Homeఆంధ్ర ప్రదేశ్ఏపీలో గవర్నర్ మార్పు .. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది

ఏపీలో గవర్నర్ మార్పు .. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది

ఏపీ గవర్నర్ మార్పు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విశ్వభూషణ్ హరిచందన్ అనూహ్య మార్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన స్థానంలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అబ్ధుల్ నజీర్ నియామకం కూడా ఓకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విశ్వభూషణ్ హరిచందన్ మార్పును కూడా ఎవరూ ఊహించలేదు. గవర్నర్ ను మారుస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. గవర్నర్ గా చాలామంది పేర్లు కేంద్రం పరిశీలిస్తోందన్న ప్రచారం చాలాసార్లు జరిగింది. కానీ అదంతా ఉత్త ప్రచారమే అని అంతా లైట్ తీసుకున్నారు.

కానీ ఏ హడావుడి లేకుండా.. కనీసం లీకులివ్వకుండా ఏకంగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి నియామకం వెనుక బీజేపీ రాజకీయం ఎదైనా ఉందా అన్న అనుమానం కలుగుతోంది. అయితే అధికార వైసీపీ కానీ.. విపక్ష టీడీపీ కానీ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. నియామకంపై హర్షం వ్యక్తం చేయలేదు. అభ్యంతరం వ్యక్తం కాలేదు. అయితే దీనిపై పవన్ స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో న్యాయవ్యవస్థపై అధికార పార్టీ అనుచిత వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. పాలనలో న్యాయవ్యవస్థ ప్రమేయాన్ని సాక్షాత్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అటు వైసీపీ శ్రేణులు కూడా సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థ తీరును ప్రశ్నించాయి. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఒకరిద్దరు నేతలు జైలు గడప కూడా తొక్కారు. ఇటువంటి సమయంలో ఒక న్యాయ నిపుణుడ్ని గవర్నర్ గా నియమించడంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ నియామకంతో బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. గవర్నర్ ద్వారా రాజకీయాలు చేసే స్థాయి బీజేపీకి ఏపీలో లేదు. అటువంటప్పుడు ఈ గవర్నర్ మార్పు ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎవరికి అనుకూలమన్న ప్రశ్న కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది.

ఈ మాజీ న్యాయమూర్తిని గవర్నర్ గా నియమించాలనుకుంటే ఏకంగా చత్తీస్ గడ్ కు పంపించవచ్చు కదా అన్న ప్రశ్న కూడా ఎదురవుతోంది. గత నెల 4న అబ్ధుల్ నజీర్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. ఇంతలోనే ఆయన్ను ఏపీ గవర్నర్ గా నియమించడం వెనుక ఉన్న మతలబు ఏమిటన్నది ఇప్పుడు చిక్కుముడిగా మారింది. ఈ విషయంలో కేంద్రం కనీసం ఏపీ ప్రభుత్వ అభిప్రాయం తీసుకుందా? అన్న మాటకు కూడా సమాధానం కరువవుతోంది. ప్రస్తుతానికి గవర్నర్ నియామకంపై వైసీపీ నేతలు గుంభనంగా ఉన్నారు. అటు ప్రతిపక్షం టీడీపీ సైతం ఆసక్తిగా గమనిస్తుందే తప్ప ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు.

అసలు మార్పు .. బీజేపీ ఉద్దేశ్యం ఏమిటన్నది ఒకటి రెండు నెలలో తేలిపోతుంది. అప్పటి వరకూ వేచిచూసే ధోరణిలో ఆ రెండు పార్టీలు ఉన్నట్టుతెలుస్తోంది. తెలంగాణ మాదిరిగా ఏపీలో బీజేపీకి ఆ పరిస్థితి లేదు. కనీసం శాసనసభలో సంఖ్యాబలం లేదు. అటువంటప్పుడు గవర్నర్ ద్వారా రాజకీయ నిర్ణయాలతో ప్రభావితం చేయాలని బీజేపీ భావిస్తుందా? అన్నది ప్రశ్నే. అటు తాజాగా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తికి గవర్నర్ పదవి కట్టబెట్టడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా ఈ నిర్ణయం ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇలా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు పదవులు పరంగా లబ్ధిపొందడం ఇది మొదటిసారి కాదు.బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కేరళ గవర్నర్ గా సుప్రీం కోర్టు రిటైర్డ్ సీజే సదానందంను నియమించారు. తరువాత రంజన్ గొగోయ్ కు ఏకంగా రాజ్యసభకు పంపించారు. ఇప్పుడు అబ్ధుల్ నజీర్ ను సైతం అదే మాదిరిగా ఏపీ గవర్నర్ గా నియమించారు. అయితే ఏరికోరి ఏపీకి న్యాయ నిపుణుడ్ని గవర్నర్ గా పంపించడం మాత్రం సస్పెన్స్ గా మారింది. ఇది ఎవరి ప్రయోజనాల కోసమన్నది చర్చనీయాంశంగా మారింది.

