Homeఅంతర్జాతీయంచైనా, పాకిస్థాన్ కు భారత్ షాక్ !!!

చైనా, పాకిస్థాన్ కు భారత్ షాక్ !!!

భారత్ విదేశాంగ విధాన వ్యూహంతో ప్రపంచం మొత్తం ఇండియా వైపే చూస్తోంది.. భారత్ ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు.. డ్రాగన్ కంట్రీ చైనా సైతం కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకోవడం లేదు.. భారత్ అనుసరిస్తోన్న విదేశాంగ విధానంతో దేశానికి మేలే జరుగుతోందా..?

కళ్ళు ఉన్నవాడు ముందు చూస్తాడు.. దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు.. అని ఓ సినిమాలో చెప్పే డైలాగ్ భారత ప్రధాని మోదీకి సరిగ్గా సరిపోతుందని అంటున్నారు విశ్లేషకులు..అలాంటి దిమాక్ ఉంది కాబట్టే… మోడీ తన విధానాలతో దునియా మొత్తాన్ని భారత్ వైపు చూసేలా చేశాడు. చేస్తున్నాడు.. అందుకే పక్కలో బల్లెం లా ఉన్న పాకిస్తాన్ ఆర్థిక కష్టాలు పడుతోంది.. సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడే చైనా త్వరలో కాళ్ళ బేరానికి వచ్చే అవకాశం లేకపోలేదు.. ప్రతిదానికి కాళ్లల్లో కట్టలు పెట్టే అమెరికా ఇప్పుడు మనకు వంత పాడుతోంది.. ఇన్ని పరిణామాలు జరిగాయి అంటే దానికి కారణం ఒకే ఒక్కడు అదే నరేంద్ర మోడీ.. అతని టీం.. ముఖ్యంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్.

చైనా తన ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తుంది… ఎంతకైనా తెగిస్తుంది. తన, పర భేదాలు ఆ దేశానికి ఉండవు. ఈ నేపథ్యంలోనే చైనా పాకిస్తాన్ కు దగ్గర అయింది.. తన అవసరాల నిమిత్తం డబ్బు సహాయం చేసింది.. అసలే ఉగ్రవాద దేశం కాబట్టి పాకిస్తాన్ కూడా సిగ్గులేకుండా తీసుకుంది.. ఇదే సమయంలో భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేందుకు చైనా పాకిస్తాన్ కు, మరీ ముఖ్యంగా ఉగ్రవాదులకు సహాయం చేయడం మొదలు పెట్టింది.. ఈ క్రమంలో పాకిస్తాన్లో పలు విద్యుత్, నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించడం కూడా మొదలుపెట్టింది.. ఇదే సమయంలో గదార్ పోర్టును హస్తగతం చేసుకుంది.. దీని ద్వారా ఇతర దేశాలకు ఎగుమతులు కూడా ప్రారంభించింది..

అయితే ఈ పోర్టు వల్ల చైనాకు రవాణా వ్యయం చాలా తగ్గుతుంది.. అందుకే దీనిపై భారీగా పెట్టుబడి పెట్టింది.. అయితే రాను రాను పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దిగజారి పోతుండడంతో చైనాకు బకాయిలు రావడం లేదు.. పైగా రెండు మిలియన్ డాలర్ల సహాయం చేయమని పాకిస్తాన్ కొత్తగా అడుగుతోంది.. దీంతో చైనా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వేసి తన దారిన తను వెళ్ళిపోయింది.. అంతేకాదు పాత బకాయిలు చెల్లించమని పాకిస్తాన్ ను డిమాండ్ చేస్తుంది.

ఇక అనేక విషయాల్లో పాకిస్తాన్ కు అండదండగా ఉన్న చైనా… ఉగ్రవాదుల విషయంలో కూడా అదే పల్లవి పాడుతోంది.. ఇందుకు ఉదాహరణే అబ్దుల్ రెహమాన్ మక్కీ ఉదంతం.. మక్కి పేరు మోసిన ఉగ్రవాది.. ఇతడిని గ్లోబల్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చాలని భారత్ ఎప్పటి నుంచో ఐక్యరాజ్యసమితిలో కోరుతూ వస్తోంది. కానీ దీనికి చైనా మోకాలడ్డుతోంది. ప్రపంచ దేశాలు దీనికి ఓకే చెప్పినప్పటికీ… చైనా తనకు ఉన్న వీటో అధికారం ద్వారా తొక్కిపెడుతోంది.

