Homeఅంతర్జాతీయంబ్రిటన్లో టమోటా ధర ఎంతో తెలుసా ? 

బ్రిటన్లో టమోటా ధర ఎంతో తెలుసా ? 

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని చాలా రెస్టారెంట్లకు టమాటాలు లేకుండా వంటలు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయాయి, ఎందుకంటే సరఫరా సంక్షోభం కారణంగా తాజా ఉత్పత్తుల ధర గణనీయంగా పెరిగింది. దాంతో కస్టమర్లకు టమాటా లేని పిజ్జాలు, పాస్తాలు సర్వ్ చేయక తప్పడం లేదు. దీంతో బ్రిటన్ రెస్టారెంట్లకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి.

బ్రిటన్ లోని చాలా రెస్టారెంట్లకు టమాటాలు లేకుండా వంటలు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది, ఎందుకంటే సరఫరా సంక్షోభం కారణంగా తాజా ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగాయి. దీనితో పిజ్జాలు, మరియు పాస్తాలు టొమాటో రహితంగా మారుతున్నాయి. లండన్‌లోని చెఫ్‌లు టమాటోలు లేకుండానే పిజ్జాలను తయారు చేస్తున్నారు. సాధారణంగా ఇటాలియన్‌ వంటకాల్లో టమాట చేర్చడం తప్పనిసరి. కానీ ప్రస్తుతం బ్రిటన్‌లో టమాట ఎక్కడా కనిపించడం లేదు. ఇటాలియన్‌ చెప్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎంజో ఓలివెరీ గార్డియన్‌ పత్రికతో మాట్లాడుతూ.. బ్రిటన్‌లో టమాటాల కొరత దారుణంగా ఉందన్నారు. ప్రపంచంలోని ఏ మారుమూల ప్రాంతం నుంచి కూడా బ్రిటన్‌కు టమాట రావడం లేదన్నారు. కొన్ని రెస్టారెంట్లు వైట్‌ టమాటాలు వాడుతున్నాయి.

కొన్ని రెస్టారెంట్లు టమాటాతో తయారు చేసే వంటకాలను మెనూ నుంచి తొలగిస్తున్నాయి. కొన్న రెస్టారెంట్లలో వైట్‌ పిజ్జా .. వైట్‌ సాసెస్‌లు పాస్టాలో, పిజ్జాల్లో వినియోగిస్తున్నారు. లేదా పిజ్జాలో అతి తక్కువ మొత్తంలో టమాటా వాడుతున్నారు. మొత్తానికి టమాటలు మార్కెట్లో దొరకడం లేదు. దొరికినా ఖరీదు ఎక్కువ పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది.. దీంతో వైట్‌ పిజ్జా, పాస్టాలో వైట్‌ సాసెస్‌ వినియోగిస్తున్నామని.. దీన్నే కొత్త ట్రెండ్‌గా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెఫ్‌ ఆలివర్‌ చెప్పారు. గత ఏడాది కాలం నుంచి టమాట ధరలు నాలుగు రెట్లు పెరిగిపోయాయి. 5 పౌండ్లు ఉండే టమాటా కాస్తా 20 పౌండ్లకు ఎగబాకింది. దీంతో పాటు క్యాన్డ్‌ టమాట ధరలు రెట్టింపు అయ్యాయి. 15 పౌండ్ల నుంచి 30 పౌండ్లకు ఎగబాకాయి. దీంతో లండన్‌తో పాటు బ్రిటన్‌లోని రెస్టారెంట్లు, సూపర్‌ మార్కెట్లు కూడా టమాట వినియోగం తగ్గించేశాయి.

