస్ధ‌ను కోరిన‌ట్టు చెబుతున్నారు. హ్యాకింగ్‌తో దాదాపు మూడు, నాలుగు కోట్ల మంది రోగుల వివ‌రాలు, డేటా గోప్య‌త‌కు ముప్పు ముంచుకొచ్చింద‌ని అధికారులు గుర్తించారు. ఇక సర్వ‌ర్లు డౌన్ కావ‌డంతో ఎమ‌ర్జెన్సీ, అవుట్‌పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌, లేబొరేట‌రీ విభాగాల్లో మాన్యువ‌ల్‌గా విధులు చేప‌డుతున్నారు. హ్యాక్ కు గురైన వెంటనే సైబర్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై డ్యామేజ్‌ను కొంత వరకూ తగ్గించగలిగారు.

ఈ సైబర్ ఎటాక్ కు కారణమేంటి..?

ఇదిలా ఉంటే, దీనిపై కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ హ్యాకింగ్‌ను చిన్న విషయంలా తీసుకోకూడదు. దీని వెనకాల
కచ్చితంగా కుట్ర ఉండే ఉంటుందని అన్నారు. సీఈఆర్‌టీతో పాటు ఎన్‌ఐఏ, పోలీసులు కూడా ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారనిచెప్పారు. ఇలాంటి దాడులు పదే పదే జరగకుండా, ప్రజల వ్యక్తిగత సమాచారం ఎవరి చేతుల్లోకీ వెళ్లకుండా కేంద్రం Digital Data Protection Billను తీసుకొస్తున్నట్టు వివరించారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెడతామని అన్నారు. ప్రతి పౌరుడి వ్యక్తిగత ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లకుండా ఈ బిల్‌ రక్షిస్తుందని వివరించారు.

ఎయిమ్స్ సర్వర్ హ్యాక్‌కు గురైన వెంటనే రాజీవ్ చంద్రశేఖర్ఉ న్నత స్థాయి అధికారులతో మీటింగ్ పెట్టారు. త్వరలోనే సర్వర్‌ను రీస్టోర్ చేసి, పనులు సవ్యంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఇక NIA కూడా రంగంలోకి దిగి దీని వెనకాల ఉగ్రకుట్ర ఏమైనా ఉందా …అనే కోణంలో విచారణ కొనసాగిస్తోంది. కొందరు వీవీవఐపీల డిటెయిల్స్ కూడా ఈ సర్వర్‌లో ఉండటం వల్లే ఇది ఉగ్రవాదుల పనా..? అన్న అనుమానాలకు తావిస్తోంది. ఎంత టెక్నాలజీ వచ్చినా…ఎంత సెక్యూరిటీ పెంచుకుంటున్నా…యాప్స్‌, వెబ్‌సైట్స్‌ హ్యాక్‌కు గురి కాకుండా చూడలేకపోతున్నారు. ఏకంగా ప్రభుత్వ శాఖల సోషల్మీ డియా అకౌంట్లనూ హ్యాక్ చేసేస్తున్నారు. ఎయిమ్స్ సర్వర్ల హ్యాకింగ్ సంచలనం ఇంకా సద్దుమణగక ముందే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన ట్విటర్ హ్యాండిల్‌ హ్యాక్‌కు గురైంది. ఉన్నట్టుండి అకౌంట్‌లో అనుమానాస్పద ట్వీట్‌లు కనిపించాయి. క్రిప్టో వ్యాలెట్ Sui Walletని ప్రమోట్ చేస్తూ వరుసగా పోస్ట్‌లు వచ్చాయి.

