యంయం శ్రీలేఖ తెలుగు సినిమా సంగీత దర్శకురాలు. ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకి సంగీతం అందించిన మహిళా సంగీత దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న మ్యాజిక్ డైరెక్టర్. తన 12 వ ఏట 1994లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నాన్నగారు సినిమాతో సంగీత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ సుమారు 70కి పైగా సినిమాలకి సంగీతం అందించారు శ్రీలేఖ. ఆమె అత్యధికంగా సురేష్ ప్రొడక్షన్స్ లో 13 చిత్రాలకి సంగీతం అందించారు.
ప్రముఖ సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ, సినిమా రంగంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, 25 దేశాలలో వరల్డ్ మ్యూజిక్ టూర్ చేయబోతున్నారు. ఈ యేడాది మార్చి 17 నుంచి ఈ టూర్ ను ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఆమె సోదరుడు, ప్రముఖ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, ప్రపంచంలోని 5 భాషల్లో 80 సినిమాలకు సంగీతం అందించిన ఏకైక మహిళా సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ . తన అచీవ్‌మెంట్స్ కి అభిననందనలు తెలుపుతున్నాను” అని అన్నారు. ఆస్కార్ వేడుకకు వెళుతున్న రాజమౌళి అన్న చేతుల మీదుగా తన వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్ లాంచ్ కావడం ఎంతో ఆనందంగా ఉందని, రాజమౌళి దర్శకత్వం వహించిన మొట్ట మొదటి టెలీ సీరియల్ ‘శాంతినివాసం’కి తానే మ్యూజిక్ అందించానని, ఇప్పుడు తన టూర్ పోస్టర్ అన్న ద్వారా రిలీజ్ కావడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీలేఖ తెలిపారు. రవి మెలోడీస్ ప్రైవేట్ లిమిటెడ్ బానర్ ద్వారా ఇన్వెస్టర్ గ్రోవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో మిడిల్ ఈస్ట్ (ఖతార్) నుంచి మొదలై లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర 25 దేశాలలో 25 మంది సింగర్స్ తో కలిసి ఈ మ్యూజిక్ టూర్ జరుగుతుందని శ్రీలేఖ తెలిపారు.