Homeఅంతర్జాతీయంబ్రిటన్ లో కంబోడియా నగలు... బయటపడ్డ తెల్లోడి దొంగతనం

బ్రిటన్ లో కంబోడియా నగలు… బయటపడ్డ తెల్లోడి దొంగతనం

అవి చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి.. ఒక దేశానికి చెందిన అత్యంత విలువైన ఆభరణాలను చోరీ చేసి.. మరొక దేశానికి తరలించారు.. చోరీకి గురైన బంగారు నగలు, కిరీటాలు, వడ్డాణాలు, చెవిపోగులు వంటి విలువైన ఆభరణాలు ఏ దేశానికి చెందినవి..?

ఇంతకూ ఆ ఆభరణాలు ఎలా అపహరణకు గురయ్యాయి..? వారసత్వ సంపదగా వస్తున్న ఆ ఆభరణాలు లండన్ కు ఎలా చేరాయి..? ఎట్టకేలకు చోరీకి గురైన ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారా..? తిరిగి సొంత దేశానికి వారసత్వ సంపదను తరలించారా..?

దొంగతనానికి గురైన కాంబోడియా ఆభరణాలను బ్రిటన్‌ లో గుర్తించారు. 7వ శతాబ్దానికి చెందిన ఆ ఆభరణాలను బ్రిటన్‌ కు చెందిన స్మగ్లర్ డగ్లస్ లాచ్‌ఫోర్డ్‌ కాంబోడియా నుంచి తరలించారు. ఇంత వరకు చూడని అనేక ఆభరణాలు వాటిలో ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆ ఆభరణాలను రహస్యంగా కాంబోడియాకు అప్ప జెప్పారు. త్వరలోనే వాటిని ఆ దేశంలోని జాతీయ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఇలా ఆయా దేశాలకు చెందిన వారసత్వ సంపదను తరలించిన కేసుల్లో నిందితునిగా ఉన్న డగ్లస్ లాచ్‌ఫోర్డ్ 2020లో మరణించాడు. ఆ తరువాత డగ్లస్ దగ్గర ఉన్న కాంబోడియా వారసత్వ సంపదను తిరిగి ఇస్తామని ఆయన కుటుంబం ప్రకటించింది.

కాంబోడియా విచారణ బృందానికి చెందిన అధికారిని డగ్లస్ కుటుంబం ఓ గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లింది.. అక్కడ పార్కింగ్‌లో ఉన్న ఒక వాహనంలో నాలుగు పెట్టెలు ఉన్నాయి. పురాతన కాంబోడియా రాచవంశాల నగలు ఆ పెట్టెల్లో కనిపించాయి. వాటిని చూడగానే ఆ అధికారి షాక్ కు గురయ్యాడు.. కాంబోడియా నాగరికతను వాళ్లు కట్టకట్టి కారు వెనుక పెట్టినట్లు గ్రహించాడు.. కారు వెనుక ఉన్న పెట్టెల్లో 77 ఆభరణాలు ఉన్నాయి. వాటిలో బంగారు నగలు, కిరీటాలు, వడ్డాణాలు, చెవి పోగులు వంటివి ఉన్నాయి. 11వ శతాబ్దానికి చెందిన ఒక పెద్ద గిన్నె కూడా ఉంది. అది మొత్తం బంగారంతో చేసినట్లుగా కనిపిస్తోంది. నాటి అంకోర్ రాజవంశీయులు ఆ గిన్నెను ‘రైస్ బౌల్’గా ఉపయోగించే వారని నిపుణులు భావిస్తున్నారు. లభించిన కిరీటాలలో ఒకటి అంకోర్ రాజుల కంటే ముందు కాలం నాటిదిగా కనిపిస్తోంది. అది 7వ శతాబ్దానికి కళాకారులు దాన్ని చేసినట్లుగా నిపుణులు భావిస్తున్నారు. చిన్నచిన్న పువ్వులు కూడా వాటిలో ఉన్నాయి.

