HomeజాతీయంBRS పార్టీ మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతుందా ?

BRS పార్టీ మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతుందా ?

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ప్రస్తుతానికి ఎమ్మెల్యే సీట్లన్నీ అధికార గులాబీ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. అయితే రాబోయే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీకి అంతా ఈజీగా లేదనే టాక్ వినిపిస్తోంది. BRS పార్టీ అధినేత ఆదేశాలతో, ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారంతా పార్టీని బలోపేతం చేయడంతో పాటు పలు సామాజిక, సేవ కార్యక్రమాలతో క్షేత్రస్థాయిలోకి దిగిపోయారు. మరోవైపు ప్రతిపక్ష బిజెపి ,కాంగ్రెస్ పార్టీలు సహా ఇతర కొత్తగా వచ్చిన పార్టీలు సైతం ఆయా కార్యక్రమాల పేరుతో క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి.

ఇదిలాఉంటే సందట్లో సడేమియా అన్నట్లుగా పలు అసెంబ్లీ సెగ్మెంట్లలలో “ఎన్జీవోలు, ఫౌండేషన్ల” పేరుతో పలువురు యువ నాయకులు సీరియస్ గా ఫోకస్ పెట్టారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో.. ఏదో ఒక పార్టీ నుంచి టికెట్ టార్గెట్ గా చాప కింద నీరులా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణాల్లోని యూత్ ని టార్గెట్ చేసుకుంటూ తమ కార్యాచరణను కొనసాగిస్తున్నారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లోనే.. కొందరు ఎమ్మెల్యేలుగా గెలిచినవారు.. మొదట్లో ఎన్జీవోలు, ఫౌండేషన్ల పేరుతోనే రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు.

ఇందులో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ముందు వరసలో ఉంటారు. మంత్రి హోదాలో కూడా ఇప్పటికీ తన తల్లి “గుంటకండ్ల సావిత్రమ్మ ఫౌండేషన్” పేరుతో పలు సామజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్స్, గ్రూప్స్, ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ఉచిత కోచింగ్, స్టడీ మెటీరియల్ పంపిణీ చేసి యువతలో క్రేజ్ సంపాదించుకున్నారు. పలుమార్లు స్టేట్ కబడ్డీ, హాకీ వంటి టోర్నమెంట్లను సైతం నిర్వహించారు. ఇక హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి..

2016 నుంచి “అంకిరెడ్డి ఫౌండేషన్, సైయూత్”పేరుతో, నకిరేకల్ MLA చిరుమర్తి లింగయ్య “చిరుమర్తి చేయూత ఫౌండేషన్, భువనగిరి MLA పైళ్ళ శేఖర్ రెడ్డి “పైళ్ల ఫౌండేషన్”, నల్గొండ MLA కంచర్ల భూపాల్ రెడ్డి “కంచర్ల ఫౌండేషన్”, మిర్యాలగూడ MLA భాస్కర్ రావు తన “NBR ఫౌండేషన్”, నాగార్జునసాగర్ MLA నోముల భగత్ సైతం “NL-ఫౌండేషన్” పేరుతో.. పలు సామజిక, సేవా కార్యక్రమాలు చేపట్టగా.. వారి గెలుపులో సోషల్ యాక్టివిటీస్ పాత్ర ఎంతో కొంత ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.

ఇక వీరిని ఆదర్శంగా తీసుకొని.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా.. పలు నియోజకవర్గాల్లో కొందరు యువ నాయకులు సైతం.. “NGO, ఫౌండేషన్” ల పేరుతో రంగంలోకి దిగిపోయారు. తాజాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ టార్గెట్ గా.. పలువురు యువ నాయకులు.. నిత్యం ఏదో ఒక సామాజిక, సేవా కార్యక్రమం పేరుతో
క్షేత్రస్తాయిలో తిరుగుతున్నారు. కొందరు గత నాలుగైదు ఏళ్లుగా కార్యక్రమాలు చేపడుతుండగా.. మరికొందరేమో గతేడాది నుంచి ఫీల్డ్ లోకి వస్తున్నారు. నల్గొండజిల్లా పరిధిలో.. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడైన ‘గుత్తా అమిత్ రెడ్డి’ ఫుల్ టైం పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టారు.

“గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్” పేరుతో.. కరోనా సమయంలో పేదలకు నిత్యావసరాలు, PPE కిట్లు, పండ్లు పంపిణీ.. SI,కానిస్టేబుల్ శారీరక ధృడ పరిక్షలకోసం వచ్చే వారికి ప్రతీరోజు తెల్లవారు జామున ప్రోటీన్ ఫుడ్ పంపిణి, పలువురికి ఆర్థిక సాయం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి సేవల పేరుతో వచ్చిన గుర్తింపుతో, అవకాశం వస్తే అసెంబ్లీ.. లేదంటే పార్లమెంట్ కు పోటీ చేయాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి .. నల్గొండ పట్టణ BRS ప్రెసిడెంట్, 8వ వార్డు కౌన్సిలర్ ‘పిల్లి రామరాజు’ సైతం.. “RKS పౌండేషన్” పేరుతో ప్రమాద బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం, ఉచితంగా గణేష్ విగ్రహాల పంపిణీ, కబడ్డీ-క్రికెట్ క్రీడలకు నగదు బహుమతులను అందించడం వంటి వాటితో పాటు, పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మిర్యాలగూడ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ‘బత్తుల లక్ష్మారెడ్డి’..

