సెల్ ఫోన్ వాడకం మనిషి జ్ఞాపకశక్తిని చంపేస్తోందా..? ఇంతకూ పరిశోధనలు ఏం చెబుతున్నాయి..? ఫోన్ దగ్గరుంటే బ్రెయిన్ చురుకుగా పనిచేయదా..? అతిగా సెల్ ఫోన్ వాడకం మతిమరుపునకు కారణమవుతోందా..? సెల్ ఫోన్ వాడకంతో మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతోందా…?
స్మార్ట్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ప్రతి చిన్న విషయానికి పక్కన ఉండాల్సిందే… టైం చూసే దగ్గర నుంచి మొదలుపెడితే గేమ్స్, సినిమాలు చూసే వరకు ప్రతి దానికి కూడా మొబైల్ కు అలవాటు పడిపోయాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనుషులు బానిసలుగా మారిపోతున్నారు అది వారికి తెలియకుండానే జరుగుతుంది, ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యక్తి కి తన ఫోన్ ఒక 10 నిమిషాలు కనిపించకపోతే ఎక్కడో పెట్టి మరిచిపోతే ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది.
స్మార్ట్ ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతకుమించి నష్టాలు కూడా ఉన్నాయి. ప్రకృతిని నాశనం చేయడం సమాజంలో విషబీజాలు సృష్టించడం దీనితో క్షణాల్లో చేసేయొచ్చు. అలానే ఎక్కడో ఎవరికో ఏదో ఆపద ఉంటే సోషల్ మీడియా యాప్ ద్వారా స్పందించే వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే దీనికి రెండు వైపులా పదును ఉంటుంది.
చాలా కుటుంబాలు ఇది వచ్చాక అనవసర సంబందాలకు తెరతీసి కోర్టు మెట్లు ఎక్కి విడిపోతున్న సంఘటనలు మనం చూస్తున్నాం.
ప్రపంచంలో టెక్నాలజీ రోజురోజుకు పెరుగుతోంది.. అందులో సెల్ ఫోన్ వినియోగం అయితే.. మరీ విపరీతంగా పెరుగుతోంది.. సెల్ ఫోన్ లో ఎక్కువ సమయం గడుపుతూ మునిగిపోయేవారు ఘననీయంగా పెరుగుతున్నారు. అయితే.. కొందరు అధిక సెల్ ఫోన్ వినియోగం నుంచి బయటపడాలని భావిస్తున్నప్పటికీ.. అది వారికి సాధ్యం కావడం లేదన్నది మెజార్టీ వర్గం ప్రజల భావన.. ఇక మరికొందరైతే.. సెల్ ఫోన్ ను తక్కువగా ఉపయోగించేందుకు ఏకంగా ఫోన్ లను స్విచ్ ఆఫ్ చేస్తున్నప్పటికీ.. మళ్లీ ఏదో ఒక అవసరం కోసం ఫోన్ ను ఉపయోగించక తప్పడం లేదు.. ఫోన్ లేకుండా కొంత సమయం కూడా ఉండలేని పరిస్థితి ఉంటుందంటే ఆశ్చర్యం లేదు.. సాధారణంగా ఫ్రెండ్స్ తో చాటింగ్, ఆఫీస్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇతరత్రా కారణాలతో సెల్ ఫోన్ కు అంటిపెట్టుకుని ఉండిపోతున్నారు.. అసలు సెల్ ఫోన్ లేకపోతే జీవితంలో ఏదో కోల్పోయామన్న బాధ వారి ముఖంలో కనిపిస్తుందంటే.. సెల్ ఫోన్ పై ఆధారపడటం ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు..
అమెరికాలో తమ మొబైల్‌ను సగటున రోజుకు 344 సార్లు అంటే ప్రతి 4 నిమిషాలకు ఒకసారి చూస్తారని ఇటీవలి రిపోర్టు ఒకటి తెలిపింది.
మొత్తంగా రోజుకు దాదాపు 3 గంటలు వాళ్లు ఫోన్ తోనే గడుపుతారని వెల్లడించింది. మనలో చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే ఏదైనా పని మీద మొబైల్ ఓపెన్చే సినపుడు.. ఈ మెయిల్ లేదా సోషల్ మీడియా ఫీడ్‌లను చూస్తూ స్కోలింగ్ చేస్తూ సమయం గడుపుతాం. ఇది ఒక విష వలయం. మన ఫోన్‌లు ఎంత ఉపయోగకరంగా మారితే అంత ఎక్కువగా వాటిని ఉపయోగిస్తాం. మనం వాటిని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తామంటే చేతిలో ఉన్న ఏ పనికైనా మన ఫోన్‌లను తీయడానికి దారితీసేలా నాడీ వ్యవస్థ పనిచేసేలా ఉంటుంది. మనకు అవసరం లేనప్పుడు కూడా మన ఫోన్‌ని తనిఖీ చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది.
