మళ్లీ రూ.2వేల నోట్ల రద్దు .. తెరపైకి వస్తోందా..? అసలు .. ఈ నోట్లు రద్దు అన్న వార్త ఎందుకు చర్చనీయాంశంగా మారుతోంది..? దీనిపై బీజేపీ
వ్యూహం ఏమిటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ వ్యాఖ్యతో .. మళ్లీ పెద్ద నోట్ల రద్దు వార్తలు .. కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో పెద్ద నోట్ల రద్దు ఏమేరకు విజయం
సాధించిందన్న చర్చతో పాటు .. మరలా మరోసారి రద్దు నిర్ణయం తీసుకోనున్నారా.. అన్నది చర్చనీయాంశంగా మారింది.
పెద్ద నోట్ల రద్దు.. ఇది దేశంలో ఎంత పెద్ద చర్చకు, ఎలాంటి పర్యవసానాలకు కారణమైందో తెలిసిందే. 2016 నవంబర్ 8న దేశంలో పెద్ద నోట్లను
రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రూ.500, రూ.1000 నోట్లను రీకాల్ చేశారు. అనంతరం రూ. 2000 నోటును, రూ.
500 కొత్త నోటును ప్రవేశపెట్టారు. పాత కరెన్సీ మార్చుకునేందుకు సామాన్యులు నానా తంటాలు పడ్డారు. ఇదిలా ఉంటే.. 2 వేల రూపాయల
నోటు ముద్రణను ఆర్బీఐ క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. ఆ నోటును రద్దు చేస్తారని కొంత కాలంగా చర్చ జరుగుతోంది.
తాజాగా రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ ఆ అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో 2000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో అన్ని ఏటీఎంలలో 2 వేల రూపాయల నోటు కనుమరుగైపోయందని, త్వరలో ఈ నోట్లను రద్దు చేస్తారని ప్రచారం జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
ఆర్బీఐ సైతం 2 వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేసింది. పెద్ద నోటైన 1000 రూపాయలను రద్దు చేసి, 2 వేల రూపాయల నోటును కొనసాగించడంలో అర్థంలేదు. 2 వేల రూపాయల నోట్లు బ్లాక్ మనీకి కేంద్రంగా మారాయి. డ్రగ్స్, మనీలాండరింగ్ లాంటి అక్రమ కార్యకలాపాలకు కారణమవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం దశలవారీగా ఈ నోటును వెనక్కి తీసుకోవాలని ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కోరారు.
పెద్ద నోట్లను మార్చుకునేందుకు ప్రజలకు రెండేళ్ల సమయం ఇవ్వాలని ఎంపీ సుశీల్మోదీ సూచించారు. 2 వేల రూపాయల రద్దు అంశంపై కొంతకాలంగా చర్చ జరుగుతుండగా.. తాజాగా బీజేపీ ఎంపీ ఈ అంశాన్ని ప్రస్తావించడంతో రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటారేమో అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది.
పెద్ద నోట్ల రద్దు తర్వాత అమలులోకి తీసుకొచ్చిన రూ.2 వేల నోటును ప్రింట్ చేయట్లేదని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. గడిచిన మూడేళ్లలో 2 వేల
నోటు ఒక్కటి కూడా ప్రింట్ చేయలేదని పేర్కొంది. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నలకు ఆర్బీఐ ఇచ్చిన వివరాలలో ఈ విషయాన్ని
వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కొత్తగా 2 వేల నోట్లు ప్రింట్ చేయలేదని తెలిపింది.
కొంతకాలంగా రూ.2 వేల నోటు చలామణిలో కనిపించడంలేదు. ఏటీఎంలలో కూడా రూ.500 వందలు, రూ.200, రూ.100 నోట్లు మాత్రమే వస్తున్నాయి. మార్కెట్లో రూ.2 వేల నోటు కనిపించడమే అరుదైపోయిందని పలువురు దుకాణదారులు చెబుతున్నారు. పాత నోట్ల రద్దు తర్వాత 2016-17, 2018-19 సంవత్సరాలలో రూ.2 వేల నోట్లను ముద్రించినట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం ఈ నోట్లలో ఎక్కువ భాగం బ్యాంకుల వద్దే ఉన్నాయని, మార్కెట్లో అతి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయని సమాచారం. రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం.. ఆర్థిక వ్యవస్థలో ఉన్న మొత్తం నోట్ల విలువలో 2 వేల నోట్ల విలువ 2021
మార్చిలో 22.6 శాతం.. ఇది 2022 మార్చి నాటికి 13.8 శాతానికి తగ్గింది.
ఇదే కాలానికి మార్కెట్లో ఉన్న మొత్తం నోట్లలో 2000 నోటు వాటా 1.6 శాతం మాత్రమేనని వెల్లడించింది. పెద్ద నోట్ల వల్ల నష్టమే ఎక్కువని తెలిసిరావడంతోనే ప్రభుత్వం వాటి ముద్రణను నిలిపివేసిందని ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో 2 వేల నోటు ప్రింట్ చేయడమా? మానడమా? అనేదానిపై ఆర్బీఐ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. గతేడాది నోట్లను ముద్రించకపోవడంపై లోక్ సభలో కేంద్రం వివరణ ఇచ్చింది. పెద్ద నోట్ల ముద్రణ ఆపేయడం ద్వారా నల్లధనాన్ని అరికట్టవచ్చని, నకిలీ నోట్ల బెడద నుంచి తప్పించుకోవచ్చని పేర్కొంది.
