ప్రముఖ బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త బాబా వంగ భవిష్యవాణి భయపెడుతోంది.. గతంలో బాబావంగ చెప్పిన అంచనాలు ఎక్కువ శాతం నిజమయ్యాయి. దీంతో ఈ ఏడాది బాబా వంగ జోస్యం కూడా నిజమవుతుందనే భయం నెలకొంది.. ఈ ఏడాది బాబావంగ భవిష్యవాణి ప్రకారం ఏం జరగనుంది..? ఈ ఏడాది ప్రపంచానికి అనేక ఉపద్రవాలు ముంచుకు రానున్నాయా..? అంతేకాదు సౌర తుఫాన్ సంభవించనుందా..? రానున్న కాలంలో మొత్తం ప్రపంచమే అంతం కానుందా..?
ఈ ఏడాది బాబా వంగ భవిష్యవాణి ఏం చెబుతోంది..?
బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా అంధురాలు. చెర్నోబిల్ విపత్తు, సోవియట్ యూనియన్ రద్దు , బ్రిటీష్ చరిత్రలో అత్యంత వివాదాస్పద సంఘటనల్లో ఒకటైన ప్రిన్సెస్ డయానా మరణంతో సహా ఆమె అనేక అంచనాలు నిజమయ్యాయి. ఇందులో ఒకటి అమెరికాకు నల్లజాతీయుడు అధ్యక్షుడు అవుతాడనేది. బాబా వంగా 1996లో మరణించినప్పటికీ.. ఆమె అంచనాలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే 2023కి గాను 5 మేజర్ అంచనాలు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
బాబా వంగా అభిప్రాయం ప్రకారం.. 2023 సంవత్సరంలోని కొన్ని నెలలు చీకటి ఏర్పడనుందని, మనుషుల జీవితం నాశనం అవుతుందని అంచనా వేశారు భూమి మీద గ్రహాంతరవాసుల రాక 2023 లో జరుగుతుందని… వీరి రాక మిలియన్ల మంది మరణానికి దారితీస్తుందని ఆమె అంచనా వేశారు. ఒక పెద్ద దేశం జీవ ఆయుధాలతో ప్రజలపై దాడి చేస్తుంది. అపారమైన విధ్వంసం కలిగించనున్నదని పేర్కొన్నారు. బాగా వంగ అంచనాల ప్రకారం, ఉక్రెయిన్ , రష్యా యుద్దం కారణంగా 2023 ప్రపంచ సంక్షోభం ఎదుర్కోనుంది. 2028లో ఒక వ్యోమగామి శుక్రుడిపైకి దిగుతాడని చెప్పారు.
బాబా వంగా భవిష్యవాణి భయపెడుతోంది. ఈ ఏడాది జ్యోతిష్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఆమె చెప్పిన జ్యోతిష్యాలు ఇప్పటి వరకు నిజమైన దాఖలాలు ఉన్నాయి. 2023 ప్రపంచానికి డెడ్ లైన్ అని బాబా వంగా భవిష్యవాణి చెప్తోంది. ఇప్పటికే 90 శాతం బాబా వంగా జ్యోతిష్యం నిజమైంది. అలాగే బాబావంగా చెప్పిందే నిజం అవుతుందని ఆమె శిష్యులు అంటున్నారు. బాబా వంగాను దైవదూతగా బల్గేరియా ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో చాలా ఉపద్రవాలు ముంచుకొస్తాయని బాబా వంగా తెలిపారు. బాబా వాంగ చెప్పిన చాలా జోస్యాలు నిజమవడంతో ఈ సంవత్సరంలో కూడా ఆమె చెప్పినట్లుగానే విపత్తులు సంభవిస్తాయేమోనని చాలా మంది ఆందోళన చెందుతున్నారు.
