అక్కడా.. ఇక్కడా కాదు.. బుర్జ్ ఖలీఫా దగ్గర దుబాయ్ లోనే ఇల్లు కొనేద్దాం అంటున్నారు భారతీయు సంపన్నులు. ఎంత ఖర్చయినా సరే.. ఏ మాత్రం వెనకాడటం లేదు.. ఖరీదైన నగరంలో ఓ ఇల్లు కొనుగోలు చేస్తున్నారు.. ఉన్నతోద్యోగులు, వ్యాపార, పారిశ్రామికవేత్తల తాజా చిరునామాగా మారిపోయింది దుబాయి.
- భారతీయులు దుబాయ్ లో ఇళ్లు ఎందుకు కొంటున్నారు…?
- వ్యాపారవేత్తల చూపంతా యూఏఈపై ఉండటానికి కారణాలేంటీ..?
- కేవలం.. లగ్జరీ జీవనం గడిపేందుకేనా..? వ్యాపార ప్రయోజనాలేమైనా ఉన్నాయా…?
- యూఏఈ ప్రభుత్వం తెచ్చిన గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ కూడా సంపన్నులను అట్రాక్ట్ చేస్తోందా…?
బుర్జ్ ఖలీఫా దగ్గర దుబాయ్‌లోనే ఇల్లు కొనేద్దాం అంటున్నారు సంపన్న భారతీయులు. ధరకు వెరవకుండా.. ఖరీదైన నగరంలో ఓ ఇల్లు కొనిపడేస్తున్నారు. అలా.. ఉన్నతోద్యోగులు, వ్యాపార, పారిశ్రామికవేత్తల తాజా చిరునామాగా మారిపోయింది దుబాయ్. మరీ ముఖ్యంగా 2022లో. ఈ మేరకు విలాస నగరంలో ఇళ్ల కొనుగోలుకు నిరుడు మనోళ్లు ఖర్చు చేసిన మొత్తం.. అక్షరాలా రూ.35,500 కోట్లు.
![](https://inewslive.net/wp-content/uploads/2023/02/dubai-684x1024.jpg)
గా, 2021 సంవత్సరంలో భారతీయులు దుబాయ్‌లో ఇళ్ల ఖరీదుకు చేసిన వ్యయం కేవలం 9 బిలియన్ దిర్హామ్‌లే. అంటే.. ఒక్క సంవత్సరంలోనే దాదాపు రెట్టింపు కావడం విశేషం. మరోవైపు దుబాయ్‌లో ఇళ్లు కొన్న విదేశీయుల్లో భారతీయుల వాటా 40 శాతం.. అందులో అత్యధికులు హైదరాబాద్, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ వారు కావడం మరో విశేషం. దుబాయ్‌లో భారతీయులు కొంటున్న ఇళ్ల విలువ రూ.3.60 కోట్ల నుంచి రూ.3.80 కోట్ల వరకు ఉంటోంది.
అద్దెకు ఇచ్చినా నెలకు రూ.3 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు వస్తుంది. ముంబైలోలాగే అద్దెల్లో వృద్ధి ఏటా 4-5 శాతం ఉంటుంది… ఈ కారణంగానూ వైట్ కాలర్ ఉద్యోగులు దుబాయ్ వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, అనేక ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండటంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉండటంతో.. దుబాయ్ లో భారత సంతతి పెరుగుతోంది. ముఖ్యంగా.. లగ్జరీ లైఫ్ గడపాలని భావించే సంపన్నులు.. దుబాయ్‌కి రీలొకేట్ అవడానికి ఇవన్నీ దోహదపడుతున్నాయని.. ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
దుబాయ్ లో సెటిల్ అవడం వల్ల.. తమ బిజినెస్‌లు మరింత పెరుగుతాయని.. ఇతర దేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉంటుందని.. అనేక మంది వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. దుబాయ్ నుంచి ఇతర దేశాలకు బిజినెస్ టూర్స్ చేయడం కూడా ఈజీ అవుతుందనే ఆలోచనతో ఉన్నారు.