ప్రతీ ఏడాది మొబైల్ వాడకం అనేది పెరిగిపోతూనే ఉంది. పదే పదే ఫోన్ చెక్ చేయడం, నోటిఫికేషన్‌ని చూడటం వంటి పరధ్యానం మంచిది కాదని మనకూ తెలుసు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. ఇది మనలోని జ్ఞాపకశక్తిని, దాని పనితీరును దెబ్బతీస్తుందనీ తెలుసు. ఇక అత్యంత ప్రమాదకరమైన ఉదాహరణలలో డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడటమనేది ఒకటి. ఫోన్‌లో మాట్లాడటమనేది రోడ్డుపై డ్రైవర్లు నెమ్మదిగా ప్రతి స్పందించడానికి దారితీస్తుందని ఒక అధ్యయనం వెల్లడించింది. ఏదైనా టాస్క్ చేస్తున్నపుడు ఫోన్‌లో డింగ్ అనే నోటిఫికేషన్ శబ్దం విన్న వాళ్ల పనితీరు తక్కువగా ఉంటున్నట్లు పరిశీలనలో తేలింది. ఆ సమయంలో వాళ్లు ఫోన్ ఉపయోగించలేదు కూడా. ఏదైనా టాస్క్ చేస్తుండగా మాట్లాడటానికి లేదా మెసేజ్ చేయడానికి ఫోన్‌ని ఉపయోగించినపుడు కూడా ఈ ప్రభావం దాదాపుగా అలాగే ఉంటోంది. ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే కాకుండా దాని ఉనికి సైతం యూజర్లను ప్రభావితం చేస్తుంది.
స్మార్ట్ ఫోన్ రావడం వల్ల చాలా కుటుంబాల్లో కలహాలు మొదలయ్యాయి, ఒకప్పుడు ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి తో మరో వ్యక్తి కొంత సమయాన్ని గడిపేవారు. అలానే ప్రతి విషయాన్ని కూడా ఇంట్లోని సభ్యులతో పంచుకునేవారు. మంచైనా చెడైనా ఏదైనా దాచుకోకుండా కుటుంబ పెద్దకు లేదా అన్న తమ్ములకు మరియు అక్క చెల్లెలు కో చెప్పుకునేవారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది.
స్మార్ట్ ఫోన్ సోషల్మీ డియా కలయిక వల్ల కొత్త పరిచయాలు దీని వేదికగా వస్తున్నాయి.
ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా ఫ్రెండ్స్ గా ఏర్పడి కుటుంబంలో ఉన్నటువంటి అన్ని విషయాల్ని వ్యక్తిగత విషయాలను ఎవరో తెలియని వ్యక్తికి చెప్పుకోవడం ద్వారా అవి చివరికి ఏదో ఒక రోజు మీ మెడకు చుట్టుకుంటాయి. ఈ రోజుల్లో చాలామంది నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నారు. పాతకాలం రోజుల్లో ఏ ఒక్కరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడే వారు కాదు.. కారణం అనుకున్న సమయానికి నిద్రపోయేవారు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని ఎప్పుడు నిద్రపోతున్నారో.. ఎప్పుడు నిద్ర లేస్తున్నారో కూడా తెలియడం లేదు. సినిమాలు, టివి షోలు లేదంటే నెట్ ఫ్లిక్స్ సిరీస్ లు అది కాదంటే చాటింగ్ కారణం ఏదైనప్పటికీ నిద్రపోయే సమయం 10 గంటలకు పడుకోవడం నుంచి అర్ధరాత్రి ఒంటిగంటకు మారింది.
