నిన్న మొన్నటి వరకు ఇంటర్నెట్ కు మరో పేరు గూగుల్ అనే విధంగా ఉండేది.. అంతలా గూగుల్ సెర్చ్ ఇంజిన్ యూజర్లకు చేరువైంది.. కానీ.. ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ కు చెందిన చాట్ జీపీటీ గూగుల్ కు సవాల్ విసురుతోంది. ఈ రోజుల్లో ఏదైనా సందేహం వస్తే.. ఎవరైనా ఠక్కున ఇచ్చే సలహా గూగుల్ చేయమని.. ఇంటర్నెట్ కి గూగుల్ మరో పేరులా మారిపోయింది. అంతలా గూగుల్ సెర్చ్ ఇంజిన్ యూజర్లకు దగ్గరైంది. గత కొన్నేళ్లుగా టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. కానీ OpenAI, మైక్రోసాఫ్ల్ కలయికలో వచ్చిన చాట్‌జిపిటి గూగుల్‌కు సవాలు విసురుతోంది. మైక్రోసాఫ్ట్ తమ బింగ్ సెర్చ్ ఇంజిన్‌కు చాట్‌జిపిటి సపోర్ట్ ను యాడ్ చేసింది. ఈ మార్పు తర్వాత బింగ్‌కి యూజర్ల ట్రాఫిక్ పెరిగిందని సిమిలర్ వెబ్ అనలిటిక్స్ డేటా చెబుతోంది. గూగుల్‌కు గట్టిపోటీ ఇస్తోందని పేర్కొంది.
మైక్రోసాఫ్ట్ ఫిబ్రవరి 7న AI- పవర్డ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. అప్పటి నుంచి బింగ్ పేజీ విజిట్స్ 15.8 శాతం పెరిగాయి. మరోవైపు Alphabet In యాజమాన్యంలో ఉన్న గూగుల్ పేజీ విజిట్స్ అదే కాలంలో దాదాపు ఒక శాతం తగ్గాయి. ఏఐ టెక్నాలజీని వినియోగించుకోవడంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. చాట్‌జిపిటి లాంచ్ అయిన వెంటనే గూగుల్ తన బార్డ్ చాట్‌బాట్ గురించి రివీల్ చేసింది. రెండు కంపెనీలు ఏఐ టెక్నాలజీపై పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి.
అయితే తాజా గణాంకాలు గూగుల్‌తో జరుగుతున్న పోటీలో మైక్రోసాఫ్ట్ పైచేయి సాధించిందని చెబుతున్నాయి. చాట్‌జిపిటి టెక్నాలజీ సపోర్ట్‌ను మైక్రోసాఫ్ట్ తన ప్రొడక్టులకు యాడ్ చేస్తోంది. ఏఐ రంగంలో చాట్‌జిపిటిని నిపుణులు ‘ఐఫోన్ మూమెంట్’తో పోలుస్తున్నారు. 120 బిలియన్ల డాలర్లకు పైగా విలువైన సెర్చింగ్ మార్కెట్‌లో చాలా సంవత్సరాలుగా 80 శాతానికి పైగా వాటాని గూగుల్ శాసిస్తూ వచ్చింది. తాజా గణాంకాలు మైక్రోసాఫ్ట్ ప్రాబల్యాన్ని సంపాదించడానికి అరుదైన ప్రారంభాన్ని సూచిస్తున్నాయి. బింగ్.. రాబోయే నెలల్లో సెర్చ్ మార్కెట్‌లో ఎక్కువ వాటాను పొందే అవకాశం ఉంది. గూగుల్ తాను అందిస్తున్న సేవల్లో ఏఐ టెక్నాలజీని చేర్చడం ఆలస్యమవుతున్న కొద్దీ మైక్రోసాఫ్ట్ ప్రభావం పెరుగుతూ ఉంటుంది.