అయితే.. కాంబోడియా ఆభరనాలు ఎప్పుడు దొంగతానికి గురయ్యాయి..? అవి ఎలా లండన్‌కు చేరాయి..? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అంకోర్ వాట్ దేవాలయంలోని గోడల మీద ఉండే అనేక చిత్రాలతో ఈ ఆభరణాలు సరిపోలుతున్నాయి. 1122లో నిర్మాణం ప్రారంభించిన అంకోర్ వాట్ దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్ద మత కట్టడంగా ఉంది. విష్ణువు కోసం ఆ దేవాలయాన్ని నిర్మించినా ఆ తరువాత అది బౌద్ధ దేవాలయంగా మారింది. ఫ్రెంచ్ వలస పాలన కాలంలో అంకోర్ వాట్‌ను భారీ స్థాయిలో దోచుకున్నారు. ఆ తరువాత ఖేమర్ పాలన కాలంలో ఇతర దేవాలయాల్లోని సంపద దోపిడికి గురైంది . ఆర్కియాలజీ సొనెత్రా సెంగ్ ‘‘దేవాలయం గోడల మీద చెక్కిన వాటితో ఆ ఆభరణాలు సరిపోలుతున్నాయి. అంటే ఆ కథలను ఇవి నిజం చేస్తున్నాయి. గతంలో కాంబోడియా నిజంగానే చాలా సంపన్నమైనది.

కొన్ని సంవత్సరాలుగా కాంబోడియా దేవాలయాల్లోని గోడల మీదచెక్కిన చిత్రాల ఆధారంగా అంకోర్ ఆభరణాల మీద ఆర్కియాలజిస్ట్ సొనెత్రా సెంగ్ పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు దొరికిన వాటిలో కొన్ని ఆభరణాలు గతంలోనూ కనిపించాయి. దీంతో తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.. 2008లో తన పార్టనర్ ఎమ్మా బంకర్‌తో కలిసి ‘ఖేమర్ గోల్డ్’ అనే పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకంలో ఆయన అయిదు ఆభరణాలను ప్రస్తావించారు. అయితే ఆ పుస్తకంలో రాసినవన్నీ నిజాలు కాదని, అందువల్ల నిపుణులు వాటి గురించి మరింత లోతుగా పరిశోధించాల్సి ఉందని
ఎస్‌ఓఏఎస్ యూనివర్సిటీలో సౌత్ ఈస్ట్ ఏసియన్ ఆర్ట్ మీద పని చేస్తున్న థాంప్సన్ తెలిపారు. అంకోర్ కాలానికి చెందిన ఆభరణాలు ఇంకా విదేశాల్లో ఉన్నాయని, వాటిని గుర్తించాల్సి ఉందని కాంబోడియా అధికారులు భావిస్తున్నారు. 2019లో నార్త్ లండన్ వేర్‌హౌస్ నుంచి కొన్ని కలెక్షన్లను అమ్మడానికి డగ్లస్ లాచ్‌ఫోర్డ్ ప్రయత్నించినట్లు కాంబోడియా అధికారులు చెబుతున్నారు. ఆయన జరిపిన ఈ-మెయిళ్ల సంప్రదింపులు అందుకు సాక్ష్యంగా వారు చూపుతున్నారు.

ఈ నగల చోరీపై కాంబోడియా అధికారులు విచారణ చేస్తున్నామంటున్నారు.. విచారణలో నేరారోపణలు నమోదు చేయదగిన ఆధారాలు ఏమీ దొరకలేదని వారు అంటున్నారు. ఒకప్పుడు సంపద దోచుకున్న వారిలో కొందరు ఆ తరువాత ప్రభుత్వానికి అప్రూవర్లుగా మారిపోయారు. కాంబోడియాలోని దేవాలయాల నుంచి పురాతన సంపదను దోచుకుని లాచ్‌ఫోర్డ్‌కు తాము విక్రయించినట్లు వారు తెలిపారు. వారు చెప్పిన కొన్ని ఆభరణాలు బ్రిటిష్ మ్యూజియం వంటి వాటిలో కనిపించాయి.. ఒకప్పుడు పురాతన ఆభరణాలను దోచుకుని విక్రయించే వారు సైతం ప్రస్తుతం దొరికిన ఆభరణాలను గుర్తించేందుకు సాయం
చేయనున్నారు. అంకోర్ రాజవంశాలకు చెందిన పురాతన ఆభరణాలను తిరిగి ఇవ్వడాన్ని కాంబోడియా నేత హన్ సేన్ స్వాగతం పలికారు. ఈ ఏడాది జులైలో ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి ప్రజల్లో తన ఇమేజ్‌ను పెంచుకునేందుకు ఆయనకు ఇది ఉపయోగపడొచ్చు.. రాజకీయాలు పక్కన పెడితే, తమ దేశం నుంచి దోచుకున్న పురాతన వస్తువులను పూర్తిగా వెనక్కి ఇచ్చేయాలని సాధారణ కాంబోడియా ప్రజలు కోరుకుంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా పెట్టెల్లో ఉన్న ఆ పురాతన సంపదను కొద్ది రోజుల్లో కాంబోడియా ప్రజల కళ్లారా చూడనున్నారు..

Must Read

spot_img