సూపర్‌మార్కెట్లు రేషన్‌ విధించాయి. దేశంలోని సూపర్‌మార్కెట్ల షెల్ప్‌ల్లో టమాట అస్సలు కనిపించడం లేదు. దేశంలోని అతి పెద్ద సూపర్‌ మార్కెట్లు టెస్కో, ఆస్డా, ఆల్డీ, మోరిసన్స్‌లు టమాటతో పాటు ఇతర కూరగాయలపై రేషన్‌ విధించాయి. ఒక్కొక్క కస్టమర్‌కు మూడు ప్యాకెట్లకు పరిమితం చేశాయి. తమకు కావాల్సిన టమాటను 95 శాతం దిగుమతి చేసుకుంటోంది బ్రిటన్‌. ముఖ్యంగా స్పెయిన్‌, ఉత్తర ఆఫ్రికా నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి అవుతోంది. అయితే దక్షిణ స్పెయిన్‌లో విపరీతంమైన చలి కారణంగా పంట దెబ్బతింది. ఇక మొరాకో విషయానికి వస్తే ఇక్కడ వరదల వల్ల పంట దెబ్బతింది. ఈ రెండు దేశాల్లో పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. ఇదిలా ఉంటే సరకు రవాణా చెద్దామంటే తుఫానుల కారణంగా షిప్పింగ్‌ ద్వారా రవాణాలు బాగా ఆలస్యం అవుతున్నాయి.

మొత్తానికి ప్రస్తుతం బ్రిటన్‌ ఆర్థిక పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. ఒక వైపు ద్రవ్యోల్బణం నాలుగు దశాబ్దాల గరిష్టానికి ఎగబాకింది. మరో వైపు రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో పాటు బ్రిటన్‌ యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలిగింది. ప్రస్తుతం పరిస్థితులు మాత్రం వ్యాపారానికి అనుకూలంగా లేవు. ముఖ్యంగా ఇటాలియన్‌ రెస్టారెంట్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని.. త్వరలోనే రెస్టారెంట్లు మూసుకొనే పరిస్థితి ఏర్పడుతుందని ఓలివేరీ చెప్పారు. మొత్తానికి టమాట రెస్టారెంట్‌ యజమానుల పొట్టకొట్టడం నిజంగానే విషాదమే అంటున్నారు అక్కడి వినియోగదారులు. నిజానికి బ్రిటిషర్స్ కు టమాటా సాస్, టాపింగ్స్ లేనిదే పిజ్జా తినడాన్ని ఇష్టపడరు. అసలు ఫిజ్జాకు ఆ రుచి రానే రాదు. ముఖ్యంగా అక్కడి వారికి అది ఆరో ప్రాణం కిందే చూస్తారు.

అలాంటిది పిజ్జా సెంటర్లన్నీ మూకుమ్మడిగా టామాటో లెస్ పిజ్జాలు చేయాలని సంకల్పంచడంతో పిజా లవర్స్ ఒక్కసారిగా డీలా పడిపోయారు. ఎక్కడ నుంచి టమాటాలు వచ్చే దిక్కు లేకపోవడంతో రెస్టారెంట్లు వైట్ పీజా, పాస్తాలతో సరిపెట్టేస్తున్నాయి. కొందరు ఏకంగా టమాటా తప్పని సరి అయిన వంటకాలను తమ మెనూ నుంచి డిలీట్ చేస్తున్నాయి.అసలు బ్రిటన్ లో టమాటాలకు కొరత ఏర్పడటానికి చాలానే కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒక్క చలికాలంలోనే స్పెయిన్, నార్త్ ఆఫ్రికా నుంచి 95 శాతం టమాటాలను దిగుబడి చేసుకుంటుంది. అయితే దక్షిణ స్పెయిన్ లో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడంతో అక్కడ దిగుబడి తీవ్రంగా దెబ్బతిన్నాది. మొరాకోలో వరదల తాకిడికి పంట మొత్తం నష్టపోయంది. ఇక రవాణా వ్యవస్థలోని లోపాల కారణంగా సరుకు రవాణాలోనూ అవాంతరాలు ఏర్పాడ్డాయి. ఇక ద్రవ్యోల్బణం, లాజిస్టిక్ సమస్యలు, బ్రెక్సిట్ కూడా బ్రిటన్ లో టమాట కొరతకు కారణమని తెలుస్తోంది

Must Read

spot_img