ఫిబ్రవరి నుంచి ఏఐ పవర్డ్ బింగ్ ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ వినియోగదారులకు అందుబాటులో ఉంది. గూగుల్ తన చాట్‌బాట్ బార్డ్‌కు గత మంగళవారం లిమిటెడ్ యాక్సెస్ అందించింది. గూగుల్ మార్కెట్ షేర్‌లో బింగ్ పదో వంతు కంటే తక్కువగా ఉంది. ఒక శాతం లేదా రెండు శాతం వినియోగదారులు చేరినా మైక్రోసాఫ్ట్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. AI టెక్నాలజీని యాడ్ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా బింగ్ యాప్ డౌన్‌లోడ్‌లు ఎనిమిది రెట్లు పెరిగాయని యాప్ రీసెర్చ్ కంపెనీ Data.ai పేర్కొంది. అదే సమయంలో గూగుల్ సెర్చ్ యాప్ డౌన్‌లోడ్‌లు రెండు శాతం తగ్గాయి.
సెర్చ్ మార్కెట్ లో మైక్రోసాఫ్ట్ ఇటీవల లాభాలు పొందినప్పటికీ, 2000ల ప్రారంభంలో టాప్ సెర్చ్ ఇంజిన్ యాహూను అధిగమించిన గూగుల్, త్వరగా కోలుకోగలదని కొందరు అభిప్రాయపడ్డారు. చాలా కాలంగా గూగుల్ టాప్ ప్లేస్ నిలబెట్టుకున్న తీరును గుర్తు చేస్తున్నారు. ఇతరుల కంటే గూగుల్ ర్యాంకింగ్ అల్గోరిథం పోటీతత్వాన్ని కలిగి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యాహూని దాటడంలో గూగుల్ అల్గారిథం సహాయపడిందని పేర్కొంటున్నారు.
కొన్ని నెలల క్రితమే గూగుల్ కంపెనీ Bard చాట్‌బాట్‌ను అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు దాన్ని తొలిసారి లిమిటెడ్ గా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే కొంతమంది పిక్సెల్ వినియోగదారులకు బార్డ్‌ను టెస్ట్ చేయడానికి గూగుల్ ఆహ్వానం పంపింది. యూఎస్, యూకేలోని పరిమిత సంఖ్యలో వినియోగ దారులకు మాత్రమే బార్డ్ అందు బాటులో ఉంటుంది. పిక్సెల్ సూపర్ ఫ్యాన్స్ సహా కొందరు ఇప్పటికే దీనికి యాక్సెస్ పొందారు. ఇతరులు వెయిట్ లిస్ట్‌లో జాయిన్ అయి బార్డ్‌ని టెస్ట్ చేసే అవకాశం పొందొచ్చు. ఈ అవకాశం కూడా కేవలం US, UK లోని వినియోగ దారులకు మాత్రమే.
గూగుల్ అనౌన్స్‌మెంట్ లో ఉన్న స్క్రీన్ షాట్‌లలోని బార్డ్ ఇంటర్‌ఫేస్ ను గమనిస్తే.. అది బింగ్ ఏఐ ని పోలి ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రతి రెస్పాన్స్ కింద థంబ్స్ అప్, థంబ్స్ డౌన్, రిఫ్రెష్ యారో, గూగుల్ ఇట్ వంటి నాలుగు బటన్ లు ఉన్నాయి. వ్యూ అదర్ డ్రాఫ్ట్స్ బటన్ ద్వారా వినియోగదారులు ఇతర రెస్పాన్స్‌లను కూడా చూసే ఫీచర్ ఉంది. ఎర్రర్స్‌ను నివారించడానికి Google “గార్డ్‌రైల్స్”ని అమలు చేస్తోంది. అయినా బార్డ్ ఎల్లప్పుడూ ఖచ్చితమైన ప్రతి స్పందనలను అందించకపోవచ్చని కంపెనీ హెచ్చరించింది.
