Homeఅంతర్జాతీయం93వ ఏట నాలుగో పెళ్లి...

93వ ఏట నాలుగో పెళ్లి…

చంద్రుడిపై కాలుమోపిన అమెరికా రెండో వ్యోమగామి బజ్ ఆల్డ్రిన్ మరో రికార్డు స్రుష్టించారు. తన 93వ ఏట నాలుగో పెళ్లి చేసుకున్నారు. తన కన్నా 30 ఏళ్ల చిన్నదైన డాక్టర్ అంకా ఫౌర్ ను ఓ చిన్న వేడుకలో వివాహం చేసుకున్నారు. కాగా వారిద్దరూ చాలా కాలంగా లివిన్ రిలేషన్ లో జీవిస్తున్నారు. బజ్ ఆల్డ్రిన్ కు చెందిన ‘బజ్ ఆల్డ్రిన్ వెంచర్స్’ సంస్థలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ ఫౌర్ పనిచేస్తున్నారు.

తన 93 ఏళ్ల వయస్సులో ఓ వృద్ధుడు నాలుగో పెళ్లి చేసుకున్నాడంలే అది విశేషమే అంటున్నారు. ఇంతకీ వారెవరో కాదు..అమెరికా వ్యోమగామి అయిన బజ్ ఆల్డ్రిన్..ఈ పేరు వినగానే అందరికీ చంద్రుడు గుర్తుకు వస్తాడు. బజ్ ఆల్డ్రిన్ మరెవరో కాదు..ఒకనాడు అమెరికా చేపట్టిన చంద్రమండల యాత్రలో విజయవంతంగా చంద్రుడిపై కాలు మోపిన రెండో ఆస్ట్రోనాట్..అపోలో రాకెట్ లో చంద్రుడిపైకి చేరిన వీరిలో మొదట నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై తొలి అడుగు వేయగా ఆపై స్పేస్ క్రాఫ్ట్ నుంచి కిందకు దిగిన వ్యక్తి బజ్ ఆల్డ్రిన్. ఆనాటి అపోలో చంద్రమండల యాత్రలో పాల్గొన్న వారిలో ఈయన తప్ప మరెవరూ జీవించి లేరు. అయితే బజ్ ఆల్డ్రిన్ వయసు 93 సంవత్సరాలు. ఆయన ఇప్పుడు నాలుగవ వివాహం చేసుకున్నారు.

ఇప్పటికే చాలా కాలంగా తన సంస్థలో పనిచేసే డాక్టర్ అంకా ఫౌర్ తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు. అయితే తన పుట్టిన రోజు సందర్భంగా ఓ చిన్న వేడుక నిర్వహించి ఆమెను తన సతీమణిగా మార్చుకున్నారు. అమెరికాకు చెందిన మాజీ వ్యోమగామి బజ్ ఆల్డ్రిన్ 93 ఏళ్ల వయసులో జరిగిన నాలుగో పెళ్లికి తోటి మిత్రులు హాజరయ్యారు. తన పెళ్లి విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు బజ్ ఆల్డ్రిన్. వ్యోమగామి బజ్ ఆల్డ్రిన్ వయసు 93 ఏళ్లయితే ఆమె వయసు 63 సంవత్సరాలు. అతని భార్య అతని కంటే 30 సంవత్సరాలు చిన్నదని బజ్ తెలిపారు. ఇద్దరూ చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆల్డ్రిన్ సాధారణ వ్యోమగామి కాడు కాబట్టి ఈ వివాహం అంతరిక్ష రంగంలో వివాహపు విషయానికి ప్రాధాన్యత లభించింది.

ఆయన ప్రపంచంలో చంద్రునిపై అడుగు పెట్టిన రెండవ వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. 1969లో చంద్రునిపై దిగిన అపోలో 11 మిషన్ సిబ్బందిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఆల్డ్రిన్ మాత్రమే ప్రస్తుతం ప్రాణాలతో ఉన్నారు. జనవరి 20న ఆయన 93వ ఏట అడుగుపెట్టారు. ఇప్పుడు తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో ప్రపంచానికి ఇది వార్తగా మారింది. ఆల్డ్రిన్ తన దీర్ఘ కాల ప్రేమ అయిన డాక్టర్ అంకా ఫౌర్ ను ఒక చిన్న వేడుకలో వివాహం చేసుకున్నట్లు పోస్ట్‌లో తెలిపారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ”నా 93వ పుట్టినరోజు. లివింగ్ లెజెండ్స్ ఆఫ్ ఏవియేషన్‌చే నన్ను కూడా సత్కరించే రోజు, నా చిరకాల ప్రేమను సంపూర్ణం చేసుకున్నామని ప్రకటించడానికి సంతోషంగా ఉంది” అని తెలిపారు.

బజ్ ఆల్డ్రిన్ ఇప్పటికి మూడు పెళ్లిల్లు చేసుకోగా అనుకోని కారణాల వలన విడాకులు తీసుకోవడం జరిగింది. ఆనాటి అపోలో ప్రాజెక్టులో పనిచేసినవారందరిలో బజ్ ఆల్డ్రిన్ మాత్రమే ఇంకా జీవించి ఉన్నారు. చంద్రుడిపై నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ పాదం మోపిన 19 నిముషాలకు బజ్ ఆల్డ్రిన్ చంద్రుడిపై దిగారు. ఆరోజటి స్పేస్ క్రాఫ్ట్ లో మొత్తం ముగ్గురు మాత్రమే చంద్రుడిపైకి వెళ్లారు. అయితే మాజీ వ్యోమగామి అయిన బజ్ ఆల్డ్రిన్ అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా నుంచి 1971లో పదవీ విరమణ చేసారు. ఆపై 1998లో ‘షేర్ స్పేస్ ఫౌండేషన్ అనే లాభాపేక్ష లేని సంస్థను స్థాపించారు. దీని ద్వారా అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను యువతకు ప్రమోట్ చేసే పని చేస్తున్నారు. చివరకు ఆయన ఇన్నాళ్లకు తన లివింగ్ పార్టనర్ ను భార్యగా మార్చుకున్నారు.

‘మేము లాస్ ఏంజిల్స్‌లో ఒక చిన్న ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నాము. మేం ఇద్దరం ఇప్పుడు యుక్తవయసులో ఉన్నంత ఉత్సాహంగా ఉన్నాము’ అంటూ తన సోషల్ మీడియా పోస్టులో ఆల్డ్రిన్‌ తెలిపారు. ఆల్డ్రిన్ నాల్గవ భార్య డాక్టర్ అంకా ఫౌర్ ‘బజ్ ఆల్డ్రిన్ వెంచర్స్’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. బజ్ ఆల్డ్రిన్ 1969లో చారిత్రాత్మక అపోలో 11 మూన్ ల్యాండింగ్‌లో భాగం. తోటి వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌తో కలిసి చంద్రునిపై నడుస్తున్నప్పుడు ఆయన ధరించిన జాకెట్ గత ఏడాది వేలం వేయగా 2.7 మిలియన్ డాలర్లు పలికింది. ఓ అజ్నాత వ్యక్తి ఆ జాకెట్ ను సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్త ప్రజలంతా ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు.

Must Read

spot_img