దీంతో.. అనేక మంది యంగ్ ఇండియన్ బిజినెస్ మ్యాన్స్ దుబాయ్ కి అట్రాక్ట్ అవుతున్నారు. అక్కడే ఉండటం వల్ల.. ప్రపంచ మార్కెట్‌లో లావాదేవీలు జరిపేందుకు అత్యంత వెసులుబాటు కలుగుతుందని భావిస్తున్నారు. సంపన్న వర్గాలను దుబాయ్ కి ఆకర్షించేందుకు.. యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా ప్రోగ్రామ్‌ను మరింత విస్తరించింది. స్కిల్డ్ ప్రొఫెషనల్స్, సైంటిస్టులు, రీసెర్చ్ స్కాలర్స్‌తో పాటు ప్రతిభావంతులైన కార్మికులు, ఉద్యోగులను సాదరంగా ఆహ్వానిస్తోంది.
ఇది కూడా దుబాయ్ రియాల్టీ రంగ వృద్ధికి కారణంగా చెబుతున్నారు. ప్రతిభావంతులైన విదేశీయులు ఉద్యోగ, విద్యావకాశాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నివాసం ఉండేందుకు దీర్ఘకాలిక గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ అనుమతిస్తోంది. ఈ వీసా తీసుకున్నవిదేశీయులు.. అక్కడే ఉండి పని చేసుకునేందుకు, చదువుకునేందుకు దీర్ఘకాలం పాటు నివాసం ఉండొచ్చు. ఇది కూడా అక్కడి ఇళ్లపై పెట్టుబడి పెట్టొచ్చనే నమ్మకం భారతీయులలో కలిగేలా చేసింది.
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుకు అంతర్జాతీయంగా డిమాండ్..
దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో.. అక్కడి రియల్ ఎస్టేట్ కంపెనీలు సిటీలో మరిన్ని అపార్ట్‌మెంట్లు, విల్లా ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయి. 2015-16 మధ్య దుబాయ్ రియాల్టీ రంగం ఓ వెలుగు వెలిగింది. అయితే.. కోవిడ్ టైమ్ లో అక్కడి రెంటల్ మార్కెట్ 30 శాతం పడిపోయింది. అది.. ఈ మధ్య కాలంలోనే కోలుకొని.. ఏడేళ్ల కిందటి స్థాయికి చేరింది. మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా పర్యటించాల్సి వచ్చే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లంతా.. ట్రావెలింగ్ పరంగా సౌకర్యంగా ఉంటుందని.. దుబాయ్ ని ఎంచుకుంటున్నారు.
వృత్తి రీత్యా.. ఇతర దేశాలకు తిరగాల్సి వచ్చినప్పుడు.. చాలా మంది వ్యాపార, పారిశ్రామికవేత్తలకు దుబాయ్ ఎంతో అనువుగా ఉంటోంది. చాలా మంది ఇండియన్ బిజినెస్ మ్యాన్స్.. యూఏఈ వైపు మొగ్గు చూపేందుకు.. అక్కడున్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్సెంటర్ కూడా ఓ ప్రధాన కారణం. అక్కడే నివాసం ఉండటం వల్ల.. విదేశీ సంస్థలతో సంప్రదింపులు జరపడం కూడా సులువని భావిస్తున్నారు.
2015-16 మధ్య దుబాయ్ రియల్టీ ఉజ్వలంగా వెలిగింది. అయితే, కొవిడ్ కాలంలో అక్కడి రెంటల్ మార్కెట్ 30 శాతం పడిపోయింది. నేడు కోలుకుని ఏడేళ్ల కిందటి స్థాయికి చేరింది. బహుళజాతి సంస్థల్లో పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా పర్యటించాల్సి వచ్చే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల రవాణా పరంగా సౌకర్యంగా ఉంటుందని దుబాయ్‌ను ఎంచుకుంటున్నా రు. వృత్తి రీత్యా లండన్- హైదరాబాద్ మధ్య తిరగాల్సి వస్తుందని… ఇలాంటప్పుడు దుబాయ్ అత్యంత అనువైన ప్లేస్ అంటూ ఎంతో మంది అటు వైపు మొగ్గుచూపుతున్నారు.. మరింత మంది పనివారు, వృత్తి నిపుణులు, పరిశోధకులకు అవకాశం కల్పిస్తూ గతేడాది గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ పరిధిని విస్తరించడంతో దుబాయ్‌లో ఇంటిపైన పెట్టుబడి పెట్టొచ్చు అని ఎంతో మందికి ముఖ్యంగా భారతీయులకు నమ్మకం కలిగించింది. యూఈలో నివాసం, వృత్తి, చదువు కోసం వచ్చే వారు దీర్ఘకాలం నివసించేందుకు వీలు కల్పించేదే గోల్డెన్ వీసా జారీ చేస్తోంది.. .