రెండేళ్లు గడువు ఇవ్వండి. ఆ తర్వాత రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేయండి. ఇప్పుడు అసలు ఈ నోటు కొనసాగించటంలో ఏ మాత్రం అర్ధం
లేదు. కేవలం డ్రగ్స్ దిగుమతి..మనీ లాండరింగ్ కి మాత్రమే ఇవి పనికొస్తున్నాయియ్. ఈ మాటలు అన్నది ఎవరో ప్రతిపక్ష నేతలు కాదు. బీజేపీ
సీనియర్ నేత,,బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి..ప్రస్తుత రాజ్య సభ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీ.
రాజ్యసభలో ఈ వ్యాఖలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. మోడీ సర్కారు ఏమి చెప్పి నోట్ల రద్దు చేసిందో ఆ లక్ష్యాలు ఏ మాత్రం నెరవేరలేదు. పైగా డిజిటల్ లావాదేవీలు పెరిగినా నగదు చలామణి 2016 కంటే భారీగా పెరిగినట్లు ఇటీవల ఆర్ బీఐ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. 2016 నవంబర్ 8 వ తేదీన వెయ్యి రూపాయలు, ఐదొందల నోట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత కొత్తగా 2 వేల రూపాయల నోటు చెలామణిలోకి తీసుకొచ్చింది. చిన్న నోట్లు రద్దు చేసి పెద్ద నోట్లను చెలామణిలో ఉంచడం సరికాదని సుశీల్ కుమార్ మోడీ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన ఇతర దేశాల్లో కూడా పెద్ద నోట్లు చెలామణిలో లేవన్నారు.
ప్రజలు తమ వద్ద ఉన్న 2 వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు రెండేళ్ల వ్యవధి ఇచ్చి ఆ తర్వాత కేంద్రం రద్దు చేస్తే బాగుంటుందని సుశీల్ మోదీ సూచించారు. ఏటీఎంలలో కూడా 2 వేల నోట్ల రూపాయలు రావడం లేదని కూడా ఆయన కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. 2 వేల రూపాయల నోట్లపై అనేక అపోహలున్నాయని, వాటిపై కేంద్రం స్పష్టతనీయాలని సుశీల్ మోడీ కోరారు. సామాన్య, మధ్య తరగతి ప్రజల దగ్గర నుంచి ఈ నోట్లు ఎప్పుడో మాయం అయ్యాయి. అసలు ఇవి ఎవరి దగ్గర ఉన్నాయనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.
అప్పట్లో అందరి చేతుల్లోనూ కొత్తగా కనిపించిన రెండు వేల రూపాయల నోటు.. ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. ఆ నోట్లన్నీ ఏమయ్యాయి?
నల్లధనం అంతా రెండు వేల రూపాయల నోట్ల రూపంలో పోగు పడుతోందన్న ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయా? అన్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.
2016 నవంబర్ 8 నోట్ల రద్దు ప్రకటన తర్వాత.. దేశ ఆర్థికవ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. డిజిటల్ లావాదేవీలు పుంజుకున్నాయి. క్యాష్
వాడకం ఆల్‌టైమ్ హై రికార్డు స్థాయికి చేరుకుంది. రెండు పెద్ద నోట్ల రద్దు తర్వాత అంతకన్నా పెద్దదైన 2వేల నోటు ఉనికిలోకి వచ్చింది.
ఆరేళ్ల కింద నగదు లావాదేవీల్లో కీలకంగా మారిన పింక్ నోట్ ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. అయితే, 2019 నుంచి ఇప్పటి వరకూ పింక్ నోట్ ఒక్కటి
కూడా ముద్రించలేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మధ్యే ఓ ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. 2016 నుంచే
ఒక వ్యూహం ప్రకారం ఆర్బీఐ పింక్ నోట్ల ప్రింటింగ్‌ను తగ్గిస్తూ వస్తోందని కేంద్ర బ్యాంక్ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక స్పష్టం చేస్తోంది.
అసలు ఆ 2 వేల రూపాయల నోట్లన్నీ ఎటు పోయాయి? 2వేల రూపాయల నోట్లు అసలు చలామణిలో ఉన్నాయా? ఈ నోటుని కూడా కేంద్రం రద్దు
చేస్తుందా? మార్కెట్‌లో పింక్ నోట్లన్నీ నల్లధనంగా మారి బడాబాబుల ఇనప్పెట్టెల్లోకి చేరిపోయాయా? అన్న సందేహాలు సామాన్యుల్లో
వెల్లువెత్తున్నాయి. మోదీ ప్రభుత్వం నోట్ల రద్దుకు కారణాలుగా చెప్పిన వాటిలో నల్లధనాన్ని అరికట్టడం అనేది అన్నింటికన్నా ముఖ్యమైంది.
కానీ, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల దాడులు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉపఎన్నికల సమయంలో అధికారులకు సోదాల్లో దొరికిన
నగదులో ఎక్కువగా రెండు వేల నోట్ల కట్టలే ఉన్నాయి. దీంతో .. నోట్ల రద్దు అన్న చర్చ మళ్లీ వినిపిస్తోంది.
పెద్ద నోట్ల రద్దు .. మళ్లీనా అన్న చర్చ ప్రజల్లో వెల్లువెత్తుతోంది. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నా, నగదుకు ప్రాధాన్యత ఏమాత్రం తగ్గకపోవడంతో,
నోట్ల రద్దు అన్నది మళ్లీ చర్చనీయాంశమవుతోంది.