బార్డ్‌ను మెరుగుపరచడంలో సహాయపడటానికి గూగుల్ తన వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను సేకరించే పనిలో ఉంది. కోడింగ్, మల్టిపుల్ లాంగ్వేజ్‌లు, మల్టీమోడల్ ఎక్స్‌పీరియన్సెస్ వంటి సామర్థ్యాలను Bard కు జోడించే పనిలో గూగుల్ ఇంజినీర్లు బిజీబిజీగా ఉన్నారు. గూగుల్ ప్రకారం.. బార్డ్ అనేది గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కి ప్రత్యామ్నాయం కాదు. గూగుల్ సెర్చ్ ఫంక్షన్‌కి ఇది కేవలం సహకరిస్తుంది. చాట్ జీపీటీ విడుదలైన అనతి కాలంలోనే కోట్ల మంది నుంచి ఆదరణ పొందినట్లు ఇటీవల వెల్లడైంది. వ్యాపారపరంగా ఇది గూగుల్ కు పెద్ద సవాలనే చెప్పుకోవాలి.

దీంతో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఫిబ్రవరి 6న బార్డ్ అనే ప్రయోగాత్మక సంభాషణ AI సేవను ఆవిష్కరించింది. భారత దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తాను సైతం చాట్ జీపీటీ వినియోగానికి బానిసనయ్యానంటూ ఇటీవల కామెంట్ చేయటంతో ఇండియాలోనూ దానికి పెరుగుతున్న ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థమౌతోంది. రానున్న మరికొన్ని వారాల్లో ప్రజలకు మరింత విస్తృతంగా Bard ను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్లు ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్ బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించారు. అయితే దీనికి ముందు మెుదట దీనిని “trusted testers” వినియోగిస్తారని తెలిపారు. అందువల్ల దీనిని మరింతగా
మెరుగుపరిచేందుకు వీలుంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
గూగుల్ తన బార్డ్ ప్రాజెక్టును అట్లాస్ పేరుతో తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. బార్డ్ కూడా చాట్ జీపీటీ మాదిరిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేస్తుంది. దీనిని లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్ ఆధారంగా రూపొందించారు. ఇది ఎవరైనా యూజర్ ఒక ప్రశ్న వేయగానే దానికి సంబంధించి ఇంటర్నెట్ లో ఉన్న అత్యుత్తమ తాజా సమాచారాన్ని సేకరించి అందిస్తుంది. చాలా ఏళ్లుగా ఇంటర్నెట్ ప్రపంచాన్ని శాసిస్తోన్న గూగుల్ సెర్చ్ ఇంజిన్ కు పోటీగా మార్కెట్లో రోజురోజుకు దూసుకెళుతోంది ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ కలయికలో వచ్చిన చాట్ జీపీటీ.. గూగుల్ యూజర్లపై ఇప్పటికిప్పుడు తీవ్ర ప్రభావం చూపించకపోయినప్పటికీ.. రానున్న కాలంలో గూగుల్ మార్కెట్ ను దెబ్బతీసే అవకాశం లేకపోలేదు.. ఇప్పటికే.. గూగుల్ కస్టమర్లను తనవైపుకు ఆకర్షిస్తోన్న చాట్ జీపీటీ బింగ్ యూజర్ల సంఖ్య పెరుగుతోందని పలు విశ్లేషణలు చెబుతున్నాయి.. ప్రస్తుతానికి గూగుల్ ప్రవేశపెట్టిన బార్డ్ ను ఇంకా ఆధునీకరించే పనిలో ఉన్నారు.. చాట్ జీపీటీకి యూజర్ల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది.. మరి.. చూడాలి భవిష్యత్ లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ ను చాట్ జీపీటీ బింగ్ రిప్లేస్ చేస్తుందో లేదో..
ఇంటర్నెట్ రంగాన్ని శాసిస్తోన్న గూగుల్ కు పోటీగా విడుదలైన చాట్ జీపీటీ అనతికాలంలోనే కోట్లాది మంది యూజర్ల ఆదరణ పొందింది.. ఇంకా యూజర్లను పెంచుకుంటోంది. బింగ్.. రాబోయే నెలల్లో సెర్చ్ మార్కెట్‌లో ఎక్కువ వాటాను పొందే అవకాశం ఉంది.