- ఇక.. దుబాయ్ లోని ఇండియన్ కరికులమ్ అత్యుత్తమైనదిగా కనిపిస్తోంది..
విద్యా వసతుల కల్పనలో.. బెస్ట్ సిటీగా నిలిచింది. పైగా.. దుబాయ్ సిటీకి సురక్షితమైన నగరంగా పేరుంది. క్యాబ్‌లో డబ్బుల సంచి మర్చిపోయినా.. ఆ డ్రైవర్ అడ్రస్ కనుక్కొని మరీ.. డబ్బుల్ని వెనక్కి తెచ్చి ఇస్తారని.. ఇప్పటికే అక్కడ స్థిరపడిన భారతీయులు చెబుతున్నారు. ముఖ్యంగా.. హైదరాబాద్, అమెరికా, లండన్, కెనడా లాంటి ప్రాంతాలకు తరచుగా ప్రయాణించే వారికి.. దుబాయ్ ఎంతో వెసులుబాటుగా ఉంటుంది.
భారత్ నుంచి పాశ్చాత్య దేశాలకు వెళ్లే వాళ్లు కూడా దుబాయ్ మీదుగా వెళ్లాల్సిందే. దీనికితోడు.. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ ఆధ్వర్యంలో.. ఫిన్ టెక్ ఎకో సిస్టమ్ అందుబాటులోకి రావడం.. భారత పారిశ్రామిక వేత్తలను విశేషంగా ఆకర్షిస్తోంది. అందువల్ల.. భారత దేశంలోని సెలబ్రిటీలు,
సంపన్నులకు.. దుబాయ్ స్వర్గధామంలా మారింది. ముఖ్యంగా దుబాయ్ వైపు భారతీయులు మొగ్గు చూపడానికి విద్యావసతులు, వ్యాపారం, సురక్షితమైన నగరం కావడం కూడా మరొక కారణం.. ప్రపంచంలోని ప్రధాన నగరాలకు ప్రయాణించాలంటే.. ఎంతో వెసులుబాటు ఉన్న నగరం కూడా దుబాయే..
ఇండియా నుంచి పాశ్చాత్య దేశాలకు వెళ్లాలంటే.. దుబాయ్ మీదుగా వెళ్లాల్సి రావడం.. పారిశ్రామిక వేత్తలకు ఎంతో అనుకూలంగా ఉండటంతో భారతీయ సంపన్నులు దుబాయ్ వైపు తీవ్రంగా ఆకర్షితులవుతున్నారు. ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా దుబాయ్ లోనే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు.. సంపన్నులకు ఎంతో అనువుగా అన్ని సౌకర్యాలు కలిగిన దుబాయ్ అంటే భారతీయులకు రోజురోజుకు ఇష్టం పెరిగిపోతోందని అక్కడ స్థిరపడే వారి సంఖ్యను బట్టే చెప్పవచ్చును.
ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, అనేక ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండటంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉండటంతో.. దుబాయ్ లో భారత సంతతి పెరుగుతోంది. ముఖ్యంగా.. లగ్జరీ లైఫ్ గడపాలని భావించే సంపన్నులు.. దుబాయ్‌కి రీలొకేట్ అవడానికి ఇవన్నీ దోహదపడుతున్నాయని చెప్పవచ్చును..