ఒక వేళ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ కు గవర్నర్ గిరీ ఇవ్వాలనుకుంటే.. చత్తీస్ ఘడ్‌కే నియమించి వచ్చు కదా.. ఏపీ నుంచి భిశ్వభూషణ్ ను బదిలీ చేసి మరీ ఆయనకు ఏపీలోనే ఎందుకు చోటు కేటాయించారు అన్నది అసలు టాపిక్ గా మారింది. ఈ విషయంలో అటు వైసీపీ కానీ.. ఇటు టీడీపీ కానీ ఈ నియామకంపై ఎలాంటి హర్షం కానీ వ్యతిరేకత కానీ వ్యక్తం చేయలేని పరిస్థితి. ఎందుకంటే. ..అసలు ఈ నియామకం ఉన్న వెనుక మోటో ఏమిటి అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో గవర్నర్ ను మార్చడం అనూహ్య పరిణామమే. కానీ ఇది ఎవరికి అనుకూలంగా చేసిన నియామకం అన్నది మాత్రం అంతు చిక్కడం లేదు. ఏపీలో బీజేపీ ఉనికి లేదు. తెలంగాణ గవర్నర్ చేసినట్లుగా చేస్తే బీజేపీకి వచ్చే లాభమేమీ ఉండదు. మరి ఎందుకు హఠాత్తుగా ఈ మార్పు ? సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వెంటనే అబ్దుల్ నజీర్ ను గవర్నర్ గా నియమించడం అనేక విమర్శలకు కారణం అవుతోంది.

న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా కేంద్రం చర్యలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇలా పదవి విరమణ చేసిన వెంటనే కేంద్రం నుంచి లబ్ది పొందిన ఇతర న్యాయమూర్తులను గవర్నర్లుగా నియమించడం ఇదే ప్రథమం కాదు. ఏపీ గవర్నర్ మార్పు వెనుక మోటో ఉందా లేదా అన్నది ఆయన వ్యవహశైలి బట్టి తెలిసిపోవచ్చు.

ఉన్నట్టుండి గవర్నర్ మార్పు అనేది ఏపీ ప్రభుత్వానికి ఊహించని పెద్ద షాకే అని చెప్పుకోవచ్చు. బీజేపీ కాకుండా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండే రాష్ట్రాల్లో గవర్నర్లకు-ప్రభుత్వాలకు మధ్య నిత్యం వివాదాలు నడిచేవి. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు గవర్నర్ల వ్యవహారం ఎంతవరకూ వెళ్లిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలో అయితే అందుకు పూర్తి విరుద్ధంగా పరిస్థితి ఉండేది. హరిచందన్.. బీజేపీతో అనుబంధం ఉన్న నాయకుడు అయినప్పటికీ..సీఎం జగన్‌తో ఎక్కడా ఎలాంటి విబేధాలు లేకుండా మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా వీరిద్దరి మధ్య ఎక్కడా పొరపొచ్చాలు వచ్చిన సందర్భాలు లేవు. అయితే.. ప్రతి విషయంలోనూ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుండేవారు. అందుకే ఈయన్ని ఏపీ గవర్నర్‌గా తొలగించిన కేంద్రం.. ఛత్తీస్‌గఢ్‌కు పంపిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ఇలా ఒకట్రెండు కాదు.. చిత్ర విచిత్రాలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఏపీలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఊహించని రీతిలో గవర్నర్‌ను మార్చడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఈ మార్పు వెనుక ఏదైనా రాజకీయ కోణం కూడా ఉండొచ్చని నెట్టింట్లో చర్చించుకుంటున్నారు. కొత్తగా వచ్చే గవర్నర్‌ ఎలా ఉంటారు..? ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటారా..? లేకుంటే తెలంగాణ,
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో జరిగినట్లు ఇక్కడ కూడా పరిస్థితులు ఉంటాయా..? అనేది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు.. మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇవ్వడం.. ప్రభుత్వం చెప్పినట్లుగా వినడం వల్లే ప్రధాని ఆశీస్సులతో ఇలా గవర్నర్‌ అయ్యారని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వంతో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎలా ఉంటారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కొత్త గవర్నర్ రాకతో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు ఎదరవుతాయన్న చర్చ జోరందుకుంది.అయోధ్యపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పిన ఐదుగురున్న బెంచ్ లో జస్టిస్ నజీర్ కూడా ఒకరు. ఆ తర్వాత త్రిబుల్ తలాక్ కేసును విచారించిన వారిలో జస్టిజ్ నజీర్ ఉన్నారు. న్యాయవ్యవస్థలో విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జస్టిస్ నజీర్ ను ఏపీ రాష్ట్ర గవర్నర్ గా నియమించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మార్పు వల్ల బీజేపీకి ఒనగూరే లాభం ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. కొత్త గవర్నర్ నియామకంపై అటు వైసీపీ సర్కార్ సైతం టెన్షన్ పడుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Must Read

spot_img