అమెరికాలో 2001 సెప్టెంబరు 11న జరిగిన ఉగ్రవాద దాడులు, Fukushima అణు విపత్తు, ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఎదుగుదల వంటి వాటిని బాబా వంగముందుగానే చెప్పారు.. 5079లో ప్రపంచం అంతమైపోతుందని బాబా వంగ చెప్పారని ఆమె అనుచరులు చెప్తున్నారు. 2023లో సౌర తుఫాను సంభవిస్తుందని బాబా వాంగ చెప్పారు. శాస్త్రవేత్తలు చెప్తున్నదానిని బట్టి ఇది కూడా నిజం కాబోతున్నట్లు తెలుస్తోంది. సూర్యుడు దాదాపు ఓ దశాబ్దం పాటు ఉన్న స్థితి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని, దీనివల్ల భూమిపై సమస్యలు రావచ్చునని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
సూర్యుడు క్రియాశీలకంగా ఉన్న దశలో వెలువడే సౌర మంటలు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీని విడుదల చేస్తాయని, ఫలితంగా వివిధ వ్యవస్థలకు అంతరాయం కలుగుతుందని చెప్తున్నారు. పవర్ గ్రిడ్స్, జీపీఎస్ సిగ్నల్స్ వంటి వ్యవస్థలు దెబ్బతింటాయని, ఇటువంటి సంఘటనలను సోలార్ మ్యాగ్జిమమ్స్ అంటారని చెప్తున్నారు. ఇవి 11 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తాయని, గతంలో వీటివల్ల చెప్పుకోదగ్గ స్థాయిలో ఆందోళన కలగలేదని అంటున్నారు.

1859లో జరిగిన కేరింగ్టన్ ఈవెంట్ వల్ల భూమిపై టెక్నలాజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసమైందని, దీనిని బట్టి సౌర తుపాను ప్రభావం ఎంత వినాశనకరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని సైంటిస్ట్‌లు చెప్తున్నారు. ఇప్పుడు మనం టెక్నాలజీపై ఆధారపడటం మరింత పెరిగినందువల్ల సౌర తుఫాను ప్రభావం మరింత విపరీతంగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. సోలార్ స్టార్మ్ సంభవిస్తే విద్యుత్తు సరఫరా, కమ్యూనికేషన్లు, రవాణా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఫలితంగా సమాజంలో గందరగోళం ఏర్పడవచ్చు. ఆర్థిక సంక్షోభం కూడా రావచ్చు. వీటన్నిటి ప్రభావం కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ప్రజల రోజువారీ జీవితాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి.
బాబా వాంగ ఇంకా ఏం చెప్పారంటే… భూమి కక్ష్య 2023లో మారే అవకాశం ఉంది. దీనివల్ల పర్యావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయి. ఓ పెద్ద దేశం జీవాయుధాల పరీక్షలను 2023లో నిర్వహిస్తుంది.అణు విద్యుత్తు కేంద్రంలో పేలుడు వల్ల విషపూరిత మేఘాలు ఆసియాను చుట్టుముడతాయి. ఆ తర్వాత ఇతర దేశాలకు కూడా ఇవి విస్తరిస్తాయి. ప్రజలు రోగగ్రస్థులవుతారు.మానవులు ప్రయోగశాలల్లో జన్మించడం 2023 నుంచి ప్రారంభమవుతుంది. వారి నడవడిక, భౌతిక రూపాలను నియంత్రించే అవకాశం ఉంటుంది. జనన ప్రక్రియ పూర్తిగా మారిపోతుంది. గ్రహాంతరవాసుల దాడుల్లో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారు.
ప్రపంచ వ్యాప్తంగా జీవ ఆయుధాల శకం నెలకొంటుందని బాబా వంగా అన్నారు. ప్రపంచం అల్లకల్లోలం అవుతుందని ఆమె భవిష్యవవాణి చెప్తోంది.. బాబా వంగా చెప్పినట్లే ఆస్ట్రేలియాలో భారీ వరదలు ఏర్పడ్డాయి. 1996లో మరణించిన బాబా వంగా.. 2023లో ఐదు భయానక అంశాలు జరుగనున్నాయని జ్యోతిష్యం చెప్పారు. సహజ జననాల ముగింపు వుంటుందని సౌర సునామీ తప్పదని ఆమె చెప్పారు. బాబా వంగాను అధికారికంగా వంగేలియా పాండేవా గుష్టెరోవా అని పిలుస్తారు. బల్గేరియాకు చెందిన ఒక ఆధ్యాత్మికవేత్త. మూలికా శాస్త్రవేత్త ఈమె. ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం బల్గేరియన్ కోజుహ్హైలాండ్స్‌లోని రూపైట్ ప్రాంతంలో నివసించింది. 1911లో బల్గేరియాలో జన్మించిన బాబా వంగా అసలు పేరు వంగేలియా పాండేవా గుష్టెరోవా. ఆమె బాల్యంలోనే కంటి చూపును కోల్పోయారు. ఆమెకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని ఆమెను నమ్మేవారు విశ్వసిస్తారు. బాబా వంగ భవిష్యత్ కోసం చెప్పిన అనేక అంచనాలు నిజమయ్యాయి.