అంతేకాక ఆ అకౌంట్ డీపీ త్రివర్ణ పతాకం ఉండగా…దాన్నీ మార్చేశారు హ్యాకర్లు. జెండా స్థానంలో Sui Wallet లోగోను సెట్ చేశారు. కవర్ పేజ్‌నూ మార్చేశారు. ఈ పోస్ట్‌తో పాటు మరెన్నో గుర్తు తెలియని అకౌంట్‌లను ట్యాగ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు అకౌంట్‌ను రికవరీ చేశారు. పాత పోస్ట్‌లన్నీ డిలీట్ చేశారు. సెక్యూరిటీ ఏజెన్సీలతో పాటు సైబర్ నిపుణులు దీనిపై పూర్తి స్థాయివిచారణ కొనసాగిస్తున్నారు. ఇక AIIMS సర్వర్‌లు హ్యాక్ చేసిన నిందితులు రూ.200 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. కానీ పోలీసులు మాత్రం దీన్ని ఖండించారు. సైబర్ టెర్రరిజం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఎయిమ్స్ పరిపాలనతో సంబంధం ఉన్న అధికారులతో పాటు, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్ఐసీ, జాతీయ ద‌ర్యాప్తు సంస్థ, ఢిల్లీ పోలీసులు, MHA సీనియర్ సభ్యులతో సహా ఇతర అధికారులు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశానికి హాజరయ్యారు.

వీవీఐపీలు, బ్యూరోక్రాట్లే టార్గెట్ గా ఈ దాడి సాగిందా..దీనిపై కేంద్రం ఏమంటోంది..?

త్వరలో ఎయిమ్స్ సర్వర్ సజావుగా పనిచేసేలా పునరుద్ధరిస్తామని ఎన్‌ఐసీ అధికారులు సమావేశంలో తెలిపారు. నివేదికల ప్రకారం, ఈ సంఘటనలో ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా అనే దానిపై ఎన్ఐఏ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. మూలాల ప్రకారం, అనేక మంది రోగుల సమాచారంతో పాటు, AIIMS సర్వర్‌లో VVIPల డేటా కూడా ఉంది. సైబర్ హ్యాక్ నేపథ్యంలో ఈ డేటా హాని కలిగించే అవకాశం ఉంది. దర్యాప్తు సంస్థల సూచన మేరకు ఎయిమ్స్‌లో ఇంటర్నెట్సే వలను నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. ఈ దాడితో ఓపీడీ, నమూనా సేకరణ సేవలతో పాటు, ఆపరేషన్లు వంటి ఇతర సేవలు ప్రభావితమయ్యాయి. ransomware సైబర్ దాడి కారణంగా బ్యాకప్ సిస్టం కూడా ప్రభావితం అయినట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.

సైబర్ దాడితో పలు ప్రాథమిక ఆంశాలు మారినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ సంఘటన ను ransomware దాడి అనీ, దీనిలో ఆన్‌లైన్ సేవలకు ప్రాప్యతను పునరుద్ధరించడానికి హ్యాకర్లు డబ్బు డిమాండ్ చేశారని మీడియాకు నివేదించింది. దీనిపై దోపిడీ, సైబర్‌ టెర్రరిజం కేసును ఢిల్లీ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ ఆపరేషన్స్‌ యూనిట్‌ నమోదు చేసింది. గత ఆరు రోజులుగా సర్వర్‌ మొత్తం హ్యాకర్ల చేతుల్లోనే ఉంది. దాంతో దవాఖానలో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆస్పత్రిలోని ఓపీడీ, ఐపీడీలకు వచ్చే రోగులు చికిత్స అందక ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ బుకింగ్, టెలికన్సల్టేషన్ వంటి డిజిటల్ సేవలు కూడా సర్వర్‌ అంతరాయంతో ప్రభావితమయ్యాయి. అయితే, ఈ సేవలన్నీ మాన్యువల్‌గా అమలు చేస్తూ రోగులకు ఇబ్బంది రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ఈ-హాస్పిటల్ కోసం ఈ-హాస్పిటల్ డాటాబేస్, అప్లికేషన్ సర్వర్లను ఎన్‌ఐసీ పునరుద్ధరించింది. ఎన్‌ఐసీ బృందం ఎయిమ్స్‌లో ఉన్న ఇతర ఈ-హాస్పిటల్ సర్వర్‌ల నుంచి ఇన్‌ఫెక్షన్‌ను స్కాన్ చేసి శుభ్రపరుస్తున్నాయి. నెట్‌వర్క్‌ను పూర్తిగా శుభ్రపరిచేందుకు మరో నాలుగు రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ-హాస్పిటల్‌ సేవలను దశలవారీగా కొనసాగించనున్నారు.ఎయిమ్స్ మెయిన్ సర్వర్లో మాజీ ప్రధానులు, మంత్రులు, బ్యూరోక్రాట్లు, న్యాయమూర్తులతో పాటు ఇతర ముఖ్యమైన పౌర సేవ అధికారులు, వీవీఐపీలు తదితర ప్రముఖ వ్యక్తుల డేటా ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఎయిమ్స్ ఆస్పత్రికి చెందిన సర్వర్లు, కంప్యూటర్లను యాంటీవైరస్సొ ల్యూషన్ లతో మళ్లీ సిద్ధం చేస్తున్నారు. మొత్తం ఐదు వేల కంప్యూటర్లలో ఇప్పటికి 1200 కంప్యూటర్లు యాంటీవైరస్ అందించబడ్డాయి.