దీనికి కారణం చేత అనేకమైన అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. కేవలం స్మార్ట్ ఫోన్ వాడకం కారణంగానే ఈ రోజున వందకి 70 మంది యూజర్లు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
ఇటీవల పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. దానిలో పార్టిసిపెంట్స్ తమ ఫోన్‌లను పక్కన పెట్టమని నిర్వాహకులు కోరారు. అంటే మొబైల్ కనిపించేలా లేదా సమీపంలో కనిపించకుండా లేదా మరొక గదిలో ఉంచాలని సూచించారు.. పార్టిసిపెంట్స్‌కు మెమరీ పవర్, వారి సామర్థ్యం, దృష్టిని పరీక్షించడం, సమస్య-పరిష్కారాలు తదితర టాస్క్‌లు ఇచ్చారు. ఫోన్‌లు సమీపంలో కాకుండా మరొక గదిలో ఉంచుకున్న పార్టిసిపెంట్స్ టాస్కులు మెరుగ్గా పూర్తి చేసినట్లు పరిశోధకులు కనుగొన్నారు. టాస్కులు చేస్తుండగా చాలా మంది పార్టిసిపెంట్స్ తమ మొబైల్స్ గురించి ఆలోచించలేదన్నదీ నిజమే. ఫోన్‌తో
ఎక్కువసేపు గడిపితే “బ్రెయిన్ డ్రెయిన్” కారణమవుతుంది. మన ఫోన్‌ని చూడాలా? వద్దా? అని నిరంతరం దిక్కులు చూడటమనేది మన మెదడును పనిలో దృష్టి కేంద్రీకరించనివ్వదు. ఈ దృష్టి మరల్చడం అనేది పని చేయడాన్ని కష్టతరం చేస్తుంది. మొబైల్ పూర్తిగా వేరే గదిలో ఉంచడం మాత్రమే దీనికి “పరిష్కారం” అని పరిశోధకులు కనుగొన్నారు.
కాగా, డివైజ్‌లపై ఆధారపడటం అనేది కొన్ని విపరీత పోకడలకు కూడా దారితీయవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ఉదాహరణకు ఫోన్‌లపై ఆధారపడటం వలన మనకు జ్ఞాపకశక్తి క్షీణిస్తుందని చాలామంది నమ్ముతారు. అయితే ఇది అంత సులభం కాదని తాజా అధ్యయనంలో తేలింది. ఇటీవలి ఒక పరిశోధనలో వాలంటీర్లకు న్యూమరికల్ సర్కిల్స్‌తో కూడిన స్క్రీన్‌ను చూపారు. సర్కిల్‌లో సంఖ్యలను
సరైన వైపునకు తరలిస్తే వాలంటీర్‌కు డబ్బులు లభిస్తాయి. పోటీల్లో సగం మందికి నోట్ చేసుకోవడానికి అనుమతించారు. మిగిలిన వారు తమ జ్ఞాపకశక్తిపై ఆధారపడ్డారు. ఊహించినట్లుగానే నోట్స్ రాసుకున్న వారు మెరుగైన పనితీరు కనబరిచారు. కానీ ఆశ్చర్యకరంగా వారు రాయనివి కూడా గుర్తుంచుకున్నారు. దీనివల్ల రాయడం అనేది జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు గుర్తించారు. డివైజ్‌పై ఆధారపడితే మన జ్ఞానానికి దీర్ఘకాలికంగా ఏమవుతుందో తెలుసుకోవడానికి పరిశోధకులకు చాలా సంవత్సరాలు పడుతుంది. అయితే ఈలోగా దాని దుష్ప్రభావాలను తగ్గించడానికి మనం ప్రయత్నించగల
మరొక మార్గం ఉంది. మన మెదడు గురించి మనం ఎలా ఆలోచించే తీరు అది.
‘ఒక పరిశోధన ప్రకారం మన సంకల్ప శక్తిని ఒక మార్గంలో ఉపయోగించి.. మరొక పనిపై దృష్టిని బలంగా కేంద్రీకరించాలి.. అయితే ఇది నిజం కావచ్చు.
కానీ, అది ఎక్కువగా మన నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది’ మన బ్రెయిన్‌కు పరిమిత వనరులు ఉన్నాయని భావించే వ్యక్తులతో పోలిస్తే అపరిమిత వనరులున్నాయని భావించే వారు పనిపై స్వీయ నియంత్రణ కలిగి ఉంటారు. తదుపరి పనిపై వారికి ప్రతికూలత ప్రభావం ఉండకపోవచ్చు. కొందరు తమ ఫోన్ వద్దకు వెళ్లకుండా మరొక గదిలో ఉంచడంపై సాధన చేస్తుంటారు. అయితే.. వారి మెదడులో అనుకున్న దానికంటే.. ఎక్కువ వనరులు
ఉన్నాయని గుర్తుచేసుకుంటారు. తమ ఫోన్ ను చూడాలనుకునే ఆకర్షణ నుంచి దూరం అయ్యేలా చేసుకుంటారు. కానీ.. అలా ఉండటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు.
ప్రస్తుత ప్రపంచంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ ను అవసరానికి మించి అతిగా ఉపయోగించడం ఎన్నో అనర్ధాలకు దారితీస్తోంది.. చాలా మంది మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు.. ఎంతో మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. చాలా మంది సెల్ ఫోన్ కు బానిసలుగా మారుతున్నారు.. సెల్ ఫోన్ అతి వినియోగం ప్రమాదకరమని ఎన్నో అధ్యయనాలలో తేలింది..