“BLR పౌండేషన్” పేరుతో గత దశాబ్దకాలంగా సామాజిక-సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 2018లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించినా, చివరి నిమిషంలో బీసీ సంఘ జాతీయాధ్యక్షుడు R.కృష్ణయ్య ను టికెట్ వరించింది. ఆతర్వాత.. మిర్యాలగూడ మున్సిపాలిటీలో దాదాపు 20 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించి సత్తా చాటారు బీఎల్అర్. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో ఆనందయ్య మందును మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికీ పంపిణీ చేసి ప్రజల్లో నాని పోయారు. ఈ గుర్తింపుతో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటొచ్చనే భావన లో ఉన్నారట బత్తుల లక్ష్మారెడ్డి.

ఇక అదే మిర్యాలగూడ నుంచి TRS నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత ‘అలుగుబెల్లి అమరందర్ రెడ్డి’ సైతం ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యేందుకు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దేవరకొండ లో.. ‘రవినాయక్’ అనే యువ నాయకుడు కూడా “రవినాయక్ పౌండేషన్” పేరుతో.. పేద,బడుగు-బలహీన వర్గాలకు తోడ్పాటు అందిస్తున్నారు. యూత్ టార్గెట్ గా.. క్రికెట్, కబడ్డీ వంటి క్రీడలను పెట్టి.. ఉచిత నగదు బహుమతులను రవి నాయక్ అందిస్తున్నారు.


యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా ఉన్న ‘కుంభం అనీల్ కుమార్ రెడ్డి’ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు “కుంభం యువసేన” పేరుతో.. మంచినీటి ప్లాంట్స్, పేదలకు ఆర్థికసాయం, ఉచిత వైద్యం సహా పలు యాక్టివిటీస్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక.. ఆలేరుకాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి, తాజాగా TPCC ప్రధాన కార్యదర్శిగా పదవి పొందిన ‘బీర్ల అయిలయ్య’ సైతం “బీర్ల పౌండేషన్” పేరుతో బీద .. బడుగు-బలహీనవర్గాల ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలు చేపడ్తున్నారు. ఉచిత వాటర్ ప్లాంట్స్, పేదలకు ఆర్థికసాయం, చేతివృత్తిదారులను ఆదుకోవడం, ఉచిత వైద్యం, ఉచిత అంబులెన్స్ ల ఏర్పాటుతోపాటు.. పలు కార్యక్రమాలు చేస్తున్నారు.

వీరంతా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. సూర్యాపేట జిల్లా నుంచి.. హుజూర్ నగర్ నియోజకవర్గంలో.. ‘పిల్లుట్ల రఘు’ అనే యువ నాయకుడు సైతం..”ఓజో” పౌండేషన్” పేరుతో.. యూత్ టార్గెట్ గా పలు సామాజిక సవా కార్యక్రమాలు చేస్తున్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉచిత కోచింగ్, స్టడీ మెటీరియల్ పంపిణీ, క్రీడలు, నిరు పేదలకు ఉచిత విద్య, వైద్యం.. ఆపదలో ఉన్నవారికి ఆర్థికంగా చేయూత నందిస్తున్నారు. ప్రస్తుతం ఈయనకు ఏ పార్టీ మద్దతు లేకున్నా..సేవా కార్యక్రమాల ద్వారా వచ్చిన క్రేజ్ తో ఇండిపెండెంట్ గా బరిలో దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఆ క్రమంలోనే కొత్త ఓటర్లు, యువత టార్గెట్ గా సోషల్ యాక్టివిటీస్ ముమ్మరం చేశారు హుజూర్నగర్ కు చెందిన పిల్లుట్ల రవి. ఇలా పలు NGO,పౌండషన్ల పేరుతో.. పలువురు యువ నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజలను, యువకుల మనస్సు చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. ముందు ప్రజల మనసు గెలిస్తే… ఆ తర్వాత విజయం ఈజీ అనే లెక్కలేసుకుంటున్నారు. ఇప్పటికే.. పలువురు MLAలు ఇదే ఫార్ములా ఉపయోగించి, రాజకీయాల్లో చక్రం తిప్పుతుండటంతో.. తమకూ ఆ అదృష్టం రాకపోదా..? అన్నట్లుగా.. వచ్చే ఎన్నికల్లో టికెట్ లక్ష్యంగా దూసుకుపోతున్నారు.

Must Read

spot_img