అయితే గత కొంతకాలం నుంచి చైనాలో కోవిడ్ తీవ్రంగా ప్రబలుతోంది. జనాభాలో 70 శాతం ఈ వైరస్ బారిన పడ్డారు.. బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి నిలిచిపోవడంతో ప్రజలకు ఔషధాలు దొరకడం గగమయింది. దీంతో ఆ దేశానికి మందులు సరఫరా చేస్తామని భారత్ ప్రకటించింది. దెబ్బకు చైనా మనసు మార్చుకుంది. పాక్ దూరం జరగడం ప్రారంభించింది. మరో వైపు పాక్ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం ఇందుకు మరో కారణం. ఇక మక్కీ ని గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చాలనే డిమాండ్ కు గత కొంతకాలంగా మోకాలడ్డుతున్న చైనా… ఈసారి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.. దీనికి తోడు అమెరికా కూడా భారత్ డిమాండ్కు తల ఊపడంతో మక్కీ పాక్ దాటి బయటకి వెళ్ళ లేదు. మరో వైపు భారత్ విదేశాంగ విధానాల వల్ల చైనా కూడా మోకరిల్లే పరిస్థితి ఎంతో దూరంలో లేదు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భూగోళం నలుమూలలా పర్యటిస్తూ ఉన్నారు. దానివల్ల అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ఠ పెరుగుతోందనటంలో సందేహం లేదు. భారత విదేశాంగ విధానం ఇంకా ద్వైపాక్షికత మీద, ప్రాంతీయత మీదే కేంద్రీకృతమైందని చాలా మంది నిపుణులు అంగీకరిస్తున్నారు. భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా అవతరించే సామర్థ్యం గల దేశంగా ఇప్పుడు గుర్తిస్తున్నారు. కానీ ఆ సామర్థ్యం ఇంకా సంతరించుకోలేదు.

ఐక్యరాజ్యసమితిలో విశిష్ట బృందమైన ఐదుగురు సభ్యుల భద్రతామండలిలో తనకు శాశ్వత సభ్యత్వం సాధించటం కోసం భారత్ ప్రయత్నిస్తోంది. భారత్ తన లక్ష్యాన్ని అందుకునేందుకు సాయం చేయటానికి అమెరికా, బ్రిటన్ వంటి ప్రపంచ శక్తులు ప్రయత్నించాయి కూడా. అయితే.. ప్రపంచంలో తనకు న్యాయంగా దక్కాలని నమ్ముతున్న ఆ స్థానాన్ని సొంతం చేసుకోవటంలో భారతదేశం వెనుకంజ వేసినట్లు కనిపిస్తోంది. భారతదేశం తనను తాను ప్రపంచ శక్తిగా చాటేందుకు ఒక అవకాశముంది.

ఇజ్రాయెల్ – పాలస్తీనా అథారిటీల మధ్య అమెరికా స్థానంలో మధ్యవర్తి పాత్రను తాను భర్తీ చేయటానికి భారతదేశం ప్రయత్నించాలని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జెరూసలేం భవిష్యత్ హోదా విషయంలో ఇజ్రాయెల్ పక్షం వహించిన అమెరికాతో సంప్రదింపులు జరపటానికి పాలస్తీనియన్లు తిరస్కరించటంతో ఈ అవకాశం లభించింది.. ఈ విషయంలో భారత వైఖరి స్పష్టమైనదే.. 1967 ముందున్న సరిహద్దులు ప్రాతిపదికగా రెండు దేశాల పరిష్కారాన్నే భారత్ ఎప్పుడూ సమర్థిస్తోంది. ఆ విషయం ఇజ్రాయెల్‌కు తెలుసు.

జెరూసలేం అంశం మీద భారత్ తనపక్షం వహించబోదని కూడా ఇజ్రాయెల్‌కు తెలుసు. ఇజ్రాయెల్‌తో బలపడుతున్న భారత సంబంధాల గురించి పాలస్తీనియన్లకు కూడా తెలుసు. భారత్ తన రక్షణ, భద్రత సామర్థ్యాలను మెరుగుపరచుకోవటానికి ఇజ్రాయెల్ మీద చాలా అధారపడిందన్న వాస్తవాన్ని పాలస్తీనా అంగీకరించింది. పశ్చిమాసియాలోని ఈ రెండు దేశాలతోనూ భారత్ పారదర్శక లావాదేవీలు నెరపటం వాటి విశ్వాసాన్ని సముపార్జించింది. అయితే.. భారతదేశం ముందుగా ఉన్నతంగా ఆలోచించటం, ద్వైపాక్షికతను మించి ముందుకు సాగటం చేయాల్సిన అవసరం ఉందని విదేశాంగ విధాన నిపుణులు చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

Must Read

spot_img