ఎయిమ్స్ లో సర్వర్ల నెట్వర్క్ శానిటైజేషన్ ప్రక్రియ మరో ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ- హాస్పిటల్ సేవలను దశలవారీగా విస్తరించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం అన్నీ డిజిటల్ ఫ్లాట్ ఫాంలో చేస్తున్నందున హ్యాక్ కావడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఐదు సర్వర్లు హ్యాక్ కాగా, ఒకటి హాంకాంగ్ నుంచి హ్యాక్ చేసినట్లు వెల్లడవడంతో, చైనా హస్తం ఉందని దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. ఓవైపు సరిహద్దుల్లో భారత్ ను చికాకుపెడుతున్న చైనా.. మరోవైపు సైబర్ వార్ తో భారత్ ను దొంగ దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. గత ఏడాది జూన్‌లో గల్వాన్‌ దగ్గర భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత నాలుగు నెలలకు.. అంటే అక్టోబర్‌లో ముంబయిలోని ఒక పెద్ద పవర్ గ్రిడ్ ఫెయిలవడం వెనుక చైనా హస్తం కూడా ఉందనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, చైనా మీద సైబర్ దాడుల ఆరోపణలు కొత్త కాదు.

అమెరికా ఇంతకు ముందు కూడా చైనా సైబర్ దాడులకు పాల్పడిందని ఆరోపించింది. తమ దేశంలోని ఐదు ప్రైవేటు కంపెనీలు, ఒక కార్మిక సంస్థకు సంబంధించిన అంతర్గత పత్రాలు, వ్యాపార రహస్యాలను చైనా ఆర్మీ అధికారులు దొంగిలించారని 2014లో అమెరికా ఆరోపించింది. అమెరికాతోపాటూ ఆస్ట్రేలియా, వియత్నాం, తైవాన్ లాంటి దేశాలు కూడా చైనా రకరకాల సైబర్ దాడులు చేసినట్లు ఆరోపించాయి. చైనా దగ్గర సైబర్ దాడులు చేయడానికి ఒక ప్రత్యేకమైన ఆర్మీ ఉందని నిపుణులు చెబుతున్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ-స్ట్రాటజిక్స పోర్ట్ ఫోర్స్ పేరుతో ఇది పని చేస్తుందని సమాచారం. 2015లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆర్మీలో దీనిని ఏర్పాటు చేశారు. అత్యంత కీలకమైన వ్యవస్థల్ని హ్యాక్ చేయడం ద్వారా ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేయడమే డ్రాగన్ కంట్రీ అసలు ఉద్దేశంగా అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డ్రాగన్ కుయుక్తులకు హ్యాకింగ్ ఆయుధంగా మారిందన్న వాదన ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతోంది. ఇప్పుడు ఎయిమ్స్ సర్వర్ల హ్యాకింగ్ .. దేశంలోనివీవీఐపీలపైనే టార్గెట్ గా సాగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..

Must Read

spot_img